12-3-2022 (శనివారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“తారా రమ్మనుచుఁ బిలిచె దాశరథి దమిన్”(లేదా...)“తారా రమ్మని రామమూర్తి పిలిచెన్ ధారాళ వాచాగతిన్”
కూరిమి మోహ వశుండై ధీరత శివ ధనువు విఱిచి దివిజులు మెచ్చ న్ నారీ మణి మను వై సీ తా రా రమ్మనుచు బిలిచె దాశరథి తమిన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
వీరాసీతనులంకనుచేరియుజూచితివిగాదెక్షేమంబేనావేరుగలేరేహనుమంతారారమ్మనుచుబిలిచెదాశరథితమిన్
పోరాటములో రావణుపేరడగించి కుసిలించు భీరువు గనుచున్ బేరిమి తోడను హే సీతా! రా రమ్మనుచు బిలిచె దాశరథి దమిన్.
కందంనీరజ నేత్రా! రాగ మయీ! రోదన మిగిలెనాకు నెటు పోయితివో!మారామది యేలనొ? సీతా! రా రమ్మనుచుఁ బిలిచె దాశరథి దమిన్!శార్దూలవిక్రీడితముఘోరారణ్యము నందునున్న నినునే గూడంగ ప్రాసాదమైపూరేకుల్ శయనంపు పట్టుపరుపై ముచ్చట్లఁ దేలింతువే!నైరాశ్యమ్ము మిగిల్చి పోవ విరహానన్ దాలలేకుంటి సీతా! రా రమ్మని రామమూర్తి పిలిచెన్ ధారాళ వాచాగతిన్!
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
🙏ధన్యోస్మి గురుదేవా!🙏
పారావారముదాటిలంకనటనాభాస్వంతుశిష్యుండవైవీరావేశముతోడవెల్గికసినాభీలంబుగాగెంతుచున్చీరన్రావణునుద్యమించితివిగాజేయుండవోబుద్ధిమంతారారమ్మనిరామమర్తిపిలిచెన్ధారాళవాచాగతిన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'రామునకు' అనడం సాధువు. అక్కడ "మారాము జేయు సుతునకు" అనవచ్చు కదా!
ధన్యవాదాలు గురువు గారు.కందంమారాముజేయు సుతునకుతారా చంద్రులను జూపి తల్లి సుతుని చేక్షీరాన్నము తిన జేయగతారా రమ్మనుచు బిలిచె దాశరథి దమిన్.ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రిఉండవల్లి సెంటర్.
శ్రీరాముండు మహోన్నతుండు ధనువున్శీఘ్రంబుగా నెత్తియున్దా రాజిల్లె సభన్ ,మహీసురవరుల్ దర్పోన్నతుల్ సిగ్గుచేబీరమ్ముల్ విడి వంచినారు తలలన్, పెండ్లాడివైదేహి ! కాంతా ! రా రమ్మని రామమూర్తి పిలచెన్ ధారాళ వాచాగతిన్
పారావారము దాటి చేరెనటకున్ బౌలస్త్యు రాజ్యమ్ము లోపోరాటమ్మున రావణాసురుని సంపూజ్యుండు త్రెళ్ళించి తానారాటమ్మున జేరి దార దరిదాపానంద ముప్పొంగ సీతా! రారమ్మని రామమూర్తి పిలిచెన్ ధారాళ వాచాగతిన్.
ఆరామము పరిసరములశ్రీరాముడు సీతఁ గూడి చెలువము మీరన్కూరిమి నడయాడగ సీతా రారమ్మనుచుఁ బిలిచె దాశరథి దమిన్
భూరి మెకమును కనగ , సీతా ! రా రమ్మనుచుఁ బిలిచె దాశరథి దమిన్పాఱుచు వచ్చి మరులుగొనిగారవముగ పతిని గోరె గావలెనంచున్
తారాపథమే పందిరిగా రాజిల భూమిపీటగాఁబెండ్లియయెన్గారాముగ వనితా!సీతా!రారమ్మనుచుఁబిలిచె దాశరథి తమిన్.
