12, మార్చి 2022, శనివారం

సమస్య - 4018

13-3-2022 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“దేవకీపుత్రుఁడయ్యె యుధిష్ఠిరుండు”
(లేదా...)
“దేవకికిన్ జనించెను యుధిష్ఠిరుఁ డా దశకంఠుఁ జంపఁగన్”

28 కామెంట్‌లు:


 1. ఉక్తలేఖనమందున నొజ్జ కుంతి
  దేవికిని పుత్రుడయ్యె యుధిష్ఠిరుండ
  టంచు చెప్పగ వ్రాసె విద్యార్థి కుంతి
  దేవకీపుత్రుఁడయ్యె యుధిష్ఠిరుండు.

  రిప్లయితొలగించండి
 2. తేటగీతి
  మౌని శాపవశమ్మున హాని దొలఁగ
  పాండురాజ సమ్మతిని, దుర్వాసవరము
  గలిగి కుంతి యమునివేడ కనికరింప
  దేవకీ! పుత్రుఁడయ్యె యుధిష్ఠిరుండు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు

  1. 1.దేవకితో వసుదేవుడు...

   తేటగీతి
   మౌని శాపవశమ్మున హాని దొలఁగ
   పాండురాజ సమ్మతిని, దుర్వాసవరము
   గలిగి కుంతి యమునివేడ కనికరింప
   దేవకీ! పుత్రుఁడయ్యె యుధిష్ఠిరుండు

   2.ఉత్పలమాల
   చేవ గలుంగు వారలకె చేపడు నర్థము, ద్వ్యర్థి కావ్యమున్
   నీవలె నావలెన్ జదువు నేర్చిన వారికి వల్లకాదుగా?
   కోవిదులొప్పనట్టిదన గూసితె రాఘవపాండవీయమున్
   దేవకికిన్ జనించెను యుధిష్ఠిరుఁ డా దశకంఠుఁ జంపఁగన్!

   తొలగించండి
 3. ధర్మసంస్థాపనంబునధరణియందు
  బుద్ధికుశలతజూపిరిపోరునందు
  ఇరువురొకటిగననవచ్చునీకరణిని
  దేవకీపుత్రుడయ్యెయుథిషిఠిరుండు

  రిప్లయితొలగించండి
 4. ధర్మ సంస్థాపనము సేయ ధరను హరియె
  దేవకీ పుత్రుడయ్యె : యుధిష్ఠి రుండు
  కుంతి పుత్రుడు గా పుట్టి కువలయ మున
  ధార్మి కుండయి పేరొంది ధన్యుడయ్యె

  రిప్లయితొలగించండి
 5. తేటగీతి
  శ్రీహరి యవతరించెను క్షేత్రము పయి
  దేవకీ పుత్రుడయ్యె ,యుధిష్ఠిరుండు
  పాండు సుతునిగ జన్మించి, బావ వాసు
  దేవుని సహకారమున పృథ్వీ పతయ్యె.

  ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
  ఉండవల్లి సెంటర్.

  రిప్లయితొలగించండి

 6. భావనుడీ వసుంధరను బందిగ మందున పుట్టెనేరికిన్?

  పావని యగ్రజుండెవడు? పంక్తిరథుండకు పుత్రుడై కదా

  పావనుడామతించెనని ప్రాజ్ఞులు చెప్పిరి దేనికోసమై?

  దేశకికిన్ జనించెను, యుధిష్ఠిరుఁడా, దశకంఠుఁ జంపగన్.

  రిప్లయితొలగించండి
 7. ఆటవెలది
  కృష్ణమూర్తి //దేవకీపుత్రుడయ్యె,యు
  ధిష్ఠిరుండు//వరలు జ్యేష్ఠుడుగను
  పాండు సుతుల లోన ప్రఖ్యాతి గాంచియు
  సరస కవివరేణ్య!శంకరార్య!

