27, జూన్ 2021, ఆదివారం

సమస్య - 3765

28-6-2021 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“తొలఁగు నఘము హుండి నిడిన దోఁచిన సొమ్ముల్”
(లేదా...)
“దురితములెల్లఁ బోవుఁ గద దోఁచిన సొమ్ముల వేయ హుండిలో”

38 కామెంట్‌లు:


 1. ఖలుకార్యములెలర నై
  తలమే ప్రాప్తించు ననగ ద్రాపుడు తెలిపెన్
  గలదొకమార్గమటంచును
  తొలఁగు నఘము హుండినిడిన దోఁచిన సొమ్ముల్.

  రిప్లయితొలగించండి

 2. పురులను గోరినీవు కడు మూర్ఖుడవైతివి మానవత్వమున్
  మరచితివోయి కూడదది మారుమటంచును పల్కినంతనే
  నరకుడు తెల్పెనిట్టుల ధనమ్మును పొందగ సల్పునట్టియా
  దురితము లెల్ల బోవుఁ గద దోఁచిన సొమ్ముల వేయ హుండిలో.

  రిప్లయితొలగించండి
 3. నరులకు చేయు సాయమది నాధుడు మెచ్చును పుణ్య ప్రాప్తినన్

  దురితములెల్లఁ బోవుఁ గద ; దోఁచిన సొమ్ముల వేయ హుండిలో”

  సిరులకు తల్లి నాధుకును చేపగ రూపము దాల్చు వానికిన్

  కరుణను చూపు మాధవుకు కల్గునె తోషము, దుష్ట మానవా

  ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'ప్రాప్తినిన్... నాథునకు..' అనడం సాధువు.

   తొలగించండి
 4. త్వరితముగా ధనార్జనను వైభవరీతిని చేయు వాడునై,
  తిరుమల వెంకటేశ్వరుని దివ్యపదమ్ముల గాంచి ధర్మమున్
  నిరతిని బొందకన్ ధనము నెంతయు స్వామికి నీయ, కల్లనౌ
  దురితములెల్లఁ బోవుఁ గద దోఁచిన సొమ్ముల వేయ హుండిలో

  రిప్లయితొలగించండి
 5. పోలుపగు గంగను మున్గిన
  తొలగు నఘము : హుండి నిడిన దోచిన సొమ్ముల్
  కలిగించును హాని మిగుల
  నిలలో నని నా ర్యులందు రెలమిన్ గదరా !

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   '... నిలలో నని యార్యులందు రెలమిన్...' అనండి.

   తొలగించండి
 6. దురితదినమ్మెగాదె యిక దుర్దిన మాయెనుపన్నుగట్టకన్
  సరియగు నట్టిదేయనుచు సాధన జేయుచు కోర్టు నందునన్
  కరములు మోడ్చి వేడుచును కారణమెయ్యది యైన నేమిలే
  దురితములెల్లఁ బోవుఁ గద దోఁచిన సొమ్ముల వేయ హుండిలో!!

  రిప్లయితొలగించండి
 7. అలవైకుంఠపురమునను
  కలడనువిష్ణువునెపుడునుకాదనడెపుడున్
  కలిగినదానముసేయగ
  తోలఁగునఘముహుండినిడినఁదోచినసోమ్ముల్

  రిప్లయితొలగించండి
 8. ఇలవైకుంఠము తిరుమల
  నిలచెను శ్రీహరి కొలువుగ నిత్యమతండే
  అలయక దీర్చును కోర్కెల
  దొలగు నఘము హుండినిడిన దోచిన సొమ్ముల్

  ఇడినన్ తోచిన
  సుబ్బలక్ష్మిగారికి ధన్యవాదాలతో

  ఎరుగరు పుణ్యపాపముల కీశుడు పెట్టిన న్యాయసూత్రముల్
  తిరుగగ స్వర్గదుర్గతుల దీర్చగ దప్పదు వేరువేరుగన్
  త్వరపడి యెంచుచుందురిటు దానముపాపము దొల్గజేయు నా
  దురితములెల్ల బోవుగద దోచిన సొమ్మును వేయహుండిలో

  రిప్లయితొలగించండి
 9. పలువిధముల దారులలో
  వలుములు సలుపుచు ధనమును ప్రాణము గొనుచున్
  తలచుట హేయము మనుజులు
  తొలఁగు నఘము హుండి నిడిన దోఁచిన సొమ్ముల్

  రిప్లయితొలగించండి
 10. కరము జనమ్ము నమ్ముదురు కా
  సులు కాంచన భూషణంబులున్
  మురిపముతోడ వేసినను పోవు
  ను జేసిన పాపమంచు నీ
  నరులు నిజంబు గాంచకను న
  మ్ముచునుందురు వాక్కులిట్టివే
  ''దురితములెల్ల బోవుగద దోచి
  న సొమ్ములు వేయ హుండిలో'''

