16-6-2021 (బుధవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“కోడలి కత్తకును జెలిమిఁ గూర్చునె యజుఁడున్”(లేదా...)“కోడలి కత్తకుం జెలిమిఁ గూర్పఁగ బ్రహ్మకునైన సాధ్యమే”
వాడనివైరంబీయదిచేడియవాణికిసిరికినిచేరికలేదేపోడిమిమీరగతలపడికోడలికత్తకునుఁజెలిమిఁగూర్చునెయజుడున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కోడలితోశత్రుత్వపుజాడలు లేకనె మనగల జాణలు కలరేచూడని వింతను కనుగొనకోడలి కత్తకును జెలిమిఁ గూర్చునె యజుఁడున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు."లేకయె.." అనండి.
సమస్య : కోడలి కత్తకుం జెలిమి గూర్పగ బ్రహ్మకునైన సాధ్యమే ( తండ్రికే కాదు కొడుక్కి కూడా ఆ అత్తాకోడళ్లను ఐకమత్యంతో ఉంచటం కుదరటంలేదు - ఒకరు ఉన్న చోట మరొకరు ఉండమంటారు )ఉత్పలమాల....................వేడుక మీరగన్ గలిసి విద్యలదేవియు భాగ్యరాణియున్ దోడుగ నీడగన్ జెలిమి తోడుత నైక్యముగా జరింపరే !యోడెను మామ గారు హరి యొక్క నిమేషము మైత్రి గూర్పకే ;కోడలి కత్తకుం జెలిమి గూర్పగ బ్రహ్మకునైన సాధ్యమే !!
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
వీడును చదువరి నెప్పుడుపోడిమి యని బుధుడొకండుపొత్తువు శ్రీతో కూడదని యిట్లు పలికెనుకోడలి కత్తకును జెలిమిఁ గూర్చునె యజుఁడున్.
చూడగపోతనార్యుడునుచూలిగవాణికిభాగ్యమందగావీడనిమత్సరంబుననుబీదనుఁజేసెనులక్ష్మియాతనిన్మేడలుమిద్దెలుండిననుమేలిమివిద్యయెవానినంటదేకోడలికత్తకున్జెలిమిఁగూర్పగబ్రహ్మకునైనసాధ్యమే
అందరికీ నమస్సులువీడక యమ్మ తాను బెను ప్రేమను బంచెను పాతికేళ్లుగా,నీడగ దాను నిల్చి కడు నెమ్మిని జూపును భార్యయే సదాతోడుగ నుండు నిర్వురును తూకము గోరెడి తీరు మార్చరే!*“కోడలి కత్తకుం జెలిమిఁ గూర్పఁగ బ్రహ్మకునైన సాధ్యమే*వాణిశ్రీ నైనాల*
కందంకూడక పరస్పరమ్ముగఁబీడగఁ గని యొకరి నొకరు వీధికి నెక్కన్దాడికి దిగు వైరులవలెకోడలి కత్తకును జెలిమిఁ గూర్చునె యజుఁడున్?ఉత్పలమాలవాడని ప్రేమతో పతినిఁ బాడిగ పెద్దల నత్తమామలన్వేడుక జూడగా, సుతగ ప్రీతినిఁ బంచఁగ నింట పెద్దలున్గూడవె సౌఖ్యముల్, మఱచి కూరిమి వైరుల భంగి పోరెడున్గోడలి కత్తకుం జెలిమిఁ గూర్పఁగ బ్రహ్మకునైన సాధ్యమే?
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
🙏ధన్యోస్మి గురుదేవా🙏
ఈడున నంతరంబు తమ ఈహల మధ్యన దవ్వుబెంచగానాడును నేడునన్ బలుకు నాల్కల పైనను నాట్యమాడుచున్వాడిగ వేడిగన్ జరుగు వాదము లింటను చెంగలించగాకోడలి కత్తకున్ చెలిమిగూర్చగ బ్రహ్మకునైన సాధ్యమే
కూడిక చేసెన్ శంభుని వీడక గళమున మెరిసెడి విష నాగమ్మున్వేడుక విష్ణుని శయ్యగకోడలి కత్తకును జెలిమిఁ గూర్చునె యజుఁడున్”...భారతీనాథ్ చెన్నంశెట్టి...
