26, ఆగస్టు 2021, గురువారం

సమస్య - 3823

27-8-2021 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మంగలవాఁడే పతి యగు మానుము దిగులున్”
(లేదా...)
“మంగలవాఁడె భర్త యగు మానుము దుఃఖమికన్ దలోదరీ”

36 కామెంట్‌లు:

  1. బెంగయునీకేలసుదతి
    చెంగునగట్టుదుతిరుపతిచేలమునీకున్
    వెంగమవడివడినలివే
    ల్మంగలవాడేపతియగుమానుముదిగులున్

    రిప్లయితొలగించండి
  2. శ్రీ గురుభ్యో నమః
    కం//
    కంగారెందుకు గోదా
    నింగిని యేలెడి ప్రభువట నీలాంబరడౌ l
    రంగడు రమణుడు "తిరునా
    మం"గలవాఁడే పతి యగు మానుము దిగులున్ ll

    రిప్లయితొలగించండి
  3. రంగుల వస్త్రముల్ దొడిగి రంజిల చేయుచు నుంటివీవు నీ
    సంగడికై తపించుచు పసందగు రూపము జూసి మెచ్చి యీ
    యంగన భార్యగా నొసగు మంచు భజింతురు శౌరి నిన్ను నో
    మంగలవాఁడె భర్త యగు మానుము దుఃఖమికన్ దలోదరీ

    రిప్లయితొలగించండి
  4. గురువర్యులకు నమస్సులు, నిన్నటి నాపూరణను పరిశీలించి తప్పొప్పుల తెలుప ప్రార్థన.
    విత్తము వృద్ధి చేయుచునె వేగము బెంచగ నెడ్ల తావునన్
    ముత్తెము వోలు యంత్రము ప్రమోదము గొల్ప నమర్చ బండికిన్
    జిత్తరు వొంద వైభవము జేకుర నా శకటమ్మె పాఱెనే
    "నత్త రయంబునన్ దిరిగె నాలుగు గ్రామములొక్క జామునన్"

    -మాచవోలు శ్రీధరరావు

    రిప్లయితొలగించండి

  5. బెంగను వీడుము సోదరి
    వెంగలి విత్తేమి రాడు పింగేక్షణుడౌ
    లింగని కృపగలిగిన ధ
    ర్మంగల వాఁడే పతియగు మానుము దిగులున్.

    రిప్లయితొలగించండి
  6. అంగన! చింత యేల హృదయంబున? నీ పనులెల్లఁ జేయువాఁ
    డుం గఠినుండు గాకయె కడుం సుఖపెట్టెడివాఁడు, వంటలె
    ల్లం గరమొప్ప జేసి తిన లాలన సేసియు బోళ్ళనెల్లఁ దో
    మం గలవాఁడె భర్త యగు మానుము దుఃఖమిఁకన్ దలోదరీ!

    రిప్లయితొలగించండి
  7. పొంగెడు నుత్సాహంబును
    క్రుంగని ధైర్యంబును గల కుశలత తోడై
    భంగ పడని వాడగు ధీ
    మం గల వాడే పతియగు మానుము దిగులున్

    రిప్లయితొలగించండి
  8. రిప్లయిలు
    1. అగ్నిద్యోతనుడు రుక్మిణీ మాతతో...

      కందం
      మంగళమూరితి వెన్నుడు
      చెంగట నిల్చి సిరులిచ్చి చెప్పెను తల్లీ!
      బంగరు తేరున గొను ప్రే
      మం గలవాఁడే పతి యగు మానుము దిగులున్!

      ఉత్పలమాల
      మంగళమూర్తిగా హృదయమందిరమేలెడు కృష్ణమూర్తి తాఁ
      జెంగట నిల్చి కానుకలు చేతికొసంగుచు రుక్మిణమ్మరో!
      బంగరుతేరుపై గొనఁగ వత్తునటంచనె మీరలన్న ప్రే
      మం గలవాఁడె భర్త యగు మానుము దుఃఖమికన్ దలోదరీ!

      తొలగించండి
  9. గంగులు వినవే చదువిన
    బంగరు ఉద్యోగిడబ్బు బస్తలువుండే
    సింగముపోకడ మరి, నే
    మం, గలవాడేపతియగు మానుము దిగులున్
    ...తోకల...