శ్రీరాముడు సతికోరికతీరగ బంగరు హరిణము తెచ్చెదననుచున్దూరంబు పోవలదు సీతా! రా రమ్మనుచుఁ బిలిచె దాశరథి దమిన్
వైరాగ్యమ్మును వీడి రాజ్య ప్రజకై భాగ్యాశ్వమేధంబునన్శ్రీ రాజిల్లగ స్వర్ణ సీత ప్రతిమన్ జీవంబునన్ జూచి "సీతా రా రమ్మ"ని రామమూర్తి పిలిచెన్ ధారాళ వాచాగతిన్నైరాశ్యమ్మది కమ్మి రాఘవుడు చింతాక్రాంతుడయ్యే నయో||
శ్రీరాజ్యంబునయోధ్యలోనపుడుసుశ్రేయంబుఁగాంక్షించిదాప్రారంభించగనశ్వమేధమునుశ్రీరంజిల్లెసంరంభమై,దారాసంయుతయాగమైనిలచుసిధ్ధాంతంబునెంచంగ సీతా!రా !రమ్మని రామమూర్తి పిలిచెన్ ధారాళ వాచాగతిన్కొరుప్రోలు రాధాకృష్ణ రావు
ఘోరమ్మీ విపినమ్ము గుట్టలకటా!గుండ్రాళ్ళతో ముళ్ళతోదారే మృగ్యము రాక్షసాళికిదియే ధామంబు,సింహాలు సంచారంబిచ్చటఁజేయు భీతిలకు నా సామీప్యమందీవు,సీతా!రారమ్మని రామమూర్తి పిలిచెన్ ధారాళ వాచాగతిన్.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
కం.వీరావేశము పొంగగజేరుచు లంకకు కనుగొన సీతను, నెమ్మిన్ధీరుని జూచుచు హనుమం*తా!రా! రమ్మనుచుఁ బిలిచె దాశరథి దమిన్*శార్దూలము.వీరావేశము పొంగిపొర్లగను దా భేదించి పంతంబుగాజేరెన్మారుతి లంక గన్గొనెనటన్ సీతమ్మనే శీఘ్రమున్ధీరుండాతని జేర్చిగౌగిలిని బంధించంగ, నో వాయుజా*తా!రా! రమ్మని రామమూర్తి పిలిచెన్ ధారాళ వాచాగతిన్*
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
రా రా రమ్మంచుఁ బిలువగా రామా యేల రావు కాంతా సీతా రా రా నారీ లోకపుఁదారా రమ్మనుచుఁ బిలిచె దాశరథి దమిన్నారీ రత్నమ నీవు లేని యెడలన్ నా కేల యీ ప్రాణముల్ ఘోరారణ్యము నందు నుంటి వెట సంకోచింప నీ కేల సీతా! రాజీవదళాక్షి! ప్రాణ సమ! స్వాంతాకాశ వీథీ లసత్తారా రమ్మని రామమూర్తి పిలిచెన్ ధారాళ వాచాగతిన్
వీరోచిత ముగ విల్లును నీరాజులు చూచుచుండ యెక్కుంబెటితిన్ నారాణివి నీవిక సీ తా!రారమ్మనుచు బిలిచె దాశరధి దమిన్
వీరావేశము తోడ రాముడు శివున్విల్లున్బటాపంచ లై యారామంగనిపించె నద్భుతముగానానంద సందోహ మున్ నారాణీ!యిక నీవెనాసతివి బో నమ్మంగ బోనాడి సీ తా!రారమ్మని రామమూర్తి పిలిచెన్ ధాఫాళ వాచాగతిన్
ఘోరమ్మౌయడవిన్ చరింతు రెపుడున్ క్రూరంపు సంధ్యాబలుల్దారన్ కన్గొని యొంటిగా నడవిలో దౌర్జన్యమున్ చేసిరా?చేరన్ వచ్చు గళమ్ము విన్న , పరితుష్టిన్ బొందుచున్ వేగ, సీతా! రా రమ్మని రామమూర్తి బిలిచెన్ ధారాళ వాచాగతిన్
కూరిమి మోహ వశుండై
రిప్లయితొలగించండిధీరత శివ ధనువు విఱిచి దివిజులు మెచ్చ న్
నారీ మణి మను వై సీ
తా రా రమ్మనుచు బిలిచె దాశరథి తమిన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివీరాసీతనులంకను
రిప్లయితొలగించండిచేరియుజూచితివిగాదెక్షేమంబేనా
వేరుగలేరేహనుమం
తారారమ్మనుచుబిలిచెదాశరథితమిన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిపోరాటములో రావణు
పేరడగించి కుసిలించు భీరువు గనుచున్
బేరిమి తోడను హే సీ
తా! రా రమ్మనుచు బిలిచె దాశరథి దమిన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికందం
రిప్లయితొలగించండినీరజ నేత్రా! రాగ మ
యీ! రోదన మిగిలెనాకు నెటు పోయితివో!
