3, మార్చి 2022, గురువారం

సమస్య - 4009

4-3-2022 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పరుని మదిని నిల్పి పతినిఁ గొలిచె”
(లేదా...)
“పరుని మనమ్మునన్ నిలిపి భర్తకు సేవలొనర్చె సాధ్వియై”

41 కామెంట్‌లు:

  1. దీక్షబూనిగిరిజదీనయైమదిలోన
    వటువుజూచిభక్తివానిమ్రొక్కె
    శంభురాణియటులసైచుచుకుటిలుని
    వరునిమదినినిల్పిపతినిగొలిచె

    రిప్లయితొలగించండి
  2. ఆటవెలది
    వాసముండనా గజాసురోదరమున,
    గిరిజ శరణువేడ హరియెవచ్చి
    శంకరునొసగంగ, శాంభవి యప్పరా
    త్పరుని మదిని నిల్పి పతినిఁ గొలిచె

    చంపకమాల
    సరగున భక్తవత్సలుఁడు సాగి గజాసుర కుక్షి జేరెనన్
    గిరిజకు వేదనన్ మఱుపఁ గేశవుడెంచఁగ గంగిరెద్దుతో
    దురమునఁ జీల్చ దుష్టునట, తోషమునందుచు శంకరున్, బరా
    త్పరుని మనమ్మునన్ నిలిపి వల్లభు సేవలొనర్చె సాధ్వియై

    రిప్లయితొలగించండి
  3. పతియె పరమమనెడు భావము పొసగగ
    భారత కొమరాలు భావ్య మనుచు
    తర తరముల నుండి తన యల వాటుగ
    పరుని మదిని నిల్పి పతినిఁ గొలిచె

    రిప్లయితొలగించండి
  4. నిరతము దప్పకుండ గడు నిర్మల నిశ్చల
    చిత్త శుద్ధితో
    వరదుని చంద్రశేఖరుని పాప విదూరుని
    నమ్మి నిష్ఠతో
    నరయగ గొల్చు నారి తన కాపద దూరము
    సేయునంచు తా
    పరుని మనంబునన్ నిలిపి భర్తకు సేవలొ
    నర్చె సాధ్వియే

    రిప్లయితొలగించండి
  5. విరసినపద్మమాసుమతివెల్గులజిమ్మెడిపారమార్థిగా
    సరసిజపత్రనేత్రసుమసౌరభభక్తినిసౌమనస్యగా
    అరయకనాథురోగముభయంబునులేకనుదైవమాపరా
    త్పరునిమనమ్మునన్నిలిపివల్లభుసేవలొనర్చెసాధ్వియై

    రిప్లయితొలగించండి
  6. వరుసను పంచపాండవుల పత్నిగ మారిన సత్యసంధ, యం
    తర మిసుమంతయున్ గనక తత్పతు లందఱి నేక దృష్టితో
    చెఱియొక యేడు జాయగను జీవిత మేర్పడఁ దన్నిజాయితీ
    పరుని మనమ్మునన్ నిలిపి భర్తకు సేవలొనర్చె సాధ్వియై.

    రిప్లయితొలగించండి
  7. పరిణయంబునాడ వచ్చిరి దిక్పతుల్
    బళిర!చోద్యము నలపంచకంబు
    తనరగాను భైమి,దమయంతి ఘనపరా
    త్పరుని మదిని నిల్పి పతినిఁగొలిచె.

    రిప్లయితొలగించండి
  8. భక్తితత్పరుండు భద్రాద్రిలో గట్టె
    సుందరమగు రామమందిరమ్ము
    కాని యాతనిసతికమలమ్మ భక్తిత
    త్పరుని మదిని నిల్పి పతినిఁ గొలిచె

    రిప్లయితొలగించండి
  9. నిండు భక్తి గల్గి నిరతమ్ము సేవించు
    పరమ భక్తు రాలు పరవశ మున
    నామ జపము సలిపి నారాయణు ని పరా
    త్పరుని మదిని నిల్పి పతిని గొలిచె

    రిప్లయితొలగించండి
  10. వరమునియైన కౌశికునిపై బకమొక్కటి ఱెట్ట వేయఁజె
    చ్చెరఁగని తీక్ష్ణ దృష్టులను చేసెను భస్మము,యాచనార్థమై
    పురమునకేగి పిల్వగను బోఁటియు నామునిఁగాంచి క్రోధ త
    త్పరుని మనమ్మునన్ నిలిపి భర్తకు సేవలొనర్చె సాధ్వియై.

