శ్రీ లంకలో ప్రభుత్వము తలచు కొంటే పట్టణముల పేర్లు మార్చడము కష్టము కాదు అని చెప్పేఈ ప్రయత్నము:
ఉ:
కాదను వారలెవ్వరట కాలము తీరె నటంచు పేరులన్ మోదము నెంచి యేలుబడి ముచ్చట మార్పు ఘటింప జేయ, నా మీదట నొక్కటేమిటట మిక్కిలి మార్పులు చెంద గాంచనౌ హైదరబాదు సింహళము నందలి పట్టణ మౌ నిజంబుగన్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. మా ఆవిడ ఎన్నడూ కాలజ్ఞానం చదువలేదు... కాని ఏదైనా వింత విన్నప్పుడల్లా "బ్రహ్మంగారు చెప్పినట్లే జరుగుతున్నాయి" అంటూ ఉంటుంది.
శంకరాభరణం వారి సమస్య : "హైదరబాదు సింహళమునందలి పట్టణమౌ నిజంబుగన్!"
4) ఉత్పలమాల
వాదము లేక విశ్వమున వాసిని పొందిన పట్టణంబులన్, భేదము లేక నెల్లరును వెళ్ళు కొలంబొ, నివాస యోగ్యమై మోదము పొంది యుండగను , మూలన నక్కిన చిన్ని ప్రాంతమే, హైదరబాదు, సింహళమునందలి పట్టణమౌ నిజంబుగన్!!
- రాంబాబు కైప 12-06-2021 🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅 [12/06, 22:51] Rambabu kaipa: సరిచేసి (యందున - నందున ; వారు వారిలో (లేదట సరిపోదు) అందుకు కచేరి వర్గమున్ అని మార్చాను 🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅
శంకరాభరణం వారి సమస్య : "హైదరబాదు సింహళమునందలి పట్టణమౌ నిజంబుగన్!"
భరత దేశము లోనుండె పట్టణమ్ము
రిప్లయితొలగించండిహైదరాబాదు, పాక్ లోను హ్లాదమిడె
హైదరాబాదు,గలదు సింహళము లోన
రాజ ధానియౌ కోలంబొ రమ్య గతిని
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిరెండవ పాదంలో గణభంగం. "హ్లాద మిడెను" అనండి.
కుండపోతగవర్షంబుకురియుచుండ
రిప్లయితొలగించండికలయచుట్టునునీళులేకనగజనులు
ద్వీపధోరణిగురుతుకుఁదెచ్చెనగరి
హైదరాబాదుగలదుసింహళములోన
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిభారతీయులకొక్కటి పక్కనుండు
రిప్లయితొలగించండిపరమ కుటిల పాకిస్థాను వారికొకటి
హైదరాబాదు గలదు ; సింహళములోన
లేదు హైదరాబాదు తెలియర నరుడ
...భారతీనాథ్ చెన్నంశెట్టి...
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములండీ
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితేటగీతి
రిప్లయితొలగించండిఅక్రమంబన్ననుఁ జెరువులాక్రమించి
ఇండ్లు గట్ట వానల గడగండ్లు మిగిలె
వరదముంచ నగరి నంత వనము సుట్ట
హైదరాబాదు గలదు సింహళములోన
(సింహళము= లంక)
ఉత్పలమాల
ఆదరబాదరన్ జెరువులాక్రమణంబున నిల్లుగట్టియున్
మోదము నందుటే మివుల మూర్ఖమనంగను వానలందునన్
రోదన గూర్పగన్ నగరిలోగిలి నీరము సుట్టుముట్టఁగన్
హైదరబాదు సింహళమునందలి పట్టణమౌ నిజంబుగన్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి🙏ధన్యోస్మి గురుదేవా🙏
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికాదనినంతనే తలను ఖండనజేయగ నాజ్ఞనిచ్చెడిన్
తొలగించండిమేదినినేలు రాజుకడ మెప్పును బొందగ మంత్రివర్యుడే
వాదనసేయకే శిరసు వంచుచు నిట్లనె శంకయేల నా
హైదరబాదు సింహళము నందలి పట్టణమౌ నిజంబుగన్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు గురుదేవా! నమస్సులు!🙏🙏🙏
తొలగించండిశిష్యు డడు గ పటము జూపి చెప్పె గురువు
రిప్లయితొలగించండిభారతము దక్షిణ ము నందు వాసి యైన
హైదరాబాదు గలదు : సింహళము లోన