  రిప్లయితొలగించండి
 11. పరులను మోసగించుచును పాపపు సొమ్మును మూటగట్టుచున్
  కరుణ యొకింత లేక ధనగర్వము కన్నులుగప్ప నెల్లరన్
  పరమ కిరాతకున్బగిది వంతల గూరుచుచున్ తలంతువా
  దురితములెల్లఁ బోవుఁ గద దోఁచిన సొమ్ముల వేయ హుండిలో

  రిప్లయితొలగించండి
 12. ఖలులు దలంతురు గానెటు
  తొలఁగు నఘము హుండి నిడిన దోఁచిన సొమ్ముల్
  పొలుపుగ కష్టార్జితమున
  కలతలడఁచ దీనులకిల కరఁగునఘంబుల్

  రిప్లయితొలగించండి
 13. చం:

  సరియగు రీతి దెల్పితిరి సంభవ మివ్విధి నేటి రోజులన్
  మరి మరి మానసింతురట మార్గము జూపు మటంచు దైవమున్
  పరిమితి కొంత భాగమును పంచగ దిట్టము నెంచి దల్పరే
  దురితము లెల్ల బోవు గద దోచిన సొమ్ముల వేయ హుండిలో !

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 14. దురితములెల్లఁ బోవుఁ గద దోఁచిన సొమ్ముల వేయ హుండిలో
  తిరుమల స్వామి మెచ్చునని తేలెదరూహలలోఖలుల్ సదా
  సరియగు దారిలో నడచి సక్రమ పద్ధతిలో గడించుచున్
  పరులకు మేలొనర్చుటయె పాపములన్ దొలగించునెన్నడున్

  రిప్లయితొలగించండి
 15. విలువలు మరచిన మూర్ఖులు
  పలు దుష్కృత్యమ్ములునెరపగ బడసిన సొ
  మ్ములగాంచి తలంచిరకట!
  తొలఁగు నఘము హుండి నిడిన దోఁచిన సొమ్ముల్

  రిప్లయితొలగించండి
 16. దురితములెల్లఁ బోవుఁ గద దోఁచిన సొమ్ముల వేయ హుండిలో
  నిరతమటంచు దెల్పుచును నెమ్మి నటించుచు సాధువుల్వలెన్
  నరులను జేరి మాయ వచనమ్ముల బల్కుచు సొమ్ము గుంజుచున్
  సరగున జేకొనన్ ధరను ఛాత్రులుగా తమ వెంట ద్రిప్పరే !

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గురువర్యులకు నమస్సులు, పై పద్యమును తొలగించి సవరించిన ఈ పద్యమును దీనిని పరిగణించ ప్రార్థన:
   దురితములెల్లఁ బోవుఁ గద దోఁచిన సొమ్ముల వేయ హుండిలో
   నిరతమటంచు దెల్పుచును నెమ్మి నటించుచు యోగులన్నటుల్
   నరులను జేరి మాయ వచనమ్ముల గొందరు సొమ్ము గుంజుచున్
   సరగున జేకొనన్ ధరను ఛాత్రులుగా తమ వెంట ద్రిప్పరే

   తొలగించండి
 17. గురువర్యులకు నమస్సులు మొన్న ఇవ్వబడిన సమస్యకు నా పూరణను కూడా పరిశీలించ ప్రార్థన.
  సమస్య: చెక్కిన బొమ్మ చిత్రముగ జేసెను నాట్యము నెల్ల వీథులన్.
  పద్యం:
  మక్కువ తోడ భూమి పయి మానవు డెన్నియొ వన్నె లందియున్
  జుక్కల నాకసమ్మునను శోధన సల్పియు జ్ఞాన మందియున్
  గ్రక్కున గాంచె వార్నిధి యగాధములున్! భళ, బ్రహ్మ తుష్టినిన్
  జెక్కిన బొమ్మ చిత్రముగ జేసెను నాట్యము నెల్ల వీథులన్

  రిప్లయితొలగించండి
 18. ఖలునికయిన నజుని దలచ
  దొలగు నఘము ; హుండి నిడిన దోఁచిన సొమ్ముల్
  పలువురు పంచు కొనగ నది
  నలుపు ధదనమగుట నిజమని నమ్ముము సుకవీ

  రిప్లయితొలగించండి
 19. ఇలలో చేసిన పాపపు
  ఫలమును తొలగంగ జేయు పరివర్తనయే!
  కలికాలములో " కొలదిగ "
  తొలఁగు నఘము ; హుండి నిడిన దోఁచిన సొమ్ముల్


  మరి మరి మీరి చట్టమును మంచిగ సొమ్ములు పోగు చేయుచున్
  పరి పరి రీతులన్ ధనము భద్రము చేయుట వీలుకాక నీ
  మెరియుచు వెల్గు హారములు, మిక్కిలి స్వర్ణము నివ్వ పోవు నా
  దురితములెల్ల ? పోవు గద ! దోఁచిన సొమ్ముల వేయ హుండిలో.

