6, ఆగస్టు 2021, శుక్రవారం

సమస్య - 3805

7-8-2021 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“జమునఁ జూడ విజయ శాంతి దక్కె”
(లేదా...)
“జముననుఁ జూడఁగా విజయ శాంతి లభించె జయప్రదమ్ముగన్”
(పెక్కు అవధానాలలో అడిగిన సమస్య)

55 కామెంట్‌లు:

  1. కురుక్షేత్రం లో శ్రీకృష్ణపరమాత్మ అర్జునునితో..

    ఆటవెలది
    మోహమందుజిక్కి పోరువీడెదనంటె
    గీత వినియు పార్థ! చేతనఁ గొని
    కదనమున కురికెడు కర్తవ్యమున ముఖా
    బ్జమునఁ జూడ విజయ! శాంతి దక్కె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చంపకమాల
      సమరము సేయలేననుచు ఛాపము వీడెద నంటె ఫల్గుణా!
      శమనము గూర్చి మోహమును చాటుకు బంపెడు గీత బోధతో
      కుమతుల కౌరవాధములఁ గూల్చు కుతూహలమొప్పు నీ ముఖా
      బ్జముననుఁ జూడఁగా విజయ! శాంతి లభించె జయప్రదమ్ముగన్

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  2. చలన చిత్ర మందు చక్కని నాయకి
    జమున జూడ విజయ శాంతి దక్కె
    ననుచు దర్శకుడనె నానంద మందుచు
    పత్రిక లకు దెల్పె భాగ్య మనుచు

    రిప్లయితొలగించండి
  3. చిన్న తాత గోరు చిత్రమ్ము మూగమ
    నసులు; మనుమడలిగి నసుగ గాంచి
    నారు కలిసి వారు నాడు కర్తవ్యము
    జమునఁ జూడ విజయ శాంతి దక్కె

    రిప్లయితొలగించండి
  4. నిందమోపి తనను నేతయె నిలదీయ
    పదవి వదలితాను ప్రతిన బూని
    తనకు మారు నిలుప దనభార్య యైనట్టి
    జమునఁ జూడ విజయ శాంతి దక్కె.

    రిప్లయితొలగించండి
  5. సమస్య :

    జమునను జూడగా విజయ
    శాంతి లభించె జయప్రదమ్ముగన్

    ( కాళియమర్దనం చేసి జమునలో జలకాలుష్యాన్ని
    పోగొట్టిన కన్నయ్యను కౌగిలించుకొని యశోదమ్మ
    తన చెలికత్తె విజయతో అంటున్నది )

    ప్రమదము మిన్ను ముట్టె మన
    పౌరుల గోవుల బక్షులందునన్ ;
    సమదుడు కాళియుండు తన
    సంతును భార్యలు వెంటనంటగా
    గుములుచు సాగరంబునకు
    గుంపుగ నేగెను బుద్ధిమంతుడై ;
    జమునను జూడగా విజయ !
    శాంతి లభించె జయప్రదమ్ముగన్ .

    ( జమున - యమున )

    రిప్లయితొలగించండి
  6. మనసునెమ్మదుండుమార్గంబుగనరాక
    తరలివెళ్లినానుదారివెదకి
    పుణ్యమరసిబుద్దిపూర్ణంబుదెలిసితి
    జమునణజూడవిజయశాంతిదక్కె

    రిప్లయితొలగించండి

  7. శాంతి గోరినాడు సమరము వలదన్న
    కాలుదువ్వనేమి కయ్యమునకు
    వారధర్మ పరులు పాపులెడల బల
    జమున జూడ విజయ, శాంతి దక్కె.

    రిప్లయితొలగించండి

  8. కుమతులధర్మవర్తనులు క్రూరులశాంతి ప్రియుండ్ర నెల్లరిన్
    సమరము నందు గూల్చితివి సత్యము ధర్మము నిల్పగా ననిన్
    విమలుడవైన నీవెగద విజ్ఞత తోడ చరింప నీదు తే
    జముననుఁ జూడగా విజయ, శాంతిలభించె జయప్రదమ్మునన్.

