14, జూన్ 2021, సోమవారం

సమస్య - 3752

15-6-2021 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"హరిని శరణమ్ము వేడె నసురగణమ్ము"
(లేదా...)
"హరి నీవే శరణంచు వేఁడెనఁట దైత్యశ్రేణి సద్భక్తితోన్"

31 కామెంట్‌లు:

  1. వేడెను విభీషణుండును వేడె కశిపు

    ని కుమరుడు సతియును పావని తులసియును

    ఎందరెందరో మాన్యులు పొందికగను

    హరిని శరణమ్ము వేడి రసురగణమ్ము"

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
  2. తపముఁజేయశివుడుతపియించురక్కసుల
    కావగానుపూనెకరుణతోడ
    విష్ణుమాయతోడవిగతజీవులుగాగ
    హరినిశరణుగోరిరసురులెల్ల
    హరి-యముడుఅనుఅర్ధము

    రిప్లయితొలగించండి
  3. ఇదొక ఊహ....

    ఆటవెలది
    కలిసి చిలికి పాలకడలి మేము సురలు
    నమృతమందినంత నంబుజాక్షి
    ముదము సగముఁ బంచ మోహినీ రూపుడౌ
    హరిని శరణు గోరి రసురులెల్ల

    మత్తేభవిక్రీడితము
    సురలున్ మేమును క్షీరసాగర సుధన్ సొంపార గ్రోలన్దగున్
    మరులన్ జిందెడు జవ్వనీ హొయలతో మాకందనీవేలనే?
    వరుసన్ బంచుమటంచు శంకఁగొని బ్రోవన్ మోహినీ రూపుడౌ
    హరి నీవే శరణంచు వేఁడిరఁట దైత్యశ్రేణి సద్భక్తితోన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుదేవులు సమస్యలను సవరించిన కారణంగా

      సవరించిన పూరణలు :


      తేటగీతి
      కలిసి మేము సురలు పాల కడలి చిలికి
      నమృతమందిన కతనాన సమము వంచ
      నియతిఁ దగునంచు మోహినీ హొయల సిందు
      హరిని శరణమ్ము వేఁడె నసురగణమ్ము


      మత్తేభవిక్రీడితము
      సురలున్ మేమును క్షీరసాగర సుధన్ సొంపార గ్రోలన్దగున్
      మరులన్ జిందెడు జవ్వనీ హొయలతో మాకందనీవేలనే?
      వరుసన్ బంచుమటంచు శంకఁగొని బ్రోవన్ మోహినీ రూపుడౌ
      హరి నీవే శరణంచు వేఁడెనఁట దైత్యశ్రేణి సద్భక్తితోన్

      తొలగించండి
  4. దురిత మొనరింప బూనిన దుష్ట తతిని
    క్రూరులౌ వారి న ణ చంగ కోరి సురలు
    హరిని శరణమ్ము వేడి +రసుర గణమ్ము
    శిష్టులను గాంచి శిక్షింప సిద్ధమైరి

    రిప్లయితొలగించండి

  5. దస్యుడంచు గాదె దనుజులు తలచుచు
    పగను పెంచుకొనిరి పద్మనాభు
    పైన, కథల మరిచి పలికెనొకడిటుల
    హరిని శరణు గోరి రసురులెల్ల.


    హరినామంబును దల్చెనంచు కదరా యంతంబుకై చూసె నా
    శరుడా కాంచన కశ్యపుండు సుతునిన్ చండమ్ముతోనాడు స
    ర్వరసుల్ చెప్పిన గాథలన్ మరిచి ఖట్వారూఢుడే పల్కెనే
    హరినీవే శరణంచువేడిరట దైత్యశ్రేణి సద్భక్తి తోన్.

    రిప్లయితొలగించండి
  6. వరకారుణ్యగుణాలయుండునటనెవ్వారంచుచూడండుగా
    శరణన్నన్గనియార్ద్రతన్గదిసితాశాంతిన్ప్రసాదించుగా
    అరియేదిక్కనిదీక్షతోదనుజులాయాసంబుతోజన్మలన్
    హరినీవెశరణంచువేడిరటదైత్యశ్రేణిసద్భక్తితోన్

    రిప్లయితొలగించండి
  7. అరియేదిక్కనిదీక్షతోమదమునాయాసంబుతోజన్మలన్

    రిప్లయితొలగించండి
  8. మరణంబొందెను రావణా సురు
    డు సమ్మర్దంబునందోడియున్
    కరమున్ జింతిలి దైత్య సైన్య
    తతి చీకాకందరున్ జెందియున్
    ద్వరతోడన్ బరువెత్తివోయి మి
    గులన్ దండంబులుంజేయుచున్
    హరి నీవే శరణంచు వేడిరట
    దైత్య శ్రేణి సద్భక్తితో





    రిప్లయితొలగించండి
  9. బలిని మదమడంచ వామన రూపుడై
    సుతల మరుగ బంప సురల గావ,
    రాక్షసేంద్రు మాట రక్కసులాలించి
    హరిని శరణువేడి రసురులెల్ల.

