9, జూన్ 2021, బుధవారం

సమస్య - 3747

10-6-2021 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కవి యవధానమ్ము లింతగా సులభములా"
(లేదా...)
"ఔరా సత్కవి యింతగా సులభమా యష్టావధానంబనన్"

54 కామెంట్‌లు:

  1. వివరముప్రుచ్ఛకులెదుటను
    అవిరళధారగపదములనాశువుగాగన్
    కవిఁజెప్పుటకరువాయెను

    కవియవధానమ్ములింగాసులభములా

    రిప్లయితొలగించండి
  2. వివరము తెలిసిన సేయున్

    కవి యవధానమ్ము ; లింతగా సులభములా?

    సవతుల పోరును తీర్చగ

    సవమును పార్వతికొసగిన సాంబునికైనన్

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
  3. అవలీలగ పూరించు సు
    కవి యవధానమ్ము లింతగా సులభములా
    భువి జను లనుకొను విధముగ
    జవమున మెప్పించ నొప్పు సామర్థ్య మునన్

    రిప్లయితొలగించండి

  4. కవిపుంగవుడచ్చోటను
    యవనమున కవితలనల్లి యలవోకగ తా
    నవధానముచేయ ననిరి
    కవి యవధానమ్ములింత గా సులభములా?

    రిప్లయితొలగించండి
  5. ఆరాగంబునుసాగదీయుటనుచాలంచున్వడిన్తెల్వితో
    సారాంశంబుచమత్కరింపగనుమీసత్యంపువాక్కెందుకో
    వీరావేశముమానినిల్వుడిచటన్వీరుండువాట్సాపులే
    ఔరాసత్కవియింతగాసులభమాయష్టావధానంబనన్

    రిప్లయితొలగించండి
  6. కవిపండితుకావ్యమ్ముల
    నవగతముంజేకొనంగ నలవడె వ్రాయన్
    అవిరళ కృషితోననుకొనె
    కవి యవధానమ్ము లింతగా సులభములా!!

    ----యెనిశెట్టి గంగా ప్రసాద్.

    రిప్లయితొలగించండి
  7. కందం
    కవితావేశమెగయ వె
    ల్లువగన్ లక్షణయుతంపు రుచిరార్థమ్ముల్
    స్తవనీయమ్ముగఁ బలుకక
    కవి! యవధానమ్ము లింతగా సులభములా?

    శార్దూలవిక్రీడితము
    ధారాశుద్ధిగ ధారణల్ ధిషణయున్ ధైర్యమ్మునౌ ధోరణిన్
    శ్రీరంజిల్ల గవిత్వమున్ రయమునన్ జిందించి వాగ్ధాటితో
    నోరుల్మూయుట పృచ్ఛకాళి మరువన్ నుంపార సాధింపకే
    యౌరా! సత్కవి! యింతగా సులభమా యష్టావధానంబనన్?

    రిప్లయితొలగించండి
  8. సవనమ్మటు నభ్యసనము
    నవిరళముగ సల్పినంత నబ్బెడు విద్యన్
    యవమతి జేయు పలుకులివి
    కవి! యవధానమ్ము లింతగా సులభములా?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'విద్యన్+అవమతి' అన్నపుడు యడాగమం రాదు.

      తొలగించండి
    2. ధన్యవాదములు గురుదేవా, సవరించెదను!🙏🙏🙏

      తొలగించండి
    3. సవరణతో

      సవనమ్మటు నభ్యసనము
      నవిరళముగ సల్పినంత నబ్బెడు విద్యన్
      చవిగొనగ లేని వాడనె
      కవి! యవధానమ్ము లింతగా సులభములా

      తొలగించండి
  9. సమస్య :

    ఔరా సత్కవి యింతగా సులభమా
    యష్టావధానంబనన్

    ( అష్టావధానసమయంలో సైతం భావకవితావైభవం
    ప్రకటించి శ్రోతల నరాలు మీటే నరాల రామారెడ్డి గారి
    అవధానచాతురి చూచిన నా అనుభూతి )

    ధారాళంబుగ జెప్పుచుంటి వవురా
    తారాడుచున్ మేధతో ;
    హేరాళంబుగ గాంచుచుంటి గద నీ
    హెచ్చైన వాగ్ధాటినే !
    యో రామా ! సముదాత్తభావజలధీ!
    యూహింపలేనైతినే !
    యౌరా ! సత్కవి ! యింతగా సులభమా
    యష్టావధానంబనన్ !!

