4, మార్చి 2022, శుక్రవారం

సమస్య - 4010

5-3-2022 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పాల వలన నరులు భ్రష్టులైరి”
(లేదా...)
“పాలే కారణమయ్యె మానవులకున్ భ్రష్టత్వముం బొందఁగన్”

23 కామెంట్‌లు:


  1. శాంత మదియె రక్ష జగతి మానవులకు
    విడువ రాదనుచు వివేకులనెడు
    మాట సత్యమె గద మహిలోన జూడ కో
    పాల వలన నరులు భ్రష్టులైరి.

    రిప్లయితొలగించండి
  2. చేయ రాని పనులు చేయుచు సతతమ్ము
    పరుల బాధ పెట్ట పంత మూని
    వక్ర మార్గ మందు వర్తించి చేయు పా
    పాల వలన నరుడు భ్రష్టు డయ్యె

    రిప్లయితొలగించండి
  3. పరుల పట్ల కీడు పాపమై చేకూరు
    నెన్న దగిన మేలు పున్నెమగును
    తప్పు దారి బట్టి తామొనరించు పా
    పాల వలన నరులు భ్రష్టులైరి

    రిప్లయితొలగించండి
  4. ఆటవెలది
    కుక్కఁ బాముఁ బిల్లిఁ గుడువంగ నింకెన్నొ
    కోవిడనెడు పేరఁ గూల్చె జనుల
    రీతి లేని తిండి మ్రింగిరనంగ లో
    పాల వలన నరులు భ్రష్టులైరి!

    శార్దూలవిక్రీడితము
    మూలన్దాగిన బల్లిఁ బిల్లినెలుకన్ బుక్కంగ వ్యామోహమై
    కూలన్ద్రోయు కరోన జృంభణమునన్ గోడాడెగా లోకమే!
    వాలాయమ్మగు తిండి యోగ మరువన్ బ్రాప్తించునారోగ్య లో
    పాలే కారణమయ్యె మానవులకున్ భ్రష్టత్వముం బొందఁగన్!

    రిప్లయితొలగించండి
  5. కూలన్ద్రోచెనుకాపురంబునకటాకోపంబుతోడన్సతిన్
    వ్రేలాడన్మెడత్రాటితోనిలిపియావేల్పున్గనెన్భార్యనే
    ఏలాబంధములిట్టులాయెనయయోవేర్పాటునేగోరుపా
    పాపాలేకారణమయ్యెమానవులకున్భ్రష్టత్వమున్బొందగన్

    రిప్లయితొలగించండి
  6. భూలోకాన జనంబులెల్లరును సమ్మోహంబు
    తో సంపదల్
    జాలిన్వీడియు మోసపూరితముతోసంపాద
    నం బెంచగా
    చాలాబాధలు హింసలుంబెట్టుదురుగా
    సన్మార్గులన్నట్టి పా
    పాలే కారణమయ్యె మానవులకున్ భ్రష్టత్వ
    మున్ జెందగాన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో గణభంగం. "హింస బెట్టుదురుగా" అనండి.

      తొలగించండి
  7. కోరికలను దీర్చు కొనుటకై చేయు పా
    పాల వలన నరులు భ్రష్టులైరి ,
    నాక సుఖము నుండి ; నరకము బొందరు
    పాప పుణ్య మెఱిగి పనులు జేయ

    భ్రష్టుడు = వెలివేయఁబడ్డవాఁడు

    రిప్లయితొలగించండి


  8. లీలామానసమూర్తి కృష్ణుడిట పల్కెన్ గాదె లోకానికిన్

    మేలున్ గూర్చు నెపమ్ముతో శమమదే మీకున్ శుభంబిచ్చునే

    యాలమ్మేల సుయోధనా వలదురా యాలించుమోపౌత్ర కో

    పాలే కారణమయ్యె మానవులకున్ భ్రష్టుత్వ ముంబొందఁగన్.

    రిప్లయితొలగించండి
  9. ఏల మనుజులందునిన్ని విభేదమ్ము
    లేల కులముమతము గోలలెపుడు
    తెలివిమాలి కోరి తెచ్చుకొనియెడుకో
    పాల వలన నరులు భ్రష్టులైరి

    రిప్లయితొలగించండి
  10. యుద్ధకాంక్షతోడ నుక్రెయిన్ రష్యాలు
    అగ్నిగుండమయ్యె నకట!నేడు
    స్పర్ధ పెరిగి రాజ్య పాలనలోని లో
    పాలవలన నరులు భ్రష్టులైరి.

    రిప్లయితొలగించండి
  11. ఉక్రె యినులు సేయు యుద్ధము కతనాన
    ధరలు పెరిగె,సేన మరణ మొందె
    రెండు దేశ ములవి యొండొరుల్ మిగులకో
    పాలవలన నరులు భ్రష్టులైరి

    రిప్లయితొలగించండి
  12. విత్త మెంచి పాప భీతి సుంతయు లేక
    విఱ్ఱ వీఁగి లజ్జ వీడి ఘోర
    దుష్ట పాప బుద్ధితోఁ జేసి నట్టి పా
    *పాల వలన నరులు భ్రష్టులైరి*

    వ్రాలం బంతము లందుఁ బాచికలలోఁ బానీయ పద్మాక్షులన్
    నేలం బౌరుష ముఖ్య దుర్గుణములన్ నిత్యమ్ము చిత్తమ్ములే
    తూలం గాంతుము జీవితమ్ముల నయో దుష్టాక్షరం బాద్యమై
    *బా లే కారణమయ్యె మానవులకున్ భ్రష్టత్వముం బొందఁగన్*

    రిప్లయితొలగించండి
  13. ఆటవెలది
    చదువు సంధ్య లేక చరియించు పౌరులు
    మత్తు మందు లో నిమగ్న మౌచు
    ఉగ్ర దాడి వంటి ఘోర కృత్యపు కలా
    పాల వలన నరులు భ్రష్టు లైరి.

    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటర్.

    రిప్లయితొలగించండి
  14. భూలోకంబున నిర్దయత్వమున దాబోబోని కష్టంపుపా
    పాలేకారణమయ్యె మానవులకున్ భ్రష్టత్భమున్ బొందగన్
    బాపాలన్ భువి జేయకుండుట యికన్ మానంగ శ్రేయంబునౌ
    పాపాలన్నియు మారు శాపములుగా భవ్యుండ వాలాయమై

    రిప్లయితొలగించండి