1, జూన్ 2021, మంగళవారం

సమస్య - 3739

2-6-2021 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సొగసునన్ మేటి వందురు సూకరమును”
(లేదా...)
“సొగసున సాటి రావనుచు సూకరమున్ నుతియింత్రు సజ్జనుల్”

61 కామెంట్‌లు:

 1. వినగబాహ్యమురూపముకాంచకుండ
  మనసునైర్మల్యభావంబుపదిలపరచి
  గౌరవింపగఁజూచుటగోప్పయగును
  సోగసునన్మేటివందురుసూకరమును

  రిప్లయితొలగించండి
 2. ఆదివరాహక్షేత్రం

  నిగనిగలాడు చక్కని వినీలపుదేహుడు శ్రీనివాసునిన్
  పొగడుదు రెల్లదేవతలు పొందుగ నిల్వగ నేడుకొండలన్
  సొగసున సాటిరావనుచు; సూకరమున్ నుతియింత్రు
  సజ్జనుల్
  తగువిధమున్ స్థలంబునిడ దైవము నచ్చట నిల్పగా దయన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
   "వినీల శరీరుడు" అంటే ఇంకా బాగుంటుందేమో?

   తొలగించండి
  2. ధన్యాస్మి గురుదేవా! సవరిస్తాను.🙏🙏🙏

   తొలగించండి
  3. సవరణతో
   ఆదివరాహక్షేత్రం

   నిగనిగలాడు చక్కని వినీల శరీరుడు శ్రీనివాసునిన్
   పొగడుదు రెల్లదేవతలు పొందుగ నిల్వగ నేడుకొండలన్
   సొగసున సాటిరావనుచు; సూకరమున్ నుతియింత్రు
   సజ్జనుల్
   తగువిధమున్ స్థలంబునిడ దైవము నచ్చట నిల్పగా దయన్

   తొలగించండి
 3. జగములోన జంతువులన్ని సంత‌సమ్ము

  కూర్చు చుండుగా సమయాను కూలముగ,శు

  నకము నకు పూజ, మత్యము నకును పూజ

  కాకులకు పూజ, పూజలు ఘనత తోడ

  కచ్చపమునకు,బల్లికి,కప్ప లకును

  వానరమునకు చేతురు భక్తి తోడ

  పూజ లు,వరాహమునక ను‌ పుణ్య మనుచు

  ఘనముగ తిరు నగములందు, వినగ వలయు

  సొగసునన్ మేటివందురు సూకరమును

  రిప్లయితొలగించండి

 4. కార్య సాధనయె తన లక్ష్యమని దలచు
  సాధకుండకు నివియన్ని సహజ మేను
  భూరిగమముల బూజింప పొచ్చెమనక
  సొగసునన్ మేటి వందురు సూకరముల.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "సాధకునకును నివియన్ని" అంటే బాగుంటుందేమో?

   తొలగించండి
 5. అగపడరేవిధంబుననునల్గురుపిల్లలునారికిన్ఁదగన్
  తగవునుగాదెసంతతినిచాలగఁగాంచుటచీనదేశమున్
  వగవకమువ్వురేవురునువద్దకుండగనుంటమేలుగా
  సోగసునసాటిరావనుచుసూకరమున్నుతియింత్రుసజ్జనుల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సమస్యను పరిష్కరించిన విధానమేమిటి? వివరించండి.

   తొలగించండి
  2. సూకరమునకునియంత్రణలేదుఅదిశ్రామికసంపదనుకోరుకుంటుందిఆవిధముగాదానిజీ.,వితముసాటిలేనిదిగభాసించుచున్నది

   తొలగించండి
 6. కాకి పిల్ల కాకికి ముద్దు , కంటికింపు

  సొగసునన్ మేటి వందురు సూకరమును

  తల్లి తండ్రి పంకమునను పొర్లు వేళ

  ముద్దు బిడ్డను కని బహు ముదముతోన

  ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

  రిప్లయితొలగించండి
 7. క్రొవ్విడి వెంకట రాజారావు:

  దనుజుడగు కనకాక్షుని దండపెట్టి
  క్షితిని సమమొందు నట్లుగా స్థిత మొనర్చ
  దంష్ట్రియై నిల్చిన హరిని దల్చు వారు
  సొగసునన్ మేటి వందురు సూకరముల

  రిప్లయితొలగించండి
 8. రాక్షసుని నుండి వసుధను రక్ష సేయ
  హరిని వేడగ దేవత లార్తి తోడ
  నవత రించెను దానప్పు డ దియు గాంచి
  సొగసునన్ మేటి వందురు సూకరమును

