5, జూన్ 2021, శనివారం

సమస్య - 3743

6-6-2021 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రాముఁడు భీష్ముని కొడుకని వ్రాసెఁ గవి దగన్”
(లేదా...)
“రాముని తండ్రి భీష్ముఁడని వ్రాసెను ధూర్జటి భారతమ్మునన్”

54 కామెంట్‌లు:

  1. సోముడు సూర్యుడు సాక్షిగ

    కామములొదలిన వటువగు గాంగేయుండే

    నీమము తప్పుటయా , ఏ

    రాముఁడు భీష్ముని కొడుకని వ్రాసెఁ గవి దగన్”

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వదలిన'ను 'ఒదలిన' అనరాదు. "కామము వదలిన/కామములు విడిన..." అనండి.

      తొలగించండి
  2. వామకుకైకకువరమా
    నీమముఁదప్పనినరపతినిండుగఁదీర్చెన్
    తామసిగాకనుతరలెను
    రాముడు, భీష్మునికోడుకనివ్రాసెకవిఁదగన్

    రిప్లయితొలగించండి
  3. కందం
    స్వామి, విశాఖుడు, శరజుడు
    భూమిని సంతతి బడయఁగఁ బొగులు ప్రజకు సం
    క్షేమమిడు వల్లి హృదయా
    రాముడు భీష్ముని కొడుకని వ్రాసెఁ గవి దగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉత్పలమాల
      ఏమని కోరిరో సురలు నీశుడు సాంబుడునౌచు తారకున్
      భీమ బలంబునన్ దునుమఁ బేర్మిసుతున్ గనె దేవసేనకున్
      స్వామిగ, కోరినన్ వరము సంతుగ నిచ్చెడు వల్లి మానసా
      రాముని తండ్రి భీష్ముఁడని వ్రాసెను ధూర్జటి భారతమ్మునన్

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  4. నీమము దప్పని వాడై
    ధీమతి యై మెలగి నట్టి ధీరుండత డే
    పామరు ని భంగి నెట్టుల
    రాముడు భీష్ముని కొడుకని వ్రాసె కవి దగన్?

    రిప్లయితొలగించండి
  5. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అమ్మాయి కోసం పాట్లు 🙃😉

      భామిని గెల్వగాదగిన పాత్రత నొందగ పట్టువీడకే
      మామకు నిష్టమైన పలు మాన్యతనొందిన గ్రంథరాజముల్
      ప్రేమము మీరగా జదివి పెంపగు ధైర్యము
      బల్కెనిట్టులన్
      రాముని తండ్రి భీష్ముడని వ్రాసెను ధూర్జటి భారతమ్మునన్

      తొలగించండి
    2. ధామమయోధ్యగ ప్రజలను
      ప్రేమగ పాలించినట్టి వీరుడు సతమున్
      నీమము మీరని దశరథ
      రాముడు భీష్ముని కొడుకని వ్రాసె కవి దగన్

      భీష్ముడు = భయంకరుడు ( దశరథుడు గొప్ప యోధుడు)

      తొలగించండి
    3. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    4. ధన్యాస్మి గురువర్యా! నమోనమః!🙏🙏🙏

      తొలగించండి

  6. ధీమతి ననుచును పలికెడు
    పామరుడొక్కడు రచించె వహి, తా నందున్
    భీముడు దశరథ సుతుడని
    రాముడు భీష్ముని కొడుకని వ్రాసెఁ గవి దగన్.



    ఏమని చెప్పనోయి మతిహీనుడు వాడు సతమ్ము తన్ను తా
    ధీమతి నంచుచెప్పుకొను దేబె లిఖించిన పొత్తమందునన్
    రాముని తండ్రి భీష్ముడని వ్రాసెను, ధూర్జటి భారతమ్మునన్
    కోమలి కృష్ణ పాండవుల కూతురటంచు వచించెనందునన్.

    రిప్లయితొలగించండి
  7. కామునికందకుండగనుగంగకుపుత్రుడుబ్రహ్మమంటెనే
    నీమముదప్పకుండగనునీరజనేత్రుడుకానకేగెనే
    సామముతోడనీగతినిసాధనఁజేసిరిపారమంటగన్
    రామునితండ్రిభీష్ముడనిధూర్జటివ్రాసెనుభారతమ్మునన్
    ధూర్జటి-కపిలజడలుగలవ్యాసుడు

    రిప్లయితొలగించండి
  8. కామిని కైకకెవ్వరట కామనలిచ్చెను ; విష్ణు నామముల్

    ప్రేమగ చెప్పిరెవ్వరని పెద్దలు వ్రాసిరి; అష్ట దిగ్గజ

    స్వాములనందొకండితడు ; సారములన్నియు చెప్పిరెందునన్

    రాముని తండ్రి ; భీష్ముఁడని వ్రాసెను ; ధూర్జటి ; భారతమ్మునన్”

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
  9. ఏమని దెల్పుదు నొక్కడు
    రాముండెవ్వడిసుతుడన రహి మిగులంగన్
    దీమసముగ దెల్పెనిటుల
    రాముఁడు భీష్ముని కొడుకని వ్రాసెఁ గవి దగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "ఏమని తెల్పుదు" అని ఉండాలి.

