10, మార్చి 2022, గురువారం

సమస్య - 4016

11-3-2022 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వార కులాంగననుఁ గలియ వర్ధిలును సిరుల్”
(లేదా...)
“వార కులాంగనన్ గలియ వర్ధిలు సద్విభవంబు లీభువిన్”

26 కామెంట్‌లు:

  1. జారిననీతినిమదిలో
    పారణజేసినసుఖమునుబరువగునదియే
    మారునుమధురమువాణితొ
    వారకులాంగననుగలియవర్ధిలునుసిరుల్

    రిప్లయితొలగించండి
  2. కోరెగనామ్రపాలియనుకోమలిరక్తినివీడిబుద్ధునిన్
    భారముగాగజీవితముపాయగజన్మపుబంధముల్తుదిన్
    సారముజాగృతిన్దెలిసిసంచితపాపముపారద్రోలెగా
    వారకులాంగనన్గలియవర్ధిలుసద్విభవంబులీభువిన్

    రిప్లయితొలగించండి
  3. మీరిన మోహము జూపుచు
    జేరియు వలపుల హొయలు ల చెలువము తోడన్
    మేరయ లేని కరణి దని
    వార కులాంగనను గలియ వర్ధిలును సిరుల్

    రిప్లయితొలగించండి

  4. పూరుషుడే సర్వమనుచు
    వారిరుహాసనయె చేరు పత్నిగ, తానే
    కోరిన పాళము పతి తని
    వార కులాంగనను గలియ వర్ధిలును సిరుల్.

    రిప్లయితొలగించండి
  5. కోరిక లుప్పతిల్లినను గోరకు మొప్పుడు
    వార కాంతలన్
    జార కులాంగనల్ సతము సంపద లిమ్మని
    కోరుచుంద్రుగా
    సారములేని జీవితము సర్వమునాశన
    మౌను గాన దు
    ర్వారకులాంగనన్ గలయ వర్ధిలు సద్విభ
    వంబులీభువిన్

    రిప్లయితొలగించండి
  6. కందం
    దోరవయస్సు మిలమిలలఁ
    నూరింపఁగఁ బుండరీక! యొప్పుదె వెలదిన్
    గూరిమి సగమౌ సతిఁ జె
    ల్వార కులాంగననుఁ గలియ వర్ధిలును సిరుల్

    ఉత్పలమాల
    మేరలులేని కామమున మీతలిదండ్రుల నాలి వీడుచున్
    చేరితె వారకాంతనట జీవితమేమయె? పుండరీక! నీ
    వారలు గన్నవారలని పాయక, మేన సగమ్మనంగఁ జె
    ల్వార కులాంగనన్ గలియ వర్ధిలు సద్విభవంబు లీభువిన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉత్పలమాల
      కూరిమగన్ నటించి కడు గొప్పగ షడ్రుచి విందుఁ బంచి తా
      నోరగఁ గన్నుగీటి నిను నూయలనూపుచు నాకు చిల్కలన్
      గూరిచి నోటికిన్ వగల గుప్పదె! బర్యవసానమెంచకే
      వార కులాంగనన్ గలియ వర్ధిలు సద్విభవంబు లీభువిన్!

      తొలగించండి

  7. సారను గ్రోలి వాగితివొ సత్యమెఱుంగని వాడవై యిటుల్

    దారుణమైన మాటలవి ద్రాపుడ వోలెను పల్కుచుంటివే

    జారిణి గూడు పాంశులుని సంపదలెల్ల నశించుగాని యే

    వారకులాంగనన్ గలియ వర్ధిలు సద్విభవంబులీ భువిన్?

    రిప్లయితొలగించండి
  8. వారిజ నేత్రను,వనితను,
    నారీమణి,నీలవేణి,ననబోఁడిని,శృం
    గార రసంబుల్ పొంగుల్
    *వార,కులాంగననుఁగలియ వర్ధిలును సిరుల్.*

    రిప్లయితొలగించండి
  9. క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:

    తీరగు భావన జేయుచు
    పోరామిని మెలగుచుండి పోడిమి తోడన్
    మూరెడి వల్లభుడే తను
    వార కులాంగనను గలియ వర్ధిలును సిరుల్.

    రిప్లయితొలగించండి
  10. కోరిన కోర్కె దీర్చగను గోరిచరించెడి దర్మభాగినై
    నీరజనేత్రి వంటి సతి నీ నిజ మందిర మందునుండగా,
    సేరకుమీ పరాంగనల, జేటొనగూడు, నిరర్థకమ్మురా
    వార కులాంగనన్; గలియ వర్ధిలు సద్విభవంబు లీభువిన్
    దార, సితారగా దలచి దార నుదారత జాయగా సుమీ!

    సితార-అదృష్టం, భాగ్యం.

    రిప్లయితొలగించండి
  11. శ్రీరమణీమణిన్,లలన,లేమ,లతాంగి,పయోరుహాననన్
    వారిజలోచనన్,మధుర
    భాషిణి,ముద్దులగుమ్మ,కోమలిన్
    చారు సుహాసినిన్,ముగుద,జవ్వని,జాణను,ప్రేమ పొంగి జా
    *ల్వార,కులాంగన్ గలియ వర్ధిలు సద్విభవంబులీభువిన్.*

    రిప్లయితొలగించండి
  12. ఊరినిగలధనవంతులు
    వార కులాంగననుఁ గలియ వర్ధిలును సిరుల్
    వారవనితాగృహమునన్
    జారత్వము హేయమోయి చంచలహృదయా

    రిప్లయితొలగించండి
  13. కె.వి.యస్. లక్ష్మి, ఉడ్బర్రీ, అమెరికా:

    మీరిన మోహముతో నే
    వారకులాంగనను గలియ వర్ధిలు సిరులున్?
    తీరగునటు కులసతితో
    కూరిమి నెంచుచు మసలిన గూడును సిరులే!

