16, జూన్ 2021, బుధవారం

సమస్య - 3754

17-6-2021 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సౌఖ్యమే లేదు రామరాజ్యమ్మునందు”
(లేదా...)
“జనులకు రామరాజ్యమున సౌఖ్యము సుంతయు లేదు లేదుపో”

66 కామెంట్‌లు:

 1. తేటగీతి
  అక్కరోన యరాచకమడ్డుకొనక
  గుడుల నేకాంత సేవలన్ గొలువు దీరి
  ప్రజల కష్టాల మఱచితే? రుజల ధాటి
  సౌఖ్యమే లేదు రామ! రాజ్యమ్మునందు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చంపకమాల
   మనుజుల ప్రాణముల్ క్రిమికి మైకమొసంగు సధామృతమ్మొకో!
   కనులకు కానరాని క్రియ ఘాతుకమెంచనె! యాలయమ్మునన్
   దినమొక సేవలో మునిగి తేలుచు ప్రాణుల సేమమెంచకే?
   జనులకు రామ! రాజ్యమున సౌఖ్యము సుంతయు లేదు లేదుపో!

   తొలగించండి
  2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
 2. తాటకిని చంపెను దశరధ తనయుండె

  కుంభ కర్ణ రావణులను కూల్చెనయ్య

  రాలిరెందరో దురితులు , రక్కసులకు

  సౌఖ్యమే లేదు రామరాజ్యమ్మునందు

  ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

  రిప్లయితొలగించండి

 3. శ్రీత్రయంబు కొలువుదీర సిరులు పొంగె
  ధర్మ మచ్చోట నాల్గుపాదముల నిలిచె
  పాపచిత్తులకును స్వార్థ పరులకు గన
  సౌఖ్యమే లేదు రామరాజ్యమ్ము నందు.

  రిప్లయితొలగించండి
 4. నేర చరితులు దోపిడీల్ నెఱపు వారు
  తమరి కార్యముల్ సాగక తపన తోడ
  చేరి యొకచోట బాధతో జెప్పు కొనిరి
  సౌఖ్య మే లేదు రామ రాజ్య మ్ము నందు

  రిప్లయితొలగించండి
 5. కోట్ల జనులకు కోవిడు గొంతు నులిమె,

  మాస్కు లేకుండ తిరుగుట మరచి పోయె

  కూడు దొరక దాయె ప్రజకున్ కూలి లేక

  జంతువులు రహదార్లలో సంచరించ

  జనులు యిళ్ళలో మగ్గిరి జైళ్ళ వోలె

  ధరణి లోని జనులకెల్ల తరచి చూడ

  సౌఖ్యమే లేదు రామ , రాజ్యమ్ము నందు

  శాంతి కలుగునా తెల్పు దశరథ తనయ

  రిప్లయితొలగించండి
 6. క్రొవ్విడి వెంకట రాజారావు:

  రావణుని లంకయందున దేవలులకు
  సౌఖ్యమే లేదు; రామ రాజ్యమ్మునందు
  ధర్మ తత్త్వము గూడిన ధార్మికులకు
  శాంతియు సుఖము గూడెను సమధికముగ.
  (దేవలుడు=ధర్మజ్ఞుడు)

  రిప్లయితొలగించండి
 7. నిజమునిష్ఠురమైననునీతియుండు
  శాసనంబుననారాజుసంధిఁబోడు
  నీతిణదప్పుచునర్తించునేతకిపుడు
  సౌఖ్యమేలేదురామరాజ్యంబునందు

  రిప్లయితొలగించండి
 8. సమస్య :

  జనులకు రామరాజ్యమున
  సౌఖ్యము సుంతయు లేదు లేదుపో

  ( అందరూ మహిళామణులే ఉండాలన్న రాణి ప్రమీల
  రాజ్యంలోని పురుషుల మనోభావాలు )

  చంపకమాల
  ...................