    రిప్లయితొలగించండి
  10. సంగములేదులేమనసుసాధనయందుననారితేరెడిన్
    జంగమదేవరాతడునుజాలగమెచ్చునునీదురూపమున్
    గంగనుదాల్చినాడతడుకాయునుకాటినిమౌనిగాననీ
    మంగలవాడెభర్తయగుమానుముదుఖమికన్దలోదరి

    రిప్లయితొలగించండి
  11. బంగరు మేనివాడధిక భాగ్యము
    గల్గిన జ్ఞానవంతుడున్
    రంగుల జీవితంబు గడు రమ్యము
    గా నడిపించువాడు నీ
    కొంగును బట్టి నడ్చుకొను గోమల
    మౌ హృదయుండు గొప్ప ధా
    మంగలవాడె భర్తయగు మానుము
    దు:ఖ మికన్ తలోదరీ

    రిప్లయితొలగించండి
  12. అంగన చింతవీడుమిక హైముడు కాంచుచు బ్రోచు తప్పకన్
    జంగమ దేవరన్ గోలిచి సత్కృప పొందిన దానవైతివే
    బెంగను వీడమంటి, నిను ప్రేమగ చూచు సదాత్ముడైన ధ
    ర్మంగల వాడె భర్తయగు మానుము దుఃఖమికన్ దలోదరీ.

    రిప్లయితొలగించండి
  13. బంగళ కారుల కధిపతి
    నింగికి నిచ్చెననువేయు నేర్పరియైనన్
    యింగితమెర్గి నడచు ప్రే
    మంగలవాడే పతియగు మానుము దిగులున్

    అంగజుమించు రూపసి సుహాసముజిందెడు మోమువాడు నీ
    యింగిత మెర్గి వచ్చునిట నిచ్చితి లేఖను జాగుజేయకే
    చెంగటనిల్చి చేయిగొను జెల్వముమీరగ కృష్ణమూర్తి నా
    మంగలవాడె భర్తయగు మానుము దుఃఖమికం దలోదరీ

    రిప్లయితొలగించండి
  14. ఈరోజుల్లో తల నీలాలు contract / గుత్త ప్రభుత్వ విధానంగా ఆడవారికే కేటాయించడ జరుగుతున్నది. ఇలా పొందిన ఒక వనిత వ్యాపార భారం వల్ల పెండ్లి చేసుకోవాలని పెద్దలు చెప్పిన మాటగా నా ప్రయత్నము.

    ఉ:

    నింగిని తాకు రాసు లట నిక్కము వెంట్రుకలంచు ముడ్పుగా
    భంగము నొందకుండగను వర్తక భారము నిర్వహింపనై
    రంగము సిద్ధమయ్యె మదిరాక్షికి పెండిలి, పెద్ద లిట్లనన్
    మంగల వాడె భర్త యగు మానుము దుఃఖమికన్ తలోదరీ

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  15. శృంగారనాయకుడు శ్రీ
    రంగడు నినుకోరి వచ్చు రయముగ సుదతీ
    బెంగిలనేటికి తిరునా
    మం గలవాఁడే పతి యగు మానుము దిగులున్

    రిప్లయితొలగించండి
  16. బంగరు రంగును కలిగిన
    మంగళరూపుడులభించు మగువా మరి నీ
    కొంగును బట్టితిరుగు నీ
    మంగలవాఁడే పతి యగు మానుము దిగులున్

    రిప్లయితొలగించండి
  17. కొంగున మూట గట్టుకొని కోరిన రీతిన చుట్టువాఱు వా
    డంగముదప్పి కామము నొడంబడి గర్భము తెచ్చిబెట్టె, నీ
    వింగిత జ్ఞానమున్ విడితివే! మగవాడిని నమ్మకే యొసేయ్
    మంగల! వాఁడె భర్త యగు మానుము దుఃఖమికన్ దలోదరీ౹౹

    రిప్లయితొలగించండి
  18. శృంగారమొసంగు సిగకు
    మంగలవాఁడే ; పతి యగు మానుము దిగులున్
    చెంగల్వదొరను బోలున్
    బెంగ విడు మనుగడయంత ప్రీతిగ జరుగున్

    రిప్లయితొలగించండి
  19. శృంగా రమందు కులమా !
    మంగలవాఁడే పతి యగు మానుము దిగులున్
    మంగళమగు నీకంతయు
    బెంగ విడిచి సంతసించు ప్రేమికు తోడన్

    రిప్లయితొలగించండి
  20. చెంగట రేపు మాపులను సేవక బృందము కూడి యుండగా
    ముంగిలి వీడ నట్టి సిరి మోదము గూర్చగ నెల్ల వేళలన్
    రంగని పైని భక్తియును రంజిలగా నిల లోన స్వర్గ ధా
    మం గలవాఁడె భర్త యగు మానుము దుఃఖమికన్ దలోదరీ

    రిప్లయితొలగించండి
  21. ఎఱుకలసాని రూపములో నున్న శ్రీనివాసుడిట్లనెను.

