30, జూన్ 2021, బుధవారం

సమస్య - 3768

1-7-2021 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“నోఁచి పొందితిఁ గష్టముల్ నూతనముగ”
(లేదా...)
“నోములు నోఁచి పొందితిని నూత్నములౌ దురవస్థ లెన్నియో”

70 కామెంట్‌లు:

  1. పల్కిన పలుకు తప్పని వ్రతమునిలన

    నోఁచి పొందితిఁ గష్టముల్ ; నూతనముగ

    కాపరిగనైతి కాటికి కాశి నగర

    వాకిటనసత్యము పలుకన్వసతికిపుడు

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
  2. ధనముసరితూగదాయెగధవునితోడ
    మునికివశమయ్యెమరియాదనుండిమగఁడు
    భావమెంచినమనసునభామయనియె
    నోఁచిపోందితికష్టముల్నూతనముగ

    రిప్లయితొలగించండి
  3. ఖ్యాతి పొందెను దనుజుల జాతి నందు
    యాగ,తప, పూజలను హిర ణ్యకశ పుడును
    మార్చ జాలక కొడుకును, మదిని తలచె
    నోఁచి పొందితిఁ గష్టముల్ నూతనముగ

    రిప్లయితొలగించండి

  4. పిల్లలకొరకు పూజల విరివిగాను
    చేసి పొందితి గర్భమున్ శివుడ వినర
    పురిటి నొప్పుల తీవ్రత నెరుగ కుండ
    నోఁచి పొందితిఁ గష్టముల్ నూతనముగ.

    రిప్లయితొలగించండి
  5. సత్యభామతో ద్రౌపది సంభాషణ

    ధీమతులేవురౌ పతుల తీక్ష్ణతపంబున మంగళంబులౌ
    నోములనోచి పొందితిని; నూత్నములౌ దురవస్థలెన్నియో
    ధూమమువోలె గప్పిగొన దూ చను దప్పక స్త్రీలధర్మముల్
    ప్రేమగనాచరించుచును పెద్దలమెప్పును బొందితిన్
    గదా!

    రిప్లయితొలగించండి
  6. క్రొవ్విడి వెంకట రాజారావు:

    స్పస్టతయె వెలితిపడిన పదములనుచు
    దేవి బీజాక్షరములెల్ల తీరుగాని
    విధము బల్కి చిత్రముగ తప్పిదమగునటు
    నోచి పొందితి గష్టముల్ నూతనముగ.

    రిప్లయితొలగించండి
  7. కె.వి.యస్. లక్ష్మి:
    పుణ్య ఫలము వలన గల్గు పుత్రులనుచు
    నోచి నోములెన్నింటినొ నొందె నొకని
    నేడు యెదుట నిల్చి యెదురు వాడు తిరుగ
    నోచి పొందితి గష్టముల్ నూతనముగ.

    రిప్లయితొలగించండి
  8. ఏమని చెప్పదున్ సతము నెంత
    యొ శుద్ధ మనంబుతోడ మా
    క్షేమము గోరి భక్తిమెయి జేసితి
    బూజలు శాంతి హోమముల్
    నీమము లందునన్ మరియు
    నిష్ఠలలో గల లోపమేమిటో?
    నోములు నోచి పొందితిని నూ
    త్నములౌ దురవస్థలెన్నియో.

    రిప్లయితొలగించండి
  9. ఆమనిరాకఁజూచియటహాయనడెప్పుడుభావహీనుడై
    కాముఁడుకోపమగ్నినటకాలెనుమూడవకన్నుదెర్వగా
    మామకమంచులేదుగదమాయలలోంగడుమౌనితానయై
    నోములునోచిపోందితినినూత్నములౌదురవస్ధలెన్నియో
    (పార్వతిమనోగతము)

    రిప్లయితొలగించండి
  10. అభిమన్యుడు వీరస్వర్గమలంకరించిన తర్వాత అన్న శ్రీకృష్ణునితో సుభద్ర :

    తేటగీతి
    అన్న! నీవు దీవింపంగ నంది విజయుఁ
    గొమరు నభిమన్యుఁ గంటి, మనుమని గనక
    ముందె సుతుని బాసితి, గతమందు నేమి
    నోఁచి పొందితిఁ గష్టముల్ నూతనముగ?