ధన్యవాదములండీ
వీడదె వాక్కుచేడియ యభీష్టము జూపు ప్రదేశ మెప్పుడున్ పోడిమి నిచ్చు పాల్కడలి ముద్దులపట్టి యటంచు జెప్పుచున్ కూడరు వీరలిద్దరని కోవిదుడొక్కడు పల్కెనిట్టులన్ కోడలికత్తకుం జెలిమిఁ గూర్పఁగ బ్రహ్మకు నైన సాధ్యమే.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
చూడగ జోద్యమ దెప్పుడుతోడున్నీడగ గలువరు దోషం బేమో!వీడగ నీ నానుడి నికకోడలి కత్తకును జెలిమిఁ గూర్చునె యజుఁడున్?!
ఈనాటి శంకరాభరణం వారి సమస్యకోడలి కత్తకును చెలిమి కూర్చునె యజుడన్ఇచ్చిన పాదము కందమునా పూరణ సీసములోతెనాలి రామలింగనికి కాళికా దేవి ప్రత్యక్షమై రెండు పాయస పాత్ర లిచ్చి ఒకటి తాగితే సిరి ఉంటుంది అని ఒకటి తాగితే సరస్వతి ఉంటుంది అని చెప్పినపుడు రెండు కావాలని గుటుక్కున త్రాగు సన్నివేశముఘనత నొప్పారుచు కవుల గృహములందునాట్య మాడును గదా నలువ పత్ని,శుభముగా జలథిజ చూడ బో దెప్పుడు నొక కంటి తోనైన నొక్కమారు,సఖ్యత యుండదు జగమున వారికినెపుడని తెలియదా ?ఈశ!చండి!కాళికా! కోడలి కత్తకును చెలిమి కూర్చునె యజుడు నీ గోత్ర మందు,సంభవము కాదు గాతల్లి , సరస గతిగనిరువురును వశించ వలెను కరుణ తోడననుచు పాయస పాత్ర ద్వయమును కొనుచు గ్రోలె నా రామలింగడు గొప్ప గాను
మీ పూరణ బాగున్నది. అభినందనలు.వాట్సప్ సమూహంలో నా సమీక్ష చూడండి.
వీడక కలహించుట గని వేడుకమిత్రుని పిలిచియు వీక్షింపు మనెన్ చూడగ ననిపించు మనకు కోడలి కత్తకును జెలిమి గుర్చునె యజుఁడున్?
కూడిక కుదరదు మగడేబూడిద యైనన్ యిరువురు పొసగరు కసితోమాడిన ముఖముల పెనగెడుకోడలి కత్తకును జెలిమిఁ గూర్చునె యజుఁడున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'ఐనన్+ఇరువురు' అన్నపుడు యడాగమం రాదు. "...యైనను నిరువురు" అనవచ్చు.
కోడలు కాదు కూతురని కోమలి భావన చేయు వేళలన్వీడిన తల్లియే మరల వియ్యపు యత్తగ రూపమెత్తగన్“ కోడలి కత్తకుం జెలిమిఁ గూర్పఁగ బ్రహ్మకునైన సాధ్యమే”వాడుక పల్కులయ్యెనుర వారిజ నాభుని సాక్షి కల్లగన్...భారతీనాథ్ చెన్నంశెట్టి...
మీ పూరణ బాగున్నది. అభినందనలు."వియ్యపు టత్తగ.." అనండి.
ధన్యవాదములండీసవరణకు కృతజ్ఞుడిని
గూడును గూల్చు చేతలను గోడలు సేయుచునుండ గాంచియున్బాడలవాటు మానుమని భామినితో వివరించి చెప్పినన్వీడక దుష్ట మార్గమున బంధకియై తిరుగాడునట్టి యాకోడలి కత్తకున్ జెలిమి గూర్పగబ్రహ్మకు నైనసాధ్యమే
3 వ పాదం లో యతి ?
తోడుగ నెన్నడునుండునువీడక సిరి వాణిలేని వేశ్మము నందున్కోడలితోకూడదెపుడుకోడలి కత్తకును జెలిమిఁ గూర్చునె యజుఁడున్
మిత్రులందఱకు నమస్సులు!నేఁడు వసించుచుండెఁ గొని నెమ్మిని మా గృహమందుఁ గోడలే,తోడుగ నుండ దేల నయొ దుర్లభ యత్తయె మా గృహంబునన్!జూడఁగ వాణి యున్న దిటఁ! జోద్యము! లక్ష్మియె లేదు! రా దిఁకన్! కోడలి కత్తకుం జెలిమిఁ గూర్పఁగ బ్రహ్మకునైన సాధ్యమే?