    రిప్లయితొలగించండి
  10. క్షీర సాగర మధన సమయంలో రాక్షసులు అమృతము పొందుటకు మోహిని ని వేడు సందర్భంగా నా ప్రయత్నము:

    మ:

    మరులెత్తంగను మోహినీ దిరుగ కామాతీతులై రాక్షసుల్
    దరిజేరంతట దెల్పినారట సుధన్ ద్రావంగ తామెల్లరై
    వరుసన్ గూర్చొను మంచు దేవతలకై వడ్డింప నొయ్యారమున్
    హరి నీవే శరణంచు వేడిరట దైత్యశ్రేణి సద్భక్తి తోన్

    హరి = విష్ణు వనియు ,బంగారు వర్ణము గలది యనియు అర్థములు గలవు

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  11. చావు కెరజేయు హరియని జడిసి, దనుజ
    కోటి వరము కోరగ వెండి కొండ జేరి,
    శక్తి నొప్పార శంకరా! చంపు మనుచు
    హరిని, శరణమ్ము వేడి రసురగణమ్ము.

    దనుజుల కోర్కెలు విపరీతములు, దురాశ తో కూడిన అసంగతములు.


    రిప్లయితొలగించండి
  12. సమస్య :

    హరి నీవే శరణంచు వేడిరట దై
    త్యశ్రేణి సద్భక్తితోన్

    ( బాలప్రహ్లాదుని బోధ విన్న మిత్రబృందం హరిభక్తబృందంగా మారింది )

    మత్తేభవిక్రీడితము
    ---------------

    " హరియే సర్వము మిత్రులార ! వినుడీ
    యాయాస మింకేలనో ?
    తరణంబౌ నతడే సుమా ! " యనగనే
    తద్భక్తు ప్రహ్లాదునాం
    తరభావమ్మది మేలుకొల్ప నతులై
    తాదాత్మ్యులై పొంగి " శ్రీ
    హరి ! నీవే శరణం " చు వేడిరట దై
    త్యశ్రేణి సద్భక్తితోన్ .

    రిప్లయితొలగించండి
  13. అరుదౌపాదప వృక్షసంఘముల నాహ్లాదంబు నందించెడిన్
    ధరణీజాతను దాచినట్టిదగు నుద్యానంబు ఛేదించగా
    హరి, నీవే శరణంచు వేడిరట దైత్యశ్రేణి సద్భక్తితోన్
    వరగర్వంబున విర్రవీగెడును దుర్వారాంధునిన్ రావణున్

    హరి = హనుమ

    రిప్లయితొలగించండి
  14. క్షీరసాగర మథనంబు చేయువేళ
    మందరగిరియుదధియందు మగ్నమవగ
    సురలు వేడిరి మూపున గిరిని మోయ
    హరిని శరణమ్ము వేడి రసురగణమ్ము

    రిప్లయితొలగించండి
  15. రిప్లయిలు
    1. సురలు పలుమార్లు వేడిరి సులభు డైన
      హరిని శరణమ్ము ; వేడిరసురగణమ్ము
      సరసిజభవుని సులువుగ సంక్రమించు
      వరములను పొంది యమరుల బాధ బెట్ట

      తొలగించండి
  16. క్షీరసాగర మథనమ్ము జేయువేళ
    నమృతముద్భవించ హరియునవతరించె
    మోహినిగను సుధనుబంచు ముదిత రూపు
    హరిని శరణమ్ము వేడి రసురగణమ్ము

    రిప్లయితొలగించండి
  17. ధరణీనాథు డొకండు సత్కృతులచే దాజేరి వైకుంఠ మా
    కరుణాసాగరు నచ్యుతున్ గొలువగా కాంక్షించి తత్సన్నిధిన్
    హరుసంబందుచు నేగి చూచినను తా మాజన్మశత్రుల్ ఖలుల్
    హరి నీవే శరణంచు వేఁడిరఁట దైత్యశ్రేణి సద్భక్తితోన్.

    రిప్లయితొలగించండి
  18. మరుగై చీరలు వెర్రి గోపికలు భామల్ క్రీడగన్నెంచి శ్రీ

    హరి నీవే శరణంచు వేఁడిరఁట ; దైత్యశ్రేణి సద్భక్తితోన్"

    సుర రాజేంద్రుని వైరి దానవుల వంశోధ్ధారి కంసాసురున్

    మరణమ్మున్ దరి చేరు వాని బహు ప్రేమన్ చేరి కీర్తించెరా

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
  19. నేటి‌ శంకరా భరణము వారి‌ సమస్య.