    ఉత్పలమాల
    సేమము గూర్చ నర్జునుని జేసితి భర్తగ, నీదు! దీవనన్
    గామిత భాగ్యమై సుతుఁడు గల్గెను, మన్మని గాంచకుండహో!
    మామక దోషమేమి యభిమన్యుడె పాసె! గదన్న! కాని వే
    నోములు నోఁచి పొందితిని నూత్నములౌ దురవస్థ లెన్నియో?

    రిప్లయితొలగించండి
  11. వలపు జూపించు వాడు నా పతియు గాగ
    నోచి పొందితి : గష్టముల్ నూతన ముగ
    పుట్టె సంసార మందున పోర దొడగి
    రొండొరుల యందు నేకత లో ర్పు లేక

    రిప్లయితొలగించండి
  12. ఒక ఆఫీసరుగారి భార్య విలాపము

    ధూమునధామునన్ బ్రజకు తోషమునిచ్చెడి కాన్కలెన్నియో
    భామల కన్నుకుట్టగను భారిగ బంచగ నోముపేరిటన్
    ఏమని చెప్పుదున్ దెలిసి ఏసిబి వారిలు సోదజేయగా
    నోములనోచి పొందితిని నూత్నములౌ దురవస్థలెన్నియో

    రిప్లయితొలగించండి

  13. భామయె పల్కెనిట్లు ప్రసవమ్మన నింతటి బాధయౌన? య
    య్యో మరుజన్మమే సతికి, యోపగ లేను సదాశివా! భువిన్
    బ్రేమను పంచువారలగు పిల్లలు లేరని వాంఛతోడ నే
    నోములు నోఁచి పొందితిని నూత్నములౌ దురవస్థలెన్నియో.

    రిప్లయితొలగించండి
  14. కుంతీదేవి విలాపము:

    ఆముని యత్రిసూనునకు నాదరమొప్ప సపర్యసేయగన్
    ప్రేమను చేరదీయుచును పిల్లడి నిచ్చెడు మంత్రమిచ్చినన్
    నామది యేల గోరె దిననాథుని కన్నెగ సంతతిమ్మెయిన్?
    నోములు నోఁచి పొందితిని నూత్నములౌ దురవస్థ లెన్నియో!

    అత్రిసూనుడు-దుర్వాసుడు
    దిననాథుడు‌-సూర్యుడు

    రిప్లయితొలగించండి
  15. ఉ:

    ఏమదొ నాదు కర్మ మటు లెందుకు బూన్చితి లక్షలక్షలున్
    సామి యనంగనే మగని చంకిలి బెట్టెడు నమ్మకమ్ముతో ?
    పాముకు పాలు బోయుటయె, వాస్తవమై యడుగంటె సర్వమున్
    నోములు నోచి పొందితిని నూత్నములౌ దురవస్త లెన్నియో

    సామి =దొంగ స్వామి

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  16. ఏమని చెప్పుదున్ నిరతమీతనిపై వినుమెన్ని కొండెముల్
    వేమరు జెప్పినన్ వినడు వెన్నలు దొంగిలి బంచి పెట్టుచున్
    కోమలులా నదీ తటిని కోకలనుంచగ దోచి వేచునే
    నోములు నోఁచి పొందితిని నూత్నములౌ దురవస్థ లెన్నియో

    రిప్లయితొలగించండి
  17. సంతతిని గోరి వ్రతములు సలిపతిగద
    నిన్నినాళ్ళుగ చేకూరె నీదినమున
    గాసి యధికమయ్యెను మరి కవలలేమొ
    నోఁచి పొందితిఁ గష్టముల్ నూతనముగ

    రిప్లయితొలగించండి
  18. ప్రేమను జూపి మోస మొన రించెడు దుష్టుని మాయమాటలన్
    భామిణి నమ్మి పెద్దలను ప్రక్కన బెట్టియు పెండ్లి యాడె నీ
    యేమరపాటు తెచ్చె తన కిక్కట మంచును చెప్పె నిట్టు లన్
    నోములు నోఁచి పొందితిని నూత్నములౌ దురవస్థ లెన్నియో!

    రిప్లయితొలగించండి
  19. సమస్య :

    నోములు నోచి పొందితిని
    నూత్నములౌ దురవస్థ లెన్నియో

    ( బాలచంద్రుడు సబ్బాయి అనే వేశ్య వలలో
    పడి తన వద్దకు రానందుకు అతని భార్య
    మాంచాల ఆవేదన )

    ఉత్పలమాల
    ..................