ఉ: తోడుగ దాచరాదనరె త్రోయగ కోశము( రెండు కత్తులన్ వీడియు నుండలేరు కడు వేడుక లెంచి వ్యవస్థ పూనికైచూడగ లోకు లెల్లరకు జోడుయె వీరలటంచు గన్పడన్కోడలి కత్తకుం జెలిమి గూర్పగ బ్రహ్మకునైన సాధ్యమే*కోశము( =ఒర ; అరసున్న రాకపోగా ( ను యెంచి నాను.*వై. చంద్రశేఖర్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'కోశము' తరువాత అరసున్న అవసరం లేదు.
ధన్యవాదములు ; జోడుయె / జోడగు గా చదువగలరు
చూడగ జిహ్వపయి నటనమాడు నలువ రాణి జామి మాధవి కగునేజోడుగ గన నరుదేమరికోడలి కత్తకును జెలిమిఁ గూర్చునె యజుఁడున్
వీడకనెల్ల వేళలను విద్య విహీనుని యింటనుండు తాతోడుగ లక్ష్మి యేలనొకొ దూరమువెట్టును వాణి నెన్నడున్కోడలు వాణిచెంత సిరి కూరిమి నుండదదేమి వైరమోకోడలి కత్తకుం జెలిమిఁ గూర్పఁగ బ్రహ్మకునైన సాధ్యమే
మీ పూరణ బాగున్నది. అభినందనలు."వీడక యెల్ల..." అనండి.
కోడలు భావి యత్తయు నగున్ గతమందున నత్త కోడలేతోడగ నుండబోరు సిరితో జతగూడని వాణి భంగి, నావాడె సుతుండు భర్త తనవాడని దల్తు రహోధ్రువమ్ములౌకోడలి కత్తకుం జెలిమిఁ గూర్పఁగ బ్రహ్మకునైన సాధ్యమే!కంజర్ల రామాచార్య
మూడును రెండు చేయమని మోదము నొందెడు నత్తలుండ వెంటాడుచు నత్త మామలను టక్కరి(టార్చరు) చేసెడు కోడలుండు ఈవేడుక మూడు గీతలను విప్పగ చెప్పగ వీలు కాదులేకోడలి కత్తకుం జెలిమిఁ గూర్పఁగ బ్రహ్మకునైన సాధ్యమే
వాడనువాడవాడలనువాడిగనుట్టులగొల్లగొట్టుచున్వీడనిబంధనంబుగదవెన్ననుమూతికిబూయుచందమున్గోడునుదెల్పగానచటగొప్పగదత్వముకృష్ణలీలనైగోడలి కత్తకుం జెలిమిఁ గూర్పఁగ బ్రహ్మకునైన సాధ్యమేకొరుప్రోలు రాధాకృష్ణ రావు
తోడును నీడనై వెలిగి తుష్టిని కాపురమందునించుచున్పోడిగ నత్తమామలను బ్రోచుచునుండగ కోడలమ్మతాన్కూడిన మైత్రి లోగొనక కూల్చగ వియ్యపురాలె, యింక నాకోడలి కత్తకుం జెలిమిఁ గూర్పఁగ బ్రహ్మకునైన సాధ్యమే
వీడని బంధమె యాయదికోడలికత్తకును జెలిమి ,గూర్చునె యజుడున్ పోడిమిగల యాలక్ష్మికిచేడియయౌ శారదాంబ చేరికయౌటన్
తోడుండఁగా సరస్వతిగోడులు తీర ధనలక్ష్మి కోపము తోడం గూడదె యెంతగఁ గొల్చినఁ గోడలి కత్తకును జెలిమిఁ గూర్చునె యజుఁడున్ వీడక చుట్టు తిర్గుచును బ్రీతినిఁ గూర్చెడి స్వీయ పుత్రుఁడే నేఁడు సతీ వశుండు నయి నిత్యము కొంగును బట్టి తిర్గఁగా నాడ మనమ్ము సంతతము నత్యధి కార్తినిఁ గుందు చుండఁగాఁ గోడలి కత్తకుం జెలిమిఁ గూర్పఁగ బ్రహ్మకు నైన సాధ్యమే
చూడగ లేమువారలను జూడ్కులకందరు చెల్మితోడయున్ వీడరు పెత్తనంబులను వేరుగ నుండుట కిచ్చగింతురేవీడును వాడునున్ ననక పెంపగు గర్వము గల్గియుండుటన్ కోడలి కత్తయుంజెలిమి గూర్పగ బ్రహ్మకునైన సాధ్యమే
కోడలి కత్తకు మద్యనజూడగ నిరతము కలహము చోద్యము గాదే!వీడని విద్వేషముగలకోడలికత్తకును జెలిమి గూర్చునె యజుడున్?కోడలు కూతురు యనుకొనిజూడగ ప్రేమ తలరారు చుండు గృహమునన్.తోడుగ యత్త మరచునేకోడలుగూడ నొక యింటి కూతురు యంచున్!