  వనితలె గొప్పవారలట !
  వారలె శక్తికి మారుపేరటే !
  మన మగవార లెప్పటికి
  మాన్యులు గారట ! యుక్తియుక్తమా ?
  మన మిట లేక సంతతులు
  మాయమె వీరికి ; పూరుషాకృతుల్
  జనులకు రామరాజ్యమున
  సౌఖ్యము సుంతయు లేదు లేదుపో !!

  ( రామరాజ్యము - స్త్రీరాజ్యము )

  రిప్లయితొలగించండి

 9. ఘనమది రామపాలనము, కంజమనోహరి నిల్చియుండెనే
  యనముల నాల్కపైన తరులన్నియు బంగరు పంటలీయగన్
  సన నిరతమ్ము సైనిక భుజాంతర మందున నిల్వ కూళులౌ
  జనులకు రామరాజ్యమున సౌఖ్యము సుంతయు లేదులేదుపో.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'ఈయగన్+చన' అన్నపుడు ద్రుతకార్యం జరుగుతుంది, గసడదవాదేశం రాదు.

   తొలగించండి
 10. పనిగోనిపాపపంకిలముపంచగరాజునురాముడంతటన్
  వినయముతోడకానలకువెళ్లెనునిర్దయనిర్ణయాత్ముడై
  అనయముతండ్రిమాటలకునర్పణఁజేసెనురాజధర్మమున్
  జనులకురామరాజ్యమునసౌఖ్యముసుంతయులేదులేదుపో

  రిప్లయితొలగించండి
 11. మునులకు యజ్ఞ యాగముకు ముప్పును తెచ్చిన రాక్షసాధమున్

  పనుపున మౌని వెంట చని పంపెను కాలుని పాద సేవకై

  రణమును కోరు రక్కసులు రక్త పిపాసులు ధూర్త శ్రేష్టులౌ

  జనులకు రామరాజ్యమున సౌఖ్యము సుంతయు లేదు లేదుపో

  ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'యాగమునకు' అనడం సాధువు. "యజ్ఞకర్మలకు.. ధూర్తవర్యులౌ" అనండి. 'కాలుని పాదసేవ'?

   తొలగించండి
 12. కరుణలేనట్టి కణజీవి కథనునడిపె
  విలయ తాండవమున్ జేసి వేగ ముగను
  కష్టజీవుల కడగండ్లు కాన రావ
  సౌఖ్యమే లేదు రామ,రాజ్యమ్ము నందు!!

