9, మార్చి 2022, బుధవారం

సమస్య - 4015

10-3-2022 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సంతసమున ముంగిసలతో సర్పమాడె”
(లేదా...)
“సంతోషంబునఁ గూడి యాడెఁ గనుమా సర్పంబుతో ముంగిసల్”

25 కామెంట్‌లు:


  1. ద్యూతమాడ పిలిచె సుయోధనుండ
    టంచు సమ్మతించి వెడలె ననఘుడపుడు
    దుష్టులనెఱగి యాడె యుధిష్ఠిరుండు
    సంతసమున, ముంగిసలతో సర్పమాడె.

    రిప్లయితొలగించండి
  2. ఆరితేరినసైన్యంబుహాస్యమాడి
    బాలచంద్రుడునిలచెనుపంతమాడి
    యుద్ధభూమినిపల్నాటయోధుడయ్యె
    సంతసమునముంగిసలతోసర్పమాడె

    రిప్లయితొలగించండి
  3. మృగములు వైరము ల్ వీడి నెగడు చుండె
    యాశ్రమంబున నొండొరు ల్ యరుదు గాగ
    నచట కనుపించు దృశ్యాల నందు నొకట
    సంత సంబున ముంగిసల తో సర్ప మాడె

    రిప్లయితొలగించండి
  4. పరమ గురువైన జ్యోతిష పండితుండు
    జన్మ నక్షత్ర రాశియు జంతు గణము
    లెక్కదేల్చుచు కనుగొనె నొక్క చోట
    సంతసమున ముంగిసలతో సర్పమాడె

    రిప్లయితొలగించండి
  5. వంతల్బాసెనగనాశ్రమంబునచటన్భాసిల్లెమిత్రుల్వలెన్
    వింతల్జూపుచుజంతుజాలమహహావేలందెమోదంబునన్
    అంతల్జేసెగకణ్వుమానసతపోహాసంబుజీవంబులన్
    సంతోషంబునగూడియాడెగనుమాసర్పంబుతోముంగిసల్

    రిప్లయితొలగించండి
  6. ఆటవెలది

    మోళి కట్టు వాఁడు మ్రోగించి డప్పును
    వింతవింతలైన విద్దె లౌర!
    చాలఁజేసె//సంతసమున ముంగిసలతో,
    సర్పమాడె//బూర సవ్వడి విని.

    రిప్లయితొలగించండి

  7. శాంతిన్ గోరెడు పాండవాత్మజుని జూజమ్మాడ రమ్మంచు తా

    మెంతో పేర్మి నటించి పిల్వగను తా హీనుండ్రతో పాళిలో

    పంతమ్మూనుచు నింతినోడె ననుచున్ బ్రజ్ఞాలుడే పల్కెనే

    సంతోషంబునఁ గూడియాడెఁ గనుమా సర్పంబుతో ముంగిసల్.

    రిప్లయితొలగించండి
  8. తేటగీతి
    గరుడుఁ బోలువర్గమునాపు విరుగుడెరిగి
    ముంగిసలగుంపు పదవినిఁ బొందకుండ
    పాముఁబాలింప మద్దతున్ బంచనెంచ
    సంతసమున ముంగిసలతో సర్పమాడె!

    శార్దూలవిక్రీడితము
    వింతేమున్నది రాజకీయమున వైవిధ్యమ్ములెన్నుండు! రా
    ద్ధాంతమ్మంచును గద్దెపై గరుడినిన్ దప్పించు వ్యూహమ్మునన్
    సుంతన్ వైరమునెంచ బోక యహికిన్ జూపించి పీఠమ్మహో
    సంతోషంబునఁ గూడి యాడెఁ గనుమా సర్పంబుతో ముంగిసల్!

    రిప్లయితొలగించండి
  9. ఎనికలందు దమ వయిపు నెలయ మంత్రి
    పదవి నొసగెదమని ప్రతిపక్ష మనగ
    సంతసమున ముంగిసలతో సర్పమాడె
    తుదకు చిన్న పదవి కూడ దొరకలేదు

    రిప్లయితొలగించండి
  10. స్వాంతబంతయు ప్రేమ నిండిన మహా
    వాత్సల్యు లౌవారి యే
    చింతల్లేని ఋషీశులాశ్రమములో జిత్రం
    బుగా ప్రాణులున్
    పంతంబుల్ మరి వైరముల్ విడిచి సద్భా
    వంబుతో నచ్చటన్
    సంతోషంబున గూడి యాడె గనుమా
    సర్పంబుతో ముంగిసల్

    రిప్లయితొలగించండి
  11. సంతోషంబునఁగూడియాడెఁగనుమా సర్పంబుతో ముంగిసల్
    గంతుల్ వైచును లేళ్లు సింహములతో,గాండ్రించగా బెబ్బులుల్
    సుంతౌ భీతినిఁజెందవౌర!సురభుల్,శోభిల్లు మున్యాశ్రమా
    లెంతో వింతను గొల్పు సీత!యని పృథ్వీశుండు రాముండనెన్.

    రిప్లయితొలగించండి
  12. క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:

    కర్ణు డుండగా తనకేమి కష్ట మనుచు
    మదిని దల్చిన రారాజు మదము గల్గి
    పాండవులతో రణ మొనర్చె పరగు మోహ
    సంతసమున, ముంగిసలతో సర్పమాడె.