      తొలగించండి
  10. ఒక Radio నుండి ఒకటి కంటే ఎక్కువ stations లో ఒకే సమయం లో పురాణ గాథలు ప్రసారమైతే జరిగే పరిణామము గా నా ప్రయత్నము:

    ఉ:

    ఏమని చెప్పనౌదు నొక ఇంటను రేడియొ మ్రోగు చుండగన్
    శ్రామము నొక్కటయ్యె పలు స్థానములందు పురాణ గాథలై
    రాముని భీష్మునిన్ గొలువ రచ్చకు మూలము నయ్యె నివ్విధిన్
    రాముని తండ్రి భీష్ముడని వ్రాసెను ధూర్జటి భారతమ్ము నన్

    రేడియొ =Radio
    శ్రామము =సమయము
    స్థానములు =stations

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  11. భీమునిపట్నమందు సుకవిత్వసమాజము వారు భాషపై
    ప్రేమను గల్గియున్ వరకవిన్ బిలిపించి వధాన మొక్కటిన్
    నీమముతోడ నేర్పరచ నేనట నిచ్చితి నీ సమస్యనే
    "రాముని తండ్రి భీష్ముఁడని వ్రాసెను ధూర్జటి భారతమ్మునన్"

    రిప్లయితొలగించండి
  12. క్రమాలంకారం……….

    భూమిజ పతి, చెడు తంత్రము
    తో మాటున దాగి చంపె తూపుల నరుడున్,
    కాముడు విష్ణువు కేమగు?
    రాముఁడు, భీష్ముని, కొడుకని, వ్రాసెఁ గవి దగన్

    క్రమాలంకారం……….

    ధీమతి కైక భర్త, విన తీవ్రములైన ప్రతిజ్ఞలన్ సదా
    భూమిని మోసె నో సుగుణ పుత్రడు గంగకు, పారిజామున్
    భూమికి దెచ్చుకావ్యమును, బోడికి బట్టలు లాగిరిచ్చటన్
    రాముని తండ్రి ,భీష్ముఁడని, వ్రాసెను ధూర్జటి, భారతమ్మునన్

    రిప్లయితొలగించండి
  13. ఏమని వివరింతును కవి
    భీమునిమధుపానమత్త ప్రేలాపనలన్
    ధీమా గలదని తలచుచు
    రాముఁడు భీష్ముని కొడుకని వ్రాసెఁ గవి దగన్

    రిప్లయితొలగించండి
  14. క్షేమమె పూరణమ్ముకయి క్లిష్టసమస్య నొసంగ, బల్మితో
    నీమము వీడి మూల వడు నీరసశబ్దములన్ బిగించి యే
    మేమొ యసంగతార్థముల నేర్పడ జెప్ప తదీయపూరణన్
    రాముని తండ్రి భీష్ముఁడని వ్రాసెను ధూర్జటి భారతమ్మునన్.

    కంజర్ల రామాచార్య.

    రిప్లయితొలగించండి
  15. నీమముగ వంశవృద్ధికై
    యా ముని కరణమున పాండునలరగ వావిన్
    కోమలియగు కుంతికి యభి
    రాముఁడు భీష్ముని కొడుకని వ్రాసెఁ గవి దగన్

    రిప్లయితొలగించండి
  16. నీమములేమి లేవు యవనీతలమందున నొక్కరుండు తా
    నేమియు కావ్యముల్ చదువ డెన్నడు మద్యము గ్రోలు నాతనిన్
    రాముని గూర్చిదెల్పుమన రంజన మీరగ పల్కెనిట్టులన్
    రాముని తండ్రి భీష్ముఁడని వ్రాసెను ధూర్జటి భారతమ్మునన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'లేవు+అవనీ..' అన్నపుడు యడాగమం రాదు. "...యుండ వవనీ..." అనండి.

