7, ఆగస్టు 2021, శనివారం

సమస్య - 3806

8-8-2021 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మరుని కంటిమంట మాడ్చె శివుని”
(లేదా...)
“మదనుని కంటి మంటలకు మాడెఁ ద్రినేత్రుఁడు చిత్రమయ్యెడిన్”

57 కామెంట్‌లు:

  1. క్రొవ్విడి వెంకట రాజారావు:

    మూర్ఖ కౌరవులను పోరున యింద్ర కొ
    మరుని కంటి మంట మాడ్చె ; శివుని
    కనలజేసి మరుడు కాలి భసితమయ్యె
    ఘనుల కోప మెపుడు గర్వ మణచు.

    రిప్లయితొలగించండి

  2. విరిశరమది త్రాక వెటకన్ను దెరచుచు
    కనలు కొనుచు నెదుట కాంచె నపుడు
    మరుని, కంట మంట మాడ్చె, శివుని మార్చ
    నెంచి మ్రగ్గెకాదె హృచ్ఛయుండు.

    రిప్లయితొలగించండి
  3. గురువు శిష్యు నడిగె మరు డన నెవ్వరో
    యెఱుక పరచుము నత డేమి జేసె
    ననగ టక్కున ననె నత డయ్యెడ నిటుల
    "మరుని కంటి మంట మాడ్చె శివుని "

    రిప్లయితొలగించండి
  4. విరియమానసంబువింతగనాషాఢ
    మాసమురిమిఁజూచెమరునిదెసను
    కుపితుడయ్యెనపుడుకుసుమంపుబాణుండు
    మరునికంటిమంటమాడ్చెశివుని

    రిప్లయితొలగించండి
  5. సమస్య :

    మదనుని కంటిమంటలకు
    మాడె ద్రినేత్రుడు చిత్రమయ్యెడిన్

    ( పంతులమ్మ ప్రశ్నలు - అమ్మాయిల జవాబులు )

    చంపకమాల
    ....................

    " చెదరిన దీక్ష నీశ్వరుడు
    ఛీత్కృతి నెవ్వని గాంచె ? మన్మథుం
    డదరుచు నేమియయ్యెనొకొ ?
    అంతట నా రతియున్ హిమాద్రిజల్
    సదమలభక్తి ప్రార్థనల
    సల్పగ మారుని గాచె నెవ్వడో ? "
    " మదనుని " " కంటిమంటలకు
    మాడె " " ద్రినేత్రుడు చిత్రమయ్యెడిన్ . "

    రిప్లయితొలగించండి
  6. మొదటి పాదంలో కొద్ది మార్పు:

    " యింద్రు కొ "

    రిప్లయితొలగించండి
  7. చేరెను‌ నగసుత శివుని‌ కొల్వదలచి, రతి దేవి తన తోడు‌ రాగ లక్కి

    సుతుడు ప్రవేశించె, శోభతో‌ నొప్పారె
    నా ప్రదేశంబంత ,నగవు తోడ

    వేసెను‌ బాణము‌ విసురుగ శివునిపై
    మదనుడు, మదిలోన నిదుర లేచె

    కోరిక భవునకు, పారెను పధకమ
    నుచు వేల్పు లెల్ల తలచు‌ చునుండ

    పరమ శివుడు వెంటనె‌ చూసె కొరకొరమని

    మరుని,కంటి‌మంట మాడ్చె, శివుని

    వేడె రయముగ పతిబిక్ష పెట్ట మనుచు

    మన్మధుని సతి శివుని నమసము‌ లిడుచు

    రిప్లయితొలగించండి

  8. విదురుడ నంచు శాస్త్రములు పెక్కుపఠించితి నంచు కల్లలన్
    బెదరక చెప్పునట్టియొక వెంగళి మాటలు నమ్మినట్టి యో
    పదుగురు కోరినారనుచు పామరు డిట్టుల చెప్పెనచ్చటన్
    మదనుని కంటమంటలకు మాడెఁ ద్రినేత్రుఁడు చిత్రమయ్యెడిన్.