  రిప్లయితొలగించండి

 9. పగతుడు పొత్తుకాడనెడి భావము చూపక నెల్ల వేళలన్
  జగతిని కార్యసాధకులు సాధన మొక్కటె లక్ష్యమంచు భూ
  రిగమపు కాళ్ళు పట్టు వెకలిన్ బఠి యంచునుతింత్రు వారెపో
  సొగసున సాటిరావనుచు సూకరమున్ సుతియింత్రు సజ్జనుల్

  రిప్లయితొలగించండి
 10. తేటగీతి
  గోపికా మనోహరు చేతిఁ గొలువు దీరి
  స్వామి మోవిని వేణువున్ స్వరము లూద
  తన్మయ మొనరింపగ గొల్లెతలలరంగ
  సొగసునన్! మేటి వందురు సూ! కరమును

  చంపకమాల
  అగణిత దీవెనా బలము నంచిత రీతిని గల్గు హస్తమై
  బిగువున మీటు నైపుణము వేడుకఁ జేయఁగ వేగిరమ్మునన్
  నగధరు మోవిపై మురళి నాదము మోదము! నన్యమేదియున్
  సొగసున సాటి రావనుచు సూ! కరమున్ నుతియింత్రు సజ్జనుల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ రెండు పూరణలు వైవిధ్యంగా, ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
   'దీవెనా బలము' అనడం సాధువు కాదు.

   తొలగించండి
  2. 🙏ధన్యోస్మి గురుదేవా🙏

   సవరించిన పూరణ పరిశీలించ ప్రార్థన.

   చంపకమాల
   అగణిత దీవెనల్ వసుధ కంచిత రీతి నొసంగు హస్తమై
   బిగువున మీటు నైపుణము వేడుకఁ జేయఁగ వేగిరమ్మునన్
   నగధరు మోవిపై మురళి నాదము మోదము! నన్యమేదియున్
   సొగసున సాటి రావనుచు సూ! కరమున్ నుతియింత్రు సజ్జనుల్

   తొలగించండి
 11. సమస్య :

  సొగసున సాటి రావనుచు
  సూకరమున్ నుతియింత్రు సజ్జనుల్

  ( శ్రీహరి శ్వేతవరాహమూర్తియై హిరణ్యాక్షుని చీల్చి చెండాడి భూదేవిని చెంతన చేర్చుకొన్న సన్నివేశం )

  చంపకమాల
  ------------

  నిగనిగ మంచు గన్నులకు
  నిండుగ గన్పడు దివ్యమూర్తియై
  భగభగ మండు క్రోధమున
  భ్రష్టహిరణ్యుని జీల్చివైవగా
  ధగధగలాడు కన్నుగవ
  దాల్చిన ధారుణి దాల్చు శ్రీహరిన్ ;
  " సొగసున సాటి రా " వనుచు
  సూకరమున్ ; నుతియింత్రు సజ్జనుల్ .

  రిప్లయితొలగించండి
 12. బ్రహ్మ దేవుని సృష్టిలో ప్రలవమైన
  జీవమేదియు కనరాదు భావనమున
  చికిలమందున పొరలినన్ చిత్రముగను
  సొగసునన్ మేటి వందురు సూకరమును

  రిప్లయితొలగించండి
 13. యుక్త వయసులోనున్నట్టి యువకులకును
  పొలతులను జూడగా బ్రేమ పుట్టుచుండు
  నట్టి సమయంబులో జూడ రందమేది
  సొగసునన్ మేటివందురు సూకరమును

  రిప్లయితొలగించండి
 14. క్రొవ్విడి వెంకట రాజారావు:

  జగతిని కట్టినట్టి దనుజాధముడా కనకాక్షు జంపగా
  పగగొని శౌరి దంష్ట్రిగను వచ్చి నడంచగ ప్రాణికోటియున్
  మిగుల ముదమ్ము నొందియు నమించి బలమ్మునె గాక జంతువుల్
  సొగసున సాటి రావనుచు సూకరమున్ నుతియింత్రు సజ్జనుల్.