  రిప్లయితొలగించండి
 8. అగ్ర తాంబూలమును బొంద నర్హతునిగ
  దేవకీపుత్రుఁడయ్యె , యుధిష్ఠిరుండు
  జేయు యాగము జూడవచ్చిన యతిథుల
  సంచయము నందు , నందరు సంతసించ

  రిప్లయితొలగించండి
 9. చేతనగలకవియొకడు నూతనముగ
  కావ్యము రచించె పాత్రలు కలిపివైచి
  పూర్తియైనట్టి కావ్యపు పొలుపు జూడ
  దేవకీపుత్రుఁడయ్యె యుధిష్ఠిరుండు

  రిప్లయితొలగించండి
 10. బాలఘాతకి పూతనన్ బాలుఁ బీల్చి
  ప్రాణ ఘాతకుడయ్యెనే పడతి సుతుఁడు
  పాండవులనగ్రజుండుగా బరగెనెవరు
  దేవకీపుత్రుఁడయ్యె యుధిష్ఠిరుండు

  రిప్లయితొలగించండి
 11. పావనమూర్తి కృష్ణభగవానుఁడు శ్రీవసుదేవ సూనుఁడై
  *దేవకికిన్ జనించెను,యుధిష్ఠిరుఁడా!దశకంఠుఁజంపగన్*
  ఠీవిగ రామభద్రుఁడయె,నిక్కము భీముడ!సవ్యసాచి!యౌ
  రా!విధి లీలలిట్టివని యాయమ కుంతి వచించె వారితోన్.

  రిప్లయితొలగించండి
 12. క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:

  శౌరి శ్రీకృష్ణ రూపమ్ము సవదరించి
  దేవకీ పుత్రుడయ్యె; యుధిష్ఠిరుండు
  పాశి వరముచే కుంతికి ప్రభవ మొందె
  ధర్మ మిలలోన పాటించు ధార్మికునిగ.

  రిప్లయితొలగించండి
 13. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 14. క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:

  బావగ నీకు నెమ్మినిడు పావనుడా మురళీధరుండు తా
  దేవకికిన్ జనించెను యుధిష్ఠిరుడా! దశకంఠు జంపగన్
  శ్రీవరుడా జనార్దనుడు చేరి ధరిత్రిని రామచంద్రుడై
  వావిరి నొందె నంచునని పల్కెను భీష్ముడు బాల నప్తతో.

  రిప్లయితొలగించండి
 15. పావనమూర్తి కృష్ణభగవానుడు బుట్టినదే పడంతికిన్ ?
  భావనజేయ కుంతి మది పాశుని యంశగ పుట్టెనెవ్వరో?
  భూవలయంబు నందు హరి పుట్టిన దెవ్వని జంప రాముఁగా?
  దేవకికిన్ జనించెను, యుధిష్ఠిరుఁ, డా దశకంఠుఁ జంపఁగన్

  రిప్లయితొలగించండి
 16. ఉ.మా.
  కావగ దీనబంధులను గంసుని జంపగ దాను గృష్ణుడై
  దీవెనలంద కుంతికిని ధీరునిగా జనియించె శ్రేష్టుడై
  పావన జన్మమందగను భారత ఖండము నేలె రాముడై
  దేవకికిన్ జనించెను, యుధిష్ఠిరుఁ డా, దశకంఠుఁ జంపఁగన్

  రిప్లయితొలగించండి
 17. కె.వి.యస్. లక్ష్మి, ఉడ్బర్రీ, అమెరికా:

  శ్రావణ బహుళాష్టమినందు శౌరి పుట్టి
  దేవకీ పుత్రుడయ్యె; యుధిష్ఠిరుండు
  పాండవులలోన ప్రథముడై ప్రాభవమున
  ధర్మపథ మెంచి పరగుచు ధరను వెలిగె.

  రిప్లయితొలగించండి
 18. క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:

  నిన్నటి పూరణ:

  ఓ రాగమయీ! చెలియా!
  ఏరీతిని పర్ణశాల నెడలితి విపుడున్?
  జోరును గూడి నిటకు సీ
  తా! రారమ్మనుచు బిలిచె దాశరథి తమిన్.

  రిప్లయితొలగించండి
 19. కె.వి.యస్. లక్ష్మి, ఉడ్బర్రీ, అమెరికా:

  బ్రోవగ నాప్తులన్ దయను పొందుగ రూపును దాల్చి శౌరియే...
  భూవరుడౌచు నిల్పె గద భూమిని ధర్మము పాండుపుత్రుడై...
  భూవలయంబునన్ వెదకి భూసుత జాడను తెల్సి రాముడే...
  దేవకికిన్ జనించెను, యుధిష్ఠిరుడా, దశకంఠు జంపగన్.

