9, ఏప్రిల్ 2022, శనివారం

సమస్య - 4046

10-4-2022 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కర్ణకఠోరమ్ము వేణుగానమ్మయ్యెన్”
(లేదా...)
“కర్ణకఠోరమై మదికిఁ గష్టముఁ గూర్చెను వేణుగానమే”

28 కామెంట్‌లు:

  1. శీర్ణంబాయెయుక్రెయినును
    జీర్ణంబెట్లగుజనములసేఁగియుచూడన్
    అర్ణవమాయెనుశోకము
    కర్ణకఠోరమ్మువేణుగానంబయ్యెన్

    రిప్లయితొలగించండి
  2. పర్ణముతోటియాకలినిపార్వతియాపెనుశంభుదీక్షలో
    వర్ణముమాసిబోయెగదవాడెనుమోమునునగ్నిమధ్యలో
    అర్ణవమయ్యెతాపమునుయామముచల్లనిగాలివీయగన్
    కర్ణకఠోరమైమదికిఁగష్టముగూర్చెనువేణుగానమే

    రిప్లయితొలగించండి
  3. రిప్లయిలు
    1. కందం
      వర్ణింపనలవి కాని భ
      యార్ణవమున బాలకృష్ణుఁడలజడి రేపన్
      ఘూర్ణిల్లుచుఁ గంసునకున్
      గర్ణకఠోరమ్ము వేణుగానమ్మయ్యెన్!

      ఉత్పలమాల
      నిర్ణయమయ్యె చావనుచు నీరసమొందెను కంసమామయే!
      యార్ణవమంటి భీతిఁ గడుయాతనఁ బెట్టగ బాలకృష్ణుఁడున్
      ఘూర్ణన విభ్రమింప ధరఁ గూలెడు మిక్కిలి తత్తఱమ్మునన్
      గర్ణకఠోరమై మదికిఁ గష్టముఁ గూర్చెను వేణుగానమే!

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    3. 🙏ధన్యోస్మి గురుదేవా🙏

      వాట్సప్ లో సూచించిన సవరణతో..

      ఉత్పలమాల
      నిర్ణయమయ్యె చావనుచు నీరసమొందెను కంసమామయే!
      యార్ణవమైన భీతిఁ గడుయాతనఁ బెట్టగ బాలకృష్ణుఁడున్
      ఘూర్ణన విభ్రమింప ధరఁ గూలెడు మిక్కిలి తత్తఱమ్మునన్
      గర్ణకఠోరమై మదికిఁ గష్టముఁ గూర్చెను వేణుగానమే!

      తొలగించండి
  4. వర్ణింపగ జాల నసం
    పూర్ణంబౌ వేణుగాన మొరసము నకటా
    ఘూర్ణిత మాకర్ణింపగ
    కర్ణకఠోరమ్ము వేణుగానమ్మయ్యెన్

    రిప్లయితొలగించండి

  5. స్వర్ణమకుట నీలాంజన
    వర్ణుడు ఫణి మదమడిచెడు పాళము నందున్
    వర్ణింపగ కుహనము నకు
    కర్ణకఠోరమ్ము వేణుగానమ్మయ్యెన్

    రిప్లయితొలగించండి

  6. స్వర్ణకిరీట ధారులిట వాసిగ యున్నను కాలకుాట గో

    కర్ణము వంటి కృష్ణునకు గారవమెందుకు నెంచి చూడగా

    వర్ణవిహీనుడంచు శిశు పాలుడు పల్కుచు నుండు నత్తరిన్

    కర్ణకఠోరమై మదికిఁ గష్టముఁ గూర్చెను వేణుగానమే.

    రిప్లయితొలగించండి
  7. అర్ణవముప్పొంగ మిగులు
    *కర్ణకఠోరమ్ము; వేణుగానమ్మయ్యెన్*
    కర్ణరసాయనము,దివిని
    పూర్ణశశియు కన్నులకును ముచ్చటగొలుపున్.

    కర్ణముఁదాకునట్టులుగఁగ్రమ్మున జ్యాఁగొనిలాగ రాముడున్
    ఘూర్ణితమయ్యె నంబుధులు,ఘోషలు దిక్కులు పిక్కటిల్లగా
    *కర్ణకఠోరమై మదికి కష్టముఁగూర్చెను;వేణుగాన
    మే
    కర్ణరసాయనంబవసుఖంబొనగూర్చెను కృష్ణుడూదగన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
      "కర్ణరసాయనంబుగ" అంటే బాగుంటుందేమో?