    రిప్లయితొలగించండి
  13. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  14. కె.వి.యస్. లక్ష్మి, ఉడ్బర్రీ, అమెరికా:

    అంతంబొందగ పాపముల్ గజ మికన్ యంధాహి లూతంబులున్
    పొంతన్ జేరుచు వైరి జంతువులవే భూతేశు నర్చించగా
    పంతంబున్ గలుగంగ నావిధమునే ఫాలాక్షు పూజించగా
    సంతోషంబున గూడి యాడె గనుమా సర్పంబుతో ముంగిసల్.
    (అంధాసి = పాము)

    రిప్లయితొలగించండి
  15. శార్దూలము.
    వింతేమున్నది పోరు క్రీడ సమమే
    వీక్షించ నుత్కంఠతో
    నంతంజేయగ బాటలేయ మదిలో
    నావేశమే పొంగగా
    చింతన్వీడుచు గర్వమొప్పు నెఱితో
    చెండాడ విద్వేషినే
    *సంతోషంబునఁ గూడి యాడెఁ గనుమా సర్పంబుతో ముంగిసల్*

    రిప్లయితొలగించండి
  16. క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:

    పంతంబొందిన రాజరాజు తమపై వైరమ్ముతో రేగగన్
    స్వాంతంబందున వాని నీచమగు దౌష్ట్యంబుల్ స్మృతిన్ జేయుచున్
    అంతంబొందగ జేయ నాతనిని నభ్యామర్ధమందున్ గడున్
    సంతోషంబున గూడి యాడె గనుమా సర్పంబుతో ముంగిసల్.
    (అభ్యామర్ధము = యుద్ధము)

    రిప్లయితొలగించండి
  17. కౌరవుల్దోడ సంగ్రామము పాండవుల్
    సలుపుదురంచు తా తలచి నట్టి

    ముద్ర దేశ నృపతి మాద్రి తనయులకు
    సాయము నందించ సమర రంగ

    మునకు వచ్చుచు నుండ మూర్ఖుడా దుర్యోధ
    నుండు శకుని మాటను విని మీదు

    మేనమామను కూడి మెఱమెచ్చులన్ సల్పి సాయమున్ కోరెగా సమిత మందు


    *సంతసమున ముంగిసలతో సర్పమాడె*

    నను విధమ్మున ఘన శల్యు డాడుచుండె

    మద్య మున్గ్రోలి, మత్తుతో మనల మరచె

    ననుచు పలికె కృష్ణుడు ధర్మజునిని గాంచి

    రిప్లయితొలగించండి
  18. కాంతారంబున పర్ణశాలకడ నే కళ్ళార వీక్షించితిన్
    శాంతాకారముబూని సింహమును మేషం బాట లాడంగ నా
    కెంతో వింతగ దోచెనాశ్రమమునందీ దృశ్యముం జూడగా
    సంతోషంబునఁ గూడి యాడెఁ గనుమా సర్పంబుతో ముంగిసల్

    రిప్లయితొలగించండి
  19. ఆశ్రమంబున గాంచితి నబ్బురములు
    పులులు మేకలు జతగూడె పొలుపుమీర
    సంతసమున ముంగిసలతో సర్పమాడె
    శాంతినెలకొనె నచ్చట క్షాంతి విరిసె

    రిప్లయితొలగించండి
  20. అంతెఱుఁగని మైకమున లోకాంతరమున
    కేఁగి వింతఁ గాంతుం డొకఁడే గరిమను
    బల్కె నివ్విధముగఁ దడఁబడుచుఁ గరము
    సంతసమున ముంగిసలతో సర్పమాడె


    చింతింపంగ ధరాతలమ్మున నహో చిత్రమ్ములం గాంచమే
    వింతల్ పెక్కు సెలంగుఁ దాపసుల సద్వృత్తమ్ము లందింపుగాఁ
    గాంతారమ్మునఁ గణ్వు నాశ్రమమునం గన్పించు నీ దృశ్యముల్
    సంతోషంబునఁ గూడి యాడెఁ గనుమా సర్పంబుతో ముంగిసల్

    రిప్లయితొలగించండి
  21. తేటగీతి
    నాల్గు వీథుల కూడలి నడుమ, గార
    డి సలిపెడి వాడు పొట్టకూటి కయి తాను
    నృత్య రీతులు వాటికి నేర్పి నంత
    సంతసమున ముంగిసలతో సర్ప మాడె.

    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటర్.

    రిప్లయితొలగించండి
  22. జాతి వైరంబు లేకుండ సాధువులయి
    సంతసమున ముంగిసలతో సర్పమాడె
    యాశ్రమంబున గలప్రాణు లన్నియునట
    యట్లె యుండును నొండొరు లైక్యముగను

    రిప్లయితొలగించండి
  23. కాంతారంబున మౌనియాశ్రమమునన్ గంతుల్వడిన్వేయుచున్
    సంతోషంబున గూడియాడె గనుమా సర్పంబుతో ముంగిసల్
    వింతల్గావివి యిట్లె పేరిమిని యాభీతావహంబౌ వనిన్
    నంతో యింతయొ జర్గు చుండును నటన్ నాశ్చర్య మందంగ గాన్

    రిప్లయితొలగించండి