13, మార్చి 2022, ఆదివారం

కాశీ, నేపాల్ యాత్ర

కవిమిత్రులకు నమస్సులు.
ప్రస్తుతం కాశీ ప్రయాణపు ఏర్పాట్లలో వ్యస్తుడనై ఉండి మీ పూరణలను సమీక్షించలేక పోతున్నాను. ఎల్లుండి బయలుదేరుతున్నాము. ముందు కాశీ, గయ, ప్రయాగ, అయోధ్య, నైమిషారణ్యం, చిత్రకూటం అనుకున్నది ఇప్పుడు మా మిత్రుల బలవంతం వల్ల ఇందులో నేపాల్ పశుపతినాథాలయం, మనోకామనాదేవి దర్శనాలు కూడా చేరాయి. ఆరోగ్యపరంగాను, ఆర్థికంగాను ఇబ్బందులున్నా వాళ్ళతో వెళ్ళక తప్పడం లేదు. మళ్ళీ 29 వ తేదీ తిరిగివస్తాము.
అప్పటివరకు సమస్యలు షెడ్యూల్ చేసి ఉంచాను. నిరంతర ప్రయాణం వల్ల నేను సమూహానికి అందుబాటులో ఉండకపోవచ్చు. దయచేసి మిత్రులెవరైనా పూరణలను సమీక్షిస్తే సంతోషం. లేదా అందరూ పరస్పర గుణదోష విచారణ చేసికొనవలసిందిగా మనవి.

6 కామెంట్‌లు:

 1. సర్
  నమస్కారములు .మీప్రయాణము నిర్విఘ్నముగా కొనసాగుగాక!ఆవిశ్వనాధుని కరుణా కటాక్షములు మీపై యెల్లవేళల ప్రసరించుగాక!

  రిప్లయితొలగించండి
 2. గురువు గారు
  మీ ప్రయాణం సుఖవంతంగా సాగాలని కోరుకుంటున్నాను
  ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
  ఉండవల్లి సెంటర్.

  రిప్లయితొలగించండి
 3. గురువుగారు నిశ్చింతతో వెళ్ళిరండి మీ ప్రయాణం శుభప్రదం కావాలని కోరుకుంటున్నాను

  రిప్లయితొలగించండి
 4. మీ యాత్ర కోరుకున్న విధం గా సాగుగాక

  రిప్లయితొలగించండి