      తొలగించండి
    2. నమస్తే శంకరయ్య గారు!అల్లాగ అందాం

      తొలగించండి
  8. పర్ణపు బూరల నూదగ
    కర్ణకఠోరమ్ము : వేణుగానమ్మయ్యెన్
    నిర్ణీతిగ వినినంతనె
    కర్ణములకు విందు కుడుపుగ నిపుణులూదన్

    రిప్లయితొలగించండి
  9. కర్ణముల కింపు నొసగును
    వర్ణింపగ నలవి గాని భాసుర లీలన్
    నిర్ణయ మది యెట్టుల నౌ
    కర్ణకఠోర మ్ము వేణు గాన మ్మ య్యెన్?

    రిప్లయితొలగించండి
  10. వర్ణములు పలుక లేవు వి
    వర్ణం బయ్యెను ముఖమ్ము పాటను నకటా
    తూర్ణం బాపుమ దయతోఁ
    గర్ణ కఠోరమ్ము వేణు! గానమ్మయ్యెన్


    కర్ణము లేని నావఁ జనఁ గా రనలమ్మునఁ జిక్కి యుండఁగాఁ
    దూర్ణము మృత్యు కంఠమునఁ దూలుచు నుండఁగ దుస్సహంపు దుః
    ఖార్ణవ మందు మున్గఁ గడు నంబర వీథిని వచ్చు చుండఁగాఁ
    గర్ణ కఠోరమై మదికిఁ గష్టముఁ గూర్చెను వేణు గానమే

    రిప్లయితొలగించండి
  11. దాశరథుండు రాఘవుఁడు ధార్మిక లోక వరేణ్య వర్యుఁ డౌ
    యీశుఁడు నిత్య సత్య రతుఁ డిద్ధ చరిత్రుఁడు జానకీ మనః
    పాశ నిబద్ధుఁ డర్క కుల వారిధి పూర్ణ శశాంకుఁ డుగ్ర దై
    త్యేశ దశాననఘ్నుఁడు మహీ వలయమ్మును బ్రోచుఁ గావుతన్

    [ప్రదీయతాం దాశరథాయ మైథిలీ – రా. 6. 14. 3,4. వాల్మీకి మహర్షి ప్రయోగము
    ఇక్కడ అన్ ప్రత్యయము గోత్రాపత్యార్థ మందు (తత్సంతతి) వచ్చినది.]

    రిప్లయితొలగించండి
  12. వర్ణనకు చిక్క నట్లుగ
    కర్ణము లాకర్షితంబు గానగ నగుచో
    నిర్ణయ మిట్టుల సరియా
    కర్ణకఠోరమ్ము వేణుగానమ్మయ్యెన్

    రిప్లయితొలగించండి
  13. పర్ణపు బూరతో నొగిని బాలుడు గట్టిగ నూదుచుండగా
    కర్ణకఠోరమై మదికి గష్టము గూర్చెను వేణుగానమే
    కర్ణకఠోరముల్వినిన కర్ణము లయ్యవి మూగబోయిదుః
    ఖార్ణవ మందునన్ మునిగి యర్రులు చాతురు విన్కి గోరుచున్

    రిప్లయితొలగించండి
  14. పూర్ణ సుధాంశు మౌక్తిక విభూషిత శారద రాత్రి వేళ సౌ
    వర్ణ శుభాంగి సత్య ప్రియవల్లభు రాకకు వేచియుండ దా
    నిర్ణయమూని పారిజమునిచ్చెను రుక్మిణికన్న వార్తయే
    కర్ణకఠోరమై మదికిఁ గష్టముఁ గూర్చెను వేణుగానమే

    రిప్లయితొలగించండి
  15. వర్ణోచ్ఛారణగానము
    *“కర్ణకఠోరమ్ము, వేణుగానమ్మయ్యెన్”*
    కర్ణములందమృతముసం
    పూర్ణముగా పోసినట్టు ముదమదిహెచ్చెన్

    రిప్లయితొలగించండి