15, మార్చి 2022, మంగళవారం

సమస్య - 4021

16-3-2022 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వైష్ణవులకుఁ గాశి యపర వైకుంఠమగున్”
(లేదా...)
“గురుఁడా వైష్ణవు లందురే యపర వైకుంఠంబుగాఁ గాశినిన్”

12 కామెంట్‌లు:

  1. వైష్ణవమాయగభ్రమగను
    జిష్ణునిభక్తులుబ్రతుకునుచెప్పుదురనిశీ
    తోష్ణముమదిలోతెలియని
    వైష్ణవులకుకాశియపరవైకుంఠమగున్

    రిప్లయితొలగించండి
  2. కందం
    తృష్ణన్ యాత్రలు సేయుచు
    విష్ణువు మదినిండియుండ విశ్వేశ్వరుఁడై
    కృష్ణాష్టమి పర్వమ్మున
    వైష్ణవులకుఁ గాశి యపర వైకుంఠమగున్!

    మత్తేభవిక్రీడితము
    స్థిరమై నమ్మిన దైవమే మదిని నిక్షిప్తమ్ముగా నుండఁగన్
    పురమేదైనను యాత్రలన్ దిరుగుచున్ బూజింప సాకారమౌ
    హరిగా గొల్వ నభేదమై హరుని నాద్యంతమ్ము సద్భక్తులై
    గురుడా! వైష్ణవు లందురే యపర వైకుంఠంబుగాఁ గాశినిన్!!

    రిప్లయితొలగించండి

  3. విష్ణువు మాత్రమె దేవుడు
    వైష్ణవులకనెఱుగ కుండ పలికెను గదరా
    కృష్ణుండు స్నేహితులతో
    వైష్ణవులకుఁ గాశి యపర వైకుంఠమగున్.


    కరుణా సంద్రుడు శ్రీనివాసుడె రమాకాంతుం డటంచున్ సదా

    చిరజీవిన్ మది దల్చుచున్ వెడలుచున్ శేషాద్రికిన్ దానినే

    గురుడా వైష్ణవులందురే యపర వైకుంఠంబుగా, గాశినిన్

    గరిచర్మాంబరధారి భక్టులిలలో కైలాసమంచందురే.

    రిప్లయితొలగించండి
  4. ఉష్ణీషిఁ గొల్చువారలు
    విష్ణుని మదిగొల్చువారు వేరనదగునా
    విష్ణుని శైవులు గొల్వగ
    వైష్ణవులకుఁ గాశి యపర వైకుంఠమగున్

    రిప్లయితొలగించండి
  5. విష్ణుని భక్తుల మనసున
    విష్ణుని చింతన మలరగ విశ్వంబవదా
    విష్ణుని మందిరము! కనుక
    వైష్ణవులకుఁ గాశి యపర వైకుంఠమగున్

    రిప్లయితొలగించండి
  6. నిష్ణాత త తో మెలిగెడు
    వైష్ణవు లకు లేదు భేద భావ మ్మెందున్
    తృష్ణగ సల్పెడు యాత్రను
    వైష్ణవు లకు గాశి యపర వైకుంఠ మగున్

    రిప్లయితొలగించండి
  7. విష్ణు సముఖముగ దోచదు
    వైష్ణవులకుఁ గాశి ; యపర వైకుంఠమగున్
    వృష్ణుని మందిర ముండిన ,
    దృష్ణ తొలగి పోవును గద తిరుమల పోవన్

    రిప్లయితొలగించండి
  8. కాశిలో చనిపోయేవారి చెవిలో శివుడు తారకమంత్రము నూది ముక్తి నిస్తాడని ప్రతీతి

    జిష్ణువు రాముని పేరు స
    హిష్ణుత చెవిలోన నూది హేలగ ముక్తి
    న్నుష్ణీషి యొసంగు కతన
    వైష్ణవులకు గాశి యపర వైకుంఠమగున్

    జిష్ణువు = జయశీలి
    ఉష్ణీషి = శివుడు (ఆం.భా.)

    రిప్లయితొలగించండి
  9. స్థిరమౌ భక్తిని శైవ వైష్ణవులిలన్ సేవించుచున్ మింతురే
    హరియున్ శంకరుడేకరూపులనుచున్ హర్షమ్ముతో నెప్పుడున్
    హరిదేవాలయమౌను వెండిమలగా యాశైవ భక్తాళికిన్
    గురుఁడా వైష్ణవు లందురే యపర వైకుంఠంబుగాఁ గాశినిన్

    రిప్లయితొలగించండి
  10. సరవిన్ కేశవుఁడంచు నీశుఁడనుచున్ సద్భక్తితో బిల్వగన్
    సరగున్ జూపడె దైవమెవ్వరయినన్ స్వాస్థ్యమ్ము గల్పింప నీ
    ధరలో శైవులు వైష్ణవాలయములన్ దర్శింపరే భక్తితో
    గురుఁడా వైష్ణవు లందురే యపర వైకుంఠంబుగాఁ గాశినిన్

    రిప్లయితొలగించండి
  11. విష్ణుని సహిష్ణు నా ప్రభ
    విష్ణుని పాదముల నుద్భవిల్లిన కతనన్
    విష్ణుపది యా సురాపగ
    వైష్ణవులకుఁ గాశి యపర వైకుంఠ మగున్


    అరవిందాక్షుఁ డనంతుఁ డచ్యుతుఁడు విశ్వాత్ముండు నిత్యుండునుం
    బరమాత్ముండు రమా మనో ధవుఁడు శ్రీవత్సాంకుఁ డెల్లప్పుడున్
    హరి విశ్వమ్మున నెందుఁ జూచినను నందందుండునే యందుకే
    గురుఁడా వైష్ణవు లందురే యపర వైకుంఠంబుగాఁ గాశినిన్

    రిప్లయితొలగించండి