5, మార్చి 2022, శనివారం

సమస్య - 4011

6-3-2022 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“తావి లేనట్టి సుమమాల దైవమునకు”

(లేదా...)
“తావి యొకింత లేని సుమదామమె యొప్పును దైవపూజకున్”

18 కామెంట్‌లు:


  1. మొక్కుబడి పూజలవియేల మూర్ఖురాల
    పొదిని పరిమళ భరితమౌ పూలు ముడిచి
    తావి లేనట్టి సుమమాల దైవమునకు
    వేయబూనుట తగదంటి బిక్కమదియె.

    రిప్లయితొలగించండి
  2. నాగరీకంపుయువతయునవతజూపి
    దారమందునప్లాస్టిక్కుదామమీయ
    పరముడీశునిరుద్రాక్షపారిపోయె
    తావిలేనట్టిసుమమాలదైవమునకు

    రిప్లయితొలగించండి

  3. పావని యాలకింపుమిది ప్రాజ్ఞులు చెప్పిన మాటయే సుమా

    దేవుడు నిర్వికారుడధిదేవున కుండదు భేద మెప్పుడున్

    భావన ముఖ్యమందురు, సువాసనలేలనె చిత్తశుద్ధితో

    తావియొకింతలేని సుమ దామమె యొప్పును దైవపూజకున్.

    రిప్లయితొలగించండి
  4. బుల్లి తెర నటి ధరియించు మురిప మలర
    తావి లేనట్టి సుమమాల : దైవమునకు
    పరిమళమ్ములు వెదజల్లు పలు రకాల
    విరుల దండల నర్పింత్రు వేద విదులు

    రిప్లయితొలగించండి
  5. భావముపుష్పరాజములభాసురసంగతికావ్యమల్లగా
    తావిధివెక్కిరించెకవితాళనులేకనుముక్తినందెనే
    కావికకీర్తినీయనికగంధసుమంగళమాలికల్భువిన్
    తావియొకింతలేనిసుమదామమెయొప్పునుదైవపూజకున్
    ఫిరదౌసికథ

    రిప్లయితొలగించండి
  6. అత్తరుల నద్దుకొన కుండ నాలయమును
    దర్శనము జేయనొప్పని తరుణులిపుడు
    తావి లేనట్టి సుమమాల దైవమునకు
    ధారణ సలుప దెచ్చుట తప్పగు గద

    రిప్లయితొలగించండి
  7. తేటగీతి
    మంచి మనసు నర్పించుచు ,మలిన భావ
    తావి లేనట్టి సుమమాల దైవమునకు
    ఘనముగ నిడుచు గావించు కఱిమెడ దొర
    మానసిక పూజ యే నిజమైన పూజ.

    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటర్.
    కఱిమెడ దొర-శివుడు.

    రిప్లయితొలగించండి
  8. పూవులు సర్వమున్ బ్రభువు పూజకు
    చెల్లునటంచు నెంచియున్
    దేవుని కంఠమందునను దెల్యక వేసెను
    పూలదండనున్
    తావి యొకింతలేని, సుమదామమె యొ
    ప్పును దైవపూజకున్
    మేలిమి పూల తావిగల మిక్కిలి చక్కగ
    గూర్చినట్టిదౌ

    రిప్లయితొలగించండి
  9. ఆటవెలది

    లేమ!వద్దు// తావి లేనట్టి సుమమాల,
    దైవమునకు//మిగుల తావులొసఁగు
    మల్లె జాజి విరుల మాలలు గొని తెచ్చి
    యధిక భక్తిఁజేయు మర్చనమ్ము

    రిప్లయితొలగించండి
  10. ఈవియు లేని సంపదటు లీశుని పూజకు వ్యర్థమౌగదా
    తావియొకింత లేని సుమదామమె,యొప్పును దైవపూజకున్
    తావులుఁజిమ్ము పూవులును దానము సేయగ నొప్పు
    సంపదల్
    భూవర!తావి పూవులకు భూరి ధనంబులకీవి యందమౌ.