కలదుగ కొలంబొ నగరము కమ్ర మగుచు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమోదముతోడనెట్టుననుమౌనముతోడనువిద్యనేర్పగా
రిప్లయితొలగించండిజోదులుశిష్యులందరునుచేడ్పడిజాబులుచెప్పుచుండగా
కాదనుధైర్యమెందులకుకాగలకార్యములిట్టులుండగా
హైదరహాదుసింహళమునందలిపట్టణమౌనిజంబుగన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసవరణ
రిప్లయితొలగించండిజోదులుశిష్యులందరునుజోరుగజాబులుచెప్పుచుండగా
2వపాదం
రిప్లయితొలగించండినాల్గు స్తంభాలు కలిగిన నాణ్యమైన
కట్టడము చార్మినారును కలిగి యుండె
హైదరాబాదు, గలదు సింహళము లోన
ప్రథిత మైనట్టి శ్రీపద పర్వతమ్ము.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండివేదన చెందితిన్ గదర విజ్ఞులమాటల నాలకింపకన్
వాదన చేయుచుండె నట వారుణి గ్రోలిన మూఢు డిట్లుగా
హైదరబాదు సింహళమునందలి పట్టణమౌ, నిజంబుగన్
గాదని చెప్పినన్ వినడు గర్హ్యుడు వానిని మార్చ లేమికన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిదారి గానక నీదరి జేరినాడ
రిప్లయితొలగించండివలయు చిరునామ గోరగ వాదమేల
చెప్పుటేలనో నిట్టుల చీదరించి
హైదరాబాదు గలదు సింహళములోన!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిభర్త విడిచిన మదవతి బ్రతుకు తెరువు
కై వలస బోయె నొకనాడు కడలి దాటి
యందరినివీడి బాధతో నామెదిదియె
హైదరాబాదు, గలదు సింహళములోన.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపట్టుదలతోడ హైదరాబాదు నకును
రిప్లయితొలగించండివచ్చి"వడివేలు"బిర్యాని వండ నేర్చె
"వేలు"హోటలు బోర్డుపై విదిత ముగుచు
"హైదరాబాదు" గలదు సింహళములోన.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిశ్రీ లంకలో ప్రభుత్వము తలచు కొంటే పట్టణముల పేర్లు మార్చడము కష్టము కాదు అని చెప్పేఈ ప్రయత్నము:
రిప్లయితొలగించండిఉ:
కాదను వారలెవ్వరట కాలము తీరె నటంచు పేరులన్
మోదము నెంచి యేలుబడి ముచ్చట మార్పు ఘటింప జేయ, నా
మీదట నొక్కటేమిటట మిక్కిలి మార్పులు చెంద గాంచనౌ
హైదరబాదు సింహళము నందలి పట్టణ మౌ నిజంబుగన్
వై. చంద్రశేఖర్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములు
తొలగించండివాదము జేయ వ్యర్థమని ప్రల్లదుడౌ నధికారి కెన్నడున్
రిప్లయితొలగించండిమోదము గూర్చ మేలనుచు మోమున బ్రీతిని జూపనెంచుచున్
కాదనకుండ భృత్యుడనె గాత్రమునన్ వినయమ్ము బల్కగా
"హైదరబాదు సింహళము నందలి పట్టణమౌ నిజంబుగన్ "
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి"వినయమ్ము జూపుచున్" అనండి.
గురువర్యులకు నమస్సులు, ధన్యవాదములు. అలాగే నండి.
తొలగించండిమార్చిన పద్యం:
వాదము జేయ వ్యర్థమని ప్రల్లదుడౌ నధికారి కెన్నడున్
మోదము గూర్చ మేలనుచు మోమున బ్రీతిని జూపనెంచుచున్
గాదనకుండ భృత్యుడనె గాత్రమునన్ వినయమ్ము జూపుచున్
"హైదరబాదు సింహళము నందలి పట్టణమౌ నిజంబుగన్ "
లోక జ్ఞానపు పాఠాల నేక బిగిన
రిప్లయితొలగించండిచదివి సహపాఠితోపోటి సలిపె నొకడు
యెదిరి ప్రశ్నల కీరీతి బదులు బలికె
హైదరాబాదు గలదు సింహళములోన
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'లోక జ్ఞాన' మన్నపుడు 'క' గురువై గణభంగం. 'ఒకడు+ఎదిరి' అన్నపుడు యడాగమం రాదు. "లోకరీతుల.. నొక్క డెదిరి..." అనండి.
సవరణలతో....