    రిప్లయితొలగించండి
  9. ఆటవెలది
    "పెళ్ళి జేసి మనకు వీడె ప్రాణములనఁ
    బతిని గని బొగిలెడు రతిని గావఁ"
    బలుక గిరిజ స్మృతిని
    బార్వతి వినతి విన
    మరుని కంటిమంట మాడ్చె శివుని

    చంపకమాల
    "అదనుకు వేడగా సురలు నంకితమై మన పెళ్ళి జేయుచున్
    బదపడి బూదియై రతికి బాధమిగిల్చెను జాలి జూపు"మన్
    సుదతి వినంగనే స్మృతిని శోచన సోలుచు భస్మమయ్యెడున్
    మదనుని కంటి మంటలకు మాడెఁ ద్రినేత్రుఁడు చిత్రమయ్యెడిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. సవరించిన ఆటవెలది పూరణతో:

      ఆటవెలది
      "పెళ్ళి జేసి మనకు వీడె ప్రాణములనఁ
      బతిని గని బొగిలెడు రతిని గావఁ"
      బలుక గిరిజ స్మృతిని భస్మమయ్యెడి వేళ
      మరుని కంటిమంట మాడ్చె శివుని

      చంపకమాల
      "అదనుకు వేడగా సురలు నంకితమై మన పెళ్ళి జేయుచున్
      బదపడి బూదియై రతికి బాధమిగిల్చెను జాలి జూపు"మన్
      సుదతి వినంగనే స్మృతిని శోచన సోలుచు భస్మమయ్యెడున్
      మదనుని కంటి మంటలకు మాడెఁ ద్రినేత్రుఁడు చిత్రమయ్యెడిన్

      తొలగించండి
  10. వదలెనుకోమలాంగుడునువాడిగబాణమునామహేశుపై
    కదలెనుయోగిపుంగవుడుకామనజూచెనుతన్వినంతటన్

    కుదిరెనులగ్నమాయెడనుకుందగరక్కసుడంతగాసితో
    మదనునికంటిమంటలకుమాడెఁద్రినేత్రుఁడుచిత్రమయ్యెడిన్

    రిప్లయితొలగించండి
  11. వదలుచు క్రోధమోహముల బ్రహ్మమహర్షిగ రూపుదిద్దగన్
    పదునగు సంయతిన్ మునుగు పావనగాధి సుతుండు సైతమా
    మదనుని కంటిమంటలకు మాడె; ద్రినేత్రుడు చిత్రమయ్యెడున్
    విధమున బుగ్గిజేసె కడు వెక్కసమందుచు పుష్పబాణునిన్

    రిప్లయితొలగించండి
  12. తండ్రి దాగుబోతుదనమును మాన్చె కొ
    మరుని కంటిమంట ; మాడ్చె శివుని
    గంటిజూపు నాడు కంతుని బూదిగ ,
    దానె బతుకునిచ్చె దయను జూపి

    రిప్లయితొలగించండి
  13. శివుని కంటిమంట సిరిపట్టినిన్మాడ్చె
    ననక తొట్రుపడుచు నాతడనెను
    వెర్రి ముదిరిపోయి వేపకాయంతగా
    మరుని కంటిమంట మాడ్చె శివుని

    రిప్లయితొలగించండి
  14. శివుడెవరినిబూదిచేసె? నేవిధమున?
    మదనుడెవరివలనమరణమొందె?
    తెలియజేయుమయ్య తేటతెల్లంబుగా
    “మరుని" "కంటిమంట మాడ్చె" "శివుని”

    రిప్లయితొలగించండి
  15. కుదురుగనొక్క చోట మరి కూర్చొనలేడెటు నేర్చు విద్యలన్
    మదనవిరోధి గాథ పలుమారులు దెల్పితి వ్రాయుమన్ననా
    పదములు తారుమారయెను భావము మారెను వ్రాసెనిట్టులన్
    "మదనుని కంటి మంటలకు మాడెఁ ద్రినేత్రుఁడు చిత్రమయ్యెడిన్"

    రిప్లయితొలగించండి
  16. చూడ నొక పటమున , సుమ శరము విసరు
    మరుని కంటి , మంట మాడ్చె శివుని
    కంటి నుండి వచ్చి కాముని దేహాన్ని ,
    పతిని జూచి యేడ్చు రతిని కూడ.