చూడగ సిరి తానుండదువేడుకగా చదువులమ్మ వెలసిన నెలవున్వాడుకనెటు మార్చగలడుకోడలి కత్తకును జెలిమిఁ గూర్చునె యజుఁడున్
కోడలు వచ్చినంత నటగోముగ పెంచినపుత్రుడింకపైకోడలిమాటలేవినగ కూరిమి తగ్గునటంచు నెప్పుడున్వీడనిశంకబూనుచునువేడిగమాటలనాడుచుండగాకోడలికత్తకున్ చెలిమిగూర్పగ బ్రహ్మకునైనసాధ్యమే.[: మరొక పూరణచాడీలనుచెప్పిసతముకూడుతినెడివేళలందుకొడుకునకనుచున్గోడుననేడ్చి గొడవపడుకోడలికత్తకును జెలిమి గూర్చునె యజుడున్
వాడనివైరంబీయది
రిప్లయితొలగించండిచేడియవాణికిసిరికినిచేరికలేదే
పోడిమిమీరగతలపడి
కోడలికత్తకునుఁజెలిమిఁగూర్చునెయజుడున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికోడలితోశత్రుత్వపు
రిప్లయితొలగించండిజాడలు లేకనె మనగల జాణలు కలరే
చూడని వింతను కనుగొన
కోడలి కత్తకును జెలిమిఁ గూర్చునె యజుఁడున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"లేకయె.." అనండి.
సమస్య :
రిప్లయితొలగించండికోడలి కత్తకుం జెలిమి
గూర్పగ బ్రహ్మకునైన సాధ్యమే
( తండ్రికే కాదు కొడుక్కి కూడా ఆ అత్తాకోడళ్లను ఐకమత్యంతో ఉంచటం కుదరటంలేదు - ఒకరు ఉన్న చోట మరొకరు ఉండమంటారు )
ఉత్పలమాల
....................
వేడుక మీరగన్ గలిసి
విద్యలదేవియు భాగ్యరాణియున్
దోడుగ నీడగన్ జెలిమి
తోడుత నైక్యముగా జరింపరే !
యోడెను మామ గారు హరి
యొక్క నిమేషము మైత్రి గూర్పకే ;
కోడలి కత్తకుం జెలిమి
గూర్పగ బ్రహ్మకునైన సాధ్యమే !!
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండివీడును చదువరి నెప్పుడు
పోడిమి యని బుధుడొకండుపొత్తువు శ్రీతో
కూడదని యిట్లు పలికెను
కోడలి కత్తకును జెలిమిఁ గూర్చునె యజుఁడున్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిచూడగపోతనార్యుడునుచూలిగవాణికిభాగ్యమందగా
రిప్లయితొలగించండివీడనిమత్సరంబుననుబీదనుఁజేసెనులక్ష్మియాతనిన్
మేడలుమిద్దెలుండిననుమేలిమివిద్యయెవానినంటదే
కోడలికత్తకున్జెలిమిఁగూర్పగబ్రహ్మకునైనసాధ్యమే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅందరికీ నమస్సులు
రిప్లయితొలగించండివీడక యమ్మ తాను బెను ప్రేమను బంచెను పాతికేళ్లుగా,
నీడగ దాను నిల్చి కడు నెమ్మిని జూపును భార్యయే సదా
తోడుగ నుండు నిర్వురును తూకము గోరెడి తీరు మార్చరే!
