8-3-2022 (మంగళవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“అగ్నికీలపైఁ జీమ నృత్యమ్మొనర్చె”(లేదా...)“నేరుపుతోఁ బిపీలికయె నృత్యమొనర్చెను వహ్నికీలపై”
చిన్న దేశమ్ము పోరున చిరుతయేనుజనులు క్రమశిక్షణ గలిగి చాలనమునచనిరి రణరంగమునకేగజాలకున్నఅగ్నికీలపైఁ జీమ నృత్యమ్మొనర్చె!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధన్యవాదములార్యా!🙏
తమ్మి మొగ్గరమున్ జొచ్చి తరుణుడైనమఘవ నందనసుతుడభిమన్యుడచటద్రోణ కర్ణుల నెదిరింప త్రోపు నందుఅగ్నికీలపై జీమ నృత్యమ్మొనర్చె.
ఆరునుశత్రులందరునుహంగులుజూపుచువిస్తరిల్లగాచేినచేతనత్వమునఛీయనిరోయుచుజాగరూకతన్భూరినలౌకికంబునగుబోధనుమానసముత్సహింపగానేరుపుతోబిపీలికమెనృత్యమొనర్చెనువహ్నికీలపైనేరుపుతోపిపీలికమె
మీ పూరణ బాగున్నది. అభినందనలు. చేరిన చేతనత్వమున... టైపాటు.
దృష్టితీక్ష్ణంబుగాగనుఋషిగనపుడుసర్వమంగళసాధువైసాధనమునలలనతోషంబునందుచులాస్యయయ్యెఅగ్నికీలపైజీమనృత్యంబొనర్చె
తేటగీతిగర్భమందున నుండు సందర్భమందెతమ్మిమొగ్గరమున్ విని తండ్రి చెప్పఁజిరుతఁడభిమన్యుఁడాపైనఁ జెలఁగననిరినగ్నికీలపైఁ జీమ నృత్యమ్మొనర్చె!ఉత్పలమాలపారును వ్యూహమంచునట పార్థుఁడు లేడని కౌరవాధముల్గూరుపఁ దమ్మిమొగ్గరము గొబ్బున నా నభిమన్యుఁడేగుచున్జీరెను బాలుఁడై పరులఁ జిందుల గర్భమునందె విన్నదౌనేరుపుతోఁ బిపీలికయె నృత్యమొనర్చెను వహ్నికీలపై!
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
🙏ధన్యోస్మి గురుదేవా!🙏
శత్రువుల తోడ పోరగ సాహసించి వెడలె బాల చంద్రుండు దా వెరువ కుండ తఱచి చూడగ ననుపించ దాని గూర్చి యగ్ని కీలపై జీమ నృత్య మ్మొ నర్చె ననుచు పలికిరి గాంచుచు నబ్బు రము గ
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'హతవిధి+అంచు' అన్నపుడు సంధి లేదు. యడాగమం వస్తుంది. "హతవిధి యని" అనండి.
తేటగీతిఅగ్ని వైద్య మతః పరం, హతవిధి యనిసుశిఖ కీలల గాల్చిన సూది జేతవాత బెట్ట దలచెనొక వ్యాధితుండుఅగ్ని కీలపై జీమ నృత్యమ్మొనర్చెప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రిఉండవల్లి సెంటర్.(అగ్ని వైద్యంమని వాతలు పెట్టు ప్రక్రియ.అన్ని వైద్యాలు అయిన పిమ్మట చేయు వైద్యం) గురువు గారు.
నారి సుభద్ర నందనుడు నాయన లేడని లోటు పూడ్చగన్ దూరెను తమ్మిమొగ్గరము ద్రోణుడు పన్నిన వ్యూహమందునన్ వీరపరాక్రమాన్వితుల పేరడగించుచు సాగె ముందుకున్ నేరుపు తోఁ బిపీలికయె నృత్యమొనర్చెను వహ్ని కీలపై.
