1, ఏప్రిల్ 2022, శుక్రవారం

సమస్య - 4038

2-4-2022 (శనివారం)
కవిమిత్రులారా,
శుభకృన్నామ సంవత్సర శుభాకాంక్షలు!
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"శుభకృద్వత్సరము భువికి శోకం బిడుతన్"
(లేదా...)
"శుభకృద్వత్సర మెల్లలోకులకు నిచ్చుంగాత శోకం బిఁకన్"

42 కామెంట్‌లు:


  1. విభవము గూర్చగ వచ్చెను
    శుభకృద్వత్సరము భువికి, శోకంబిడుతన్
    బ్రబలెడు రోగమ్ములపై
    యభిశంకను వీడినంత నాలింపుమికన్.

    రిప్లయితొలగించండి
  2. కవిమిత్రులకుశుభకృత్నామసంవత్సరశుభాకాంక్షలు
    అభయంబీయకరాజును
    ఇభసన్నిభమదముతోడనేర్పునులేకన్
    ఉభయముతానేకాగా
    శుభకృద్వత్సరముభువికిశోకంబిడుతన్

    రిప్లయితొలగించండి

  3. ప్రబలును రోగమ్ములనిన
    యభిశంకను విడినవాడి కవనిని జూడన్
    విభవము గూర్చగ వచ్చిన
    శుభకృద్వత్సరము భువికి శోకంబిడు తన్.

    రిప్లయితొలగించండి

  4. అభిశంకన్ విడబోకుమా నరుడ పర్యాప్తమ్ము వర్తించినన్

    ప్రబలున్ గోవిడు సత్వరమ్మునదియే ప్రాణాలనే తీయదే

    యభయంబిచ్చి శుభంబు గూర్చమని యాహ్వానింప నేతెంచినన్

    శుభకృద్వత్సర మెల్లలోకులకు నిచ్చుంగాత శోకంబిఁకన్.

    రిప్లయితొలగించండి
  5. శుభము లొసగ వచ్ఛు గదా
    శుభకృద్వత్స రము భువికి : శోకంబిడు తన్
    విభవము గోల్పోయిన తరి
    ప్రబలెడి యిడుముల వలనను ప్రజలకు మిగులన్

    రిప్లయితొలగించండి
  6. అభయంబిచ్చునునెల్లరీతులనునాయాసమ్ముబోద్రోచుచున్
    శుభకృద్వత్సరమెల్లలోకులకు;నిచ్చున్గాకశోకంబికన్
    సభలోవాదనజేయువారలకుతాసామర్ధ్యమేలేకనే
    విభవంబిచ్చునువేంకటేశుడిలనావిష్ణుండునాదేవుడై

    రిప్లయితొలగించండి
  7. ఉభయ విలాతులు నాపక
    నభిమరమును సలుపుచుండ నతివేగముగన్
    విభవములారగ , గనెదము
    శుభకృద్వత్సరము భువికి శోకం బిడుతన్

    రిప్లయితొలగించండి
  8. రిప్లయిలు
    1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    2. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      బ-భ ప్రాస ?

      తొలగించండి
    3. పొరబాటే.....ఇలా సవరించాను...

      శుభములు గూర్చగ వచ్చెను
      శుభకృద్వత్సరము భువికి శోకం బిడుతన్
      ప్రభవించిన రోగభయము
      నిభృతంబై మదినొకింత నిబ్బరమొసగన్

      తొలగించండి
  9. అభయంబిచ్చియుఁబ్రోచుత
    *శుభకృద్వత్సరము భువికి;శోకంబిడుతన్*
    ప్రభవించెడు దుర్మతులకు
    శుభముల్ దొలగంగ నశుభ సూచనములచేన్.

    శుభముల్ గూర్చుత పారద్రోలి రుజలన్
    సొంపారనారోగ్యమున్
    విభవంబున్,సుగుణంబులున్,యశము
    నిర్భీతిన్,మనోధైర్యమున్
    *శుభకృద్వత్సరమెల్లలోకులకు నిచ్చుంగాత;
    శోకంబిలన్*
    ప్రభవంబొందకఁజేసి,సంతసము
    విభ్రాజిల్లగాఁజేసెడున్.

    రిప్లయితొలగించండి
  10. శుభములు దెచ్చును తథ్యము
    శుభకృద్వత్సరము భువికి, శోకం బిడుతన్
    విభవముచెడి గత వత్సర,
    మభయంబిడ వేడుకొందు నవని జనులకున్

    రిప్లయితొలగించండి
  11. క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:

    శుభమును పఱచగ వచ్చెను
    శుభకృద్వత్సరము భువికి; శోకంబిడుతన్
    ప్రభవమునైన కరోనయె
    ప్రభూతముగ లోకమందు వర్థిల్లు వడిన్.