*“కోడలి కత్తకుం జెలిమిఁ గూర్పఁగ బ్రహ్మకునైన సాధ్యమే
*వాణిశ్రీ నైనాల*
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికందం
రిప్లయితొలగించండికూడక పరస్పరమ్ముగఁ
బీడగఁ గని యొకరి నొకరు వీధికి నెక్కన్
దాడికి దిగు వైరులవలె
కోడలి కత్తకును జెలిమిఁ గూర్చునె యజుఁడున్?
ఉత్పలమాల
వాడని ప్రేమతో పతినిఁ బాడిగ పెద్దల నత్తమామలన్
వేడుక జూడగా, సుతగ ప్రీతినిఁ బంచఁగ నింట పెద్దలున్
గూడవె సౌఖ్యముల్, మఱచి కూరిమి వైరుల భంగి పోరెడున్
గోడలి కత్తకుం జెలిమిఁ గూర్పఁగ బ్రహ్మకునైన సాధ్యమే?
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి🙏ధన్యోస్మి గురుదేవా🙏
తొలగించండిఈడున నంతరంబు తమ ఈహల మధ్యన దవ్వుబెంచగా
రిప్లయితొలగించండినాడును నేడునన్ బలుకు నాల్కల పైనను నాట్యమాడుచున్
వాడిగ వేడిగన్ జరుగు వాదము లింటను చెంగలించగా
కోడలి కత్తకున్ చెలిమిగూర్చగ బ్రహ్మకునైన సాధ్యమే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికూడిక చేసెన్ శంభుని
రిప్లయితొలగించండివీడక గళమున మెరిసెడి విష నాగమ్మున్
వేడుక విష్ణుని శయ్యగ
కోడలి కత్తకును జెలిమిఁ గూర్చునె యజుఁడున్”
...భారతీనాథ్ చెన్నంశెట్టి...
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములండీ
తొలగించండి
రిప్లయితొలగించండివీడదె వాక్కుచేడియ యభీష్టము జూపు ప్రదేశ మెప్పుడున్
పోడిమి నిచ్చు పాల్కడలి ముద్దులపట్టి యటంచు జెప్పుచున్
కూడరు వీరలిద్దరని కోవిదుడొక్కడు పల్కెనిట్టులన్
కోడలికత్తకుం జెలిమిఁ గూర్పఁగ బ్రహ్మకు నైన సాధ్యమే.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిచూడగ జోద్యమ దెప్పుడు
తోడున్నీడగ గలువరు దోషం బేమో!
వీడగ నీ నానుడి నిక
కోడలి కత్తకును జెలిమిఁ గూర్చునె యజుఁడున్?!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈనాటి శంకరాభరణం వారి సమస్య
రిప్లయితొలగించండికోడలి కత్తకును చెలిమి కూర్చునె యజుడన్
ఇచ్చిన పాదము కందము
నా పూరణ సీసములో
తెనాలి రామలింగనికి కాళికా దేవి ప్రత్యక్షమై రెండు పాయస పాత్ర లిచ్చి ఒకటి తాగితే సిరి ఉంటుంది అని ఒకటి తాగితే సరస్వతి ఉంటుంది అని చెప్పినపుడు రెండు కావాలని గుటుక్కున త్రాగు సన్నివేశము
ఘనత నొప్పారుచు కవుల గృహములందు
నాట్య మాడును గదా నలువ పత్ని,
శుభముగా జలథిజ చూడ బో దెప్పుడు నొక కంటి తోనైన నొక్కమారు,
సఖ్యత యుండదు జగమున వారికి
నెపుడని తెలియదా ?ఈశ!చండి!
కాళికా! కోడలి కత్తకును చెలిమి కూర్చునె యజుడు నీ గోత్ర మందు,
సంభవము కాదు గాతల్లి , సరస గతిగ
నిరువురును వశించ వలెను కరుణ తోడ
ననుచు పాయస పాత్ర ద్వయమును కొనుచు
గ్రోలె నా రామలింగడు గొప్ప గాను
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివాట్సప్ సమూహంలో నా సమీక్ష చూడండి.
