19-3-2022 (శనివారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“సామాన్యుఁడు వేంకటపతి సంపద లొసఁగున్”(లేదా...)“సామాన్యుండగు వేంకటేశుఁ డిడు నిష్టశ్రీలు సంపూర్తిగన్”
కందంనామస్తోత్రము సేయుచుజీమూతమునెక్కి వేచి స్థిరచిత్తముతోరోమాంచితుడై గాంచఁగసామాన్యుఁడు, వేంకటపతి సంపద లొసఁగున్శార్దూలవిక్రీడితమునామస్తోత్రము సేయుచున్ మిగుల తా నత్యంత భక్త్యాత్ముఁడైజీమూతమ్మును మెట్టులెక్కి వరుసన్ జేకొట్టి గోవిందునిన్రోమాంచమ్మున శ్రీనివాసమున నాలోకించు వాడాతఁడేసామాన్యుండగు, వేంకటేశుఁ డిడు నిష్టశ్రీలు సంపూర్తిగన్!
నీమము తప్పక దేవునినామము మదిలో తలచుచు నారాధించన్ సామాన్యజనులకైన నసామాన్యుఁడు వేంకటపతి సంపద లొసఁగున్
భామావినుమీదేవుడుతామానకనుండుమనకుదాపునదయతోవేమరుపిలచినచాలునుసామాన్యుడు;వేంకటపతిసంపదలొసగున్
తామరకంటి సుచిశ్రువుడా మధుసూదనుడతండు యజ్ఞేశ్వరుడౌ శ్రీమంతుని కొలిచిన హంసా! మాన్యుఁడు వేంకటపతి సంపద లొసఁగున్.
కామిత వరదు డటంచును నీమము తో నామ జపము నిష్టగ సత మున్ ప్రేమగ భక్తిన్ వేడగ సామాన్యుడు : వేంకట పతి సంపద లొసఁగున్
తోమాలన్నిజభక్తులన్గనుచుతాతోనుండునెల్లప్పుడున్భూమిన్జూడగవేల్పునైప్రజకుతాభోగంపువాసుండుపోరామిన్కొండకుపేదయైనరుడుసంరంభంబువేవచ్చి;తాసామాన్యుండగు;వేంకటేశుడిడునిష్టశ్రీలుసంపూర్తిగన్
నీమముతో భక్తులు కరుణామయుడౌ వేంకటాద్రి నాథుని మ్రోలన్తామసభావము వీడ నసామాన్యుఁడు వేంకటపతి సంపద లొసఁగున్
హే! ముంగొంగులతండ్రి నాకికను నీవే దిక్కుగా నెంచి నీ నామంబే నను బ్రోచునంచు మదిలోనన్ నమ్మినన్ జాలునే క్షేమంబొప్పగ జేయు పుట్టు వడుగా శ్రీనాథుడే నమ్ము హంసా! మాన్యుండగు వేంకటేశుఁడిడు నిష్టశ్రీలు సంపూర్తిగన్.
నామాల వాన్కి ముడుపిడెసామాన్యుఁడు ; వేంకటపతి సంపద లొసఁగున్నేమఱక డింగరీలకు ,చామర సేవను నిరతము సలుపుచు నుండన్
శ్రీమంతుండగు వేంకటాద్రిపతి సంక్షేమంబు జేకూర్చగన్సామాన్యుండని గొప్పవాడనుచు వైషమ్యంబు చూపించకన్ నీమంబొప్పగ భక్తితత్పరతతోనెమ్మిన్ భజింపంగ దాసామాన్యుండగు, వేంకటేశుఁ డిడు నిష్టశ్రీలు సంపూర్తిగన్
కం.శ్రీమన్నారాయుణుడేకామితముల దీర్చునంచు కలియుగ మందున్నీమంబున కొలువగ నొకసామాన్యుడు వేంకటపతి సంపదలొసగున్✍️ తిరివీధి శ్రీమన్నారాయణ
దామోదరునకు హరి కా శ్రీమన్నారాయణునకు లేఁడు సముండే నేమమ్మునఁ బూజించిన సామాన్యుఁడు వేంకటపతి సంపద లొసఁగున్భామా ద్వంద్వ వివాద కారణమునం బ్రాప్తాశ్మ రూపుండు నాహా మాహాత్మ్యము నందు విశ్రుతుఁడు దేవారాధ్యుఁడౌ యా పరం ధాముం డెన్నఁడు స్వీయ భక్తునకు స్వాంతం బందు బందీకృ తా సామాన్యుం డగు వేంకటేశుఁ డిడు నిష్టశ్రీలు సంపూర్తిగన్
కందం
రిప్లయితొలగించండినామస్తోత్రము సేయుచు
జీమూతమునెక్కి వేచి స్థిరచిత్తముతో
రోమాంచితుడై గాంచఁగ
సామాన్యుఁడు, వేంకటపతి సంపద లొసఁగున్
శార్దూలవిక్రీడితము
నామస్తోత్రము సేయుచున్ మిగుల తా నత్యంత భక్త్యాత్ముఁడై
జీమూతమ్మును మెట్టులెక్కి వరుసన్ జేకొట్టి గోవిందునిన్
రోమాంచమ్మున శ్రీనివాసమున నాలోకించు వాడాతఁడే
సామాన్యుండగు, వేంకటేశుఁ డిడు నిష్టశ్రీలు సంపూర్తిగన్!