తొలగించండిలోక రీతుల పాఠాల నేక బిగిన
చదివి సహపాఠి తోపోటి సలిపె నొక్క
డెదురి ప్రశ్నల కీరీతి బదులు బలికె
హైదరాబాదు గలదు సింహళములోన
సమస్య :
రిప్లయితొలగించండిహైదరబాదు సింహళము
నందలి పట్టణమౌ నిజంబుగన్
( కాలజ్ఞానంలో వ్రాయబడకపోయినా కొన్ని విషయాలను అందులో ఉన్నట్లు చెప్పే ఒక ప్రబుద్ధుని డంబపు పలుకులు )
ఉత్పలమాల
...................
" చేదగు వార్త యైన మరి
చెప్పిరి బ్రహ్మము గారు ; సోదరుల్ !
నాదగు భాషణన్ వినుడు ;
నమ్ముడు ; సాగరజృంభణంబుచే
నైదు శతాబ్దముల్ బిదప
నందరి మన్నన లందినట్టిదౌ
హైదరబాదు - సింహళము
నందలి పట్టణమౌ నిజంబుగన్ . "
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిమా ఆవిడ ఎన్నడూ కాలజ్ఞానం చదువలేదు... కాని ఏదైనా వింత విన్నప్పుడల్లా "బ్రహ్మంగారు చెప్పినట్లే జరుగుతున్నాయి" అంటూ ఉంటుంది.
[12/06, 21:04] Rambabu kaipa: 🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅
రిప్లయితొలగించండిశంకరాభరణం వారి సమస్య : "హైదరాబాదు గలదు సింహళములోన"
1)
లంక సింహళ దేశము రమ్యముగను
జనులు వలస వచ్చిరి నెల్ల జగతి నుండి
నందు కలదు తెలుగు వారి నగరి, చిన్న
"హైదరాబాదు గలదు సింహళములోన"
- రాంబాబు కైప
12-06-2021
🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅
[12/06, 21:20] Rambabu kaipa: 🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅
శంకరాభరణం వారి సమస్య : "హైదరాబాదు గలదు సింహళములోన"
2)
భాగ్యనగరి నేటి ప్రవర ? భారతమున
పదునెనిమిది పర్వములు గలద తెలుపుము ?
రాజధాని కొలంబొ, యే రాష్ట్రమందు ?
"హైదరాబాదు; గలదు; సింహళములోన"
- రాంబాబు కైప
12-06-2021
🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅
[12/06, 22:17] Rambabu kaipa: 🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅
శంకరాభరణం వారి సమస్య : "హైదరబాదు సింహళమునందలి పట్టణమౌ నిజంబుగన్!"
4)
ఉత్పలమాల
వాదము లేక విశ్వమున వాసిని పొందిన పట్టణంబులన్,
భేదము లేక నెల్లరును వెళ్ళు కొలంబొ, నివాస యోగ్యమై
మోదము పొంది యుండగను , మూలన నక్కిన చిన్ని ప్రాంతమే,
హైదరబాదు, సింహళమునందలి పట్టణమౌ నిజంబుగన్!!
- రాంబాబు కైప
12-06-2021
🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅
[12/06, 22:51] Rambabu kaipa: సరిచేసి (యందున - నందున ; వారు వారిలో (లేదట సరిపోదు) అందుకు కచేరి వర్గమున్ అని మార్చాను
🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅
శంకరాభరణం వారి సమస్య : "హైదరబాదు సింహళమునందలి పట్టణమౌ నిజంబుగన్!"
3)
ఉత్పలమాల
ఆదర బాదరన్ ప్రతులయందున వ్రాసిరి తప్పులెన్నియో
లేదట, తప్పులొప్పులను రీతిగ జూచు కచేరి వర్గమున్,
వాదము జేసి జెప్పిరట, వాస్తవమందున నేటిరోజునన్
హైదరబాదు సింహళమునందలి పట్టణమౌ నిజంబుగన్!!
- రాంబాబు కైప
12-06-2021
🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅
[13/06, 01:27] Rambabu kaipa: 🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅
శంకరాభరణం వారి సమస్య : "హైదరబాదు సింహళమునందలి పట్టణమౌ నిజంబుగన్!"
5)
ఉత్పలమాల
వేదము లెల్ల వాసియని పేర్కొను పట్నము పుణ్య కాశియే
మోదముతోడ రాసులుగ ముత్యములుండు, సుపట్టణంబుయే
హైదరబాదు,; సింహళమునందలి పట్టణమౌ నిజంబుగన్
సాదు కొలంబొలో మణులు చౌకని మెచ్చిరి లోకులెల్లరున్
- రాంబాబు కైప
12-06-2021
🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅
[13/06, 02:00] Rambabu kaipa: 🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅
శంకరాభరణం వారి సమస్య : "హైదరబాదు సింహళమునందలి పట్టణమౌ నిజంబుగన్!"