శూరుడు శస్త్ర విద్యలను క్షుణ్ణముగానెరుగర్జనుండటన్పోరొనరించ రాడనియు పూనియు పన్నిరితమ్మి మొగ్గరంబారయ కౌరవుల్ ,వెడలె నాయభి మన్యుడుబాలకుండు తానేరుపుతో బిపీలికము నృత్యమొనర్చెను వహ్ని కీలిపై
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
బాలుడైనను జొచ్చెను భండనమునవైరిమూకల నడుమకు పార్థ సుతుఁడువిక్రమముఁగన చాలవు వేయి కన్నులగ్నికీలపైఁ జీమ నృత్యమ్మొనర్చె
రవి యెపుడు కుంగకుండు సామ్రాజ్యమునకుదేశము విడిచి వెళ్ళుటె తిన్నదనుచుతలచ జేసిన గాంథి వి ధమును జూడఅగ్నికీలపైఁ జీమ నృత్యమ్మొనర్చె
మరుఁడు సంధించి శరములు మరల మరలవిడువ వివశుఁడై పడిపోయె మృడుఁడు మన్మథాగ్ని కీలపైఁ,జీమనృత్యమ్మొనర్చెపుష్ప బాణమ్ములందొప్పి మురిపెముగను.చేరువ దాగియుండి శశిశేఖరుపై సుమసాయకమ్ములన్మారుఁడు వేయ మాటికిని మన్మథ కీలలఁజిక్కె నాతఁడున్మారుని సూనబాణముల మధ్యను నొప్పుచు సంతసంబునన్నేరుపుతో పిపీలికయె నృత్యమొనర్చెను వహ్నికీలలన్.
నిత్య కృత్యమై హోమము నిర్వహించునీమముగలమహర్షి తానెరప నెంచెయజ్ఞ మానాడు తత్సమయమ్మున 'జమదగ్ని' కీలపైఁ జీమ నృత్యమ్మొనర్చెకీల = మోచేతిదిబ్బ
యూరపు శీతకాలమున నుష్ణముకై యొక నిప్పుగూటినిన్వారగ యున్న యద్దపు గవాక్షము మీదన గంతులాడెనోహీర, గభాల్న చూడనిటు లింగిలమున్ యది తోచెనిట్టులేనేరుపుతోఁ బిపీలికయె నృత్యమొనర్చెను వహ్నికీలపై||
నిప్పుగూడు = fireplace
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'ఉష్ణమునకై' అనడం సాధువు. *... నుష్ణము గోరుచు నిప్పు... వారగ నున్న... మీదను ... లింగిలమున్ గన.." అనండి.
ఉ.మా.దారుణ కృత్యముల్సలుపు దానవు లెందరొ చుట్టునుండగన్భారము మోయు ధారుణిగ భారత నారియె యోర్పుతోడుతన్మారుచు శక్తిరూపిణిగ మానవ దృక్కుల దీరుమార్చగా*నేరుపుతోఁ బిపీలికయె నృత్యమొనర్చెను వహ్నికీలపై*
హోమ గుండపు దెఱపైన హొయల వోలె గదులు చుండగ చిత్రముగా గనబడె నగ్ని కీలపై జీమ నృత్యమ్మొనర్చె జూడ వింతగా నుండును జూపరులకు
చెట్టు పైనను గాకుండఁ బుట్ట లోనఁ గాక మఱి యింటి లో నైనఁ గాక యకట చేతి లోనఁ జెలంగెడుఁ జిత్ర మగు నిరగ్నికీలపైఁ జీమ నృత్యమ్మొనర్చెవారక కీటకం బొకటి ప్రాణములం గొని విఱ్ఱవీఁగుచున్ వీర విహార ముద్ధతిని బిట్టుగఁ జేయుచు నాక్రమించెనే దారుణ శస్త్ర సంచయము తద్దయుఁ గల్గిన విశ్వ మూర్ధమున్ నేరుపుతోఁ బిపీలికయె నృత్యమొనర్చెను వహ్నికీలపై
ఆరని హోమగుండమున కావల దూరమునందు చేలపై నేరుపుతో బిపీలికయె నృత్యమొనర్చెను వహ్నికీలపై యీరకమైన వింతకల యేర్పడి వచ్చెను జిత్రమయ్యెడిన్ దూరుపు తెల్లవారెననిదోచుట చేతను నిద్రలేచితిన్
చిన్న దేశమ్ము పోరున చిరుతయేను
రిప్లయితొలగించండిజనులు క్రమశిక్షణ గలిగి చాలనమున
చనిరి రణరంగమునకేగజాలకున్న
అగ్నికీలపైఁ జీమ నృత్యమ్మొనర్చె!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదములార్యా!🙏
తొలగించండి
రిప్లయితొలగించండితమ్మి మొగ్గరమున్ జొచ్చి తరుణుడైన
మఘవ నందనసుతుడభిమన్యుడచట
ద్రోణ కర్ణుల నెదిరింప త్రోపు నందు
అగ్నికీలపై జీమ నృత్యమ్మొనర్చె.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఆరునుశత్రులందరునుహంగులుజూపుచువిస్తరిల్లగా
రిప్లయితొలగించండిచేినచేతనత్వమునఛీయనిరోయుచుజాగరూకతన్
భూరినలౌకికంబునగుబోధనుమానసముత్సహింపగా
నేరుపుతోబిపీలికమెనృత్యమొనర్చెనువహ్నికీలపై
నేరుపుతోపిపీలికమె
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిచేరిన చేతనత్వమున... టైపాటు.
