11, జూన్ 2021, శుక్రవారం

సమస్య - 3749

12-6-2021 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"రుద్రుఁడె సుయోధనునిఁ జంపెఁ గ్రూరముగను"
(లేదా...)
"రుద్రుఁడె యా సుయోధనునిఁ గ్రూరముగా వధియించెఁ జూడుమా"

54 కామెంట్‌లు:

  1. వస్త్ర మూ డ్చగ జూచిన పాలసుండు
    దుష్ట కృత్యుండు దురితుఁడు ద్రోహి యైన
    కుజనుని దురము నందున క్రుద్ధ భీమ
    రుద్రుడు సుయోధనుజంపె క్రూర ముగను

    రిప్లయితొలగించండి

  2. శివుని యాజ్ఞయె లేకున్న చీమయైన
    కుట్ట దందురు లోకులు కువలయమున
    వాయు సుతుడు కారణమైన భండనమున
    రుద్రుడె సుయోధనునిఁ జంపెఁ గ్రూరముగను.

    రిప్లయితొలగించండి
  3. భీకరముగాగరణభూమిభీముడపుడు
    కదిసినెదిరినినుసిఁగోల్పెగదనుఁబట్టి
    ఖండనమ్మునుఁజేసెనుకనగకాల
    రుద్రుడెసుయోధనునిఁజంపెక్రూరముగను

    రిప్లయితొలగించండి
  4. రౌద్రమురూపుదాల్చినదిరోహితమయ్యెనుయుద్ధభూమియే
    భద్రముఘీంకరించెనటభాసురమయ్యెనుకోపమగ్నిగా
    ఛిద్రముఁజేసెభీముఁడునుఛీయనిరోయుచురాజరాజునే
    రుద్రుడెయాసుయోధనునిఁగ్రూరముగావధియించెఁజూడుమా

    రిప్లయితొలగించండి
  5. సమస్య :
    రుద్రుడె యా సుయోధనుని
    గ్రూరముగా వధియించె జూడుమా

    ( పాంచాలీపరాభవము - భీముని ప్రతీకారము )

    భద్రముతోడ భర్తలకు
    భామిని ద్రౌపది ప్రేమ మీర ని
    ర్ణిద్రగ సేవలన్ సలుప
    నీచుడు రాజు మదోద్ధరుండునై
    ఛిద్రపు బుద్ధి నూరువుల
    జేరగ బిల్వగ ; భీమసేనుడన్
    రుద్రుడె యా సుయోధనుని
    గ్రూరముగా వధియించె జూడుమా !

    రిప్లయితొలగించండి
  6. గణపతికి తండ్రి యనినంత, కనెనెవరని

    ముందు గాంధారి, గిరిధారి పూత‌న స్ధన

    ములను‌ బట్టి చేసె నదేమి, పొట్ట పట్టి

    హరి దనుజు నెవ్విధముగ సంహరణ చేసె

    రుద్రుడె, సుయోధనుని‌ ,జంపె, క్రూరముగను

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "తండ్రి యెవ్వరొ... స్తన.." అనండి.

      తొలగించండి
  7. క్రొవ్విడి వెంకట రాజారావు:

    ద్వంద్వ యుద్ధము నందున వాయు సుతుడు
    భీకరమ్మగు కినుకతో పెచ్చురేగి
    రుద్రుడె సుయోధనుని జంపె క్రూరముగను
    ననియెడు నటుల తీక్ష్ణమై యడరుజెందె.

    రిప్లయితొలగించండి

  8. అద్రిజ ప్రాణనాథు డతడంబర కేశుని యాజ్ఞలేనిదే
    యీ ధ్రువమందు జీమయిన నెవ్వని కుట్టగ లేదు సత్యమే
    క్షుద్రుడటంచు నానిలి వృకోదరుఁ బావుగ జేసి తంపిలో
    రుద్రుడె యా సుయోధనుని గ్రూరము గావధియించె జూడుమా!