    రిప్లయితొలగించండి
  11. భావనజేసి ఱాయి భగవానునిగా మదిలోన భక్తితో
    సేవలు సల్పగా నెలమి, చింతలు దీరును నిశ్చయంబుగా
    దేవుడు భక్తిజూచు మరిదేనినిజూడడు నిర్మలాత్ముకున్
    తావి యొకింత లేని సుమదామమె యొప్పును దైవపూజకున్

    రిప్లయితొలగించండి
  12. అందమొలికించి కనులకువిందుసల్పు
    మంచి పరిమళభరితసుమాల మాల
    వలయు దేవతార్చనసేయ, వలదు వలదు
    తావి లేనట్టి సుమమాల దైవమునకు

    రిప్లయితొలగించండి
  13. తేటగీతి
    చిత్తశుద్ధిని వీడుచు శివుని పూజఁ
    జేయనెంచినఁ బుణ్యమ్ము సిక్కనగునె?
    సుమ సమమ్మైనఁ బఠియించు స్తోత్రమాల
    తావి లేనట్టి సుమమాల దైవమునకు!

    ఉత్పలమాల
    సేవకుఁ గూర్చలేను యభిషేకమొనర్చెడు పంచకంబు, నే
    నే విధిఁ బూజఁ జేతుఁ బరమేశ్వర లేకయె పూలమాలలున్?
    దైవమ! స్తోత్రమాల నినుఁ దాకి నుతించి యలంకరింపఁగన్
    దావి యొకింత లేని సుమదామమె? యొప్పును దైవపూజకున్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సవరించిన వృత్త పూరణ:

      ఉత్పలమాల
      సేవకుఁ గూర్చలేక యభిషేకమొనర్చెడు పంచకంబు, నే
      నే విధిఁ బూజఁ జేతుఁ బరమేశ్వర లేకయె పూలమాలలున్?
      దైవమ! స్తోత్రమాల నినుఁ దాకి నుతించి యలంకరింపఁగన్
      దావి యొకింత లేని సుమదామమె? యొప్పును దైవపూజకున్!

      తొలగించండి
  14. తావి లేనట్టి సుమమాల దైవమునకు
    నేల వేసితి విప్పుడు బాల!నీవు
    తావి గలయట్టి మాలనే దైవమునకు
    దినము దినమును వేయుము తీరికగను

    రిప్లయితొలగించండి
  15. తావి యొకింత లేని సుమదామమె యొప్పును దైవపూజకున్
    దావిని బట్టి చూడకుడు దామము వేసిన వేయకున్ననున్
    దైవము దృప్తి నొందునట ధార్మిక బుద్ధిని బూజజేయుచో
    గావున నెల్లవారలు సుగంధపు మానసులై భజింపనౌ

    రిప్లయితొలగించండి
  16. తివిరి నైవేద్య మిత్తురు దేవునకును
    దినుట యది యెల్ల నింపుగ జనుల వంతు
    తావి యున్నట్టి సుమమాల దంపతులకుఁ
    దావి లేనట్టి సుమమాల దైవమునకు


    ఏవి హి తాహితమ్ము లిల నెంచఁగ దేవున కెన్నఁ డేనియున్
    దేవుని సృష్టి కెన్నఁగ నతీతము లున్నవె భూతలమ్మునం
    దావి సెలంగు నట్టి సుమ దామ సమానము సత్య మెంచినం
    దావి యొకింత లేని సుమదామమె యొప్పును దైవ పూజకున్

    రిప్లయితొలగించండి
  17. ఈ వనమందు పూచినవి
    యెన్నొ సుగంధ సుమాలు వన్నెలన్
    దేవుని పూజకై తునిచి
    తీరిచె పళ్ళెరమందు నో సఖీ!
    ఈ విరిమాల లింక సొగ
    సీనును స్వామిధరింప! ఘాటుగన్
    తావి యొకింత లేని సుమదామమె యొప్పును దైవపూజకున్!

    రిప్లయితొలగించండి