  రిప్లయితొలగించండి
 15. చం:

  జగతికి రక్ష గూర్చ నస జన్మము నెత్తి వరాహ మూర్తియై
  పొగరణగించి రక్కసుని పోరున జంపి ధరిత్రి గావగన్
  నిగనిగ లాడు రూపుగని నింగిని దేవతలెల్లఁ వేడనై
  సొగసున సాటిరావనుచు సూకరమున్ నుతియింత్రు సజ్జనుల్

  నస జన్మము= శ్రీ హరి బ్రహ్మ దేవుని నాసిక నుండి వరాహముగా జన్మించుట

  రక్కసుడు=హిరణ్యాక్షుడు

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 16. బుంగమూతి గలిగియుండి , పుష్టియగు శ
  రీర ముండ నెవరు సాటి లేరనెదరు
  సొగసునన్ ; మేటి వందురు సూకరమును
  మురికినీట మునిగి తేలి ముదమునొంద

  రిప్లయితొలగించండి
 17. సర్వ భూమండల మనంత జలధి మునుగ
  అవని పరిరక్షణార్థమై యవతరించె
  విష్ణు మూర్తి వరాహుడై భీకరముగ
  సొగసునన్ మేటి వందురు సూకరమును

  రిప్లయితొలగించండి
 18. 🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅
  శంకరాభరణం వారి సమస్య : “సొగసునన్ మేటి వందురు సూకరమును”
  సరదా పూరణము .

  తే. గీ
  నల్ల పందులు దొరుకును నల్లమలను
  తెల్ల పందుల నచటికి తెచ్చెనొకడు
  రంగు రూపులు జూడ తెల్లటి మృగముల
  “సొగసునన్ మేటి వందురు సూకరమును”

  🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅
  2)
  అందమైన మృగములకు హార మొసగ
  స్పర్ధ జేసిరి ధనికులు చక్కగాను
  వివిధ జంతుజాలములలో వింత పశువు
  “సొగసునన్ మేటి వందురు సూకరమును”

  🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅
  మూడవ పూరణ :

  ముద్దు పెదవుల పోటీలు, ముద్దుగాను
  పెంచు కొనెడి జంతువులకు వింత గాను
  వనితలెల్ల గూడి జరుప, వాటి లోన
  “సొగసునన్ మేటి వందురు సూకరమును”

  - రాంబాబు కైప
  01-06-2021
  🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅

  రిప్లయితొలగించండి
 19. 🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅
  శంకరాభరణం వారి సమస్య :"సొగసున సాటి రావనుచు సూకరమున్ నుతియింత్రు సజ్జనుల్"

  చంపకమాల
  మిగుల, విచిత్ర వార్తలను మెండుగ తెల్పుడు మూడు రీతులన్ ?
  వగలున మేటి జంతువని వానరమున్ ప్రకటించె కాంతలున్ ,
  నగవున జాతి నెల్ల సరి, నక్కకు లేరటు జెప్పె శాస్త్రముల్ ,
  సొగసున సాటి రావనుచు సూకరమున్ నుతియింత్రు సజ్జనుల్ ||

  - రాంబాబు కైప
  01-06-2021
  🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅

  రిప్లయితొలగించండి
 20. 🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅
  5)
  శంకరాభరణం వారి సమస్య :"సొగసున సాటి రావనుచు సూకరమున్ నుతియింత్రు సజ్జనుల్"

  చంపకమాల
  వగలున వారిజాక్షియట , వైరికి దుర్గగ భీకరంబుగన్
  నగవుల రాణి లాస్యమున, నాట్యమునన్ నటరాజ భాంధవిన్
  తగు వరముల్ నొసంగి , కడు దైన్యపు జీవుల రక్ష జేయగన్
  సొగసున సాటి రావనుచు సూ, కరమున్ నుతియింత్రు సజ్జనుల్ ||

  - రాంబాబు కైప
  01-06-2021
  🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅

  రిప్లయితొలగించండి
 21. సగమగు లక్ష్మికై వెదకి సానువు చేరెను లచ్చి నాధుడున్

  నగమున చోటునిచ్చెనిల , నందుని పుత్రుడు కోరి నిల్వగన్,

  సొగసున సాటి రావనుచు ; సూకరమున్ నుతియింత్రు సజ్జనుల్”

  లఘువుగ కొండ చేరి హరి లక్షణ మోమును చూచు ముందునన్

  ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

  రిప్లయితొలగించండి
 22. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. స్థగణను పట్టి దంతముల సందున నుంచి పరాంగ వమ్మునన్


   వగచక సంచరించుచు క్షపాచరునిన్ పురుషో త్తముండు చం

   పగ చుబుకంబు నెత్తుచు శుభాంగి ముదంబుగ ముద్దు లివ్వగన్

   సొగసున సాటి రావనుచు సూకరమున్ నుతియింత్రు సజ్జనుల్

   తొలగించండి
 23. మగసిరి జూపరా! సుగుణమాన్యుడవై వరవర్తనమ్ము నం
  దగణితవీర్యవిక్రమమ నన్యసుధీస్ఫురితార్జనమ్మునన్,
  నగుదురు నాల్గు రీతుల ననారతదూషితకార్యమగ్నతన్
  సొగసున సాటి రావనుచు సూకర! మున్ నుతియింత్రు సజ్జనుల్.

