17, ఏప్రిల్ 2022, ఆదివారం

సమస్య - 4053

18-4-2022 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“తలకు రోఁకలిఁ జుట్టె విద్వాంసుఁ డౌర”
(లేదా...)
“తలకున్ రోఁకలిఁ జుట్ట మేలనెను విద్వాంసుండు నీతిజ్ఞుఁడై”

31 కామెంట్‌లు:

  1. బ్రహ్మకైననుతాబోధపడనిపదము
    భాష్యకారునకర్ధబుపాలుఁబోదు
    వింతజగతినివింతయౌవిద్యయిదియ
    తలకురోఁకలిఁజుట్టెవిద్వాంసుడౌర

    రిప్లయితొలగించండి

  2. శిక్షకుడనుచు గొప్పగా చెప్పినట్టి
    వానిని గమనించితి గాదె వాసిగాను
    తెలిసితెలియని వాడుట్టి దేబె యతడు
    తలకు రోఁకలిఁ జుట్టె విద్వాంసుఁ డౌర.



    పులిపాలన్ గొనితెమ్మటంచు నృపుడా మూర్ఖుండు వాచింపగా

    నిల సాధ్యమ్మది కాదటంచెఱగి తానిట్టుల్ సమాధానమున్

    బలికెన్ బీర్బలు కానకేగెదను నాభద్రమ్ము కై వెంటనే

    తలకున్ రోకలిఁ జుట్ట మేలనెను విద్వాంసుండు నీతిజ్ఞుడై.

    రిప్లయితొలగించండి
  3. కలలోగాంచనికాితార్ధములతాకావ్యాలలోఁజూపుచున్
    ఇలలోగాననిపాతవడ్డనటనావిన్యాసముంగ్రాలుచున్
    ఉలికిన్జిక్కనిరూపమాకవియుతానూహింపఁజూడంగశ్రో
    తలకున్రోకఁలిఁజుట్టమేలనెనువిద్వాంసుండునీతిజ్ఞుడై

    రిప్లయితొలగించండి
  4. కలలోగాంచనికామితార్ధముల, టైపాటు

    రిప్లయితొలగించండి
  5. జరుగవు నిజ జీవిత మున జగతి యందు
    నట్టి వెన్నియో జరుగ వే యతి శయ ముగ
    కల ల యందున సాధ్యమైకాంతు మదియ
    "తలకు రోకలి చుట్టె విద్వాంసు డౌర !"

    రిప్లయితొలగించండి
  6. 1.ఒక అవధాని గురించి పృచ్ఛకుని అభిప్రాయము:

    తేటగీతి
    విషమమౌ నసంబద్ధపువిషయమీయ
    పూరణమ్మధిక్షేపమై పొసఁగనొప్పు
    ప్రతి సమస్యకునవధాని ప్రశ్నవైచి
    తలకు రోఁకలిఁ జుట్టె విద్వాంసుఁ డౌర?

    2.విలువల్ శూన్యమునౌచు నాయకుల గెల్పింపంగ హామీలతోఁ
    బలుకుల్ కోటలు దాటి చేతలకసంబద్ధమ్ము నై వాగెడున్
    దులువల్ నేతలటంచు తిట్టిగొణిగెన్ "దుర్మార్గులీ జాతికిన్
    దలకున్ రోఁకలిఁ జుట్ట మేలనెను విద్వాంసుండు నీతిజ్ఞుఁడై!"

    రిప్లయితొలగించండి
  7. యాదవ కులమందున బుట్టి నటుల , నేడు
    కాల మార్పు వలన బుట్టె కవయితల చి
    తలకు రోఁకలిఁ ; జుట్టె విద్వాంసుఁ డౌర
    తలకు పాగను తన గొప్పతనము జాట

    చిత = ప్రోగు, చేర్పఁబడినది

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కాల మార్పు' దుష్ట సమాసం. 'కవయి తలచి'?