    రిప్లయితొలగించండి
  17. మన్మథుడు శంకరుని మేల్కొలుప డానికి పూల బాణాలను తన *వాడిచూపులతో* గురి పెట్టి వదలినపుడు శంకరునికి ప్రేమ తాపము పుట్టి (మాడి) మెలకువ వస్తుంది.
    మన్మథుడి వాడి ( గురి) చూపులు కంటి మంటలుగాను ; శంకరుడు ప్రేమ తాపము చే మాడి మేల్కొనడముగాను చెప్పే ప్రయత్నము చేశాను.

    చం:

    కదలగ జేయ శంకరుని గైకొన పార్వతి బెండ్లి యాడనై
    పదమనె దేవరాజు వల పన్నగ, నీశుడు ప్రేమ పొందగన్
    వదలక వైచె బాణములు వాడిమి చూపుల తాపమెచ్చగన్
    మదనుని కంటి మంటలకు మాడె ద్రినేత్రుడు చిత్రమయ్యెడిన్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  18. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  19. చంపకమాల:
    పదునుగ పూలబాణములు వ్రాల తనేమని రుద్రుడై ,కనన్
    ఎదురుగ నున్న వాడెటుల నిక్కటులంబడె? నెమ్మదించి తా
    ముదమున పెండ్లియాడెనట ముగ్ధమనోహరి పార్వతిన్ క్రమన్
    “మదనుని కంటి, మంటలకు మాడెఁ, ద్రినేత్రుఁడు చిత్రమయ్యెడిన్”
    --కటకం వేంకటరామశర్మ.

    రిప్లయితొలగించండి
  20. మదనవికారమే బొడమె మారుని తూపులు తాకనీశుకున్
    కదలికతో తపంబునకు గల్గగ భంగము దల్చిరెల్లరున్
    వదలక చాగజేయ తన వాడిశరంబులు వేడిదృక్కులన్
    మదనుని కంటి మంటలకు మాడెఁ ద్రినేత్రుఁడు చిత్రమయ్యెడిన్

    రిప్లయితొలగించండి
  21. కుధరము పై తపస్సునల గోపతి చేయుచు నుండ నిష్ఠ వా
    రిద వహనమ్ముపై తిరుగు వృత్రహు పన్పున వేయ బాణముల్
    హృదయము చంచలింపగను హెచ్చగ తాపము పూ శరమ్ములన్
    మదనుని కంటి మంటలకు మాడెఁ ద్రినేత్రుఁడు చిత్రమయ్యెడిన్

    రిప్లయితొలగించండి
  22. జపము జేయు వాని సడలని దీక్షయే
    లక్ష్మి దేవి పుత్రు లక్ష్య మనగ,
    మించు శక్తి గనుచు మెరమెర మితిమీర
    మరుని కంటిమంట ,మాడ్చె శివుని
    మాడ్చె=కోపము తెప్పించిన
    కొరుప్రోలు రాధాకృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  23. మూర్ఖుడొకడు పలుక మోమోటముబడక
    మరుని కంటిమంట మాడ్చెశివుని
    నొజ్జ చెప్పెనిటుల యోరి!వినుము
    మరుని సంహ రించె హరుని కన్ను