    రిప్లయితొలగించండి
  9. సమరముఁజేయపుట్టుకనుసంయమిగాగనుసాగుమాతుదిన్
    కుమతులవోలెబాహ్యమునుకూర్పగరాదుగమోక్షమెప్పుడున్
    అమరినసౌఖ్యమెంచకనుయానముజేయుచుసారసాంబురా
    జముననుఁజూడగావిజయశాంతిలభించెజయప్రదమ్ముగన్

    రిప్లయితొలగించండి
  10. వివిధ కళల యందు వినుతి కెక్కినవారి
    చిత్ర పటములన్ని సేక రించ
    నాటి చలన చిత్ర నాయికలందున
    జమునఁ జూడ విజయ శాంతి దక్కె

    రిప్లయితొలగించండి
  11. చం:

    సమయము మించి పోయినది సావధి నింటనె నెమ్మదించుచున్
    భ్రమగొన లేక నింక మరి భారమటంచు కరోన తీవ్రతన్
    తమదగు పూరణమ్ము గని తాండవ మాడె మనస్సు నూహలన్
    జమునను జూడగా విజయ శాంతి లభించె జయప్రదమ్ముగన్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  12. శోకతప్త సీత చూడామణినిదెచ్చి
    రామలక్ష్మణులకు రయముతోడ
    హనుమ జూప నామహాత్ముని దివ్యతే
    జమునఁ జూడ విజయ శాంతి దక్కె

    రిప్లయితొలగించండి
  13. దూర సాగరాన, దుర్భిణీ కటకరా
    జమునఁ జూడ విజయ శాంతి, దక్కె
    చెక్క నావ పైన కెక్కి తాన్నర్తించు
    మంచి దృశ్య మొకటి, మదిని నిలిచె.

    రిప్లయితొలగించండి
  14. సముచిత రీతి నున్నతుల సామ్య
    ముకల్గు విధంబు జేయ , నా

    సమయమునాటి నాయికల
    చక్కదనంబును జూసి యెంతగన్

    శ్రమమునకోర్చి చిత్రముల సంగ్రహ మందున రోయుచుండగన్

    జముననుఁ జూడఁగా విజయ శాంతి లభించె జయప్రదమ్ముగన్

    రిప్లయితొలగించండి
  15. సుముఖతకల్గియాడిరట
    సుచ్చరితంబు పచీసు ఇంతివల్
    అమరికచేసిగవ్వలవి
    హస్తమునమ్రగవేసిరంతటన్
    సమరముసాగెమధ్య యిది
    సాద్యమ కాయను సంప, సంపు పం
    జమునను జూడగా విజయ
    శాంతి లభించె జయప్రదమ్ముగన్
    .....తోకల....

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'సచ్చరితము' ఉంది కాని 'సుచ్చరితము' లేదు. 'పంజము' మాండలికం.

      తొలగించండి
  16. బంతియాటయందు పంతమ్ము హెచ్చెను
    పరిణమించె తుదకు బవరమట్లు
    వెసను బంతిపోవ వెదకిరి దాని కుం
    జమునఁ జూడ విజయ, శాంతి దక్కె

    రిప్లయితొలగించండి
  17. చంపకమాల:
    సమముగ సానిటైజు ప్రతిసారి యొనర్తురు భీతిలేదు దూ
    రము తగురీతినుంచుదురు రాసుకు పూసుకు నుండబోరు రో
    గము గలవారి జాడ పసి గట్టి ప్రవేశము నాపివేతురే
    సుముఖత జూపవే చెలియ సూపరు మార్కెటు కేగ నీ ముఖా
    “బ్జముననుఁ జూడఁగా విజయ శాంతి లభించె జయప్రదమ్ముగన్”
    --కటకం వేంకటరామశర్మ.