    హరిని‌ శరణు కోరి రసురు లెల్ల


    ఇచ్చిన. పాదము ఆట వెలది

    నా‌ పూరణ క్రమాలంకారములో
    తేట గీతలో





    శివుని కాచ మనుచు కోరె శివ నెవరిని‌ ,

    దశముఖుని సోదరు డెటుల దాశరథి ప

    దముల పైబడె,థర్మ యధ్ధము లోన

    చచ్చి రెవరు, శ్రీ కృష్ణుని జాంబ వంతు

    డెపుడు శరణు చూపమని య డిగెను, హరిని,

    శరణు కోరి,రసురులెల్ల,శక్తి తగ్గ

    రిప్లయితొలగించండి
  20. సరినీకెవ్వరు లేరు విశ్వమున నోసంరక్షకా పాహి మం
    దరమున్ కవ్వముచేయ క్రుంగినది సంద్రమ్మందు కూర్మంబవై
    గిరినిన్మూపునదాల్చుమంచుసురలంగీకారమున్ కోరగా
    హరి నీవే శరణంచు వేఁడిరఁట దైత్యశ్రేణి సద్భక్తితోన్

    రిప్లయితొలగించండి
  21. మరణమ్మున్ గొన రావణాసురుడు సమ్మర్దమ్ములో రాముచే
    పరిపాలించు నధీశునిన్ గనక కంపమ్మొందు చిత్తమ్ముతో
    కరుణాధీరుడు భక్తవత్సలుడునౌ కంజార వంశీయునిన్
    “హరి నీవే శరణంచు వేఁడిరఁట దైత్యశ్రేణి సద్భక్తితోన్”

    రిప్లయితొలగించండి
  22. చిరకాలమ్ము గతించె నయ్య! దనుజశ్రేణీమహద్దైవమై
    సురసంఘప్రముఖాభవా! గిరిశ! సంస్తుత్యప్రభావోన్నతా!
    దురితుండౌ కులనాశకుం డకట! విద్రోహాంతకృద్వైరి యా
    హరి‌, నీవే శరణంచు వేఁడిరఁట దైత్యశ్రేణి సద్భక్తితోన్.

    కంజర్ల రామాచార్య

    రిప్లయితొలగించండి
  23. సమస్య :-
    "హరిని శరణమ్ము వేడి రసురగణమ్ము"

    *కందం*

    హరి నామము మోక్షమనుచు
    చిరు ప్రహ్లాదుడు భజనలు జేయుచు చెప్పన్
    హరిని శరణమ్ము వేడి ర
    సురగణములు వీధి వీధి స్తోత్రము తోడన్
    .....................✍️చక్రి

    రిప్లయితొలగించండి
  24. పరమాత్మా దయ జూపవే రయమునన్ పాపాత్ములన్ గూల్చవే
    హరి నీవే శరణంచు వేఁడిరఁట; దైత్యశ్రేణి సద్భక్తితోన్
    హరునిన్ వేడి వరంబులంది బల గర్వాధిక్యతన్ రేగుచున్
    దరుమన్ జేరిరి విష్ణులోకమును సంతాపంబునన్ దేవతల్

    రిప్లయితొలగించండి
  25. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  26. అసుర బాధలు పడలేక భూసురులట
    హరిని శరణమ్ము వేడిర, సురగణమ్ము
    దేవలోకమ్ము పైబడి దేవతలను
    బంది జేయగ విడిపించె భవుని హితుడు

    రిప్లయితొలగించండి
  27. దైత్య బృందము ద్వేషించె నిత్య మబ్జ
    నాభుని హరిని సంత తానాథ శరణు
    శుద్ధ భక్తిని నమరులు, చూచు చుండ
    హరిని శరణమ్ము వేడి, రసుర గణమ్ము


    దైత్య బృందము ద్వేషించె నిత్య మబ్జ
    నాభుని హరిని సంత తానాథ శరణు
    దక్ష జాత్మనాథుని సంతత కరుణా ల
    హరిని శరణమ్ము వేడె నసుర గణమ్ము


    హరి తానంచు విభీషణుం డెఱిఁగి రామాఖ్యున్ నుతించెన్ హరిం
    గరి రక్షా రతుఁ బూజ సేసి రల రక్షః కోటి మున్నెందఱో
    యరిషడ్వర్గముఁ ద్రుంచి సంతతము ప్రహ్లాదాది దైత్యార్భకుల్
    హరి నీవే శరణంచు వేఁడిరఁట దైత్యశ్రేణి సద్భక్తితోన్

    రిప్లయితొలగించండి
  28. స్ధిరమౌ నీవని భక్తులెల్లరును నీసేవఃదగన్ జేయుచున్
    హరినీవే శరణంచు వేడిరట,దైత్యశ్రేణి సద్భక్తితోన్
    పరమాచార్యుని విష్ణునిన్ ముదము నింపారన్ నొగిన్బంచుమా
    సురలున్బాటుగ వారలున్ నమృతమున్ జుఱ్ఱంగవేడెన్ వెసన్

    రిప్లయితొలగించండి
  29. త్వర పెట్టెన్ నిజపుత్రు చంపగ జనుల్ వారించినన్, వానినిన్
    నరసింహుండుగ మారి చీల్చి దునిమెన్ నారాయణుండుగ్రుడై
    మరి ప్రహ్లాదుని తండ్రి చావు గనుచున్ మన్నింపు కై భీతులై
    హరి నీవే శరణంచు వేఁడిరఁట దైత్యశ్రేణి సద్భక్తితోన్.

    రిప్లయితొలగించండి