  రిప్లయితొలగించండి
 13. ~~~~~~~~~~~~~~~~~~~~~
  మనమున నెల్లవేళల నమానుష
  చింతన యుండు వారికిన్
  అనయము మోసగించి పరు
  లాస్తిని ప్రోగొన రించువారికిన్
  వినయ విహీన క్రూరులకు విభ్ర
  మ చేష్టలు సేయునట్టి దు
  ర్జనులకు రామరాజ్యమున సౌ
  ఖ్యము సుంతయులేదులేదుపో
  ~~~~~~~~~~~~~~~~~~~~~

  రిప్లయితొలగించండి
 14. అనయము పాడిపంటలను హ్లాదమునిండగ
  సాజమైనదౌ
  జనులకు రామరాజ్యమున సౌఖ్యము; సుంతయు లేదులేదుపో
  చినుకులు లేనికాలమది, చింతలువంతల స్రుక్కువారలౌ
  జనులను గానజాలమట, చావులు జబ్బులు లేవులేవుగా

  రిప్లయితొలగించండి
 15. చం:

  వినికిడి మాత్రమై నిలిచె వింతగ దేశము రామ రాజ్యమై
  కనులకు గాన రాదు గద కట్టడి, నీతియు, ధర్మ మెచ్చటన్
  మనుగడ నెంచి నాయకులు మాటలు కోటలు దాట బల్కనై
  జనులకు రామ రాజ్యమున సౌఖ్యము సుంతయు లేదు లేదు పో

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 16. కనులకు కట్టినట్లుగను కన్పడ దృశ్యము నిస్సహాయులే
  వినగను దుస్థితిన్నిపుడు వేగమె సాయము పొందజాలకన్
  అనయము పొర్గు వారలకునార్థిక భారము తీర్చకుండినన్
  జనులకు రామరాజ్యమున సౌఖ్యము సుంతయు లేదు లేదుపో!!

  రిప్లయితొలగించండి
 17. త్వరజరకు, జాడ్యము లకు సంతాప ములకు,
  కరువులకు, వరదలకు, సంకటముల కును,
  విలయములకు,దావానల వికట ములకు
  సౌఖ్యమే లేదు రామరాజ్యమ్మునందు

  రిప్లయితొలగించండి
 18. క్రొవ్విడి వెంకట రాజారావు:

  చనువుగ తోడివారలకు సాయమొసంగని స్వార్థ మెంచుచున్
  పనుపగు ధర్మమార్గమును పాయు నధర్మ నసత్య వాదులై
  అనయము జీవితమ్మున ననర్థ మొనర్చు పథమ్ము నేగునౌ
  జనులకు రామ రాజ్యమున సౌఖ్యము సుంతయు లేదు లేదుపో!

  రిప్లయితొలగించండి
 19. మునులను హింస బెట్టి,మరి మూర్ఖపు చేతల యజ్ఞయాగముల్
  మనుటకు నడ్డుగా నిలిచి, మాయలు చేయుచు మోదమొందు చున్,
  వనితల,బాల,వృద్ధులను వర్జన చేసెడు క్రూర దైత్య దుర్
  జనులకు, రామరాజ్యమున సౌఖ్యము సుంతయు లేదు లేదుపో!

  రిప్లయితొలగించండి
 20. కఠిన చిత్తుడు రాముడు కారడివికి
  ధర్మ పత్నిని తరలించె దారుణముగ
  వెదకి చూడగ సీతకు వెతలె దప్ప
  సౌఖ్యమే లేదు రామరాజ్యమ్మునందు

  రిప్లయితొలగించండి
 21. పేరు జూడ రాముడె గాని పేదలయెడ
  దయనుజూపక సరకుల ధరలబెంచి
  రేపు యెటులనంచు నిదురలేకపోవ
  సౌఖ్యమే లేదు రామరాజ్యమ్మునందు

  రిప్లయితొలగించండి
 22. మునిజనసేవలోమునిగిపుణ్యముజేసినక్షత్రియుండునున్
  వనమునపర్ణశాలననువాసముసల్పినసత్యశీలియున్
  వినుచునువారిమాటలనువీడెనుసీతను,నట్టిదూరుదు
  ర్జనులకు రామరాజ్యమున సౌఖ్యము సుంతయు లేదు లేదుపో

  కొరుప్రోలు రాధాకృష్ణ రావు

  రిప్లయితొలగించండి
 23. రిప్లయిలు
  1. మునిజనయాగహానికరమూర్ఖనిశాచరులైన వారికిన్,
   వినుతపతివ్రతామణుల భీరువులం జెరఁబట్టువారికిన్,
   జననుతశీలవంతులను శంకల దూరెడు దుష్టకార్యరం
   జనులకు, రామరాజ్యమున సౌఖ్యము సుంతయు లేదు లేదుపో.