  కంజర్ల రామాచార్య.

  రిప్లయితొలగించండి
 24. జగముల నేలు నీ కరము సన్నుతి సేయగ నార్తి తోడ మ
  త్తగజము దిక్కు నీవె యని తత్క్షణమే తెగటార్చి నక్రమున్
  దగ దయ మూర్థము న్నిమిరె దానవ వైరి కరమ్ము పద్మముల్
  సొగసున సాటి రావనుచు సూ కరము న్నుతియింత్రు సజ్జనుల్.

  రిప్లయితొలగించండి
 25. నగుటకు;నాణ్యమౌ యరుపు, నల్లని దేహము, చిన్ని తోక యున్,
  తగునని బొర్లుపంకమున తాను చరించను ముళ్ళకంపలన్
  జిగురుగనుండు పందియని చెప్పిన; నవ్వుచు నెల్ల జీవులున్
  సొగసున సాటి రావనుచు, సూకరమున్ నుతియింత్రు సజ్జనుల్.


  రిప్లయితొలగించండి
 26. ఖగవతి బట్టి సాగరపు గర్భమునందున నుంచ, రక్కసున్
  దగదగలాడు దంష్ట్రముల దాల్చిన యుగ్రపు రూపమందునన్
  పొగరడగించి చంపి హరి భూతధరిత్రి వరించి మించగా
  సొగసున సాటి రావనుచు సూకరమున్ నుతియింత్రు సజ్జనుల్

  రిప్లయితొలగించండి
 27. రిప్లయిలు
  1. శ్రీ గురుభ్యోనమః

   నిగ నిగ రూపముల్ కలిగి, నిండు మన మ్ముల లేమి చేతనన్
   వెగటుగ మారుచుండుచును వింతలు గాంచెడి రోజులందునన్
   బిగువున నమ్మకంబునను పెన్నిధి జూచిన, జీవులెందునన్
   సొగసున సాటి రావనుచు సూకరమున్ నుతియింత్రు సజ్జనుల్

   (బిగువు-గంభీరము)

   తొలగించండి
 28. పంది రూపము నెత్తుచు నందసుతుడు
  వసుధ నెత్తిన కతనాన వార్ధి నుండి
  సొగసునన్ మేటి వందురు సూకరమును
  నంద గాడగును గదయా యాదవపతి

  రిప్లయితొలగించండి
 29. శిబిని మించెను భువి దానశేఖరుండు
  కోరఁ గవచ కుండలములు కోసి యిచ్చెఁ
  దలఁచుచు నిరంతరము ఘను దాన కర్ణు
  సొగసునన్ మేటి వందురు సూ కరమును
  [కరము =చేయి]


  పెగలిచి దుష్ట దానవుని, వెన్నుని లీలల నెంచ శక్యమే,
  తగలిచి భూమి దంతమునఁ దద్దయు నేర్పున నెత్తి కావఁగా
  నగణిత వీర్య దంష్ట్ర బల యజ్ఞవరాహము నెన్ని భక్తినిన్
  సొగసున సాటి రావనుచు సూకరమున్ నుతియింత్రు సజ్జనుల్

  రిప్లయితొలగించండి
 30. తగునని రాక్షసాధముడు ధారుణినంతయు జాపచుట్టి యా
  సగరుల తోయమందుననె జయ్యన వేయ గబందిరూపునన్
  జగములు సంతసించగను శ్యామను నుద్ధతి బైకితీయుటన్
  సొగసున సాటిరావనుచు సూకరమున్ నుతియింత్రు సజ్జనుల్

  రిప్లయితొలగించండి
 31. తగదుగ నెన్నడేనియును తక్కువ జేయగనల్పజీవులన్
  సొగసున సాటి రావనుచు; సూకరమున్ నుతియింత్రు సజ్జనుల్
  జగతిని గాచె నాడు హరి జంపెను రక్కసు నీదు రూపునన్;
  సుగుణమె సత్యమున్ శివము సుందరమౌ గన ప్రాణికోటికిన్

  రిప్లయితొలగించండి