    రిప్లయితొలగించండి
  9. మూడు కనులతో సతి యందము కనునెవడు

    రందిననెవరిన్ చంపెను పాండు సుతుడు

    జింకలనెటుల చంపెను సింహ రాజు

    రుద్రుఁడె , సుయోధనునిఁ జంపెఁ , గ్రూరముగను"

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
  10. అద్రిజ నాదరింపకయె యజ్ఞము జేయగ దక్షుడచ్చటన్
    భద్రము గానలేక సతి ప్రాణమువీడగ యోగవహ్నిలో
    ఛిద్రము జేయగా దలచి శీఘ్రమె జన్నము వీరభద్రుడై
    రుద్రుడె యాసుయోధనుని క్రూరముగా వధియించె జూడుమా

    సుయోధనుడు = మంచి యోధుడు ( దక్షుడు)

    రిప్లయితొలగించండి
  11. బద్రముగాను దాగినను భాను
    మతీశుని రెచ్చగొట్టగా
    రౌద్రముతోడ వెల్వడెను రాజస
    మొప్పగ మడ్గునుండియున్
    భద్ర గజంబు రీతిగను వాయు
    కుమారుడు భీకరోగ్రుడౌ
    రుద్రుడె, యా సుయోధనుని క్రూ
    రముగా వధియించె జూడుమా

    రిప్లయితొలగించండి
  12. తేటగీతి
    'ఊరువున్' జూపి కృష్ణనగౌరవించ
    'ఛిద్రమొనరింతు'నని భీమసేనుడనియు
    దాగి యుండ మడుగున గదాధరునిగ
    రుద్రుఁడె సుయోధనునిఁ జంపెఁ గ్రూరముగను

    నా ప్రయత్నం:
    ఉత్పలమాల
    నిద్రను సైతమున్ మఱువ నేరక ద్రౌపది భంగపాటులన్
    ఛిద్రము జేతు నూరువుల నిక్కమిదన్న ప్రతిజ్ఞ 'భీముఁడున్' ,
    భద్రమటంచు సారమున వాలినఁ బోరుకుఁ బిల్చియున్ 'గదా
    రుద్రుఁడె' యా సుయోధనునిఁ గ్రూరముగా వధియించెఁ జూడుమా

    రిప్లయితొలగించండి
  13. తొల్లి ప్రతినలు చెల్లింప తొడలు విరిచి
    భీమసేనుడు రారాజు బింకమణచె
    కలను నిప్పులెగయ మధ్య కన్ను తెరచి
    రుద్రుఁడె సుయోధనునిఁ జంపెఁ గ్రూరముగను


    శంక తీర్చగ అర్జును వంక జూచి
    కృష్ణు డతనికొసగె దివ్య దృష్టి అందు
    వధలు చేయువాడు శివుడు; వరుస లోన
    రుద్రుఁడె సుయోధనునిఁ జంపెఁ గ్రూరముగను

    రిప్లయితొలగించండి
  14. క్రొవ్విడి వెంకట రాజారావు:

    క్షుద్రుడు కౌరవాగ్రజుని క్రూర గుణమ్ముల నీసడించుచున్
    రౌద్రపు రూపమొంది నని రావము జేయుచు భీకరమ్ముగన్
    ఛిద్రము జేసి యూరువులు చీదఱలాడుచు భీమసేనుడౌ
    రుద్రుఁడె' యా సుయోధనునిఁ గ్రూరముగా వధియించెఁ జూడుమా!

    రిప్లయితొలగించండి
  15. కె.వి.యస్. లక్ష్మి:

    ప్రాణ భయమున మునుగగ ద్రహము నందు
    భీము డరిగెను కనుగొని భీరు జాడ
    నులిమె భీకర రీతిని తలప దోచె
    రుద్రుఁడె సుయోధనునిఁ జంపెఁ గ్రూరముగను
    (ద్రహము=మడుగు)

    రిప్లయితొలగించండి
  16. ఉ:

    భద్రత నెంచి దాగెనట పర్ణసి యందున రాజరాజు తా
    ముద్రలు వేసి స్తంభనగ, ముప్పును నివ్విధి మట్టగించ నై
    క్షుద్రపు మార్గమున్ గనగ క్రోధము మీరగ భీమసేనుడన్
    రుద్రుడె యా సుయోధనుని గ్రూరముగా వదియించె జూడుమా

    ముద్రలు =యోగ ముద్ర
    మట్టగించు=తొలగించు

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  17. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  18. గుండె నిండుగ ద్వేషమ్ము కూరుకొనగ
    అనిల పుత్రుని తామసమతిశయించ
    పంచ భర్తృక సంతోష పడగ భీమ
    రుద్రుఁడె సుయోధనునిఁ జంపెఁ గ్రూరముగను

    రిప్లయితొలగించండి
  19. ద్రౌపదికి దన తొడలను దరిసనమిడ
    రట్టడి యనుచు భావించి రౌద్రగతిని
    నతని తొడల నుగ్గుగజేతుననిన భీమ
    రుద్రుఁడె సుయోధనునిఁ జంపెఁ గ్రూరముగను

