29, మార్చి 2022, మంగళవారం

సమస్య - 4035

30-3-2022 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“షట్చక్రములందు దాఁగె షడ్రిపుగణమే”
(లేదా...)
“షట్చక్రంబులలోన దాగెను గదా షడ్వైరిబృందం బహో”

12 కామెంట్‌లు:

  1. షట్చక్రపరిధిదాటగ
    షట్చక్రాక్రమితమునరిషడ్వర్గంబే
    షట్చక్రనిలయజేరగ
    షట్చక్రములందుదాగెషడ్రిపుగణమే

    రిప్లయితొలగించండి
  2. షట్చక్రవర్తులైనను
    షట్చాస్త్రంబులనెరిగిన సద్వర్తనులే
    రాట్చరితలలోనైనను
    షట్చక్రములందు దాఁగె షడ్రిపుగణమే

    రిప్లయితొలగించండి
  3. కందం
    విట్చరమెడలించఁ బొలము
    నిట్చరమది గ్రుడ్డిది పడి యేదినయటులన్
    షట్చరణములై తలపులు
    షట్చక్రములందు దాఁగె షడ్రిపుగణమే!

    శార్దూలవిక్రీడితము
    షట్చక్రాలకు దేహమాలయముగన్ సాగింపయోగాదులన్
    షట్చక్రాళిని దాటి కుండలినితాసాగన్ సహస్రారమున్
    షట్చక్రంబులసాధనమ్ముముగియున్, స్వార్థప్రకోపమ్మునన్
    షట్చక్రంబులలోన దాగెను గదా షడ్వైరిబృందం బహో!

    రిప్లయితొలగించండి
  4. షట్చక్రము గమనింపక
    షట్చక్రము ధ్యానమందు చతికిల బడఁగన్
    షట్చక్ర దురాక్ర మ మై
    షట్చక్రము నందు దాగె షడ్రిపు గణమే

    రిప్లయితొలగించండి
  5. షట్చక్రములు మెయి కలలు
    షట్చ క్ర రథము పయిననె చలనమొనర్చన్
    షట్చ క్రవర్తులకయిన
    షట్చక్రములందు దాఁగె షడ్రిపుగణమే

    కల= భాగము

    రిప్లయితొలగించండి
  6. కందం
    షట్చక్ర యోగ భేదన,
    షట్చక్రోపరి నివాసి సంజ్ఞను చేరన్
    షట్చక్ర నాడిలోనన్
    షట్చక్రములందు దాగె షడ్రిపు గణమే.

    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటర్.

    రిప్లయితొలగించండి
  7. రిప్లయిలు
    1. సృట్చతురాస్య జనిత స
      మ్రాట్చయము నిరంతరమ్ము రణముల లోనన్
      ధ్రుట్చయమై పోరాడుచు
      షట్చక్రములందు దాఁగె షడ్రిపుగణమే

      [ధ్రుట్టు = అపకారి, శత్రువు; షట్చక్రములు = ఆఱు ఖండములు]


      త్విట్చక్రద్వయ రాజ పుంగవులు వైవిధ్యైక శాఖా మహీ
      రుట్చాంచల్య సముద్భ వానిలుఁడు మారుండింక నాభీలవౌ
      షట్చక్రావలి వాహకుండు జల మన్, సత్యంబు నెంచంగ, రా
      ట్షట్చక్రంబులలోన దాఁగెను గదా షడ్వైరిబృందం బహో

      భాష్యము: కాంతిపుంజముల జంట దినరాజు రేరాజు నయిన సూర్యచంద్రులు, వివిధములైన కొమ్మలు కలిగిన వృక్షముల యస్థిరత కొఱకు పుట్టిన గాలిరాజు లక్ష్మీ పుత్రుఁడైన కామరాజు వషట్కారములను మోసికొని పోవు నగ్గిరాజు జలమయమైన సముద్ర రాజులతో గూడిన యీ యాఱుగురు రాజుల వలయములలోఁ బ్రాణుల యాఱుగురు శత్రువుల బృందము దాఁగి యున్నది.
      ఆయా సమయములలో వీరు విలయమును సృష్టించు చుందురు. చంద్రుఁడు, మన్మథుఁడు కామవికారములను గలిగించి పాపకార్యము లొనరించుటకుఁ బురికొల్పి మానవులను బాపకూపములోఁ బడ వేయుదురు. మిగిలిన వారి బీభత్సము విదితమే.

      తొలగించండి

  8. షట్చైతన్యపు మూలము
    షట్చక్రములంచునొజ్జ సంబోధింపన్.
    షట్ఛాత్రులనిరి నమ్మక
    షట్చక్రములందు దాఁగె షడ్రిపుగణమే.


    షట్చక్రాంకిత దివ్యదేహమనుచున్ శాస్త్రమ్ములే చెప్పుచున్

    షట్చైతన్యము నందజేయునవియే సన్మార్గనిర్దేశ్యముల్

    షట్చక్రమ్ములటంచనన్ ఖలుడు విస్రంభమ్ముతో పల్కెనే

    షట్చక్రంబులలోన దాగెను గదా షడ్వైరిబృందం బహో

    రిప్లయితొలగించండి
  9. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  10. షట్చక్రంబులవశమయి
    షట్చక్రము బేరుతోడ చతురత నొందన్
    షట్చక్రము లనబడు నా
    షట్చక్రములందు దాగె షడ్రిపు గణమే

    రిప్లయితొలగించండి
  11. కం. రాట్చరితంబగునె?దునుమ
    పట్చరియించెడి యరిజను పంతమడంచన్,
    ఘట్ఛేదనజేసికనుమ
    షట్చక్రములందు దాఁగె షడ్రిపుగణమే

    తాత్పర్యము:బాహ్యముగా ఉన్న శత్రువులను దునుమాడినంత మాత్రమున మన చరిత్ర ప్రకాశిస్తుందా? మనసును ఛేదించి చూడు నిజమైన శత్రువులు ఆరు అనగా కామ,క్రోధ,లోభ,మోహ మద మాత్సర్యాలు అను శత్రువులు మనయందే దాగిఉన్నవి అన్న సత్యం గోచరిస్తుంది అన్న భావనతో

    రిప్లయితొలగించండి