    రిప్లయితొలగించండి
  18. ప్రమదముతోడవచ్చి కని బంధుల నొజ్జల, సంశయమ్ముతో
    సముదయమందునన్ నిలిచి చంపగ లేను స్వజనమ్మునంటివే
    విమలపు బుద్ధితోడుతను విష్ణువు రూపము నీదు హృత్సరో
    జముననుఁ జూడఁగా విజయ! శాంతి లభించె జయప్రదమ్ముగన్

    రిప్లయితొలగించండి
  19. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  20. సమస్య: జమునఁ జూడ విజయ శాంతి దక్కె.

    మనసు నందు "శాంతి" మసకబారినవేళ
    తీర్థయాత్రకొరకు తీరు వెడల
    నచట బారుచున్న యందాల నదియగు
    జమునఁ జూడ విజయ! "శాంతి" దక్కె.

    ---గోలి.

    రిప్లయితొలగించండి
  21. నాదు మనుమరాలు నాట్యమాడగనిన్న
    యూరివారలపుడ యుత్సుకతన
    వేయి విధములుగను వినుతించ ముఖపంక
    జమున జూడ విజయశాంతిదక్కె

    రిప్లయితొలగించండి
  22. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సరదా ప్రయత్నము (ప్రాస సవరణతో)

      ప్రమదల నాటి చిత్రముల ప్రాకటమెవ్వరి ప్రజ్ఞ జూడగా
      రమణి తనెవ్వరో మలి తరంబున దక్కెను చిత్రసీమకున్
      తమ తమ పేర్లలో "జయ"ను దాకొలుపంగనికెట్లు సాగెనో
      జముననుఁ జూడఁగా; విజయ శాంతి లభించె; జయప్రదమ్ముగన్

      (మూడవ పాదంలో జయప్రద, జయసుధ, జయమాలిని యిత్యాదుల నట ప్రస్థానం గురించి)

      తొలగించండి
  23. తమ నెలవుల నుండి తలిరుఁబో ళ్లేతెంచ
    నొక్క చోటి కప్పు డక్కజముగఁ
    బల్కె నొక్కఁ డిట్లు పన్నుగ వినఁబడ
    జమునఁ జూడ విజయ శాంతి దక్కె


    కుములుచు నిక్కుపాటులను గ్రుంకుచు మిక్కుట మెల్ల కోపులం
    దమిఁ జని యేటి కింపుగఁ గతల్ విని బత్తి మునింగి నంతటన్
    గము లయి వచ్చె సొమ్ములు దగన్ వడిఁ బట్టిన యెల్ల తావులన్
    జముననుఁ జూడఁగా విజయ శాంతి లభించె జయప్రదమ్ముగన్

    రిప్లయితొలగించండి
  24. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  25. విమల మనంబు గల్గుచును వెన్నెలవోలెను వెల్గునాసతిం
    జమునను జూడగావిజయ శాంతిలభించెజయప్రదమ్ముగన్
    మమతలె యుట్టి చెందగను మాన్యతతోడను జిత్రమందులీ
    నమయినరీతి చిత్తమున నాట్యముజేయుచు నుండునేగదా

    రిప్లయితొలగించండి

  26. చిన్ననాటి అనుభవాలను మిత్రనితో పంచుకొంటున్న శ్రీకృష్ణుడు

    అమలిన స్నేహభావమున నాటలనాడుచు గోపగోపికల్
    విమలజలమ్ము నెంచి దిగి వీడగ ప్రాణము ఖేదమందితిన్
    జమునను జూడగా విజయ! శాంతి లభించె జయప్రదమ్ముగన్
    సమయగ జిక్కులెల్ల ఘనసర్పము నంపగ దూరదేశమున్

    రిప్లయితొలగించండి
  27. అమలిన నీటి రేడు ధరపై
    గురిపించె సమృద్ధి వర్షమున్
    సమముగ దేశమంతటను
    సర్వజనుల్ గడు సంతసించగా
    నమనము జేసె భక్తిమెయి నమ్రత తో బ్రవహించునట్టి యా
    జమునను జూడగా విజయ!
    శాంతి లభించె జయప్రదమ్మునన్.











    రిప్లయితొలగించండి