    ( తారాడు - సంచరించు;మేధ - ధారణాశక్తి గల బుద్ధి ; హేరాళము - అధికము )

    రిప్లయితొలగించండి
  10. ఆరంభించి యవధానమున్ గవిసునాయాసమ్ము గా పద్యముల్
    వీరావేశము తోడ జెప్పగ నటన్ విద్వాంసులే మెచ్చగా
    నారోజు సభలోని ప్రేక్షకులు తామాశ్చర్యమున్ బల్కిరే
    ఔరా! సత్కవి యింతగా సులభమా యష్టావధానంబనన్.

    రిప్లయితొలగించండి
  11. అవిరళముగపూరణముల
    నవలీలగ సలిపి పృచ్ఛకావళియలరన్
    వ్యవధానములేక సలుపు
    కవి యవధానమ్ము లింతగా సులభములా

    రిప్లయితొలగించండి
  12. ధారాళంబుగ పద్యపూరణలు సంధానించి యేకాగ్రతన్
    ధీరోదాత్తతతోడ పృచ్ఛకులుసంధించంగ ప్రశ్నావళుల్
    పోరామిన్ పడకెంత సంయమనమున్ బుద్ధిన్ ప్రదర్శింతువే
    ఔరా సత్కవి యింతగా సులభమా యష్టావధానంబనన్

    రిప్లయితొలగించండి
  13. రిప్లయిలు
    1. శ్రీ గురుభ్యోన్నమః
      వివిధములైనవి పూరణ
      లవలీలగ చేయగ గని నబ్బుర పడుచున్
      యువకుని మెచ్చిరి యిటులను
      "కవి యవధానమ్ము లింతగా సులభములా"

      తొలగించండి
  14. చవిగల పృచ్ఛకు లేరీ?
    కవి యవధానమ్ము లింతగా సులభములా?
    చెవిలో నిట్టులనెన్, పే
    లవమౌ అవధానముగని లౌకికు డొకడున్.

    రిప్లయితొలగించండి
  15. పూరణ కొరకు వ్రాసినదిగా చదువగలరు :

    శా:

    సారా త్రాగిన మత్తులో చులకనై సాగింప సంభాషణల్
    పూరింపందగు నెంచి పద్యములు తా పుట్టించి నట్టిట్టుగన్
    వీరావేశము పొంగ జూచి సఖులే పృచ్ఛిన్చ విడ్డూరమై
    యౌరా ! సత్కవి ఇంతగా సులభమా ? యష్టావధానంబనన్!!

    పూరించుట =అవధానం లో పృచ్ఛకులడిగిన పద్యాలు పూరించుట

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  16. అవధానమ్మేదైనను
    యవలీలగజేసి చూపి యలరింతువుగా
    అవగతమొనరించుమ యో
    కవి యవధానమ్ము లింతగా సులభములా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఏదైనను+అవలీలగ' అన్నపుడు యడాగమం రాదు.

      తొలగించండి
  17. వారల్ గోరగ వల్లె యంటిని కదా పాండిత్యమా లేదికన్
    దీరైయొప్పెడి పద్యసద్రచనచే దీపిల్లు సత్వంబు లే
    దారంభించితి దైవసత్కృపను దానందెన్ ఫలం బందులో
    నౌరా సత్కవి! యింతగా సులభమా యష్టావధానంబనన్

    రిప్లయితొలగించండి
  18. రిప్లయిలు
    1. ధారారంజితధోరణీధిషణయున్ ధైర్యోల్లసధ్ధారణల్
      పారంపర్యశరప్రవాహకలనావ్యాకృత్సుశబ్దార్ధశై
      లీరమ్మమ్ములు సుంత లేవు గదరా! లీలన్ బ్రదర్శింతువో!
      యౌరా సత్కవి! యింతగా సులభమా యష్టావధానంబనన్.