6)
ఉత్పలమాల
హైదరబాదు, సింహళమునందలి పట్టణమౌ నిజంబుగన్
కాదుర! భారతీయ మణి , కౌస్తుభ రత్నము, ముత్యరాశి, రా
మాదులు, రామదాసునకు మంచిని కోరుచు వెళ్లినారులే;
మోదముతో ప్రజల్ పిలుచు, ముత్యపు పట్టణమంచు ప్రీతిగా
- రాంబాబు కైప
12-06-2021
🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅
[13/06, 02:30] Rambabu kaipa: 🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅
శంకరాభరణం వారి సమస్య : "హైదరాబాదు గలదు సింహళములోన"
7)
*గణన యంత్ర కార్యములకు ఘనత యెక్కి*
*ప్రముఖ ముత్యాలకు, ప్రథమ వరుస లోన*
" _హైదరాబాదు గలదు; సింహళములోన_ "
*పగడ నీల రత్నములెల్ల బాగు బాగు*
- రాంబాబు కైప
12-06-2021
🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅🔆🔅
మీ పూరణలన్నీ బాగున్నవి. అభినందనలు.
తొలగించండిమీ పద్యాలపై విడివిడిగా సమీక్షలను వాట్సప్ సమూహంలో చూడండి.
మీ పూరణల జడి వాన హాయిగా ఉంది
తొలగించండిమీ పూరణల జడి వాన హాయిగా వుంది
తొలగించండిభరత దేశమున ప్రముఖ పట్టణముగ
రిప్లయితొలగించండిహైదరాబాదు గలదు ; సింహళములోన
వెలసెను కొలంబొ యనునొక పెద్దనగరి
రాజధాని కనువయి చిరంతరముగ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమోదము "నాకుటంబ, మతిపూజ్యము విశ్వమటంచు నమ్ముచున్
రిప్లయితొలగించండిభేదము చూపకుండుటయె" విజ్ఞులు నమ్ముడు, వాని కెంచినన్
మేదిని యొక్కటే యగును, మేరలొకింతయు కానరావులే
హైదరబాదు సింహళమునందలి పట్టణమౌ నిజంబుగన్.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిబల్లపై చిత్తరువు గాంచి బాల్య మిత్రు
డడిగె నెవ్వరీ యందాల యతివయంచు
చెప్పితి ప్రియురాలనుచును చెలియదిదియె
హైదరాబాదు, గలదు సింహళము లోన.
వైవిధ్యమైన చక్కని పూరణ. అభినందనలు.
తొలగించండిసమస్య :-
రిప్లయితొలగించండి"హైదరాబాదు గలదు సింహళములోన"
*తే.గీ**
భాషలకు నిలయము కదా భాగ్య నగరి
పట్టు గొమ్మలా హైదరాబాదు గలదు
సింహళము లోన కూడ భాషించు జనులు
యెదురు పడెదరు చూడగ యెందరోను
...................✍️చక్రి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'వలె'ను 'లా' అనరాదు. 'జనులు+ఎదురు..' అన్నపుడు యడాగమం రాదు.
తొలగించండిసవరణతో
సమస్య :-
"హైదరాబాదు గలదు సింహళములోన"
*తే.గీ**
భాషలకు నిలయము కదా భాగ్య నగరి
బ్రతుకు నేర్పంగ హైదరాబాదు గలదు
సింహళము లోన కూడ భాషించు జనులు
కంటికి కనిపించెదరులే కలిసి మెలిసి
...................✍️చక్రి
వాదములాడుచుండె మధు పానము చేసిన మిత్రులిర్వురున్
రిప్లయితొలగించండిరాధను రావణుండు బహు రాగము పెట్టెను కంచిలోననెన్
కాదుర లంకనందుననె కాంచుము రక్కసులుండు చోటుయే
హైదరబాదు సింహళమునందలి పట్టణమౌ నిజంబుగన్
...భారతీనాథ్ చెన్నంశెట్టి...
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'చోటు+ఏ' అన్నపుడు యడాగమం రాదు.
ధన్యవాదములండీ
తొలగించండిసోదరభావశూన్యులయి శోచ్యవిగర్హితనీచకర్ము లు
రిప్లయితొలగించండిన్మాదకులై చరించుచు వినాశకులై కలహించుచో నరుల్
కాదన జాలు నెట్లు గతకాలనిశాటనివాసమై దగన్...
