28, మార్చి 2022, సోమవారం

సమస్య - 4034

29-3-2022 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“తీర్థయాత్ర లఘంబులఁ దీర్చునొక్కొ”
(లేదా...)
“వదలదు పాపసంచయము వాసిగఁ జేసిన తీర్థయాత్రలన్”

18 కామెంట్‌లు:

 1. అర్థకామములందుననాసపడక
  నిర్ధనంబుగతనదైననేర్పుతోడ
  వ్యర్థమెంతయులేనిదియానమందు
  తీర్థయాత్రలఘంబులదీర్చునొక్కొ

  రిప్లయితొలగించండి
 2. తేటగీతి
  మదిని దైవంపు గుడిఁజేసి సుదతిఁగూడి
  చిత్తశుద్ధిమై చేయంగఁ జిక్కుముక్తి
  యాలి వెంటగొని విహారయాత్రలనఁగఁ
  దీర్థయాత్ర లఘంబులఁ దీర్చునొక్కొ?

  చంపకమాల
  మదిని పరాత్పరున్ నిలిపి మంగళమందఁగ లోకమంతయున్
  సదనము వీడి సాధ్విఁ గొని శంకరుఁడాదిగ వేల్పులందరిన్
  ముదమునఁ గొల్చి వచ్చిననె ముక్తి ప్రదమ్ము, విహారదృష్టిమై
  వదలదు పాపసంచయము వాసిగఁ జేసిన తీర్థయాత్రలన్!

  రిప్లయితొలగించండి
 3. చేయ కూడని పనులెల్ల చేయుచుండి
  కపట భక్తిని ప్రకటంప కౌతుకమున
  ధనము వెచ్చించి దర్పాన ధరను సలుపు
  తీర్థ యాత్రల ఘంబులు దీర్చు నొక్కొ?

  రిప్లయితొలగించండి
 4. వేసవిన నాటవిడుపుగ వెడలు వీలు
  దొరికెనంచు దన మనసు తుష్టి నొందు
  రీతి బలు దేశముల విహరించ సలుపు
  తీర్థయాత్ర లఘంబులఁ దీర్చునొక్కొ

  రిప్లయితొలగించండి
 5. ఆటవెలది
  అరసి చూడ*తీర్థయాత్రలఘంబులు
  దీర్చు,నొక్కొ*కతఱి తీఱు రుజలు
  జ్ఞానమబ్బును బహుదానగుణమ్మును
  దైవభక్తి కలుగు తప్పకుండ.

  రిప్లయితొలగించండి
 6. మది యిసుమంత భక్తి ,పర మాత్మునిపై
  ననురక్తి లేకయున్,
  కుదురుగలేని చింతనము, కోర్కులకంతము
  లేని జీవికిన్
  వదలదు పాప సంచయము వాసిగ జేసిన
  తీర్థ యాత్రలున్
  వదలును పాతకమ్ము నిజ భక్తి మెయిన్
  హరి సంస్తుతించినన్.

  రిప్లయితొలగించండి
 7. తీర్థయాత్రలకై నాడు పార్థు డరగ
  దక్కె చిత్రాంగద యులూపి నిక్కువముగ
  తీర్థ యాత్రకై పాంథుడు తెప్పదెరల
  తీర్థయాత్ర లఘంబులఁ దీర్చునొక్కొ

  రిప్లయితొలగించండి
 8. పదిలముగామనమ్ము భగవంతుని పైనిడి,గంగ,కృష్ణ, న
  ర్మద,గయ,కంచి,కాశి,మధురల్ గని వచ్చిన వాని నెందుకై
  వదలదు పాపసంచయము?వాసిగఁజేసిన తీర్థయాత్రలన్
  వదలును కామక్రోధములు,వర్ధిల్లు పుణ్యము గల్గు మోక్షమున్.

  రిప్లయితొలగించండి
 9. వదలదు పాపసంచయము వాసిగఁ జేసిన తీర్థయాత్రలన్,
  మదమును మత్సరంబులను మానుచు జేసెడి యాత్ర లా సరో
  జదళనిభాక్షు భావనము సాంత్వన మిచ్చును భక్తకోటికిన్
  ముదముగ సర్వతీర్థముల పుణ్యము గల్గు దలంచినంతనే.

  రిప్లయితొలగించండి


 10. ధనమునార్జించు టొక్కటే ఘనమటంచు
  పరుల వంచించి భాగ్యమున్ బడయు వాడు
  తల్లిదండ్రుల హింసించు ప్రల్లదునకు
  తీర్థయాత్రలఘంబులఁ దీర్చునొక్కొ.