    రిప్లయితొలగించండి
  14. క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:

    గౌరవమైన రీతిగల కాంత గృహమ్మున నుండ నీవిటుల్
    తీరునులేని తత్త్వమున దిర్గుచు వేశ్యలనంటి యుండుచో
    సారము పోవునంచు పిత చక్కగ బిడ్డకు చెప్పె నిట్లు చె
    ల్వార కులాంగనన్ గలియ వర్ధిలు సద్విభవంబు లీభువిన్.

    రిప్లయితొలగించండి
  15. ఆరును సంపద లన్నియు
    వార కులాంగననుఁ గలియ ; వర్ధిలును సిరుల్
    గౌరవముగ నింటినిగల
    నారీమణి సంతసించ నయముగ బొగడన్

    రిప్లయితొలగించండి
  16. కె.వి.యస్. లక్ష్మి, ఉడ్బర్రీ, అమెరికా:

    కూరిమితోడ మెల్గు సతి గొప్పగ నింటను కాపురమ్ము తా
    తీరుగ జేయుచున్ సతము దీప్తిని గూర్చుచు తేజరిల్లగా
    గౌరవమొప్ప పెన్మిటియె గారవ మెంచుచు ప్రీతి నొంది చె
    ల్వార కులాంగనం గలియ వర్ధిలు సద్విభవంబులీ భువిన్.

    రిప్లయితొలగించండి
  17. వారలుధనమాసింతురు
    వారకులాంగనల పొందు వలదుర నరుడా,
    దారల దారినిఁ జను! చె
    ల్వార కులాంగననుఁ గలియ వర్ధిలును సిరుల్

    రిప్లయితొలగించండి
  18. వారకులాంగనన్ గలువ వద్దుర సోదర లగ్గుకాదు నీ
    వారలె నిన్ను దూఱుదురు స్వస్థత సన్నగిలున్ ధనంబునున్
    నీరమువోలె పారునిక నీగతి దుర్గతి తథ్యమన్న! చె
    ల్వార కులాంగనన్ గలియ వర్ధిలు సద్విభవంబు లీభువిన్

    రిప్లయితొలగించండి
  19. తీరని రోగము గలుగును
    వారకులాంగనను గలియ,వర్ధిలును సిరుల్
    గోరికలను విడనాడుచు
    నారమనే శరణు గోర యంచిత బుద్ధిన్

    రిప్లయితొలగించండి
  20. దూరపు బంధుత్వ మడరఁ
    బేరిమి మీఱ నుతియించి విత్తార్థంబై
    బోరనఁ జెంతకు నేగిన
    వార కులాంగననుఁ గలియ వర్ధిలును సిరుల్


    క్షీర సముద్ర రాజ సుత సేవిత పద్మదళాక్ష సంత తా
    పార దయార్ద్ర మానసను భక్తి వహించి మనః పథమ్మునన్
    వారక కోరి విత్తమును బద్మ దళస్థిత లోభిలోక దు
    ర్వార కులాంగనం గలియ వర్ధిలు సద్విభవంబు లీ భువిన్

    రిప్లయితొలగించండి
  21. తీరని వ్యాధులున్గలుగు,దెప్పలుదెప్పలుగా ధనంబులున్
    నారతి కర్పురంబలెను నారును బూర్తిగ నిశ్చయంబుగన్
    వారకులాంగనున్గలియ,వర్ధిలు సద్విభవంబులీ భువీన్
    మారెమ దేవతన్గొలువ మౌనము తోడను దప్పకుండగన్

    రిప్లయితొలగించండి
  22. ఉత్పలమాల
    వారిజ నేత్ర ,రూప గుణ భామిని ,మంజుల వాగ్విలాసినిన్
    చారు లతాంగి ,మానవతి ,చామన చాయను బోలు వర్ణినిన్
    సారము తోడ కన్నియను, జాయగ బొందిన, పేర్మి పొందు జా
    ల్వార ,కులాంగనన్ గలియ వర్ధిలు సద్విభవంబు లీ భువిన్

    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటర్.
    సారము-సంపద

    రిప్లయితొలగించండి
  23. కం.
    ఆరాధించగ మనమున
    భారము గైకొన విధిగను భార్యగ నలరన్
    మీరిన ప్రేమలనిడి చె
    *ల్వార కులాంగననుఁ గలియ వర్ధిలును సిరుల్*
    ఉ.మా.
    మారెను డెందమే పెనుపు మంత్రము వేసెడి మోము జూడగన్
    కోరిక లబ్దియై లలన గోముగ నింటను జేర భార్యయై,
    మీరిన ప్రేమతో మెలగి మెండుగ సౌఖ్యము లందజేయ చె
    *ల్వార కులాంగనన్ గలియ వర్ధిలు సద్విభవంబు లీభువిన్*

    రిప్లయితొలగించండి