27, మార్చి 2022, ఆదివారం

సమస్య - 4033

28-3-2022 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“యమపాశం బయ్యెను కుసుమాస్త్రం బయ్యో”
(లేదా...)
“మరుని సుమాస్త్రమయ్యె యమమారణపాశముగాఁ గనుంగొనన్”

15 కామెంట్‌లు:


 1. కొమరాలు మాద్రి గనగనె
  తమకముతో పాండురాజు దరిజేరిన యం
  త మరించె నందురది గన
  యమపాశంబయ్యెను కుసుమాస్త్రం బయ్యో.

  రిప్లయితొలగించండి
 2. కందం
  ప్రమదన్ గాంచినయంత కు
  సుమాస్త్రుడు మరులు గొలుపఁగ సోలుచుఁ జెరచన్
  గుమతిన్ గాల్చిరి భటులున్
  యమపాశం బయ్యెను కుసుమాస్త్రం బయ్యో!

  సుమకోమలి సీతమ్మను
  గుమతిగ రావణుఁడు వట్టఁ గూలె రణమ్మై
  విమలుఁడు రాముని జేతన్
  యమపాశం బయ్యెను కుసుమాస్త్రం బయ్యో!

  చంపకమాల
  ధరణిజ పైని మోహమునఁ దారకరాముని ధిక్కరించుచున్
  మరులు గొనంగ రాక్షసుఁడు మందుడు నాహవమందుఁ జావడే!
  తరుణుల నన్యకాంతలను దాకగ రావణు పైన నెక్కిడన్
  మరుని సుమాస్త్రమయ్యె యమమారణపాశముగాఁ గనుంగొనన్!

  రిప్లయితొలగించండి
 3. సమముగలేనిశరంబుల
  నమలినశంభునితపమునుహరియింపంగా
  సుమశరుడుతనువువదలెను
  యమపాశంబయ్యెనుకుసుమాస్త్రంబయ్యో

  రిప్లయితొలగించండి
 4. తరతమభేదమెంచక నితాంత సుధామయమైన ప్రేమతో
  నిరుహృదయంబులొక్కటయెనిక్షుశరాసను సాక్షిగా మనో
  హరమగుజంట గాంచియపహాసముగావిడదీయ పెద్దలే
  మరుని సుమాస్త్రమయ్యె యమమారణ పాశముగాఁ గనుంగొనన్

  రిప్లయితొలగించండి
 5. తమకు సుపరిపాలనమిడ
  యమూల్య మైన తమ ‘వోటు’ లన్నిటి నీయన్
  సమసె గద వారి కోరిక
  ‘యమపాశం బయ్యెను కుసుమాస్త్రం బయ్యో’

  రిప్లయితొలగించండి
 6. అమరులు కోరిన రీతిగ
  తమకము బుట్టింప నెంచె ధైర్యము తోడన్
  సుమశరు శివుడు దహింపగ
  యమ పాశంబయ్యెను కుసుమా స్త్ర o బయ్యో !

  రిప్లయితొలగించండి
 7. సుమచరుడే సాక్షిగ నా
  రమణీరమణుల హృదయములయ్యె నొకటిగా
  తమ పెద్దలడ్డుకొనగా
  యమపాశం బయ్యెను కుసుమాస్త్రం బయ్యో

  రిప్లయితొలగించండి

 8. మరిచెను శాపమున్ నృపుడు మానిని మాద్రిని గాంచినంతనే

  పరవశమంది కామనున భామను కూడిన తక్షణంబునన్

  బరగతినందె నందె తాపసి యవగ్రహ మందు వనాంతరమ్మునన్

  మరుని సుమాస్త్రమయ్యె యమ మారణ పాశము గాఁ గనుంగొనన్.

  రిప్లయితొలగించండి
 9. సుమశరతాడితధూర్తులు
  సమయమునకుకానబడిన సకియను బలిమిన్
  రమియించిరి కడతేర్చిరి
  యమపాశం బయ్యెను కుసుమాస్త్రం బయ్యో

  రిప్లయితొలగించండి
 10. తమితో నర్తనశాలకు
  ప్రమదను సైరంధ్రిఁగోరి రాఁగీచకుఁడే
  యమపురికిఁబంపె భీముఁడు
  యమపాశంబయ్యెను కుసుమాస్త్రంబయ్యో!

  రిప్లయితొలగించండి
 11. కందం
  సుమశరమున పాండునృపుడు
  తమకార్తికి లోనయి సురతముకై సతి మా
  ద్రి మధుర కౌగిలి జేరగ
  యమపాశం బయ్యెను కుసుమాస్త్రం బయ్యో.

  ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
  ఉండవల్లి సెంటర్.

  రిప్లయితొలగించండి
 12. అరెరె! విచిత్రమియ్యదియె యంగజబాధకు నోర్వనేరకే
  వరగుణ ద్రౌపదిన్ వలచి వచ్చియు సింహబలుండు. భీమసం
  గరమున ప్రాణముల్ విడచెగాదె నిశీథిని నాట్యశాలలో
  మరునిసుమాస్త్రమయ్యె యమమారణపాశముగా గనుంగొనన్.

  రిప్లయితొలగించండి
 13. దురితమనస్కుడై కుజను దొంగిల రావణు డాస్థ తోడుతన్
  విరివిలుకాని చెయ్దముల ప్రేమ జనింపగ మానసమ్ములో
  నిరుపమ శక్తి రాఘవుడు నిర్జర వైరిని సంహరించె నా
  మరుని సుమాస్త్రమయ్యె యమమారణపాశముగాఁ గనుంగొనన్

  రిప్లయితొలగించండి
 14. హరుని తపస్సు భంగమును హైమయె చేయుమటంచు గోరగా
  విరివిలుకాడు సేసె తన వింటి లకోరిని
  వేసి భంగమున్
  పరమశివుండు క్రోధమున భస్మము సేసెను
  వానినయ్యెడన్
  మరుని సుమాస్త్రమయ్యె యమ మారణ
  పాశముగా గనుంగొనన్

  రిప్లయితొలగించండి
 15. రమణీ మణి ద్రౌపదిఁ గాం
  చి ముమ్మరమ్ముగ నెడందఁ జెలరేఁగఁగఁ గా
  మము వర్తిలఁ గీచకునకు
  యమపాశం బయ్యెను గుసు మాస్త్రం బయ్యో


  సుర గణ కార్య మంచు హరి చోదితుఁడై కడు నుత్సహించి యా
  గిరిజకు శంభుఁ గూర్ప విలు కేలను గైకొని మన్మథుం డటన్
  హరు నయ నాగ్ని భస్మముగ నయ్యెను బాణము వేసి నంతటన్
  మరుని సుమాస్త్రమయ్యె యమమారణపాశముగాఁ గనుంగొనన్

  రిప్లయితొలగించండి