మారామది యేలనొ? సీ
తా! రా రమ్మనుచుఁ బిలిచె దాశరథి దమిన్!
శార్దూలవిక్రీడితము
ఘోరారణ్యము నందునున్న నినునే గూడంగ ప్రాసాదమై
పూరేకుల్ శయనంపు పట్టుపరుపై ముచ్చట్లఁ దేలింతువే!
నైరాశ్యమ్ము మిగిల్చి పోవ విరహానన్ దాలలేకుంటి సీ
తా! రా రమ్మని రామమూర్తి పిలిచెన్ ధారాళ వాచాగతిన్!
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి🙏ధన్యోస్మి గురుదేవా!🙏
తొలగించండి
రిప్లయితొలగించండిపారావారముదాటిలంకనటనాభాస్వంతుశిష్యుండవై
వీరావేశముతోడవెల్గికసినాభీలంబుగాగెంతుచున్
చీరన్రావణునుద్యమించితివిగాజేయుండవోబుద్ధిమం
తారారమ్మనిరామమర్తిపిలిచెన్ధారాళవాచాగతిన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'రామునకు' అనడం సాధువు. అక్కడ "మారాము జేయు సుతునకు" అనవచ్చు కదా!
ధన్యవాదాలు గురువు గారు.
తొలగించండికందం
మారాముజేయు సుతునకు
తారా చంద్రులను జూపి తల్లి సుతుని చే
క్షీరాన్నము తిన జేయగ
తారా రమ్మనుచు బిలిచె దాశరథి దమిన్.
ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటర్.
శ్రీరాముండు మహోన్నతుండు ధనువున్
రిప్లయితొలగించండిశీఘ్రంబుగా నెత్తియున్
దా రాజిల్లె సభన్ ,మహీసురవరుల్ దర్పోన్న
తుల్ సిగ్గుచే
బీరమ్ముల్ విడి వంచినారు తలలన్, పెండ్లాడి
వైదేహి ! కాం
తా ! రా రమ్మని రామమూర్తి పిలచెన్ ధారాళ
వాచాగతిన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపారావారము దాటి చేరెనటకున్ బౌలస్త్యు రాజ్యమ్ము లో
రిప్లయితొలగించండిపోరాటమ్మున రావణాసురుని సంపూజ్యుండు త్రెళ్ళించి తా
నారాటమ్మున జేరి దార దరిదాపానంద ముప్పొంగ సీ
తా! రారమ్మని రామమూర్తి పిలిచెన్ ధారాళ వాచాగతిన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఆరామము పరిసరముల
రిప్లయితొలగించండిశ్రీరాముడు సీతఁ గూడి చెలువము మీరన్
కూరిమి నడయాడగ సీ
తా రారమ్మనుచుఁ బిలిచె దాశరథి దమిన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిభూరి మెకమును కనగ , సీ
రిప్లయితొలగించండితా ! రా రమ్మనుచుఁ బిలిచె దాశరథి దమిన్
పాఱుచు వచ్చి మరులుగొని
గారవముగ పతిని గోరె గావలెనంచున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితారాపథమే పందిరి
రిప్లయితొలగించండిగా రాజిల భూమిపీటగాఁబెండ్లియయెన్
గారాముగ వనితా!సీ
తా!రారమ్మనుచుఁబిలిచె దాశరథి తమిన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిశ్రీరాముడు సతికోరిక
రిప్లయితొలగించండితీరగ బంగరు హరిణము తెచ్చెదననుచున్
దూరంబు పోవలదు సీ