    అంగద మేలనో ప్రభువ! యందరు గొల్చెడి శోభనాంగుడా
    శృంగము పైననుండతడు శీఘ్రమునన్ వివహంబుజేయుమీ
    యంగజ కీడుజోడగును యామెయు మెచ్చెను శ్రీనివాసు! నా
    మంగలవాఁడె భర్త యగు మానుము దుఃఖమికన్ దలోదరీ!

    అంగదము-దుఃఖము
    ప్రభువు-ఆకాశ రాజు
    తలోదరి- స్త్రీ, ధరణీదేవి

    రిప్లయితొలగించండి
  22. సంగమ మొంద వంశమని
    సంశయ మొందుట పాటికాదు గా
    మంగలవాఁడె భర్త యగు
    మానుము దుఃఖమికన్ దలోదరీ
    మంగళమౌను నీబతుకు
    మారుని బోలెడు యవ్వనుండె గా
    బెంగను వీడి కాపురము
    ప్రీతిగ చేయుము ప్రాణనాథుతో

    రిప్లయితొలగించండి
  23. సమస్య :-
    “మంగలవాఁడే పతి యగు మానుము దిగులున్”

    *కందం**

    శృంగారమ్మును చిందెడు
    బంగరు రంగు చినదాన పైటల వేళన్
    బెంగేలా నీతియు నియ
    మం గలవాఁడే పతి యగు మానుము దిగులున్
    ...................✍️చక్రి

    రిప్లయితొలగించండి
  24. మంగళకరుడా కృష్ణుడు
    సంగతి విని సమ్మతించె సంతోషముగా
    నంగన నీపై గడు ప్రే
    మం గలవాఁడే పతి యగు మానుము దిగులున్

    రిప్లయితొలగించండి
  25. మంగా!వినుమిది తిరునా
    మంగలవాడే పతియగు మానుము దిగులున్
    బెంగను వదులుమ యికనీ
    చెంగటనేయుండునిజము శ్రీకరుడెపుడున్

    రిప్లయితొలగించండి
  26. అంగన,నాదుమాటవిను మందముబాటుగ మోక్షమందుకా
    మంగలవాడెభర్తయగు మానుము దుఃఖమికన్ దలోదరీ!
    చెంగటజేరి యాహరికి సేవనుజేయగ నెల్లవేళలన్
    భంగముకాదు నీకదియ భావినిమేలును గూర్చుదప్పకన్

    రిప్లయితొలగించండి
  27. అంగాంగ వైభవమ్ముల
    మంగలవారి నరయంగ మాన్యుఁడు సుమ్మీ
    యంగన వచింతు నిక్కము
    మంగల! వాఁడే పతి యగు మానుము దిగులున్


    అంగజ తుల్య సుందరత రాస్యుఁడు ధీనిధి సర్వ శాస్త్ర పా
    రంగతుఁ డుత్తముండు నిను లాలన సేయుచుఁ బ్రేమగా ని జో
    త్సంగము నందు నిల్పి కను సచ్చరితుండు తిరస్కృతాన్య భా
    మం గలవాఁడె భర్త యగు మానుము దుఃఖ మిఁకం దలోదరీ

    [భామను + కలవాఁడె = భామం గలవాఁడె]

    రిప్లయితొలగించండి
  28. (పద్మావతితో సోదమ్మ వేషంలో వేంకటేశ్వరుని పలుకులు)

    రంగుల కల చెదురదు, యీ
    భంగి కలవరపడనేల భామా, భువినే
    లంగ తిరుమలేశుని నా
    మం గలవాఁడే పతి యగు మానుము దిగులున్”

    రిప్లయితొలగించండి
  29. అంగన చింతనొందవల దందరిలో ఘన కీర్తిగన్న నా
    మంగళరూపుడై దనరు మారుని మించిన మోహనాంగుడౌ
    రంగడు నిన్నుకోరి నిను రంజిలజేయు మనోజ్ఞమైన నీ
    మం గలవాఁడె భర్త యగు మానుము దుఃఖమికన్ దలోదరీ

    రిప్లయితొలగించండి
  30. మంగళ హారతి గైకొని
    బంగరు పుట్టింటి పట్టి పంపకమందున్
    కుంగ, తనవారనిరి పటి
    మం గలవాఁడే పతి యగు, మానుము దిగులున్

    రిప్లయితొలగించండి
  31. హంగుల తోడ నీ బ్రతుకు
    హాయిగ సాగును‌ సారసాక్షి! నీ
    చెంగట నుత్తముండగు స
    చేతనుడైన మగండు వచ్చు, ని
    బ్భంగిని ప్రేమతోడ గను
    భావము లొక్కటిగా దలంచి క్షే
    మం గలవాఁడె భర్త యగు
    మానుము దుఃఖమికన్ దలోదరీ!

    రిప్లయితొలగించండి