13, మార్చి 2022, ఆదివారం

సమస్య - 4019

14-3-2022 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ధర్మాచరణమ్ము గనఁగ దానవగుణమౌ”
(లేదా...)
“ధర్మము నాచరించుటయె దానవనైజము మానఁగాఁ దగున్”

19 కామెంట్‌లు:


  1. మర్మమ్మెఱంగు మంటిని
    నిర్మొహమాటముఁ దెలిపెద నెత్తురు ద్రావుల్
    శర్మా కాంచగ సతతమ
    ధర్మాచరణమ్ము గనఁగ దానవగుణమౌ.

    రిప్లయితొలగించండి
  2. గురువుగారూ,గచ్ఛామ శివాఁస్తేపంథానస్సన్తు,మీమార్గముశుభకరమగుగాక

    రిప్లయితొలగించండి
  3. అర్మిలిమ్రొక్కకపరమును
    కర్మమునకుకర్తయనుచుఘనుడైతానే
    మర్మముతెలియనిమూఢున
    ధర్మాచరణమ్ముగనగదానవగుణమౌ

    రిప్లయితొలగించండి
  4. నిర్మల మదితో మెలగుట
    ధర్మాచరణమ్ము ; గనఁగ దానవగుణమౌ
    దుర్మతితో పర పీడన ,
    ధర్మాధర్మము లెరుగుట దప్పదు మనగన్

    రిప్లయితొలగించండి
  5. మయసభలో జరిగిన అవమానమునకు దుర్యోధనుని మనోభావన...

    కందం
    కూర్మిని బిలిచియు మయసభ
    నిర్మాణము విడిదిఁ జేసి నీచత్వమనన్
    దుర్మద పరిహాసమన న
    ధర్మాచరణమ్ము గనఁగ దానవగుణమౌ!

    ఉత్పలమాల
    మర్మలెరుంగలేక నను మానితరీతిని బిల్వ గొప్పగన్
    నిర్మితమైన నీ సభను నిల్చితి ద్రౌపది పంచ భర్తృకన్
    దుర్మద నుంచి మమ్మిటుల దుర్భరరీతి పరాభవించు దు
    ర్ధర్మము నాచరించుటయె దానవనైజము మానఁగాఁ దగున్!

    రిప్లయితొలగించండి

  6. నిర్మొహమాటమున్ దెలిపె స్నేహితు డొక్కడు బుద్ధిచెప్పుచున్

    శర్మను దుష్టశీలునొక సద్గుణ వంతునిగాను మార్చ కా

    కర్మల చక్కబెట్టుచు వికారపు బుద్ధులతో విరుద్ధమౌ

    ధర్మము నాచరించుటయె దానవనైజము, మానఁగాఁ దగున్.

    రిప్లయితొలగించండి
  7. నిర్మల చిత్తులు మెత్తురు
    ధర్మాచరణము : గనగ దానవ గుణమౌ
    కర్మలతో హింసించుచు
    ధర్మము విడనాడి మెలగు తామసుల నిలన్

    రిప్లయితొలగించండి
  8. కర్మ ఫలంబుచే మనిషిగా జనియించితి
    వీవు ధాత్రిపై
    నిర్మల నీతి కార్యములు నీవొనరించుము
    పుణ్యసిద్ధికై
    మర్మమెరుంగు మానవుడ మారుము
    మంచిగ లోకమందు దు
    ర్ధర్మము నాచరించటయె దానవ నైజము
    మానగా దగున్.