వీడక కలహించుట గని
రిప్లయితొలగించండివేడుకమిత్రుని పిలిచియు వీక్షింపు మనెన్
చూడగ ననిపించు మనకు
కోడలి కత్తకును జెలిమి గుర్చునె యజుఁడున్?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికూడిక కుదరదు మగడే
రిప్లయితొలగించండిబూడిద యైనన్ యిరువురు పొసగరు కసితో
మాడిన ముఖముల పెనగెడు
కోడలి కత్తకును జెలిమిఁ గూర్చునె యజుఁడున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'ఐనన్+ఇరువురు' అన్నపుడు యడాగమం రాదు. "...యైనను నిరువురు" అనవచ్చు.
కోడలు కాదు కూతురని కోమలి భావన చేయు వేళలన్
రిప్లయితొలగించండివీడిన తల్లియే మరల వియ్యపు యత్తగ రూపమెత్తగన్
“ కోడలి కత్తకుం జెలిమిఁ గూర్పఁగ బ్రహ్మకునైన సాధ్యమే”
వాడుక పల్కులయ్యెనుర వారిజ నాభుని సాక్షి కల్లగన్
...భారతీనాథ్ చెన్నంశెట్టి...
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"వియ్యపు టత్తగ.." అనండి.
ధన్యవాదములండీ
తొలగించండిసవరణకు కృతజ్ఞుడిని
గూడును గూల్చు చేతలను గోడ
రిప్లయితొలగించండిలు సేయుచునుండ గాంచియున్
బాడలవాటు మానుమని భామి
నితో వివరించి చెప్పినన్
వీడక దుష్ట మార్గమున బంధ
కియై తిరుగాడునట్టి యా
కోడలి కత్తకున్ జెలిమి గూర్పగ
బ్రహ్మకు నైనసాధ్యమే
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి3 వ పాదం లో యతి ?
తొలగించండితోడుగ నెన్నడునుండును
రిప్లయితొలగించండివీడక సిరి వాణిలేని వేశ్మము నందున్
కోడలితోకూడదెపుడు
కోడలి కత్తకును జెలిమిఁ గూర్చునె యజుఁడున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండినేఁడు వసించుచుండెఁ గొని నెమ్మిని మా గృహమందుఁ గోడలే,
తోడుగ నుండ దేల నయొ దుర్లభ యత్తయె మా గృహంబునన్!
జూడఁగ వాణి యున్న దిటఁ! జోద్యము! లక్ష్మియె లేదు! రా దిఁకన్!
కోడలి కత్తకుం జెలిమిఁ గూర్పఁగ బ్రహ్మకునైన సాధ్యమే?
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఉ:
రిప్లయితొలగించండితోడుగ దాచరాదనరె త్రోయగ కోశము( రెండు కత్తులన్
వీడియు నుండలేరు కడు వేడుక లెంచి వ్యవస్థ పూనికై
చూడగ లోకు లెల్లరకు జోడుయె వీరలటంచు గన్పడన్
కోడలి కత్తకుం జెలిమి గూర్పగ బ్రహ్మకునైన సాధ్యమే
*కోశము( =ఒర ; అరసున్న రాకపోగా ( ను యెంచి నాను.*
వై. చంద్రశేఖర్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'కోశము' తరువాత అరసున్న అవసరం లేదు.
ధన్యవాదములు ; జోడుయె / జోడగు గా చదువగలరు
తొలగించండిచూడగ జిహ్వపయి నటన
రిప్లయితొలగించండిమాడు నలువ రాణి జామి మాధవి కగునే
జోడుగ గన నరుదేమరి
కోడలి కత్తకును జెలిమిఁ గూర్చునె యజుఁడున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివీడకనెల్ల వేళలను విద్య విహీనుని యింటనుండు తా
రిప్లయితొలగించండితోడుగ లక్ష్మి యేలనొకొ దూరమువెట్టును వాణి నెన్నడున్
కోడలు వాణిచెంత సిరి కూరిమి నుండదదేమి వైరమో
కోడలి కత్తకుం జెలిమిఁ గూర్పఁగ బ్రహ్మకునైన సాధ్యమే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"వీడక యెల్ల..." అనండి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికోడలు భావి యత్తయు నగున్ గతమందున నత్త కోడలే
రిప్లయితొలగించండితోడగ నుండబోరు సిరితో జతగూడని వాణి భంగి, నా
వాడె సుతుండు భర్త తనవాడని దల్తు రహో
ధ్రువమ్ములౌ
కోడలి కత్తకుం జెలిమిఁ గూర్పఁగ బ్రహ్మకునైన సాధ్యమే!