నీమము తప్పక దేవుని
రిప్లయితొలగించండినామము మదిలో తలచుచు నారాధించన్
సామాన్యజనులకైన న
సామాన్యుఁడు వేంకటపతి సంపద లొసఁగున్
భామావినుమీదేవుడు
రిప్లయితొలగించండితామానకనుండుమనకుదాపునదయతో
వేమరుపిలచినచాలును
సామాన్యుడు;వేంకటపతిసంపదలొసగున్
రిప్లయితొలగించండితామరకంటి సుచిశ్రువు
డా మధుసూదనుడతండు యజ్ఞేశ్వరుడౌ
శ్రీమంతుని కొలిచిన హం
సా! మాన్యుఁడు వేంకటపతి సంపద లొసఁగున్.
కామిత వరదు డటంచును
రిప్లయితొలగించండినీమము తో నామ జపము నిష్టగ సత మున్
ప్రేమగ భక్తిన్ వేడగ
సామాన్యుడు : వేంకట పతి సంపద లొసఁగున్
తోమాలన్నిజభక్తులన్గనుచుతాతోనుండునెల్లప్పుడున్
రిప్లయితొలగించండిభూమిన్జూడగవేల్పునైప్రజకుతాభోగంపువాసుండుపో
రామిన్కొండకుపేదయైనరుడుసంరంభంబువేవచ్చి;తా
సామాన్యుండగు;వేంకటేశుడిడునిష్టశ్రీలుసంపూర్తిగన్
నీమముతో భక్తులు కరు
రిప్లయితొలగించండిణామయుడౌ వేంకటాద్రి నాథుని మ్రోలన్
తామసభావము వీడ న
సామాన్యుఁడు వేంకటపతి సంపద లొసఁగున్
రిప్లయితొలగించండిహే! ముంగొంగులతండ్రి నాకికను నీవే దిక్కుగా నెంచి నీ
నామంబే నను బ్రోచునంచు మదిలోనన్ నమ్మినన్ జాలునే
క్షేమంబొప్పగ జేయు పుట్టు వడుగా శ్రీనాథుడే నమ్ము హం
సా! మాన్యుండగు వేంకటేశుఁడిడు నిష్టశ్రీలు సంపూర్తిగన్.
నామాల వాన్కి ముడుపిడె
రిప్లయితొలగించండిసామాన్యుఁడు ; వేంకటపతి సంపద లొసఁగున్
నేమఱక డింగరీలకు ,
చామర సేవను నిరతము సలుపుచు నుండన్
శ్రీమంతుండగు వేంకటాద్రిపతి సంక్షేమంబు జేకూర్చగన్
రిప్లయితొలగించండిసామాన్యుండని గొప్పవాడనుచు వైషమ్యంబు చూపించకన్
నీమంబొప్పగ భక్తితత్పరతతోనెమ్మిన్ భజింపంగ దా
సామాన్యుండగు, వేంకటేశుఁ డిడు నిష్టశ్రీలు సంపూర్తిగన్
కం.
రిప్లయితొలగించండిశ్రీమన్నారాయుణుడే
కామితముల దీర్చునంచు కలియుగ మందున్
నీమంబున కొలువగ నొక
సామాన్యుడు వేంకటపతి సంపదలొసగున్
✍️ తిరివీధి శ్రీమన్నారాయణ
దామోదరునకు హరి కా
రిప్లయితొలగించండిశ్రీమన్నారాయణునకు లేఁడు సముండే
నేమమ్మునఁ బూజించిన
సామాన్యుఁడు వేంకటపతి సంపద లొసఁగున్
భామా ద్వంద్వ వివాద కారణమునం బ్రాప్తాశ్మ రూపుండు నా
హా మాహాత్మ్యము నందు విశ్రుతుఁడు దేవారాధ్యుఁడౌ యా పరం
ధాముం డెన్నఁడు స్వీయ భక్తునకు స్వాంతం బందు బందీకృ తా
సామాన్యుం డగు వేంకటేశుఁ డిడు నిష్టశ్రీలు సంపూర్తిగన్