22, జూన్ 2021, మంగళవారం

సమస్య - 3760

23-6-2021 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కదలనివాఁడె పరుగెత్తెఁ గడు వేగమునన్”
(లేదా...)
“కదలఁగలేనివాఁడు వడిగం బరువెత్తుట చోద్యమెట్లగున్”

76 కామెంట్‌లు:

  1. చెదరని భక్తిగ గొలుచుచు
    వదలక స్మరియించి వేడె వరదుని మదిలో
    సదయుని కృపతో మెదలని
    కదలని వాడె పరుగెత్తె గడు వేగముగన్

    రిప్లయితొలగించండి
  2. బెదరగయానములాగెను
    చెదరెనుకలలునుకరోనచేటునుదెచ్చెన్
    పదపడికట్టడియాగగ
    కదలనివాఁడెపరుగెత్తెఁగడువేగమునన్

    రిప్లయితొలగించండి
  3. కందం
    ముదిత వలువ లూడ్చఁగ సభ
    వదలెను తా దుస్ససేనుఁ బావని యోర్మిన్
    కదనమునఁ జిక్క, నాడట
    కదలనివాఁడె పరుగెత్తెఁ గడు వేగమునన్!

    చంపకమాల
    ముదితకు వల్వలూడ్చ సభ పూనిక వీడుచు నన్నమాటకై
    వదలెను దుస్ససేనుఁ గని పావని, బట్టియు రొమ్ముఁ జీల్చకే
    కదనము నందు జిక్కఁగనె కాంతకు మోదము గూర్ప, నాడటన్
    గదలఁగలేనివాఁడు వడిగం బరువెత్తుట చోద్యమెట్లగున్?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. 🙏ధన్యోస్మి గురుదేవా🙏

      సవరించిన పూరణలు :

      కందం
      ముదిత పరాభవమందున
      వదలె సభన్ దుస్ససేనుఁ బావని యోర్మిన్
      గదనమునఁ జిక్క మునుపట
      కదలనివాఁడె పరుగెత్తెఁ గడు వేగమునన్!

      చంపకమాల
      ముదితకు వల్వలూడ్చ సభఁ బూనిక వీడుచు నన్నమాటకై
      వదలెను దుస్ససేనుఁ గని పావని దుష్టుని రొమ్ముఁ జీల్చకే,
      కదనము నందు జిక్కఁగనె కాంతకు మోదము గూర్ప, మున్ను తాఁ
      గదలఁగలేనివాఁడు వడిగం బరువెత్తుట చోద్యమెట్లగున్?

      తొలగించండి
    3. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి

  4. చెదరము పొదలో గనగనె
    చెదలది పైబడు ననినను చిరునవ్వులతో
    నదరక నటనుండెప్పుడు
    కదలని వాఁడె పరుగెత్తెఁ గడువేగమునన్.

    రిప్లయితొలగించండి
  5. పదుగురు గూడి యొక్కటను బర్వుల పందెము వేసికొంచు, స
    మ్ముదమును ప్రేక్షకుల్ మిగులఁ బొందఁగ, గెల్వఁగఁ గోరువారలై
    బదములు చచ్చువోయి తన బంధుల తోడను జూచుచుండఁగం
    గదలఁగలేనివాఁడు - వడిగం బరువెత్తుట చోద్యమెట్లగున్?

    రిప్లయితొలగించండి
  6. కందం

    వదలక సెల్లును నిరతము
    కదలక ఫ్రీఫైరునందు కాల్చగ వచ్చెన్
    బెదరక యాడుచు తినుటకు
    కదలనివాఁడె పరుగెత్తెఁ గడు వేగమునన్
    .................✍️చక్రి

    రిప్లయితొలగించండి
  7. సూర్యుడి రధ సారధి , ఊరువులు లేని అనూరుడు, పరుగు పెట్టు విధము, ఆధారముగా…..



    కదిలెడు మేఘపు బారుల

    రధమున్వెట్టగ పరుగులు రాజిలు శోభన్

    పదములునూరువు లేకను

    కదలనివాఁడె పరుగెత్తెఁ గడు వేగమునన్

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
  8. కుదరనికాలిపోందికనుకూలగలేదనిజీవసౌధమే
    చెదరనిగుండెతోడుగనుచేర్చెనుక్రుత్త్రిమపాదముల్వెసన్
    అదరెనునాట్యభంగిమలునాయమలాస్యముచిద్విలాసమై
    కదలగలేనివాఁడువడిగంబరువెత్తుటచోద్యమెట్లగున్

    రిప్లయితొలగించండి
  9. చదువడు బుడుతడు నిత్యము
    మెదలక కంప్యూటరునను మీటలు నొక్కున్.
    అదిగో! దయ్యం బనగా
    కదలనివాఁడె పరుగెత్తెఁ గడు వేగమునన్.