      తొలగించండి
  8. పూర్తి మద్యనిషేధపు స్పూర్తితోడ
    మద్యముపయి నియంత్రణ మమలు పరచి
    పిదప మదిరపై రాబడి కుదువబెట్టె
    తలకు రోఁకలిఁ జుట్టె విద్వాంసుఁ డౌర

    రిప్లయితొలగించండి
  9. పలు దుర్మాగులు నేస్తులయ్యిరి గదా పాపంబు పెంచంధరన్
    పలురీతిం బరువాయెగా నితడు, మా బందమ్ముగోల్పోయెగా
    పలుకుంగోపముగానుమాయెడల, మాపట్ట్లాయెగాకాలుడున్
    తలకున్ రోఁకలిఁ, జుట్టమే లనెను? విద్వాంసుండు నీతిజ్ఞుఁడై

    రిప్లయితొలగించండి
  10. విద్యలన్నియు నేర్చిన విజ్ఞుడతడు
    మితిని మించిన చదువుతో మతిచలించి
    మొండి వాదన సలుపును మెండుగాను
    తలకు రోఁకలిఁ జుట్టె విద్వాంసుఁ డౌర

    రిప్లయితొలగించండి
  11. తేటగీతి
    వెర్రి ముదిరిన వైద్యుడు వింత గానె
    మెలగె ,తలపోటనుచు జేరె మేన సోయ
    లేని రోగి చికిత్సకై ,లీల జేసె
    తలకు రోకలి జుట్టె విద్వాంసు డౌర.

    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటర్.

    రిప్లయితొలగించండి
  12. కొండ నెత్తెద నను జూపి కండ లకట
    కడలి నెండింతు నం చను నడరి తాను
    గంటి దేవుని నం చను వెంట నరిగి
    తలకు రోఁకలిఁ జుట్టె విద్వాంసుఁ డౌర


    పలుకుల్ వేదము లంచు వీని నల సంభావించిరే యెందఱో
    యిలలో శాస్త్రము లందు దిట్ట యనిరే యింకెందఱో వీనినిం
    గలలో నైనను ధర్మ సూక్ష్మములు వక్కాణించు నాఁ బల్కిరే
    తలకున్ రోఁకలిఁ జుట్ట మే లనెను విద్వాంసుండు నీతిజ్ఞుఁడై

    రిప్లయితొలగించండి
  13. ఎన్ని రోజులు బరికించ యిసుము కూడ
    సానుకూలత గానక సహన మేది
    తలకు రోకలి జుట్టె వి ద్వాంసుడౌర
    సహజ మిద్దియ యేరికి సంభవించ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "...బరికించ నిసుము..." అనండి.

      తొలగించండి
    2. వలపుల్ రేగెను భావరాజునకు నబ్బామన్ నటన్ జూడగా
      దలపుల్ మారెను వెంటనే కనుగవల్ దైవంబు బోనాడుచున్
      గలలో సైతము భామనే గనగ నక్కాముండుమాద్యుండునౌ
      దలకున్ రోకలి జుట్టమేలనెను విద్వాంసుండు నీతిఙ్ఞుడై

      తొలగించండి
  14. అలనాడొక్కడవజ్ఞుఁడౌచు గని రాజాస్థానవిద్వాంసునిన్
    తలకున్ రోఁకలిఁ జుట్ట మేలనెను, విద్వాంసుండు నీతిజ్ఞుఁడై
    తెలిపెన్ రేనికి వీని పిచ్చి ముదిరెన్ తెల్లంబగున్ చేష్టలన్
    కొలువందీతనినుంచగా దగదు సంకోచింపకేమాత్రమున్

    రిప్లయితొలగించండి
  15. పద్యములు వ్రాయగ సతము వాసిగా ను
    శాంతి కల్గును మనసుకు జవముగాను
    నెల్లరు జలును తగ్గంగనింక నీవె
    *"తలకు రోకలి జుట్టె విద్వాంసు డౌర"*

    రిప్లయితొలగించండి