12, ఏప్రిల్ 2022, మంగళవారం

దత్తపది - 182

13-4-2022 (బుధవారం)
కవిమిత్రులారా,
'దర్భ - తిల - పిండ - శ్రాద్ధ' పదాలతో
రుక్మిణీ కళ్యాణ వృత్తాంతాన్ని గురించి
స్వేచ్ఛాఛందంలో పద్యం వ్రాయండి.

19 కామెంట్‌లు:

  1. ఆవిదర్భమందుఘనుడై హరియునిలిచె
    భీతిలప్రజయురుక్మినిపీఁచమణచె
    అండపిండముబ్రహ్మాండమందుతల్లి
    శ్రాద్ధసంగతిరుక్మిణిశక్తిగొలిచె

    రిప్లయితొలగించండి

  2. ఆ విదర్భ రాజసుతతో నగ్నిముఖుడు
    భీతిలకుమంచు చెప్పె నే వెడలి యండ
    పిండ బ్రహ్మాండ మేలెడు వీరు డతడు
    శ్రాద్ధ దేవుని జడిపించు శైలధరుని
    వెంట గొనితెత్తు నిక నిన్ను పెండ్లియాడ.

    రిప్లయితొలగించండి
  3. కందం
    వలచిన విదర్భ రాట్సుత
    తిలకము ధరియించి గౌరి దేవళము కడన్
    నిల నండపిండ బ్రహ్మాం
    డ లయుఁడు హరి కొనఁగ గంప శ్రాద్ధమ్మగునే?

    (గంపశ్రాద్ధము : అలవికాని భారము)

    రిప్లయితొలగించండి
  4. రాయబారిగ ను విదర్భ రాజ సుతయు
    పంప యదు కుల తిలకుని వద్ద జేరి
    అండ పిండము లేకమై యడ్డు పడిన
    శ్రాద్ధ మిడు రుక్మి కయ్యెడ శౌర్యముగన
    నుచు తెలియజేసె రుక్మిణి నోటి మాట

    రిప్లయితొలగించండి
  5. రిప్లయిలు
    1. తేటగీతి
      *శ్రాద్ధ*దేవుసన్నిధిఁజేర్చి శాత్రవులను
      దెసల నెచ్చెలి*పిండ*రుదెంచి కొలువ
      నుదుట కల్యాణ *తిల*కంబు సుదతులిడగ
      కృష్ణుఁడు వి*దర్భ*రాట్సుత కేలుపట్టె.

      తొలగించండి
  6. ఆ విదర్భ రాజకుమారి హస్తమంది
    ఖతిలకుని బోలు శ్రీకృష్ణుఁ గదన మందు,
    నలఘు డుద్దండ పిండంబు నాప దరమె?
    ద్వారకను జేరి వృద్ధి శ్రాద్ధంబు సేసె.

    వృద్ధి శ్రాద్ధం-వివాహాది శుభకర్యములలో అభ్యుదయాన్ని కోరి చేసే నాందీ శ్రాద్ధం. (ఆంధ్ర భారతి)

    రిప్లయితొలగించండి
  7. క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:

    కు(తిల) పడుచుండెడి వి(దర్భ) కువలయేశు
    పుత్రి కలలోన కృష్ణుడు పొదలి జెప్పె
    (శ్రాద్ధ)చిత్తయై రుక్మిణి సరిగ వినుము
    (పిండ)గలవాడ రుక్మిని భండనమున
    పెండ్లి యాడగలను నిన్ను ప్రేమ ననుచు.

    రిప్లయితొలగించండి
  8. *పిండ*నమొనర్చి శిశుపాల దండునెల్ల
    *శ్రాద్ధ* దేవునికడకంపు సత్వరమ్ము
    రమ్య మగురీతిని వి*దర్భ* రాజపుత్రి
    కేలు పట్టి హాయిని *తిల*కించవయ్య

    రిప్లయితొలగించండి
  9. కె.వి.యస్. లక్ష్మి, ఉడ్బర్రీ, అమెరికా:

    కు(తిల)పడ వలదీరీతి కుదురుకొనుము
    వినుమిది వి(దర్భ)రాట్సుత వివరముగను
    (శ్రాద్ధ) చింతన జేయుము శౌరి దలచి
    అండయగు నీకు రుక్మిని (పిండ) జేయు
    ననుచు నామెకు జెప్పెను నగ్నిజుండు.