    రిప్లయితొలగించండి
  10. క్రొవ్విడి వెంకట రాజారావు:

    మదమెక్కి జూదమాడుచు
    కదలని వాడె పరుగెత్తు గడు వేగమునన్
    బెదరించి తరుముచుండుచు
    నెదురొచ్చెడి రక్షకభట నేతను గనగన్.

    రిప్లయితొలగించండి
  11. మదురువు త్రాగుచు,పేకను
    కదలక క్రీడించ,రక్షకభటులు వచ్చెన్
    వదులుచు సొమ్ములు నచటను
    కదలనివాఁడె పరుగెత్తెఁ గడు వేగమునన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "భటుడు వచ్చెన్/భటులు రాగా" అనండి.

      తొలగించండి

  12. వదలక నంబుకంటకము ప్రాణముతీయగ నెంచెనేమొ నా
    పదమును పట్టెపావనుడ పాహియటంచును బ్రాణభీతితో
    హృదయము దాకునట్లు కరి యేడ్చుచు బిల్వ భుజమ్ము లేనిదే
    కదలగ లేనివాడు వడిగం బరువెత్తుట చోద్యమెట్లగున్.

    రిప్లయితొలగించండి
  13. వదలక భస్మాసురుడట
    గదియగ తనశీర్షమునను కరమారోపిం
    చ దిగులున నాశుతోషుడు
    కదలని వాడె పరుగెత్తె కడు వేగమునన్

    శివుడు = స్థాణువు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వదలక వెంబడించగను, పర్యవసానము నెంచకే దగన్
      ముదమున నీయగాను వరమున్న సురుండని
      తోచకే, తనన్
      దిగులున నాశుతోషుడట దిక్కును దోచక భీతినొందగా
      కదలగ లేనివాడు వడిగం బరువెత్తుట చోద్యమెట్లగున్

      శివుడు = స్థాణువు

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    3. ధన్యాస్మి గురుదేవా! నమస్సులు!🙏🙏🙏

      తొలగించండి
  14. సమస్య :
    కదలగలేనివాడు వడి
    గం బరువెత్తుట చోద్యమెట్లగున్

    ( భగినీహస్తభోజనం కావిస్తున్న శ్రీనాథకవిసార్వభౌ ముడు తన పుత్రిక బావిలో పడిందన్న మేనల్లుడు మల్లన మాటలు విని చివాలున లేచి పరువులెత్తటం )

    చంపకమాల
    ....................

    చెదరని ప్రేమ చెల్లెలటు
    చిక్కని మీగడ పెర్గువేయగన్
    సదమలభోజనుండు కవి
    చక్కురవర్తి కుమార్తె బావిలో
    నదటున పడ్డ వార్త విని
    యార్చుచు వెంటనె లేచి యేగెనే !
    కదలగలేనివాడు వడి
    గం బరువెత్తుట చోద్యమెట్లగున్ ??

    రిప్లయితొలగించండి
  15. మదమెక్కి జూదమాడుచు
    కదలని వాడె పరుగెత్తు గడు వేగమునన్
    బెదరించి తరుముచుండుచు
    నెదురౌనగు రక్షకభట నేతను గనగన్.

    రిప్లయితొలగించండి
  16. కుదరుగ పట్టెదడీ శని

    ముదముగ ననుచు పలుకంగ‌ బూచుల రేడున్

    బెదరి వదలె తన గీమున్

    కదలని‌ వాడె పరుగెత్తె కడు వేగము గన్

    రిప్లయితొలగించండి
  17. పదములు కూర్చి గీతములు వ్రాసెను పాదము కూలి బాధనన్

    కదలఁగలేనివాఁడు ; వడిగం బరువెత్తుట చోద్యమెట్లగున్

    కథలను వ్రాయ లేని, హరి గానము సేయగ లేని వీరుడున్

    రధమును వీడి భీతిగను రంగము వీడుచు వెన్ను చూపగన్

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
  18. బెదిరించి బ్రతుక నేర్చెను
    కుదురుగ కుర్చీలనొకడు కూర్చొని యెపుడున్
    బెదరు నుపాయముగొనగా
    కదలనివాఁడె పరుగెత్తెఁ గడు వేగమునన్!!