హైదరబాదు, సింహళమునందలి పట్టణమౌ నిజంబుగన్.
కంజర్ల రామాచార్య.
అవిడి కల్లంత దూరాన నాదిలక్ష్మి!
రిప్లయితొలగించండిహైదరాబాదు గలదు,సింహళములోన
నమ్మ శాకంబరీదేవి యాశ్రితులకు
రక్షగా నుండె గొలువయి రమ్యముగను
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమేదిని మేటిగానడరి మెప్పును బొందిన పట్టణంబునన్
రిప్లయితొలగించండిహైదరబాదు నొక్కటయి యాంధ్రము నందున నుండునట్లుగా
హైదరబాదు సింహళము నందలి పట్టణమౌ నిజంబుగన్
గాదన జాలమున్ గనుక గట్టిగ నమ్ముట యొప్పగున్ గదా
లేదనకుండ నందరకు రేపటి రోజున మ్యాపు బుక్కులన్
రిప్లయితొలగించండిప్రోదియు జేయ,నిత్తుననె, రొక్కము వద్దనె, నొజ్జ నందునన్
ఖేదము కల్గునట్టులను గీసిరి తప్పును, దిద్దకున్న పో!
హైదరబాదు సింహళమునందలి పట్టణమౌ నిజంబుగన్.
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండిమోదము నందఁగా, ఘన సుపోషణలో, నిటువంటి పట్టణం
బే, దిటవైన సుస్థిరత హెచ్చఁగ, లంకనుఁ జేరి, యచ్చటన్
సాదరపూర్ణులౌ కుతుబుషాహిలు నిర్మితి సేసియున్నచో,
హైదరబాదు సింహళము నందలి పట్టణమౌ నిజంబుగన్!
భాగ్యనగరమ్ము విలసిల్లు భద్ర గతిని
రిప్లయితొలగించండిభార తావనిఁ బన్నుగ వఱలు చుండి
పరఁగుచుఁ గొలంబొ నా ముఖ్య పురము, కాదు
హైదరాబాదు, గలదు సింహళము లోన
సోదరుఁ డాక్రమించె ఘన శూరుడు రావణుఁ డీపురమ్మునున్
గాదిలి విశ్వకర్మ మఱి కట్టఁ గుబేరుఁడు నుండ నింపుగా
మేదిని లంక నా పురము మించఁగ శోభలఁ బెక్కు భంగులన్
హైదరబాదు సింహళము నందలి పట్టణమౌ నిజంబుగన్
[హైదరాబదు(న్)]
కాదనునేమి జెప్పినను కష్టము వానికి నచ్చ జెప్పుటే
రిప్లయితొలగించండివాదమదేల వ్యర్థమిక వాడొక మూర్ఖుడు పట్టు వీడడే
లేదు ఫలంబు నీవు వివరించిన నాతడికిట్టులే యనున్
"హైదరబాదు సింహళమునందలి పట్టణమౌ నిజంబుగన్"
రిప్లయితొలగించండికాదనలే మదేదియును
కల్పన నందున నిల్పి జూడగన్
రాదొకొ వింత వింతయగు
రమ్యపు భావన మానసమ్మున
న్నేది దలంచ నద్దియె ర
హించును కన్నులలోన చిత్రమై
హైదరబాదు సింహళము
నందలి పట్టణమౌ నిజంబుగన్!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిజాదును చేసియిక్కడివి చారుమినారును, గోలుకొండ తో
రిప్లయితొలగించండిపాదుల నుండియెత్తికొని, పారగ దిట్టము లైనమేటి నా
వల్ దడి కట్టి సాగరము పైజని, లంకను దించినన్ గదా!
హైదరబాదు సింహళమునందలి పట్టణమౌ నిజంబుగన్.
కుండపోతగ వానలు కొట్టి కురిసె
రిప్లయితొలగించండివాగువంకలు పొంగగ సాగరమును
జ్ఞప్తిచేయుచు ననిపించె జలమునడుమ
"హైదరాబాదు గలదు సింహళములోన"
හේදරාබාද: සිංහල
రిప్లయితొలగించండిශ්රීධර් භූක්යා
భాగమతిపేరునవెలసె భాగ్యనగర
రిప్లయితొలగించండిమదియుకాలక్రమమ్మున నయ్యె గనుము
హైదరాబాదు,గలదు సింహళము లోన
సీత నుంచిన వనమదిచెదరకుండ