  ముదమగు రామనామమది మోక్షమునిచ్చు నటంచు కొల్చినన్

  వదులును కాని నిత్యము విభావరి పొందును గోరువారికిన్

  పదుగురి సొత్తు మ్రుచ్చిలుచు భాగ్యము పొందెడు వారికిన్ గనన్

  వదలదు పాపసంచయము వాసిగఁ జేసిన తీర్థయాత్రలన్.

  రిప్లయితొలగించండి
 11. కె.వి.యస్. లక్ష్మి, ఉడ్బర్రీ, అమెరికా:

  సదమల భక్తి భావనను సద్గతి గోరుచు ధన్యజీవియై
  ముదమును గూడి నిత్య పరిపూరిత చిత్తముతోడ నీశ్వరున్
  చదురుగ దల్చి సేవల నొసంగగలేక చరించు వానికిన్
  వదలదు పాప సంచయము వాసిగ జేసిన తీర్థయాత్రలన్.

  రిప్లయితొలగించండి
 12. త్తీర్ధ యాత్ర లఘంబుల దీర్చునొక్కొ
  తీర్ధయాత్ర లఘంబుల దీర్చ వార్య!
  భక్తి శ్రద్ధల తోడను బరమ శివుని
  బూజ జేయుట మూలాన పోవునఘము

  రిప్లయితొలగించండి
 13. భూత దయ నొకింతయు నైనఁ బూన కున్న
  దాన గుణము డెందమ్మునఁ గాన కున్నఁ
  బాప భీతిని వీడి పాపములు సేయఁ
  దీర్థ యాత్ర లఘంబులఁ దీర్చు నొక్కొ


  బెదరరు పాప క‌ర్ము లెదఁ బృథ్విని నిందు నిమిత్త మెన్నఁడుం
  బదపడి నీవు సంతతము వారక రక్తినిఁ బెక్కు శాస్త్రముల్
  చదివితి కాదె వీడు మిఁక సందియ మేల నరాళి కిద్ధరన్
  వదలదు పాప సంచయము వాసిగఁ జేసిన తీర్థ యాత్రలన్

  రిప్లయితొలగించండి
 14. వదలదు పాపసంచయము వాసిగ జేసినతీర్ధయాత్రలన్
  చదువగ బొత్తముల్దెలిసె సారసనేత్రుని గొల్వచేతనే
  వదలును బాపసంచయము వహ్నిని గాలెడు దూదివోలెసూ
  మదిని సదాశివున్ దలచి మంచిగ బ్రార్ధన జేయగా వలెన్

  రిప్లయితొలగించండి
 15. తే.గీ.॥
  దైవమందున సుంతయు ధ్యాసనిడక
  నెంత శ్రమపడి సలిపిన నేమిఫలము
  తీర్థయాత్ర లఘంబులఁదీర్చునొక్కొ?
  గుల్లయౌమేను జేబులు చిల్లుబడును

  చంపకమాల:
  చెదరిన ధ్యాసతో నరులు చేసెడియాత్రలఘంబు దీర్చునా?
  సదమల భక్తితో నజుని సన్నిధి జేరగ తీర్థయాత్రలన్
  ముదముగ సల్పగానెలమి, ముక్తికి మార్గము జూపు, నన్యథా
  వదలదు పాపసంచయము వాసిగఁ జేసిన తీర్థయాత్రలన్

  రిప్లయితొలగించండి
 16. తేటగీతి
  కామ, క్రోధ మోహాదులందే మునిగెడి
  వారు ,దైవము పై గౌరవాది శరణు
  గతియు లేని వారలు తీర్థ గాము లైన
  తీర్థయాత్ర లఘంబులు దీర్చు నొక్కొ?

  ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
  ఉండవల్లి సెంటర్.

  రిప్లయితొలగించండి
 17. మది వ్యసనమ్ములన్ నిలువ మద్యముఁ గ్రోలుచు, వేశ్యవాటికన్
  ముదమును పొందుచున్ సతము, పూజ్యుల మన్నన చేయకుండ, సొం
  పొదవు పదమ్మునన్ దిరుగు మూర్ఖుడు చేయ విహార భంగితో,
  వదలదు పాపసంచయము వాసిగఁ జేసిన తీర్థయాత్రలన్

  రిప్లయితొలగించండి