    రిప్లయితొలగించండి
  19. చం:

    వదలక చీట్ల పేకలను పందెము లాడుచు పొద్దు నెంచకై
    కుదురుగ నుండ లేక బహు కోపము తోడుత వాదు లాడుచున్
    మొదటికె మోసమంచు, కడు ముప్పగు రక్షక దండు గాంచనై
    కదలగ లేని వాడు వడిగంబరు వెత్తుట చోద్యమెట్లగున్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  20. సదమలమైన భార్య కడు సమ్ము
    దమొందుచు నమ్మయింటికిన్
    బది పదునైదు రోజులును భర్తను
    వీడియు వెళ్ళిపోయి తా
    ముదమున దిర్గి వచ్చె,గని మో
    దము జెందెను గర్జ మన్న చో
    కదలగ లేనివాడు , వడిగన్
    బరువెత్తుట చోద్యమెట్లగున్

    రిప్లయితొలగించండి
  21. ముదిరిన ముఖ్యనేత తగు ముచ్చటదీరగ నింటినుండియే
    కదలక జేయ పాలనము, గండకమొక్కటి దాపురించగాన్
    గదలగ మూలబంధములు, కాప్టరునెక్కి చరించె రాష్ట్రమే,
    కదలఁగలేనివాఁడు వడిగం బరువెత్తుట చోద్యమెట్లగున్?

    రిప్లయితొలగించండి
  22. ఎదలో దృఢసంకల్పము
    యెదిరించెడుతెగువ యెట్టి యిడుముడులైనన్
    బెదరక వెనుకకు నెపుడున్
    కదలనివాఁడె పరుగెత్తెఁ గడు వేగమునన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "సంకల్ప । మ్మెదిరించెడు.." అనండి.

      తొలగించండి
  23. చెదరని భక్తి భావమున చిన్మయునా హరినే దలంచుచున్
    వదలక ధర్మ వర్తనము భాగవతోత్తముడై చరించునా
    కదలఁగలేనివాఁడు వడిగం బరువెత్తుట చోద్యమెట్లగున్
    సదయుడు దా వహించు గద సజ్జనులందరి సేమమున్ సదా

    రిప్లయితొలగించండి
  24. కదుపగలేక పోయె తన కాలును, తీవ్రపు గాయమవ్వగా
    బెదరక నిల్చియోర్చుకొనె పెక్కగు శస్త్రచికిత్స బాధలన్,
    కుదిరెను కాలు చక్కగను కొన్ని దినంబుల లోననప్పుడా
    కదలఁగలేనివాఁడు వడిగం బరువెత్తుట చోద్యమెట్లగున్”

    రిప్లయితొలగించండి
  25. పదవులపైకాంక్షలతో
    ఎదిరిని గెలువంగదలచి ఏకాగ్రతతో
    పదునగు సుస్థిరచిత్తము
    కదలనివాఁడె పరుగెత్తెఁ గడు వేగమునన్

    రిప్లయితొలగించండి
  26. తుదకు సతి మొత్తుకొనినను
    కదలనివాఁడె , పరుగెత్తెఁ గడు వేగమునన
    పది శాతము రాయితి నిడ ,
    మొదలుగ గల విలువ పెంపుపొందిన గూడన్

    రిప్లయితొలగించండి
  27. చదికిలె మేను, కాళ్ళు మరి చచ్చుబడెన్, పతనమ్ము కానిదే
    కద గుఱి! స్వర్ణ కాంస్య పతకమ్ముల గెల్వగ పోలియోకు తాఁ
    కదలఁగలేనివాఁడు వడిగం బరువెత్తుట చోద్యమెట్లగున్?
    చెదరని స్వీయనమ్మకము చేతయె స్ఫూర్తి ప్రదాయకంబగున్౹౹

    (రాజిందర్ సింగ్ రహేలు, పోలియో రోగి, వెయిట్ లిఫ్టర్, పతక గ్రహీత)

    రిప్లయితొలగించండి
  28. సదమలమైన చిత్తమున సత్యపు మార్గమునందుఁ బోవుచున్
    వదలని భక్తితో గరుడవాహను పూజలతోడ తన్పుచున్
    చెదరని యిచ్చతో బ్రతుక, శ్రీహరి యిచ్చిన సాకతమ్ముతో
    కదలఁగలేనివాఁడు వడిగం బరువెత్తుట చోద్యమెట్లగున్ ?