    రిప్లయితొలగించండి
  9. ధర్మముతప్పనిపాలన
    ధర్మాత్ములుచేసిచూపి తరియించితిరే
    దుర్మతులౌ పాలకుల య
    ధర్మాచరణమ్ము గనఁగ దానవగుణమౌ

    రిప్లయితొలగించండి
  10. తీర్మానించి తిరుగబడి,
    ఖర్మము విడి తెల్లవాడి కైవడిఁ నడువన్
    దుర్మదులై యువతరపు న
    ధర్మాచరణమ్ము గనఁ గదా నవగుణమౌ||
    (ఖర్మము = పౌరుషము)

    రిప్లయితొలగించండి
  11. ధర్మాధర్మములందలి
    మర్మమెరిగి తగినరీతి మసలిన నదియే
    వర్మమువలెఁ గాపాడున
    ధర్మాచరణమ్ము గనఁగ దానవగుణమౌ


    ధర్మమునాచరింపనది దప్పక రక్షణఁజేయునన్ననీ
    మర్మమెరింగి మానవులు మాన్యతనొందగఁ జేయు ధర్మమే
    వర్మమువోలె గాచుఁ పెఱవారికి కీడొనగూర్చు నట్టిదౌ
    ధర్మము నాచరించుటయె దానవనైజము మానఁగాఁ దగున్

    రిప్లయితొలగించండి
  12. కం.
    నిర్మల చిత్తము వీడుచు
    మర్మము నెరుగక మసలెడి మనుజునిగా స
    త్కర్మల త్యజించినట్టి య
    *ధర్మాచరణమ్ము గనఁగ దానవగుణమౌ*

    ఉ.మా.
    నిర్మల చిత్తమున్విడచి నీతికి తావు నసమ్మతించగన్
    మర్మమగోచరంబగుచు మార్గము నెంచి స్వకామియౌచు స
    త్కర్మలనజ్జగించగను గాలము నెట్టుచు నా విరుద్ధమౌ
    *ధర్మము నాచరించుటయె దానవనైజము మానఁగాఁ దగున్*

    రిప్లయితొలగించండి
  13. పేర్మిని గోరుచు కర్ణుని
    ధర్మద్రోహగు కురుపతి దగ్గర దీయన్
    కూర్మిని స్నేహ మదనుచున్
    ధర్మాచరణమ్ము గనఁగ దానవగుణమౌ”

    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటర్.

    రిప్లయితొలగించండి
  14. వర్మా!యవశ్యము మనకు
    ధర్మాచరణమ్ము, గనగ దానవగుణమౌ
    మర్మములను బురిగొలిపెడు
    దుర్మార్గపు బుద్ధిగలుగు దురితుల కెపుడున్

    రిప్లయితొలగించండి
  15. దుర్మతిఁ ద్యజించి యింపుగ
    నిర్మల చిత్తమ్ము నూని నిత్యమ్మును స
    త్కర్మముల నీ వవశ్యము
    ధర్మాచరణమ్ము గనఁగ దానవ! గుణమౌ


    ధర్మమె స్వీయ భ్రాతలకు దారుణ మత్సర మూనఁగా మహా
    కర్ములె యాదితేయు లగు కశ్యప సూనులు దైత్య దానవుల్
    ధర్మ విభేద మున్న నొక తండ్రి కుమారులె యందు సంత తా
    ధర్మము నాచరించుటయె దానవ నైజము మానఁగాఁ దగున్

    రిప్లయితొలగించండి
  16. ధర్మము నాచరించుటయె దానవనైజము మానఁగాఁ దగున్
    ధర్మము నాచరించునెడ దప్పక రక్షణ జేయుగావుతన్
    మర్మము జేయకెప్పుడును మాన్యతనొందుచు నెల్లవేళ స
    త్కర్మలుసేయుచున్భువిని కర్మవిరుద్ధముజేయకుండుతన్

    రిప్లయితొలగించండి

  17. కర్మలయందు నైష్ఠ్యమున
    గాంచవలె న్విపులార్థ భావమున్
    నిర్మల తత్వ సంపదను
    నిశ్చలమై బలమూను ధ్యేయమున్
    శర్మదమౌ విధానమున
    సాధన జేయగ నోపు....గాక నా
    ధర్మము నాచరించుటయె
    దానవ నైజము-మానఁగాఁ దగున్!

    రిప్లయితొలగించండి