  రిప్లయితొలగించండి
 20. త్వరితముగా మనస్సునకు ప్రాణముకున్ శమమందు మార్గమై
  దురితములెల్లఁ బోవుఁ గద దోఁచిన సొమ్ముల వేయ హుండిలో,
  వరుసగ జేయ పూజలకు! వర్తక వర్గము నేతలెల్లరున్
  తిరుగుదురీ విధంబునను దేవునికీ తగు లంచమిచ్చుచున్౹౹

  రిప్లయితొలగించండి
 21. బలి వైరిని కొలువంగను

  తొలఁగు నఘము ; హుండి నిడిన దోచిన సొమ్ముల్

  కలుగునె జలజా నాధుని

  సలలిత కరుణా కటాక్ష సదనపు వసతిన్

  ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

  రిప్లయితొలగించండి
 22. నిరతము దైవచింతయును నిర్మల చిత్తము లేకయుండుటన్
  దరఁదమభేదముల్గలిగిధర్మమువీడెడి స్వార్దబుద్దియున్
  దిరుమల వేంకటేషునికి దీర్చగ మ్రొక్కునునిల్వుదోపిడిన్
  దురితములెల్లఁ బోవుఁ గద దోఁచిన సొమ్ముల వేయ హుండిలో

  కొరుప్రోలు రాధాకృష్ణ రావు

  రిప్లయితొలగించండి
 23. [

  సులువుగధనమార్జించుచు
  నిలనక్రమసరణితోడనిమ్ముగకుజనుల్
  తలపోయుదురిటుమదిలో
  దొలగునఘము నుండి నిడిన దోచిన సొమ్ముల్

  రిప్లయితొలగించండి
 24. పరిమితి లేని పైకమును పంచుచునెన్నికలందు గెల్చుచున్,
  మరి తమవారినెల్లరికి మాన్యమురాజ్యము దోచి వెట్టుచున్,
  తిరుపమువోలె నాయకులు దేవుని కించుక యిచ్చి యెంచరే?
  దురితములెల్లఁ బోవుఁ గద దోఁచిన సొమ్ముల వేయ హుండిలో.

  రిప్లయితొలగించండి
 25. సులువగు మార్గము సుగతికి
  తెలిపిరి మనగురువుగారు తీయటి కబురున్
  కలగా భావించక విను
  తొలగు నఘము హుండినిడిన దోచిన సొమ్ముల్

  రిప్లయితొలగించండి
 26. రిప్లయిలు
  1. తెలియుచు భగవత్తత్వము
   గలిగిన సిరులను పరోపకారమ్మందున్
   నిలిపిన మేలౌ నెటులన్
   దొలఁగు నఘము హుండి నిడిన దోఁచిన సొమ్ముల్?

   చంపకమాల
   నిరతము దైవతత్వమును నీమము దప్పక యాచరించుచున్
   గురుతుగ తోడివారలకు గూర్పగసాయము గల్గినంతలో
   హరి కరుణించి ముక్తినిడు హద్దులు మీరెడు వర్తనమ్ము నే
   దురితములెల్లఁ బోవుఁ గద దోఁచిన సొమ్ముల వేయ హుండిలో?

   తొలగించండి
 27. వెలయ వలయు నిడిన పిదప
  వలదు కలవర మర సున్నపడలే దకటా
  యిల దైవపేటి యనఁబడు,
  తొలఁగు నఘము, “హుండి” నిడిన దోఁచిన సొమ్ముల్

  [ఇడిన పై నరసున్నపోకున్న “ఇడినఁ దోఁచిన యయి తోఁచిన సొమ్ము లని యర్థము]


  అరుగును వేసి నట్టి జనుఁ డా నరకమ్మున కెంచి చూడ నె
  వ్వ రిడిరి యన్న దెన్నఁడును బ్రశ్నము రాదిల దైవ దృష్టినిన్
  సరి యగు భాషణంబ యిది సత్యము దోఁపిడి యైన వారివౌ
  దురితములెల్లఁ బోవుఁ గద దోఁచిన సొమ్ముల వేయ జేజెకై
  (దురితములెల్లఁ బోవుఁ గద దోఁచిన సొమ్ముల వేయ హుండిలో)

  రిప్లయితొలగించండి
 28. దురితము లెల్లబోవుగద దోచిన సొమ్ముల వేయ హుండిలో
  నరయుము గొంతపాపమది యాక్షణమందున బోవు నిక్కమే
  యిరవుగ మంచికార్యమున కిచ్చుచు ఖర్చునుబెట్టగల్గుటన్
  కరమును సంతసించుచును గాంక్షలుదీరగ బుణ్యమబ్బుటే

  రిప్లయితొలగించండి

 29. నిరత మసత్యముల్ బలికి నీమములన్ విడి తప్పుదారిలో
  సిరులనుఁ బొందగా విడిచి సిగ్గును నెగ్గును, సంచరించుచున్
  మరణము నొందు వేళ హరి మన్ననఁ బొందగ నెంచి యందురే,
  దురితములెల్లఁ బోవుఁ గద, దోఁచిన సొమ్ముల వేయ హుండిలో

  రిప్లయితొలగించండి