10, ఏప్రిల్ 2022, ఆదివారం

సమస్య - 4047

11-4-2022 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“నరహరి జన్మించెనఁట కనన్ దేవకికిన్”
(లేదా...)
“నరహరి యుద్భవించెను ఘనంబుగ దేవకి గర్భమందునన్”

28 కామెంట్‌లు:


 1. సురలోకమ్మును వీడర
  మరులనుచున్ వాగనేల మందుని వలె నీ
  యరుపులవిచాలునిక మా
  నర, హరి జన్మించెనఁట కనన్ దేవకికిన్

  రిప్లయితొలగించండి
 2. ధరలోధర్మమునిలుపగ
  వరగుణశోభలనలరుచుభాసురకీర్తిన్
  గురువుగపాండవులకునుత
  నర, హరిజన్మించెనటకనన్దేవకికిన్

  రిప్లయితొలగించండి

 3. కరుణయె లేనివారలని స్కంభుల గూర్చివచించుచున్ సదా

  పరుషపు మాటలేల భగవానుడు ధాత్రిని ధర్మరక్షకై

  బెరకుల ద్రుంచ బుట్టునిల బేరజ మేల యభాండమింక మా

  నర, హరి యుద్భవించెను ఘనంబుగ దేవకి గర్భమందునన్.

  రిప్లయితొలగించండి
 4. ఉరమునుజీల్చిరక్కసునినూరువుపైనిడిభీకరాకృతిన్
  కరగినమానసంబుననుగాచెనుగాచెనుభక్తునిదాపునుండియున్
  కరుణనుపాండవాదులనుగావగధర్మమునిల్పుదీక్షనా
  నరహియుద్భవించెనుఘనంబుగదేవకిగర్భమందునన్

  రిప్లయితొలగించండి
 5. నరహరియుద్భవించెనుచివరిపాదంతప్పుగటైపు

  రిప్లయితొలగించండి
 6. ధరలో ధర్మము నిల్పగ
  తిరముగ దుష్టులను జంప దివ్యుo డగుచున్
  సురలును మెచ్చంగను గా
  నర హరి జన్మించె నట కనన్ దేవకికి న్

  రిప్లయితొలగించండి
 7. పొరి కంబంబున భీకర
  నరహరి జన్మించెనఁట;కనన్ దేవకికిన్,
  నరకాంతకు,నరక వధకు
  చెరసాలనుబుట్టె రాత్రి శ్రీహరి శిశువై

  రిప్లయితొలగించండి
 8. కందం
  ధరణియు ధర్మము వేడ న
  సుర సంహారమొనరింప శుభలగ్నమునన్
  వరమై వసుదేవుండు ద
  నర, హరి జన్మించెనట కనన్ దేవకికిన్

  చంపకమాల
  ధరణియు ధర్మమిద్దరవతారము దాల్చుమటంచు వేడఁగన్
  దెరపినిఁ గశ్యపుండు వసుదేవుఁడనంగ సుతుండు గాగఁ దా
  దురితుల పాలి కాలుడుగ దుర్విధి మ్రోగగ మేటి మృత్యు కి
  న్నర, హరి యుద్భవించెను ఘనంబుగ దేవకి గర్భమందునన్!

  రిప్లయితొలగించండి
 9. హరి తొలియుగ యవతారము
  నరహరి : జన్మించెనఁట కనన్ దేవకికిన్
  చెరసాల లోపలన నొక
  నరుడై మూడవ యుగమున నరకుని జంపన్

  రిప్లయితొలగించండి
 10. పరమాత్ముడు జగమెరిగిన
  కరుణారస మృదుహృదయుడు గద సకల చరా
  చర జగతి పారవశ్యమొ
  నర హరి జన్మించెనఁట కనన్ దేవకికిన్

  రిప్లయితొలగించండి
 11. క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:

  దరుమము నాశన బఱచుచు
  కెరలెడి దుష్టుల నదమగ కృష్ణుండగుచున్
  ధరణిని జనులకు మోద మొ
  నర హరి జన్మించె నట కనన్ దేవకికిన్.

  రిప్లయితొలగించండి
 12. క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:

  ధరణిని ధర్మమార్గము నుదల్చి జనాళి కవస్థ లుంచుచున్
  కెరలెడి దుష్టులన్ యణచి క్షేమము నందగజేయు లక్ష్యమున్
  త్వరపడి జైలు చేరగను వచ్చెడి దృశ్యమునెల్ల జూడుమో
  నర! హరి యుద్భవించెను ఘనంబుగ దేవకి గర్భ మందునన్.

  రిప్లయితొలగించండి
 13. ఆది శక్తి కంసునితో

  వరుసగ చంపితివే సో

  దరి కనినట్టి శిశువులను దయయే లేకన్

  మరణము తథ్యము నీకు,వి

  నర, హరి జన్మించెనట కనన్ దేవకికిన్

  రిప్లయితొలగించండి
 14. సురముని గణముల రక్షణ
  హరి బాధ్యతగావహించు ననవరతంబున్
  కరుణను శ్రీకృప్ణునిగా
  నరహరి జన్మించెనఁట కనన్ దేవకికిన్

  రిప్లయితొలగించండి
 15. కందం
  చెఱసాల లోపలన్ ద్వా
  పర యుగమున జన్మ మెత్తె పరమాత్మ చెడున్
  పరిమార్చ దలంచగ కా
  నర ,హరి జన్మించెనట కనన్ దేవకి కిన్

  ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
  ఉండవల్లి సెంటర్.