    వేమరు గుండెలో నిలిపి
    వీరుని బాలు స్మరించుచుంటినే !
    ధీమతి బ్రహ్మనాయనికి
    దీవ్రపు దుర్యశమున్ గడించుచున్
    సామపు బుద్ధినే విడిచి
    సాకుల జెప్పెడి యిట్టి భర్త నే
    నోములు నోచి పొందితిని ;
    నూత్నములౌ దురవస్థ లెన్నియో .

    రిప్లయితొలగించండి
  20. నీమము తోడ పూజలను నేను‌ నిరంతము చేయుచుంటి శ్రీ

    రాముని పొందు కోరుచు‌ విరామము నొందక మానసంబునన్

    యేమిది తండ్రి తోడ సుతులీ‌ దినమందు రణంబు సల్పి నా

    దేముని కాగ్రహంబునిడి తిప్పలు పెట్టుచు నుండి రంటివా

    క్షేమము కోరి సల్పితిని శీఘ్రముగా లలితాంబ పూజలన్

    నోములు నోచి బొందితిని నూత్నములౌ దురవస్థ లెన్నియో,

    భూమిజ కేల బాధలని‌ భోరున యేడ్చె కపీశు తెల్పగన్

    రిప్లయితొలగించండి
  21. పాములు కప్పలున్ తినెడు పాపపు భోజను చీని వాసులున్

    ప్రేమగ పంచె పుర్వులను, పేదలు పెద్దలు బేధమెంచకన్

    గ్రామపు వాసులందరికి రంజగు విందును పెట్టి, తోషమున్

    నీమము తప్పి చేరితిని నీచ కరోనల బాహు బంధమున్

    నోములు నోఁచి పొందితిని నూత్నములౌ దురవస్థ లెన్నియో”

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
  22. శ్రీ గురుభ్యోనమః

    ఉ.
    స్వాముల నాశ్రయించితిని స్వల్పములైనటి బాధ లెంచగన్;
    స్తోమత మీరి విస్తరము సొమ్ములు ధారగ బోసినాను, నే
    ధీమతినంచు స్వజనుల దీర్ఘపు యోచన తోసిపుచ్చుచున్,
    నోములు నోఁచి పొందితిని నూత్నములౌ దురవస్థ లెన్నియో!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఐనట్టి' అనడం సాధువు. "స్వల్పములౌ పలు బాధ..." అందామా? మూడవ పాదంలో గణభంగం. సవరించండి.

      తొలగించండి
    2. ధన్యవాదములు గురువుగారు
      సవరణ తో..

      ఉ.
      స్వాముల నాశ్రయించితిని స్వల్పములౌ పలు బాధ లెంచగన్;
      స్తోమత మీరి విస్తరము సొమ్ములు ధారగ బోసినాను, నే
      ధీమతినంచు బంధువుల దీర్ఘపు యోచన తోసిపుచ్చుచున్,
      నోములు నోఁచి పొందితిని నూత్నములౌ దురవస్థ లెన్నియో!

      తొలగించండి
  23. రిప్లయిలు
    1. భూమిధరమ్ము వాసమగు బోనము భిక్ష త్వగంబరమ్ము నె
      మ్మోమున చిచ్చుగంటి సెగ మూర్ధమునన్ సురగంగ మేన ను
      ద్ధామవిభూతి, పుత్రి! బెడిదంపు మగండని జెప్ప వింటినే!
      నోములు నోఁచి పొందితిని నూత్నములౌ దురవస్థ లెన్నియో!

      కంజర్ల రామాచార్య‌

      తొలగించండి
    2. ప్రణయకలహం లో శివునితో పార్వతి అన్నట్లు భావన.