    రిప్లయితొలగించండి
  10. భారతమున వి”దర్భ” నృపాలుని సుత
    కు”తిల” నెరిగి కృష్ణుడు తీసు కొనుచ బోవ
    పెనుగులాడ వచ్చిన వారి “ పిండ” మణచి
    సకియ రుక్మిణి గైకొనె “శ్రాద్ధ” ముగను

    రిప్లయితొలగించండి
  11. అండపిండముల్ బ్రహ్మాండమంతమైన
    యదుకులతిలకుడేపతియనితలంచి
    యెదురుచూడని సందర్భ మేదిలేదు
    రమణు రాకకై రుక్మిణి శ్రాద్ధగతిని

    రిప్లయితొలగించండి
  12. మధురాక్కర
    శ్రద్ధ గల విదర్భజ విచారమున దల్చె మనంబున
    శ్రాద్ధ దేవుడు తననేల చంప కున్నాడోయని
    శ్రద్ధగనె పిండపుష్పరాజముల గౌరిని పూజించి
    పద్ధతిన ప్రీతిల గని చేపట్టె యదు తిలకుని
    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటర్
    శ్రాద్ధ దేవుడు-యముడు ,పిండ పుష్పం -దాసనపు పువ్వు.

    రిప్లయితొలగించండి

  13. ఈనాడు శ్రీ కంది శంకరయ్య గా రిచ్చిన దత్తపది
    "తిల-పిండ-దర్భ-శ్రాద్ధ" అనే పదాలని ఉపయోగిస్తూ రుక్మిణీ కళ్యాణ విషయం గా స్వేచ్చాఛందస్సు లో పద్యం .
    నా పూరణ.

    (1)మ:తగు నీ పత్నిగ నీ విదర్భ భువి కాంతారత్నమే , ,యెంతొ యా
    శగనిన్ దల్చుచు భావనాయుతసుమిశ్రాద్ధమ్ముగా లేఖ చ
    క్కగ దా నొక్కటి శంక పిండగను నీ కారుణ్యమున్ నమ్మి వ్రా
    సెగ! కన్యాతిలకమ్మొనర్చు మనవిన్ చిత్తమ్మునన్ జేర్చుమా!
    (అద్ధము:సత్యము.భావనామయము,సత్యము కూడా కలిపి వ్రాసినది అని బ్రాహ్మణుడు శ్రీకృష్ణుని తో అన్నాడు.)

    రెండవ పూరణ. శంకరయ్య గారు అన్యార్థం అన లేదు కనుక.
    (2)తే.గీ:వాని పిండమా?ఆ శిశుపాలు డెంత?
    తిలల,దర్భల గొనె తెమ్ము! తీట యణిగి
    వాడు మరణింప గృష్ణుని వలన,శ్రాద్ధ
    కర్మ జరుపగా వలయును కాదె అన్న!
    (అని రుక్మిణి తన అన్న యైన రుక్మితో అంది.)

    రిప్లయితొలగించండి
  14. లలనా తిలక బకారిని
    వలచి మహోద్దండ పిండ వసుదేవ సుతున్
    సలలిత వైదర్భ తనయ
    లలి మిశ్రాద్ధాపురుషుఁ బరముఁ బెండ్లాడెన్

    [మిశ్ర +అద్ధాపురుషు =మిశ్రాద్ధా పురుషు; అద్ధాపురుషుఁడు = సరియైన మనుష్యుఁడు; మిశ్రుఁడు = గౌరవము కలవాఁడు]

    రిప్లయితొలగించండి
  15. భీతిలకుబాల!కృష్ణుడు ప్రేమ మీర
    శ్రాద్ధ యుక్తిని నిచ్చటి రాజులరయ
    యండపిండ బ్రహ్మాండము నదరు నట్లు
    తీసికొని వెళ్ళు ననివిదర్భ సుతనుననె

    రిప్లయితొలగించండి
  16. కృష్ణునితో అగ్నిద్యోతనుడు
    తలచి నిన్ను విదర్భజ తనియు చుండు
    నవని నాకన్నియ తిలక మనువగు సతి
    నీకు, పిండము నవకము, నిశ్చయముగ
    శ్రాద్ధతో కని నీకిడు సంతసమ్ము
    పిండము : శరీరము, శ్రాద్ధ: శ్రద్ధ

    రిప్లయితొలగించండి
  17. విని వి(దర్భ)జ జేసిన విన్నపంబు
    తరలె యదుకుల (తిల)కుఁడు దా విదర్భ
    భీష్మకుని సేనలెదిరింప (పిండ)లింతు
    ననుచు (శ్రాద్ధ)యౌ రమణి చేయందుకొనియె

    రిప్లయితొలగించండి
  18. అలవిదర్భ ప్రభువు నాత్మజ నుగనుచు
    ముదమునతిలకించి మురహరుండు
    శత్రుపిండములనుచావగొట్టి
    శ్రాద్ధ మిడక వదిలె శ్యాలకునట

    రిప్లయితొలగించండి