  రిప్లయితొలగించండి
 16. కె.వి.యస్. లక్ష్మి, ఉడ్బర్రీ, అమెరికా:

  ధరలో ధర్మము నిలుపగ
  హరి యవతారములదాల్చు ననవరతమ్మున్
  పరిమార్చగ కంసుని యా
  నరహరి జన్మించె నట కనన్ దేవకికిన్.

  రిప్లయితొలగించండి
 17. పరమ దురాత్ముఁడౌచు పసి బాలుని కక్కసవెట్టు రక్కసున్
  నురుమగ నుగ్రరూపమున నుగ్గులువార్చుచు కంబమందునన్
  నరహరి యుద్భవించెను; ఘనంబుగ దేవకి గర్భమందునన్
  మరల జనించె కంసు బరిమార్చగ మాధవుఁడార్త రక్షియై

  రిప్లయితొలగించండి
 18. కం:నరజన్మము ధన్యమ్మై
  తరియించెడు భాగవతకథన్ విను మయ్యా
  నరనాథ !తృప్త పాలిత
  నర! హరి జన్మించె నట కనన్ దేవకికిన్
  (అని రాజుకి భాగవత కథ చెప్పటం ప్రారంభించాడు.తృప్త పాలిత నర=పాలించ బడుచున్న తృప్తు లైన నరులు కలవాడు.)

  రిప్లయితొలగించండి
 19. అరి,పిలువన్ స్తంభమునన్
  *నరహరి జన్మించెనట;కనన్ దేవకికిన్*
  చెఱసాలను జన్మించెను
  మురళీకృష్ణుండు పుణ్యమూర్తులఁబ్రోవన్.

  మురహరు లీలలంగనగ మోదముఁగల్గును దానవేంద్రుఁడే
  హరి!హరి!యంచుఁదాఁబిలిచినంతనె స్తంభము నుండి క్రోధుఁడై
  *నరహరి యుద్భవించెను ఘనంబుగ,దేవకి గర్భమందునన్*
  సురలు నుతించ కృష్ణునిగ శోభిలె నాతడె ద్వాపరంబునన్.

  రిప్లయితొలగించండి
 20. పరమదయార్ద్ర చిత్త!పరిపాలితధర్మనిబద్ధచిత్త స
  న్నర!హరి యుద్భవించెను ఘనమ్ముగ దేవకి గర్భ మందునన్
  నరకుని సంహరించి జననాశము బాపగ కంసు గూల్చి సం
  బరమును గూర్చగా జగతి ,పాండవ భక్తుల బాధ దీర్పగన్.

  రిప్లయితొలగించండి
 21. వరుస శిశుహత్యలవిసో
  దరిపిల్లలనుచు గరుణయు దపనయు లేదా?
  కఱకుద నంబును నికమా
  నర,హరిజన్మించెనట కనన్ దేవకికిన్

  రిప్లయితొలగించండి
 22. పరమ పురుషుండు నరునిగ
  ధరలోఁ గృష్ణుం డనంగఁ దద్దయుఁ బ్రీతిన్
  హరియే సుతునిగ వింటివె
  నరహరి! జన్మించె నఁట కనన్ దేవకికిన్


  గురువరుఁ డెల్ల లోకములకుం బరి పాలకుఁ డచ్యుతుండు దా
  స్థిరముగ భూమి భారమును దీర్పఁగ నెంచి పరాత్పరుండు ద్వా
  పరమున నా రమా పతియె పన్నుగ మున్నిల నెవ్వఁ డయ్యెనో
  నరహరి యుద్భవించెను ఘనంబుగ దేవకి గర్భ మందునన్

  రిప్లయితొలగించండి
 23. సురలును మౌనివర్గముల క్షోభనుగూర్చెడు దుర్మదాంధులన్
  సరగున రూపుమాపుటకు శక్రుడుతాధర నుద్భవించి సం
  హరణమొనర్చు, నట్టి దురితాత్ముడు కంసుని జంప కృష్ణుగా
  నరహరి యుద్భవించెను ఘనంబుగ దేవకి గర్భమందునన్

  రిప్లయితొలగించండి
 24. కరమును భీషణాకృతిని గర్జనజేయుచు గంబమందునన్
  నరహరి యుద్భవించెను ఘనంబుగ దేవకి గర్భమందునన్
  ధరణిని ధర్మమార్గమున దాచరియించుచు నెల్లవారలన్
  దరియగజేయ యెత్తునవతారము లెన్నియొ దేవదేవుడున్

  రిప్లయితొలగించండి
 25. నరకడు కంసుడాగ్రహమునన్ చెలరేగుచు నక్కబావలన్
  నిరతము బందిగమ్మునను నెవ్వ నొసంగుచు నుండ నిత్యమున్
  సరగున వారి నాదుకొని చక్కని జీవన మియ్య నెంచి యా
  నరహరి యుద్భవించెను ఘనంబుగ దేవకి గర్భమందునన్

  రిప్లయితొలగించండి
 26. వరగర్వితునిదునుమగన్
  *“నరహరి జన్మించెనఁట కనన్ దేవకికిన్”*
  చెరలోశ్రావణమందున
  ధరలోజన్మించెను హరి దామోదరుడై.

  హరిగలడాయటంచుపితయాతనిడంగనుయాగ్రమ్ముతో
  *“నరహరి యుద్భవించెను, ఘనంబుగ దేవకి గర్భమందునన్”*
  నరక బకాసురాదులనునాశముచేయగనెంచనాచెరన్
  హరియుదయించగానచటహర్షమునొందెసురాళియున్ దివిన్

  రిప్లయితొలగించండి