      తొలగించండి
  17. రాముడు, కాముడున్, కవిత, రాధిక, చూసెను భీష్ముడున్, గదన్,
    భీముడు, వ్రాసె ధూర్జటి,యని పెక్కులు,వ్రాయుచు ఫ్లాషుకార్డ్లపై
    సోముడు టీచరొక్కరుడు సొంపుగ వాటిని పేర్చె నిట్టులన్
    రాముని తండ్రి ,భీష్ముఁడని, వ్రాసెను ధూర్జటి, భారతమ్మునన్……..

    రిప్లయితొలగించండి
  18. ప్రేమన్ దొలుకగ గణపతి
    నామంబు జపించుచుండి నమ్రత నీ భూ
    ధామంబున కధిపతి యభి
    రాముఁడు భీష్ముని కొడుకని వ్రాసెఁ గవి దగన్!


    అభిరాముడు=సంతోషముగలిగించువాడు
    భీష్ముడు=శివుడు

    రిప్లయితొలగించండి
  19. గురువు గారికి నమస్కృతులతో

    కామము నిగ్రహించి తన గాంతల దమ్ముల కిచ్చె భీష్ముడున్
    భామకు మాటయిచ్చి తన భార్యగు కైకయి గోర్కెదీర్చె నా
    డా మహరాజు గొప్పగను డాకొను భావ తలంపునా కవిన్
    రాముని తండ్రి భీష్ముడని వ్రాసెను ధూర్జటి భారతమ్మునన్

    రిప్లయితొలగించండి
  20. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  21. భామా! మతిచెడె? చెప్పుమ
    రాముడు భీష్ముని కొడుకని వ్రాసెగవి దగన్
    రాముని గూరిచి వ్రాసిన
    నామహితాత్ముని సుమధుర యాఖ్య ను జెపుమా!
    ప్రత్యుత్తరంతొలగించు

    రిప్లయితొలగించండి
  22. ఆ ముని తోడుగా సుతుని యాగముగావగనంపెనెవ్వరిం
    కేమనిరా నదీజునటులెన్నికగా గొన బ్రహ్మచర్యమిం
    కేమయె కాళహస్తి కథలెందు గనంబడునన్ని ధర్మముల్
    రాముని తండ్రి; భీష్ముఁడని; వ్రాసెను ధూర్జటి; భారతమ్మునన్

    రిప్లయితొలగించండి
  23. సోమము గ్రోలినట్టు లనుచున్ పలు భంగుల బూటకమ్ములన్
    గ్రామము నందు నెప్పుడు శకారుడు కాలము వెళ్ళబుచ్చువా
    డేమియు జ్ఞానమున్ గొనక ఇంపుగ పల్కెను పొల్లు మాటలన్
    “రాముని తండ్రి భీష్ముఁడని వ్రాసెను ధూర్జటి భారతమ్మునన్”
    సోమము: జలము., గ్రామము: సమూహము

    రిప్లయితొలగించండి
  24. భామకు లొంగి భయంకరుఁ
    డై మను జాధిపతి పంప నడవికి సుతునిన్
    రాముని దయ వీడి, కనలి
    రాముఁడు భీష్ముని కొడుకని వ్రాసెఁ గవి దగన్

    [భీష్ముఁడు = భయంకరుఁడు]


    క్షేమద విఘ్ననాథు శశిశేఖర రక్షితు శ్రీ లసన్మహా
    భీమ భుజంగ సూత్రు పరివేష్టిత నిర్జరు కుంజరంపుఁ బె
    న్మోము గలట్టి వాని వరమూషిక వాహను భక్త మాన సా
    రాముని తండ్రి భీష్ముఁ డని వ్రాసెను ధూర్జటి భారతమ్మునన్

    [మానస +ఆరాముఁడు =మాన సారాముఁడు; భీష్ముఁడు =శివుఁడు; భారతము = భారత దేశము]

    రిప్లయితొలగించండి
  25. ఏమని జెప్పనొప్పుదును నిప్పటి పిల్లల మొండివైఖరుల్
    దాముగ మార్పుజేయగను దల్లియుదండ్రియు నెంతజెప్పినన్
    రాముని తండ్రి భీష్ముడనీ వ్రాసెనుధూర్జటి భారతమ్మునన్
    సోముడు వ్రాసె పైవిధము చొప్పుననందఱు ఛీత్కరించగా

    రిప్లయితొలగించండి
  26. ఆమునికోరినంతసుతునంపెవశిష్టునిసూచనమ్మునన్
    కామునిచూపుతోడనటకాల్చుచు బూడిదగానుచేసెనా
    సోముని గూర్చి కావ్యమును సొంపగు రీతిన మెచ్చుగా జనుల్
    రాముని తండ్రి,భీష్ముడని,వ్రాసెను ధూర్జటి భారతమ్మునన్

    రిప్లయితొలగించండి