      తొలగించండి
  24. సమస్య: నోములు నోఁచి పొందితిని నూత్నములౌ దురవస్థ లెన్నియో
    ఉ: మామ కుమారునిన్ వలచి మాన్యులు మెచ్చగ పెండ్లి యాడితిన్
    కామన లన్నియున్ కరము కమ్మగ తీరెను తొల్లి , పిమ్మటన్
    కోమలుడౌ కుమారునికి కూడెను హెచ్చుగ జన్యు లోపముల్
    నోములు నోఁచి పొందితిని నూత్నములౌ దురవస్థ లెన్నియో
    (మేనరికం చేసుకున్న ఆమె వేదన)

    రిప్లయితొలగించండి
  25. ప్రేమయె మీరగన్ గనుచు బ్రీతిగ భర్తయె సాకుచుండగన్
    నీమము తప్పకుండగడు నిండుగ బొందుగ బిడ్డలిర్వురన్
    నోములు నోఁచి పొందితిని; నూత్నములౌ దురవస్థ లెన్నియో
    లేమిని కల్గజేయుచును రేగెను వ్యాధియె లోకమంతటన్

    రిప్లయితొలగించండి
  26. సెనగ నోమును భక్తితో గనులలరగ
    శాస్త్ర విధులను దప్పక శ్రద్ధ తోడ
    నోచి పొందితి గష్టముల్ నూతనముగ
    చిన్ని కొమరుడు మరణించ సెనగ వలన

    రిప్లయితొలగించండి
  27. ఎన్ని తీర్థముల్ వీక్షించి యెంతమంది
    సాధుజనులకు మ్రొక్కితి సంతు కొఱకు
    శోక హేతువుగా మార సుతుఁడు నోము
    నోఁచి పొందితిఁ గష్టముల్ నూతనముగ

    రిప్లయితొలగించండి
  28. దేవుఁ డెఱుఁగును ఫలితమ్ము లేవి యైనఁ
    జేయ నా పతి యప్పులు చింత తోడ
    నోము లెన్నియొ నే నిల నొచ్చు చుండి
    నోఁచి పొందితిఁ గష్టముల్ నూతనముగ


    నీమము తోడఁ బూజ లనునిత్యము సేసి కృశించి కన్న దా
    కోమలి పుత్రు దుష్టుఁ డయి ఘోరముగా నిడ వాఁడె దుఃఖముల్
    సామజ తుల్య గామిని యశాంతి మనమ్మునఁ దల్చె నివ్విధిన్
    నోములు నోఁచి పొందితిని నూత్నములౌ దురవస్థ లెన్నియో

    రిప్లయితొలగించండి
  29. సాముల సేవజేసితిని సాగిల మ్రొక్కితి సంతు కోసమై
    నీమముతోడ దైవమును నిశ్చల భక్తితొ వేడ గల్గె నా
    ధామమునందు పుత్రకుడు దారుణ మాతని తీరు చూడగన్
    నోములు నోఁచి పొందితిని నూత్నములౌ దురవస్థ లెన్నియో

    రిప్లయితొలగించండి
  30. కామిత వస్తువెల్లయును గౌరిని గూరిచి నిష్ఠతో ధరన్
    నోములునోచి పొందితిని,నూత్నములౌ దురవస్ధలెన్నియో
    మామకు మారునున్ వలచి మంచిగ బెండ్లియాడగా
    కామపిశాచియై పలువికారపు చేష్టల బొందితిన్ సుమా

    రిప్లయితొలగించండి
  31. ఉత్పలమాల:
    పాముల మ్రొక్కి,పుట్ట లను పాలిడి, నక్తము లుండి, నేలపై
    నీమముతో పరుండి ,పతి నీడనుఁ దప్పక సంచరించి నే
    నోములు నోఁచి పొందితిని నూత్నములౌ దురవస్థలెన్నియో
    భూమినిదొర్లు పాపడికి! బుద్ధి పురోగతి పొందు నాటికిన్!!
    -కటకం వేంకటరామశర్మ.
    (మూడవ పాదము-ఇవ్వబడిన సమస్య)

    రిప్లయితొలగించండి
  32. అరక యెద్దులఁనంగడి కమ్మి ,క్రొత్త
    యినుప యంత్రము కొనితేగ ననుముచెడుచు
    మాటి మాటికి పట్నంపు బాటఁబట్ట
    నోఁచి పొందితిఁ గష్టముల్ నూతనముగ!

    రిప్లయితొలగించండి
  33. పూజలనుచేయనిధులను పొందవచ్చు
    ననెడి వార్తమదినినమ్మి యాశ తోడ
    విడక చెప్పినవిధముగా వేగ నోము
    నోచి పొందితి కష్టముల్ నూతనముగ


    రిప్లయితొలగించండి