తా! రా రమ్మనుచుఁ బిలిచె దాశరథి దమిన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివైరాగ్యమ్మును వీడి రాజ్య ప్రజకై భాగ్యాశ్వమేధంబునన్
రిప్లయితొలగించండిశ్రీ రాజిల్లగ స్వర్ణ సీత ప్రతిమన్ జీవంబునన్ జూచి "సీ
తా రా రమ్మ"ని రామమూర్తి పిలిచెన్ ధారాళ వాచాగతిన్
నైరాశ్యమ్మది కమ్మి రాఘవుడు చింతాక్రాంతుడయ్యే నయో||
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిశ్రీరాజ్యంబునయోధ్యలోనపుడుసుశ్రేయంబుఁగాంక్షించిదా
రిప్లయితొలగించండిప్రారంభించగనశ్వమేధమునుశ్రీరంజిల్లెసంరంభమై,
దారాసంయుతయాగమైనిలచుసిధ్ధాంతంబునెంచంగ సీ
తా!రా !రమ్మని రామమూర్తి పిలిచెన్ ధారాళ వాచాగతిన్
కొరుప్రోలు రాధాకృష్ణ రావు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఘోరమ్మీ విపినమ్ము గుట్టలకటా!గుండ్రాళ్ళతో ముళ్ళతో
రిప్లయితొలగించండిదారే మృగ్యము రాక్షసాళికిదియే ధామంబు,సింహాలు సం
చారంబిచ్చటఁజేయు భీతిలకు నా సామీప్యమందీవు,సీ
తా!రారమ్మని రామమూర్తి పిలిచెన్ ధారాళ వాచాగతిన్.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండికం.
రిప్లయితొలగించండివీరావేశము పొంగగ
జేరుచు లంకకు కనుగొన సీతను, నెమ్మిన్
ధీరుని జూచుచు హనుమం
*తా!రా! రమ్మనుచుఁ బిలిచె దాశరథి దమిన్*
శార్దూలము.
వీరావేశము పొంగిపొర్లగను దా భేదించి పంతంబుగా
జేరెన్మారుతి లంక గన్గొనెనటన్ సీతమ్మనే శీఘ్రమున్
ధీరుండాతని జేర్చిగౌగిలిని బంధించంగ, నో వాయుజా
*తా!రా! రమ్మని రామమూర్తి పిలిచెన్ ధారాళ వాచాగతిన్*
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిరా రా రమ్మంచుఁ బిలువ
రిప్లయితొలగించండిగా రామా యేల రావు కాంతా సీతా
రా రా నారీ లోకపుఁ
దారా రమ్మనుచుఁ బిలిచె దాశరథి దమిన్
నారీ రత్నమ నీవు లేని యెడలన్ నా కేల యీ ప్రాణముల్
ఘోరారణ్యము నందు నుంటి వెట సంకోచింప నీ కేల సీ
తా! రాజీవదళాక్షి! ప్రాణ సమ! స్వాంతాకాశ వీథీ లస
త్తారా రమ్మని రామమూర్తి పిలిచెన్ ధారాళ వాచాగతిన్
వీరోచిత ముగ విల్లును
రిప్లయితొలగించండినీరాజులు చూచుచుండ యెక్కుంబెటితిన్
నారాణివి నీవిక సీ
తా!రారమ్మనుచు బిలిచె దాశరధి దమిన్
వీరావేశము తోడ రాముడు శివున్విల్లున్బటాపంచ లై
రిప్లయితొలగించండియారామంగనిపించె నద్భుతముగానానంద సందోహ మున్
నారాణీ!యిక నీవెనాసతివి బో నమ్మంగ బోనాడి సీ
తా!రారమ్మని రామమూర్తి పిలిచెన్ ధాఫాళ వాచాగతిన్
ఘోరమ్మౌయడవిన్ చరింతు రెపుడున్ క్రూరంపు సంధ్యాబలుల్
రిప్లయితొలగించండిదారన్ కన్గొని యొంటిగా నడవిలో దౌర్జన్యమున్ చేసిరా?
చేరన్ వచ్చు గళమ్ము విన్న , పరితుష్టిన్ బొందుచున్ వేగ, సీ
తా! రా రమ్మని రామమూర్తి బిలిచెన్ ధారాళ వాచాగతిన్