దృష్టితీక్ష్ణంబుగాగనుఋషిగనపుడు
రిప్లయితొలగించండిసర్వమంగళసాధువైసాధనమున
లలనతోషంబునందుచులాస్యయయ్యె
అగ్నికీలపైజీమనృత్యంబొనర్చె
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితేటగీతి
రిప్లయితొలగించండిగర్భమందున నుండు సందర్భమందె
తమ్మిమొగ్గరమున్ విని తండ్రి చెప్పఁ
జిరుతఁడభిమన్యుఁడాపైనఁ జెలఁగననిరి
నగ్నికీలపైఁ జీమ నృత్యమ్మొనర్చె!
ఉత్పలమాల
పారును వ్యూహమంచునట పార్థుఁడు లేడని కౌరవాధముల్
గూరుపఁ దమ్మిమొగ్గరము గొబ్బున నా నభిమన్యుఁడేగుచున్
జీరెను బాలుఁడై పరులఁ జిందుల గర్భమునందె విన్నదౌ
నేరుపుతోఁ బిపీలికయె నృత్యమొనర్చెను వహ్నికీలపై!
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి🙏ధన్యోస్మి గురుదేవా!🙏
తొలగించండిశత్రువుల తోడ పోరగ సాహసించి
రిప్లయితొలగించండివెడలె బాల చంద్రుండు దా వెరువ కుండ
తఱచి చూడగ ననుపించ దాని గూర్చి
యగ్ని కీలపై జీమ నృత్య మ్మొ నర్చె
ననుచు పలికిరి గాంచుచు నబ్బు రము గ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'హతవిధి+అంచు' అన్నపుడు సంధి లేదు. యడాగమం వస్తుంది. "హతవిధి యని" అనండి.
తేటగీతి
తొలగించండిఅగ్ని వైద్య మతః పరం, హతవిధి యని
సుశిఖ కీలల గాల్చిన సూది జేత
వాత బెట్ట దలచెనొక వ్యాధితుండు
అగ్ని కీలపై జీమ నృత్యమ్మొనర్చె
ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటర్.
(అగ్ని వైద్యంమని వాతలు పెట్టు ప్రక్రియ.అన్ని వైద్యాలు అయిన పిమ్మట చేయు వైద్యం) గురువు గారు.
రిప్లయితొలగించండినారి సుభద్ర నందనుడు నాయన లేడని లోటు పూడ్చగన్
దూరెను తమ్మిమొగ్గరము ద్రోణుడు పన్నిన వ్యూహమందునన్
వీరపరాక్రమాన్వితుల పేరడగించుచు సాగె ముందుకున్
నేరుపు తోఁ బిపీలికయె నృత్యమొనర్చెను వహ్ని కీలపై.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిశూరుడు శస్త్ర విద్యలను క్షుణ్ణముగానెరు
రిప్లయితొలగించండిగర్జనుండటన్
పోరొనరించ రాడనియు పూనియు పన్నిరి
తమ్మి మొగ్గరం
బారయ కౌరవుల్ ,వెడలె నాయభి మన్యుడు
బాలకుండు తా
నేరుపుతో బిపీలికము నృత్యమొనర్చెను
వహ్ని కీలిపై
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిబాలుడైనను జొచ్చెను భండనమున
రిప్లయితొలగించండివైరిమూకల నడుమకు పార్థ సుతుఁడు
విక్రమముఁగన చాలవు వేయి కన్ను
లగ్నికీలపైఁ జీమ నృత్యమ్మొనర్చె
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిరవి యెపుడు కుంగకుండు సామ్రాజ్యమునకు
రిప్లయితొలగించండిదేశము విడిచి వెళ్ళుటె తిన్నదనుచు
తలచ జేసిన గాంథి వి ధమును జూడ
అగ్నికీలపైఁ జీమ నృత్యమ్మొనర్చె
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమరుఁడు సంధించి శరములు మరల మరల
రిప్లయితొలగించండివిడువ వివశుఁడై పడిపోయె మృడుఁడు మన్మ
థాగ్ని కీలపైఁ,జీమనృత్యమ్మొనర్చె
పుష్ప బాణమ్ములందొప్పి మురిపెముగను.