  రిప్లయితొలగించండి
 20. దుష్ట శిక్షణ కొఱకును శిష్టులనిక
  రక్ష జేయుట కునుహరి రత్నసువున
  దేవకీ పుత్రుడయ్యె,యుధిష్ఠిరుండు
  గొంతి కొమరుడు ధర్ముడు కువలయమును
  ధర్మ పాలన గావించి ధార్మికుడయె

  రిప్లయితొలగించండి
 21. పౌరవాన్వయ తిలకుండు కౌరవ కుల
  దీపకుండు పాండు సుతుండు స్థిరుఁడ యాజిఁ
  గుంతి కీయంగ సంతోష మంత వినుమ
  దేవకీ! పుత్రుఁ డయ్యె యుధిష్ఠిరుండు


  దేవ గణమ్ము కోరఁగ నతీత భయమ్మున విష్ణు వింపుగాఁ
  గావఁగ భూ నివాసులను గయ్యము నందు స్థిరుండు రాముఁడే
  పావనుఁ డైన పంక్తిరథు భార్యకు నెవ్వతె ముందు వుట్టె నా
  దేవకికిన్ జనించెను యుధిష్ఠిరుఁ డా దశకంఠుఁ జంపఁగన్

  రిప్లయితొలగించండి
 22. <¤> శంకరాభరణం సమస్య <¤>
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  దేవకికిన్ జనించెను యుదిష్టరుడా దశకంఠు
  జంపగన్ 13/4
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  క్రమాలంకారములో పూరణ

  పావనుడా మురారి కడు భాసురు
  డేరికి పుట్టె ధాత్రిపై?
  భావిని కుంతి యగ్ర సుతు భవ్యపు
  నామమ దేమి? విష్ణువే
  భావుక నామ రాముడయి వాసురపై
  జనియించెనెందుకున్?
  దేవకికిన్ జనించెను, యుదిష్టరుడా ,
  దశకంఠు జంపగన్.
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~

  రిప్లయితొలగించండి
 23. డా బల్లూరి ఉమాదేవి
  శంకరాభరణం గ్రూప్ వారిచ్చిన సమస్యలకు నా పూరణలు.

  *"దేవకీపుత్రుఁడయ్యె యుధిష్ఠిరుండు”*
  (లేదా...)
  *"దేవకికిన్ జనించెను యుధిష్ఠిరుఁ డా దశకంఠుఁ జంపఁగన్”*  ద్వాపరమందుకృష్ణుడన దానవసంహరణార్థమై,పృథా
  దేవికి జ్యేష్టపుత్రుడయిదీటుగ రాజ్యమునేలెచక్కగా
  పావనిరామచంద్రునకుబంటుగమారుచుచేసెసాయమున్
  *దేవకికిన్ జనించెను యుధిష్ఠిరుఁ డా దశకంఠుఁ జంపఁగన్.

  ‌పాండుసుతులకుముదమున బావయగుచు
  ద్వాపర యుగమునహరియే వసుధయందు
  *"దేవకీపుత్రుఁడయ్యె :యుధిష్ఠిరుండు”*
  పృథకునుసుతుడై చక్కగా పృథ్వినేలె.


  జగతి జనులనుచేయగ జాగృతమును
  నవతరించగ నెంచుచు నచ్యుతుండు
  *"దేవకీపుత్రుఁడయ్యె :యుధిష్ఠిరుండు”*
  భక్తితో నతని గొలిచి పడసె దయను


  రిప్లయితొలగించండి
 24. కావగఋలోకమున్ మఱియు కంసుని జంపగకృష్ణుడే చెఱన్
  దేవకికిన్ జనించెను,యుధిష్ఠిరుడా దశకంఠు జంపగన్
  బావన మూర్తి యాహరియెఋభార్గవ రాముని ముందువానిగా
  నీవసుధాతలంబుననె నిచ్చెను జన్మను రామచంద్రుగాన్

  రిప్లయితొలగించండి

 25. సవరణతో
  కావగనెంచిశిష్టులనుకంతుపితుండగుకృష్ణుడే;పృథా
  దేవికి జ్యేష్టపుత్రుడయిదీటుగ రాజ్యమునేలెచక్కగా
  పావనిరామచంద్రునకుబంటుగమారుచుచేసెసాయమున్
  *దేవకికిన్ జనించెను యుధిష్ఠిరుఁ డా దశకంఠుఁ జంపఁగన్.

  రిప్లయితొలగించండి