    రిప్లయితొలగించండి
  11. పతికి సేవజేయ పరమార్థమనియెంచి
    యూడిగములుచేసె నువిద సుమతి
    సానిఁగోరుమగని సంతృప్తికై పరా
    త్పరుని మదిని నిల్పి పతినిఁ గొలిచె

    రిప్లయితొలగించండి
  12. చంపకమాల
    వరముగ జన్మపొందగను భారత నారిగ వెల్గులీనుచున్
    నిరతము భక్తి భావములఁ నీరజ నాభుని సన్నిధానమున్
    శరణము గోరి గానమున చంచల దృక్కులఁ వీడి, యా పరా
    త్పరుని మనమ్మునన్ నిలిపి భర్తకు సేవలొనర్చె సాధ్వియై

    రిప్లయితొలగించండి
  13. పరమ పతివ్రతామణికి భర్తయె దైవము వాని సేవయే
    నిరతము ధ్యాసగాగడిపి నివ్వటిలెన్ సుమతీ లలామ తా
    వరవుఁదనమ్ముసల్పితన భర్తకు సానినిఁ గూర్చియా పరా
    త్పరుని మనమ్మునన్ నిలిపి వల్లభు సేవలొనర్చె సాధ్వియై

    రిప్లయితొలగించండి
  14. తనను బెండ్లి యాడ రానలుని పగిది
    చూసి సురల మదిని సోత్కర్షతన
    సతియగు దమయంతి సఖులురా యాపరా
    త్పరుని మదిని నిల్పి పతిని గొలిచె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నిరతము బూజజేయుచును నెమ్మిని పార్వతినాధునాపరా
      త్పరుని మనమ్మునన్ నిలిపి సేవలొనర్చె సాధ్వియై
      కరమును సేవజేయుచును గాంతుని మన్నన బొందగావలెన్
      బరగను మంచిమార్గమది భార్యలకెల్లను ముక్తినొందగాన్

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      ఆటవెలది మొదటి పాదంలో ప్రాసయతి తప్పింది. రెండవ పాదంలో గణభంగం. "సఖులు రా నా పరాత్పరుని" అని ఉండాలి.

      తొలగించండి
  15. రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. సోయగమ్ము నందుఁ జూచిన సరి లేరు
      గుణము లందుఁ గాంచ మణియె చుమ్మి
      కాంత లందు మిన్న కలనైనఁ దలఁపక
      పరుని మదిని నిల్పి పతినిఁ గొలిచె


      త‌రుణుల కెంచ స్వీయ పతి తద్దయు గౌరవనీయుఁడౌ నిలన్
      వరునకు నెంచ స్వీయ సతి పన్నుగ నిత్యము రక్షణీయయౌ
      కర మనురక్తి సంతతము కాంత స హర్షము స్వీయ దేవ తా
      పరుని మనమ్మునన్ నిలిపి భర్తకు సేవలొనర్చె సాధ్వియై

      [దేవతా +అపరుని =దేవ తాపరుని; అపర దైవమును]

      తొలగించండి
    3. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.

      తొలగించండి

  16. పరమ నాస్తికుడగు భర్త వారించిన
    భర్తృ వ్రతము జేయు పడతి గాన
    లోక మేలు నట్టి లోకేశుడైన యా
    పరుని మదిని నిల్పి పతినిఁ గొలిచె


    మరణపు శయ్యపైన యజమానియె ముక్కుచు మూల్గుచుండ నా

    పురుషుని ప్రాణరక్షకయి మ్రొక్కెను కన్నులు రెండు నశ్రువుల్

    కురుయుచు నుండ శోకమున కోమలి నిర్గుణుడైనయా పరా

    త్పరుని మనమ్మునన్ నిలిపి భర్తకు సేవలొనర్చె సాధ్వియై

    రిప్లయితొలగించండి
  17. ఆటవెలది
    రుక్మిణీరమణికి, రూప విలాసము
    మోహిత మొనరింప మోహన ముర
    ళీ ధరుని జపమున లీనమై ,నాపరా
    త్పరుని మదిన నిల్పి పతిని గొల్చె
    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటర్.

    రిప్లయితొలగించండి
  18. ఆ.వె:దైవకరుణచేత ధరణి యందు వివాహ
    మవగ సంతసమ్ము నందినట్టి
    పడతియంతులేని భక్తితో నాపరా
    *“త్పరుని మదిని నిల్పి పతినిఁ గొలిచె”*

    కరమనురక్తితోడనటకాయముతోడను మానసమ్ముతో
    నిరతము మూడు ప్రొద్దులును నీరజనాభుని పాదపద్మముల్
    స్థిరమగుభక్తినెల్లతరితీరుగసేవలొనర్చి యాపరా
    *“త్పరుని మనమ్మునన్ నిలిపి భర్తకు సేవలొనర్చె సాధ్వియై”*

    రిప్లయితొలగించండి