కంజర్ల రామాచార్య
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిమూడును రెండు చేయమని మోదము నొందెడు నత్తలుండ వెం
రిప్లయితొలగించండిటాడుచు నత్త మామలను టక్కరి(టార్చరు) చేసెడు కోడలుండు ఈ
వేడుక మూడు గీతలను విప్పగ చెప్పగ వీలు కాదులే
కోడలి కత్తకుం జెలిమిఁ గూర్పఁగ బ్రహ్మకునైన సాధ్యమే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివాడనువాడవాడలనువాడిగనుట్టులగొల్లగొట్టుచున్
రిప్లయితొలగించండివీడనిబంధనంబుగదవెన్ననుమూతికిబూయుచందమున్
గోడునుదెల్పగానచటగొప్పగదత్వముకృష్ణలీలనై
గోడలి కత్తకుం జెలిమిఁ గూర్పఁగ బ్రహ్మకునైన సాధ్యమే
కొరుప్రోలు రాధాకృష్ణ రావు
తోడును నీడనై వెలిగి తుష్టిని కాపురమందునించుచున్
రిప్లయితొలగించండిపోడిగ నత్తమామలను బ్రోచుచునుండగ కోడలమ్మతాన్
కూడిన మైత్రి లోగొనక కూల్చగ వియ్యపురాలె, యింక నా
కోడలి కత్తకుం జెలిమిఁ గూర్పఁగ బ్రహ్మకునైన సాధ్యమే
వీడని బంధమె యాయది
రిప్లయితొలగించండికోడలికత్తకును జెలిమి ,గూర్చునె యజుడున్
పోడిమిగల యాలక్ష్మికి
చేడియయౌ శారదాంబ చేరికయౌటన్
తోడుండఁగా సరస్వతి
రిప్లయితొలగించండిగోడులు తీర ధనలక్ష్మి కోపము తోడం
గూడదె యెంతగఁ గొల్చినఁ
గోడలి కత్తకును జెలిమిఁ గూర్చునె యజుఁడున్
వీడక చుట్టు తిర్గుచును బ్రీతినిఁ గూర్చెడి స్వీయ పుత్రుఁడే
నేఁడు సతీ వశుండు నయి నిత్యము కొంగును బట్టి తిర్గఁగా
నాడ మనమ్ము సంతతము నత్యధి కార్తినిఁ గుందు చుండఁగాఁ
గోడలి కత్తకుం జెలిమిఁ గూర్పఁగ బ్రహ్మకు నైన సాధ్యమే
చూడగ లేమువారలను జూడ్కులకందరు చెల్మితోడయున్
రిప్లయితొలగించండివీడరు పెత్తనంబులను వేరుగ నుండుట కిచ్చగింతురే
వీడును వాడునున్ ననక పెంపగు గర్వము గల్గియుండుటన్
కోడలి కత్తయుంజెలిమి గూర్పగ బ్రహ్మకునైన సాధ్యమే
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికోడలి కత్తకు మద్యన
రిప్లయితొలగించండిజూడగ నిరతము కలహము చోద్యము గాదే!
వీడని విద్వేషముగల
కోడలికత్తకును జెలిమి గూర్చునె యజుడున్?
కోడలు కూతురు యనుకొని
జూడగ ప్రేమ తలరారు చుండు గృహమునన్.
తోడుగ యత్త మరచునే
కోడలుగూడ నొక యింటి కూతురు యంచున్!
చూడగ సిరి తానుండదు
రిప్లయితొలగించండివేడుకగా చదువులమ్మ వెలసిన నెలవున్
వాడుకనెటు మార్చగలడు
కోడలి కత్తకును జెలిమిఁ గూర్చునె యజుఁడున్
కోడలు వచ్చినంత నటగోముగ పెంచినపుత్రుడింకపై
రిప్లయితొలగించండికోడలిమాటలేవినగ కూరిమి తగ్గునటంచు నెప్పుడున్
వీడనిశంకబూనుచునువేడిగమాటలనాడుచుండగా
కోడలికత్తకున్ చెలిమిగూర్పగ బ్రహ్మకునైనసాధ్యమే.
[: మరొక పూరణ
చాడీలనుచెప్పిసతము
కూడుతినెడివేళలందుకొడుకునకనుచున్
గోడుననేడ్చి గొడవపడు
కోడలికత్తకును జెలిమి గూర్చునె యజుడున్