27-3-2022 (ఆదివారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“గజబల మాకాశమందు గంతులు వైచెన్”(లేదా...)“గజబల మాకసంబునను గంతులు వైచెను సంతసంబునన్”
కందంనిజమగు ఫలమని సూర్యునిభుజియింపగనంద నెంచు ముచ్చటమీరన్భుజములు సాచిన మారుతిగజబల మాకాశమందు గంతులు వైచెన్! చంపకమాలనిజమగు పండు సూర్యుఁడని నింగిని దాకెడు శాఖలందునన్కుజమునఁ గాసెనంచు తిన నోరది యూరఁగ నాంజనేయుఁడున్భుజముల సాచి హూమ్మనుచు పొందెడు కోరిక మిన్నుముట్టగన్గజబల మాకసంబునను గంతులు వైచెను సంతసంబునన్!
ను ుమెచ్చకావ్యములశోభనుగూర్చగమాణికంబునైనిజముగవాణిహారముననేర్పుననిల్చినసౌరుతోగనన్భనలదివ్యనాదములభాసురరీతినికూడియష్టదిగ్గజబలమాకసంబుననుగంతులువైచెనుసంతసంబునన్
సుజనులు
ద్విజుడయి వామనుండు చని, విట్పతియౌ బలి వద్దనుండి పూర్వజునకు రాజ్యమున్నిడ నవారిత పాదము మోప విష్ణువే,భుజబల మంతరించ, బలి భూరిగ దానమొసంగ, శక్రు నంగజబల మాకసంబునను గంతులు వైచెను సంతసంబునన్.
కుజముల శుకపిక తతులక్కజముగ,శశి,నవవసంత, గాడ్పులతో పాంథ జనులు మెచ్చగ సఖి!యంగజబలమాకాశమందు గంతులు వైచెన్.
గజయాన సీత వెదక కపి జలధరము దాటనెంచి పెనురూపముతో విజయార్థియై కదల గనగజబల మాకాశమందు గంతులు వైచెన్. సుజనుడు రామచంద్రునకు శోకము దీర్చగ నెంచి యయ్యయో నిజ జలజాక్షి జాడకయి నీరధి దాటుచు లంకకేగి తా విజయము నంది వత్తునని వేగము తోజను మారుతాత్మజున్ గజబల మాకసంబునను గంతులు వైచెను సంతసంబునన్.
కుజములఁగూయసాగినవికోకిల కేకి,శుకంబులున్ నవాంబుజమకరందముల్ భ్రమరముల్ దనివారగఁగ్రోల సాగె,నక్కజముగ వచ్చె నామిని యుగాది సుపర్వపువేళ నిట్టు లంగజబలమాకసంబునను గంతులు వైచెను సంతసంబునన్.
రెండవ పాదములో నామని అని సవరణ.
ధ్వజమెత్తెను కృష్ణుడు పారిజాత కుసుమములుకోరి త్రిదివముపైనన్వ్రజవల్లభునడ్డగ సురగజబల మాకాశమందు గంతులు వైచెన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
అజయులమనుకొను సభ్యులగజబల మాకాశమందు గంతులు వైచెన్భజనపరుల పలుకులు విని , రుజువగు వేగముగ వారి లోపము ప్రజకున్
కుజములు పెంపుమీఱగను కొమ్మల నిండుగఁ బూలుఁ బూయుచున్రజనిఁ గలాధరుండు దివిఁ బ్రస్ఫుటమైన వెలుంగు నింప గాప్రజలల పొంగ మోదమున ప్రాకటమైన వసంత వేళ నంగజబల మాకసంబునను గంతులు వైచెను సంతసంబునన్
కుజముల పోలిన మబ్బులు ధ్వజముల కరణిని గనపడి పలు రకములుగా ప్రజల కు దోచగ నయ్యెడ గజబల మాకాశ మందు గంతులు వైచెన్
గజముల బోలిన మొయిలులు గజిబిజిగా దిరుగుచుండ గాలుల వలనన్ సజలయుత మగు ట గనుగొన గజబల మాకాశమందు గంతులు వైచెన్
విజయము సాధింపంగ గిరిజా సతీనాథుఁ జేయ రేఁగ మరుం డా గజ దిట్ట సదాశివు నంగజ బల మాకాశ మందు గంతులు వైచెన్ [అంగజ బలము = మారుని సేన]ఋజువుల నేల కోరుదు నిజేచ్ఛను నీవ యెఱుంగ నోపుదే నిజముగ వర్ష కాలమున నివ్వెఱ నందఁగ నభ్ర వీధినిన్ సజల మ హాసితాభ్ర ఘన సంచయ మారయఁ దోఁచు నివ్విధిన్ గజబల మాకసంబునను గంతులు వైచెను సంతసంబునన్
కందంసుజలంబుల కేళి సలుపుగజరాజులు కేలు నింపి కమల మృణాళిన్ఋజురేఖన పైకి విసరుగజబల మాకాశమందు గంతులు వైచెన్.ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రిఉండవల్లి సెంటర్.కమలమృణాళిన్-నీటితో కూడిన తామర తూడు.
కందం
రిప్లయితొలగించండినిజమగు ఫలమని సూర్యుని
భుజియింపగనంద నెంచు ముచ్చటమీరన్
భుజములు సాచిన మారుతి
గజబల మాకాశమందు గంతులు వైచెన్!