    రిప్లయితొలగించండి
  24. చెదరగ ధ్యానమా హరుడు చిచ్చరకంట దహించెనేరినో
    సదయుని ధ్యానభంగమున చైత్రసఖుండెటులంతమాయెనో
    మదనుని పుష్ప బాణముల మాయ నుమన్ వరియించెనెవ్వరో
    మదనుని; కంటి మంటలకు మాడెఁ; ద్రినేత్రుఁడు చిత్రమయ్యెడిన్

    రిప్లయితొలగించండి
  25. చంపకమాల
    సదమల భావముల్ వలికి సర్వులు మెచ్చెడు పండితాగ్రణిన్
    హృదయమునంటు రీతి ప్రవచింపగ బిల్వుమటంచు జెప్పగన్
    వదరెడు వాని దెచ్చితివి! పల్కుల పొంతనలేక కూసె నే
    మదనుని కంటి మంటలకు మాడెఁ ద్రినేత్రుఁడు? చిత్రమయ్యెడిన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆటవెలది
      ప్రవచనమ్ము వలికి రంజింపఁ జేసెడు
      గొప్పపండితుడని చెప్పి దించ
      వింత వాగుడు విన పొంతనన్నది లేక
      మరుని కంటిమంట మాడ్చె శివుని!

      తొలగించండి
  26. అరి భయంకరు ఘను నమర నదీ సుతు
    వీత శస్త్రుఁ జేసి భీష్ము నని శి
    ఖండి దర్శనమ్ము కాలు నింటికి నంపె
    మరుని కంటిమంట మాడ్చె శివుని


    కదలని కోట యున్న దని గాఢ నివాతము చిప్ప పెట్టెయుం
    బదిల మొసంగుఁ దప్ప కని పంతము నూని మనమ్ము నందుఁ దా
    బెదరక నిల్వ దర్పమున భీష్ముని భస్మ తనూ కృతజ్వల
    న్మదనుని కంటి మంటలకు మాడెఁ ద్రినేత్రుఁడు చిత్రమయ్యెడిన్

    [త్రినేత్రుఁడు = కొబ్బరికాయ]

    రిప్లయితొలగించండి
  27. మదనుని కంటిమంటలకు మాడె ద్రినేత్రుడు చిత్రమయ్యెడిన్
    మదమున బల్కుచుంటివ?యమానుషపల్కులు న్యాయమా రమా
    ముదమున నుంటివేయికను మూర్ఖునివోలెను బల్కుపల్కియున్
    మొదటిగురుండు శంకరుడు మోమును వంచుచుమ్రొక్కుమా వెసన్

    రిప్లయితొలగించండి
  28. జగముగొల్చువిభునిసాంబునియీశుని
    పన్నగాభరుణునిపంచముఖుని
    కామమునుజయించు కల్యాణ మూర్తిని
    మరుని కంటిమంట మాడ్చె శివుని

    రిప్లయితొలగించండి
  29. శివునిప్రతిమచేయ చెక్కతోజక్కన్న
    పొగడఁగని యసూయపొందెనొకడు
    నిప్పుపెట్టి పోయె నిద్రింప జనులు పా
    మరునికంటిమంట మాడ్చె శివుని

    గాదిరాజు మధుసూదనరాజు

    రిప్లయితొలగించండి
  30. మదవతులందరున్ బొగడ మామ త్రినేత్రునియన్నదాతగా
    మదనుడసూయతో కనులమంటలుహెచ్చగఁగుట్టువిప్పె సం
    పదగుడిలోనజిక్కెననిపాపపుసొమ్మని మోము మాడె నా
    మదనుని కంటి మంటలకు మాడెఁ ద్రినేత్రుఁడు చిత్రమయ్యెడిన్

    గాదిరాజు మధుసూదనరాజు

    రిప్లయితొలగించండి
  31. కల్లు కుడిచి వచ్చి పల్లెటూరి నడుమ
    తోలు బొమ్మలాట కీలుకాడు
    త్రాగిన మయకమున వాగిన మాటలే
    మరుని కంటిమంట మాడ్చె శివుని 

    రిప్లయితొలగించండి