చేరువ దాగియుండి శశిశేఖరుపై సుమసాయకమ్ములన్
మారుఁడు వేయ మాటికిని మన్మథ కీలలఁజిక్కె నాతఁడున్
మారుని సూనబాణముల మధ్యను నొప్పుచు సంతసంబునన్
నేరుపుతో పిపీలికయె నృత్యమొనర్చెను వహ్నికీలలన్.
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండినిత్య కృత్యమై హోమము నిర్వహించు
రిప్లయితొలగించండినీమముగలమహర్షి తానెరప నెంచె
యజ్ఞ మానాడు తత్సమయమ్మున 'జమ
దగ్ని' కీలపైఁ జీమ నృత్యమ్మొనర్చె
కీల = మోచేతిదిబ్బ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండియూరపు శీతకాలమున నుష్ణముకై యొక నిప్పుగూటినిన్
రిప్లయితొలగించండివారగ యున్న యద్దపు గవాక్షము మీదన గంతులాడెనో
హీర, గభాల్న చూడనిటు లింగిలమున్ యది తోచెనిట్టులే
నేరుపుతోఁ బిపీలికయె నృత్యమొనర్చెను వహ్నికీలపై||
నిప్పుగూడు = fireplace
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'ఉష్ణమునకై' అనడం సాధువు. *... నుష్ణము గోరుచు నిప్పు... వారగ నున్న... మీదను ... లింగిలమున్ గన.." అనండి.
ఉ.మా.
రిప్లయితొలగించండిదారుణ కృత్యముల్సలుపు దానవు లెందరొ చుట్టునుండగన్
భారము మోయు ధారుణిగ భారత నారియె యోర్పుతోడుతన్
మారుచు శక్తిరూపిణిగ మానవ దృక్కుల దీరుమార్చగా
*నేరుపుతోఁ బిపీలికయె నృత్యమొనర్చెను వహ్నికీలపై*
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిహోమ గుండపు దెఱపైన హొయల వోలె
రిప్లయితొలగించండిగదులు చుండగ చిత్రముగా గనబడె
నగ్ని కీలపై జీమ నృత్యమ్మొనర్చె
జూడ వింతగా నుండును జూపరులకు
చెట్టు పైనను గాకుండఁ బుట్ట లోనఁ
రిప్లయితొలగించండిగాక మఱి యింటి లో నైనఁ గాక యకట
చేతి లోనఁ జెలంగెడుఁ జిత్ర మగు ని
రగ్నికీలపైఁ జీమ నృత్యమ్మొనర్చె
వారక కీటకం బొకటి ప్రాణములం గొని విఱ్ఱవీఁగుచున్
వీర విహార ముద్ధతిని బిట్టుగఁ జేయుచు నాక్రమించెనే
దారుణ శస్త్ర సంచయము తద్దయుఁ గల్గిన విశ్వ మూర్ధమున్
నేరుపుతోఁ బిపీలికయె నృత్యమొనర్చెను వహ్నికీలపై
ఆరని హోమగుండమున కావల దూరమునందు చేలపై
రిప్లయితొలగించండినేరుపుతో బిపీలికయె నృత్యమొనర్చెను వహ్నికీలపై
యీరకమైన వింతకల యేర్పడి వచ్చెను జిత్రమయ్యెడిన్
దూరుపు తెల్లవారెననిదోచుట చేతను నిద్రలేచితిన్