చంపకమాల
నిజమగు పండు సూర్యుఁడని నింగిని దాకెడు శాఖలందునన్
కుజమునఁ గాసెనంచు తిన నోరది యూరఁగ నాంజనేయుఁడున్
భుజముల సాచి హూమ్మనుచు పొందెడు కోరిక మిన్నుముట్టగన్
గజబల మాకసంబునను గంతులు వైచెను సంతసంబునన్!
ను ుమెచ్చకావ్యములశోభనుగూర్చగమాణికంబునై
రిప్లయితొలగించండినిజముగవాణిహారముననేర్పుననిల్చినసౌరుతోగనన్
భనలదివ్యనాదములభాసురరీతినికూడియష్టది
గ్గజబలమాకసంబుననుగంతులువైచెనుసంతసంబునన్
సుజనులు
రిప్లయితొలగించండిద్విజుడయి వామనుండు చని, విట్పతియౌ బలి వద్దనుండి పూ
రిప్లయితొలగించండిర్వజునకు రాజ్యమున్నిడ నవారిత పాదము మోప విష్ణువే,
భుజబల మంతరించ, బలి భూరిగ దానమొసంగ, శక్రు నం
గజబల మాకసంబునను గంతులు వైచెను సంతసంబునన్.
కుజముల శుకపిక తతుల
రిప్లయితొలగించండిక్కజముగ,శశి,నవవసంత, గాడ్పులతో పాం
థ జనులు మెచ్చగ సఖి!యం
గజబలమాకాశమందు గంతులు వైచెన్.
రిప్లయితొలగించండిగజయాన సీత వెదక క
పి జలధరము దాటనెంచి పెనురూపముతో
విజయార్థియై కదల గన
గజబల మాకాశమందు గంతులు వైచెన్.
సుజనుడు రామచంద్రునకు శోకము దీర్చగ నెంచి యయ్యయో
నిజ జలజాక్షి జాడకయి నీరధి దాటుచు లంకకేగి తా
విజయము నంది వత్తునని వేగము తోజను మారుతాత్మజున్
గజబల మాకసంబునను గంతులు వైచెను సంతసంబునన్.
కుజములఁగూయసాగినవికోకిల కేకి,శుకంబులున్ నవాం
రిప్లయితొలగించండిబుజమకరందముల్ భ్రమరముల్ దనివారగఁగ్రోల సాగె,న
క్కజముగ వచ్చె నామిని యుగాది సుపర్వపువేళ నిట్టు లం
గజబలమాకసంబునను గంతులు వైచెను సంతసంబునన్.
రెండవ పాదములో నామని అని సవరణ.
రిప్లయితొలగించండిధ్వజమెత్తెను కృష్ణుడు పా
రిప్లయితొలగించండిరిజాత కుసుమములుకోరి త్రిదివముపైనన్
వ్రజవల్లభునడ్డగ సుర
గజబల మాకాశమందు గంతులు వైచెన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅజయులమనుకొను సభ్యుల
రిప్లయితొలగించండిగజబల మాకాశమందు గంతులు వైచెన్
భజనపరుల పలుకులు విని ,
రుజువగు వేగముగ వారి లోపము ప్రజకున్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికుజములు పెంపుమీఱగను కొమ్మల నిండుగఁ బూలుఁ బూయుచున్
రిప్లయితొలగించండిరజనిఁ గలాధరుండు దివిఁ బ్రస్ఫుటమైన వెలుంగు నింప గా
ప్రజలల పొంగ మోదమున ప్రాకటమైన వసంత వేళ నం
గజబల మాకసంబునను గంతులు వైచెను సంతసంబునన్
కుజముల పోలిన మబ్బులు
రిప్లయితొలగించండిధ్వజముల కరణిని గనపడి పలు రకములుగా
ప్రజల కు దోచగ నయ్యెడ
గజబల మాకాశ మందు గంతులు వైచెన్
గజముల బోలిన మొయిలులు
రిప్లయితొలగించండిగజిబిజిగా దిరుగుచుండ గాలుల వలనన్
సజలయుత మగు ట గనుగొన
గజబల మాకాశమందు గంతులు వైచెన్
విజయము సాధింపంగ గి
రిప్లయితొలగించండిరిజా సతీనాథుఁ జేయ రేఁగ మరుం డా
గజ దిట్ట సదాశివు నం
గజ బల మాకాశ మందు గంతులు వైచెన్
[అంగజ బలము = మారుని సేన]
ఋజువుల నేల కోరుదు నిజేచ్ఛను నీవ యెఱుంగ నోపుదే
నిజముగ వర్ష కాలమున నివ్వెఱ నందఁగ నభ్ర వీధినిన్
సజల మ హాసితాభ్ర ఘన సంచయ మారయఁ దోఁచు నివ్విధిన్
గజబల మాకసంబునను గంతులు వైచెను సంతసంబునన్
కందం
రిప్లయితొలగించండిసుజలంబుల కేళి సలుపు
గజరాజులు కేలు నింపి కమల మృణాళిన్
ఋజురేఖన పైకి విసరు
గజబల మాకాశమందు గంతులు వైచెన్.
ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటర్.
కమలమృణాళిన్-నీటితో కూడిన తామర తూడు.