    రిప్లయితొలగించండి
  20. కద్రువ బిడ్డ వాసుకియె కంఠమునుండగ యానతిచ్చెనా

    రుద్రుఁడె ; యా సుయోధనునిఁ గ్రూరముగా వధియించెఁ జూడుమా"

    భద్రము నీట దాగిన ప్రభావము వీడిన రాజ రాజునా

    క్షుద్రుని, భీమ సేనుడట , కూలిన యూరువె సాక్ష్యమిచ్చురా

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
  21. రిప్లయిలు
    1. ఛిద్రము జేసి పాండవుల జీవితముల్ కురురాజ్యకాంక్షతో
      క్షుద్రదురాశయుండు నయకోవిదులన్ వని ద్రోల దుర్మతిన్,
      భద్రయశోవిలాసవర వాయుసుతప్రకటారివాహినీ
      రుద్రుఁడె యా సుయోధనునిఁ గ్రూరముగా వధియించెఁ జూడుమా!

      కంజర్ల రామాచార్య.

      తొలగించండి
    2. మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  22. రిప్లయిలు
    1. ముద్రణ చేయు వేళ తన మామను పేర్చగ జెప్పెనచ్చులన్
      నిద్రను యుండుటన్ మరచి నేర్పుయు లేకను అంతరార్థమున్
      భద్రుడు, వృద్ధుడే మరచి పద్యము మార్చెను చూడ నిట్టులన్
      రుద్రుఁడె యా సుయోధనునిఁ గ్రూరముగా వధియించెఁ జూడుమా

      తొలగించండి
    2. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "నిద్రను నుండుటన్ ... నేర్పును లేకయె యంతరార్థమున్..."

      తొలగించండి
  23. ధన్యవాదాలు ఇలా సవరించాను గురువుగారు!

    ముద్రణ చేయు వేళ మరి మోదము నొప్పగ పేర్చలేక తాన్
    నిద్రను యచ్చులన్ మరచి నేర్పును లేకయు యంతరార్థమున్
    భద్రుడు, వృద్ధుడేమమరచి పద్యము మార్చెను చూడ నిట్టులన్
    రుద్రుఁడె యా సుయోధనునిఁ గ్రూరముగా వధియించెఁ జూడుమా

    రిప్లయితొలగించండి
  24. క్షుద్రుడు వీడెగా కొలువుకూటమునందు పరాభవించె నా
    డా ద్రుపదాత్మజన్, బల మదాంధుని జేతుననూరునంచు దా
    రౌద్రముగా చెలంగె రణరంగమునన్ గన భీముడా మహా
    రుద్రుఁడె యా సుయోధనునిఁ గ్రూరముగా వధియించెఁ జూడుమా

    రిప్లయితొలగించండి
  25. నిండు సభలోన ద్రౌపది నెగ్గు వడగ
    గారణంబగు దుష్టుని కసిని,కాల
    రుద్రుడె సుయోధనుని జంపె గ్రూరముగను
    సబబ యయ్యది భార్యను సముదయింప

    రిప్లయితొలగించండి
  26. భద్రుడు నామకుండొకడు భామరొ! వింటిరె? చిత్రమియ్యదిన్
    రుద్రుడె యాసుయోధనుని గ్రూరముగావధియించె జూడుమా
    రుద్రుడు నాబరంగుచును రౌద్రముతోడను నుండునట్టియా
    భద్రపు రూపుడేసరగు వంధ్యుని జేసెను ధార్తరాష్ట్రునిన్

    రిప్లయితొలగించండి
  27. జీవ లయ కార్యము దలంప శివుని లీల
    యొక్కరికి నొక్క కారణ ముండ మృతికిఁ
    జంపు వా రాయుధమ్ములె శంకరునకు
    రుద్రుఁడె సుయోధనునిఁ జంపెఁ గ్రూరముగను


    క్షుద్రుని వంశ నాశకునిఁ గ్రూరుని నన్యపు టంగ రాశియే
    భద్ర మవధ్యమై తనరఁ బార్థుని సన్నను గాంచి యంతటన్
    ఛిద్రము సేసి యూరువుల శీఘ్రమ భీముఁడు భీకరాకృతిన్
    రుద్రుఁడె యా సుయోధనునిఁ గ్రూరముగా వధియించెఁ జూడుమా

    రిప్లయితొలగించండి
  28. భార్యనవమానపరచినపగతుడచట
    దాగగ మడుగునందున దరికినీడ్చి
    చీల్చుచుతొడలనట భీమసేనుడనెడి
    రుద్రుడెసుయోధనునిజంపె క్రూరముగను

    రిప్లయితొలగించండి