    రిప్లయితొలగించండి
  29. వదలక మానసమ్మునను వారిజ నేత్రుని పాదపద్మముల్,
    ముదముగ భక్తి యుక్తముగ బూజలు సల్పగ ప్రాణికోటి, తా
    హృదయము పొంగి శక్తినిడ హృత్కమలాసను గన్నతండ్రియే,
    కదలఁగలేనివాఁడు వడిగం బరువెత్తుట చోద్యమెట్లగున్?

    రిప్లయితొలగించండి
  30. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  31. subbaraoబుధవారం, జూన్ 23, 2021 10:54:00 AM

    ఎదుటన బామును జూడగ
    హృదికిన్ భయముగ లుగంగ ,హెచ్చుగ బీపీ
    నదుముకొ నంగను నంతన్
    కదలనివాడె పరుగెత్తె గడు వేగముగనన్

    రిప్లయితొలగించండి
  32. నదులనుకొండలుదాటుచు
    కదలనివాడెపరుగెత్తుకడువేగముగన్
    అదిరెనువిఠలాచార్యుని
    కదలడువదలడుకధనన కమనీయముగా

    రిప్లయితొలగించండి
  33. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  34. ఎదుటన పాము జూసిన నరేంద్రుడు భీతిని నొక్కసారిగా
    నెదకు భయంబు గల్గుట నహెచ్చుగ రక్తము పాఱుచుండుటన్
    గదలగ రక్తనాళములు గ్రక్కున నుబ్బుచు దేహమంతటన్
    గదలగ లేనివాడు వడిగం బరువెత్తుట చోద్యమెట్లగున్

    రిప్లయితొలగించండి
  35. ఎదురుగ వచ్చి రయమ్మునఁ
    జదువఁగ బడికి నిలువ వరుసను విత్తముఁ బం
    చెద రనఁగ బద్దకమ్మునఁ
    గదలనివాఁడె పరుగెత్తెఁ గడు వేగమునన్


    వదలకు మాగు మాగు మనఁ బాఱఁగ నేర్చిన వాఁడు నిల్చునే
    యెదిరిప జాగరూకత వహించుట నీ కగు న్యాయ మెత్తరిన్
    విదిలిచి నీ కరాంబుజ మభీతిని, నించుక యైన నేని నీ
    కదలఁగ లేనివాఁడు, వడిగం బరు వెత్తుట చోద్య మెట్లగున్

    [నీకు + అదలఁగ = నీ కదలఁగ; అదలు = బెదరు]

    రిప్లయితొలగించండి
  36. కదలక మెదలక తపమున
    మదిలో దైవంబు దలచు మలచెడిభక్తే
    కుదురుగ నిలుపక తనువే
    కదలని వాడేపరుగెత్తెకడు వేగమునన్

    రిప్లయితొలగించండి
  37. చం:

    ఎదురుగ జూచి కౌరవుల నెంతయొ భీతిని చెంది బ్రాణముల్
    కుదురుగ నున్న జాలునని గోరి, బృహన్నల తోడ వేగమై
    పద మనె దిర్గి , నుత్తరుడు వచ్చిన ద్రోవనె, పోరు చేయనై
    కదలగ లేని వాడు వడిగం బరువెత్తుట చోద్యమెట్లగున్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  38. పదుగురు ధూర్తులం గలసి వారిజనేత్రలతో దురీక్షణా
    దిదురితవర్తనమ్మున మదిం జెడు నెక్కొన మాటలాడు వా
    డదరక నుండి, రక్షకభటాగమనమ్మున, మార్గమందునన్
    కదలఁగలేనివాఁడు వడిగం బరువెత్తుట చోద్యమెట్లగున్.

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  39. కుదురగ తినికూర్చొను బతి

    వదలి వెడలి పోయె దల్లి

    వద్దకు కసితో

    నిదురచెడి రాగ పనికిన్

    కదలనివాడె , పరుగెత్తె

    కడువేగముగన్

    రిప్లయితొలగించండి
  40. మదిలో కోరెను శుభమును
    కదలని వాడె, పరిగెత్తె కడవేగమునన్
    పదములు గలిగిన మానవు
    డెద నిండగ దఃఖమదియు నెగయూపిరితో

    రిప్లయితొలగించండి