   కంజర్ల రామాచార్య

   తొలగించండి
 24. నిజము శ్రీరామచంద్రుడీ నేత యనుచు
  నమ్మి రాజును జేసిరానాడు జనులు
  వమ్ము జేయగ నాశలు బలికిరిటుల
  సౌఖ్యమే లేదు రామరాజ్యమ్మునందు

  రిప్లయితొలగించండి
 25. తాపసుల బట్టి వేధించు తామసులను
  రామబాణంబు వెన్నాడ రాత్రి పవలు
  పరుగులెత్తుచు వారలు బలికిరిటుల
  సౌఖ్యమే లేదు రామరాజ్యమ్మునందు

  రిప్లయితొలగించండి
 26. కనగను చోద్యమాయెగద గందరగోళము లాయెనంతటన్
  పనులకు నంతరాయమున భారము లాయెను జీవనంబులే
  కనివిని నేర్వమీ క్రిమిని, కాలమె నేర్పును కారణంబునున్
  జనులకు రామ!రాజ్యమున సౌఖ్యము సుంతయు లేదు లేదుపో
  మనవిది నీకిదే వినుమ! మమ్ముల కావగ రమ్ము శీఘ్రమున్

  రిప్లయితొలగించండి
 27. రాముడేలికగానుండ రాజ్యమందు
  నెలకు వానలు మూడుగా నేల తడిసె
  పౌరులెల్లరు ముదమున బడయనట్టి
  సౌఖ్యమే లేదు రామరాజ్యమ్మునందు

  రిప్లయితొలగించండి
 28. రాముడే పోవలసి వచ్చె భామతోడ
  దండకారణ్య వాసంపు తమము తోడ
  రావణాసురి చేష్టలు రచ్చ యగుట
  సౌఖ్యమేలేదు రామ రాజ్యమ్ము నందు

  రిప్లయితొలగించండి
 29. కనివినియెన్నడేనియెరుగమ్మిటు లింధనముల్ సువర్ణముల్
  దినుసులు కూరగాయలును దేశమునందున నింగినంటగన్
  జనహితకారకమ్ములగు చర్యలు చేతుమటంచు పల్కినన్
  జనులకు రామరాజ్యమున సౌఖ్యము సుంతయు లేదు లేదుపో

  రిప్లయితొలగించండి
 30. ముఖ్యముగ నెంచ రఘు రామమూర్తి విశ్రు
  తాఖ్య జప గరిమఁ బెరిగె నట జనులకు
  సఖ్యము రవంత దుఃఖము, చాల కల్గె
  సౌఖ్యమే, లేదు రామరాజ్యమ్మునందు


  ఘనపు టుపద్రవమ్ము సెలఁగం బురి నప్పుడు భద్రు రాహు కా
  ల నిగది తోక్త వాక్యముల రాఘవ హృద్విలసన్మనో రమా
  వనిజ బహిష్కరించి యనుపన్ వని కక్కట దుఃఖ తప్తులౌ
  జనులకు రామరాజ్యమున సౌఖ్యము సుంతయు లేదు లేదుపో

  రిప్లయితొలగించండి
 31. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 32. మనము చలించగా నొకడు మాన్యత లేకను బల్కెనిట్లుగా
  జనులకు రామరాజ్యమున సౌఖ్యము సుంతయు లేదులేదుపో
  యనగను నమ్మువారలును,హర్షముజెందెడు వారలుందురా?
  వినుముర రామరాజ్యమును బృధ్విని నాంధ్రమునందు జూడుమా

  రిప్లయితొలగించండి
 33. ఇనకులుడా దురాత్ముఁ వధియించి మహీజను గాచెనా పయిన్
  దన నిజవాసమేగి వినుతంబుగ రాజ్యము నేలుచుండగా
  తనరగ ధర్మ వర్తనము, తావిక లేక హతాశులైన దు
  ర్జనులకు రామరాజ్యమున సౌఖ్యము సుంతయు లేదు లేదుపో

  రిప్లయితొలగించండి
 34. రాముడానాడు ధర్మంబు రాకయుంచ
  "కాముడీనాడు కల్లోల కావరంబు
  బంచ? మరుగాయె మనుజులమంచితనము"
  సౌఖ్య మేలేదురామ!రాజ్యమ్మునందు.

  రిప్లయితొలగించండి
 35. కనగ కరోన దేశమున కష్టములన్ కలిగించు చుండగా
  మనుజుల ప్రాణముల్ గొనుచు, మారి విధమ్మున పిక్కటిల్లుచున్
  ధనము గడించ పేదలిట దారిని కాంచక తల్లడిల్లగా
  జనులకు, రామ! రాజ్యమున సౌఖ్యము సుంతయు లేదు లేదుపో

  రిప్లయితొలగించండి