      కంజర్ల రామాచార్య.

      తొలగించండి
  19. నోరే బల్కదు రీతిగా జనులకున్, నూరేండ్లునిండేనుగా
    దారేచిక్కుటకున్, సువిద్యలెపుడున్ యాధ్యాత్మికమ్మేసుమీ
    కారేయోగ్యులునెవ్వరున్ బడకనేకష్టమ్ము, హాస్యోక్తియే
    "ఔరా సత్కవి యింతగా సులభమా యష్టావధానంబనన్"

    రిప్లయితొలగించండి
  20. ఒక కవిత్వాభిమాని ప్రశంస!

    ప్రారంభించిన నాదిగాను తనదౌ పాండిత్యమున్ జూపుచున్
    ధీరోదాత్తత పృచ్ఛకాళి ఘన సందేహమ్ములన్ దీర్చుచున్
    సారంబౌ పలు పద్యసంతతిని సుశ్రావ్యంబుగా చెప్ప నౌ
    రౌరా !సత్కవి !యింతగా సులభమా యష్టావధానంబనన్!



    రిప్లయితొలగించండి
  21. ధారాపాతము వోలె పద్యముల సంధానించుచున్ మించితే
    ప్రేరేపించుచు పృచ్ఛకుల్ తగిలి యుద్రేకమ్ము కల్గించగా
    తీరౌరీతిని ధారణమ్ము సలుపన్ దృష్టించి కావ్యమ్ముల
    నౌరా సత్కవి యింతగా సులభమా యష్టావధానంబనన్

    రిప్లయితొలగించండి
  22. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  23. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  24. రవి తుల్యుండు వినూతన
    వివి ధాంశ విశేష గుప్త విజ్ఞానమునం
    గవి కావలెఁ దగ దిట్లనఁ
    గవి! యవధానమ్ము లింతగా సులభములా


    పారావార సమాన ధారణ పదప్రామాణ్య విజ్ఞానుఁడున్
    ధారా సంయుత పద్య కల్పన మహా దార్ఢ్యాది సంయోగుఁడున్
    దూరాలోచన శక్తి యుక్తుఁ డయినం దోరమ్ముగా ధాత్రిలో
    నౌరా సత్కవి యింతగా సులభమా యష్టావధానం బనన్

    రిప్లయితొలగించండి
  25. రవి!విను బ్రతివారునునిల
    నవధానంబును గఱపుట యచ్చెరువాయెన్
    నవలో కించగ దెలిసెను
    కవి యవధానమ్ము లింతగా సులభములా?

    రిప్లయితొలగించండి
  26. యవధానమ్మును జూచుచు
    కవనపుశైలిగని తలచె కవితన మదిలో
    నవిరళ జ్ఞానమునందిన
    కవయవధానమ్ములింతగాసులభములా


    రిప్లయితొలగించండి
  27. 2వ ప్రయత్నము:

    శా:

    ధారా ధారణ శక్తి సొంత మవగన్ దైవత్య సంధానమై
    ప్రేరేపించగ నమ్మ శారద మదిన్ రేకెత్త పాండిత్యమై
    సారంబెంచి వధానమున్నుడువనై జంకేల నేరీతినో
    యౌరా సత్కవి యింతగా సులభమా యష్టావధానంబనన్

    దైవత్య= నేర్పు

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  28. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  29. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  30. కారాగారము నుండి వచ్చిన రమాకాతుండు సంతోషియై
    యౌరాసత్కవి!యింతగా సులభమా యష్టావధానంబనన్
    మీరల్ చూచుచు నుండ యిప్పుడ మఱిన్మేధావు లుప్పొంగగా
    నారాకాధిపు పంచజేతును ననెన్ నష్టావ ధానమ్మునున్

    రిప్లయితొలగించండి