    రిప్లయితొలగించండి
  12. క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:

    శుభముల్ దండిగ కూర్చవచ్చె నిపుడున్ సొంపైన లక్ష్యంబుతో
    శుభకృద్వత్సరమెల్ల లోకులకు; నిచ్చుంగాత శోకంబికన్
    ప్రభవమ్మొందినదౌ కరోన రుజయే బాహుళ్యమై వ్రాలుచో
    విభవమ్మంతయు మచ్చమాయగ తనున్ పింజమ్ము గోల్పోవుచున్.

    రిప్లయితొలగించండి
  13. శ్రీగురుభ్యోనమః
    గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి చరణారవిందములకు
    నమస్సులు.
    గురువుగారికి,శంకరాభరణం బ్లాగు కవి పండితులకు, బ్లాగు వీక్షకులకు, అందరి కుటుంబ సభ్యులకు
    శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు💐💐💐💐🙏🙏🙏🙏
    శ్రీపతి శాస్త్రి పిడతల.

    మ.
    వివరింపంగ ననేక రూపములతో విస్తారమై ప్రాకుచున్
    జవసత్వంబు లుడింగిపోవ ప్రజకున్ శాసించె కోవిడ్ ధరన్
    ప్లవమై తేల్చెను శార్వరిన్ జటిలమౌ ప్రక్షాళనన్ జేయుచున్
    శివకాలంబుగ సాగ నీ శుభకృతున్ శ్రీశంకరున్ వేడెదన్

    చం.
    ఎంతటి కష్టముల్ కలుగ నెంతటి నష్టము సంభవించినన్
    చింతలు కల్గినన్ విషము జిమ్ముచు కాలము వెక్కిరించినన్
    భ్రాంతిగ నెంచుచున్ మదిని వచ్చెడి కాలము మంచికాలమై
    స్వాంతన గూర్చదేమనుచు భావన జేతురు మానవోత్తముల్

    చం.
    శుభకృతు నామ వత్సరపు సోయగ మంతయు కాంతివంతమై
    యభయమునిచ్చి బ్రోచి కడుహ్లాదము గూర్చగ లోకమంతటన్
    శుభముల బెంపుజేయుచును శోకములెల్ల నశించిపోవగా
    విభవము నిచ్చు కాలముగ వేగమె రమ్మని స్వాగతించెదన్

    తోటకం
    శుభకృత్ జగతిన్ కడు శోభలతో
    నభయంబిడుచున్ విజయంబులతో
    విభవమ్ముల కున్నొక వేదికగా
    ప్రభవించగ నీ ధర పావనమౌ

    స్వస్తి 🌹🌹🙏🙏

    రిప్లయితొలగించండి
  14. కె.వి.యస్.లక్ష్మి, ఉడ్బర్రీ,అమెరికా:

    విభవము గూర్చగ వచ్చెను
    శుభకృద్వత్సరము భువికి,శోకంబిడుతన్
    ప్రభవము జూపెను కోవిడు
    రభసను జేయుచు జనులను రాక్షసి వోలెన్.

    రిప్లయితొలగించండి
  15. శుభముల్ గూర్చగ నేగుదెంచెనదిగో శోభాయ మానంబుగా
    నభమున్ డిగ్గి ధరాతలంబునకునానందంబు సౌభాగ్యముల్
    శుభకృద్వత్సర మెల్లలోకులకు నిచ్చుంగాత, శోకం బిఁకన్
    ప్రభవంబొందక విశ్వశాంతి గదురన్  రక్షింపవే దైవమా

    రిప్లయితొలగించండి
  16. సభలన్ జేయుచు పండితోత్తములిడన్ సద్దీవెనల్ బ్రీతితో
    నభయమ్మున్ బొనరించి సత్వరము నత్యంతంపు సౌఖ్యమ్ములీ
    శుభకృద్వత్సర మెల్లలోకులకు నిచ్చుంగాత, శోకం బిఁకన్
    శుభకార్యమ్ములతోనశించి బ్రతుకుల్ శోభించు తథ్యమ్ముగా

    రిప్లయితొలగించండి
  17. కందం
    శుభములు గూర్చగ వచ్చెను
    శుభకృద్వత్సరము భువికి ,శోకం బిడుతన్
    రభస కరోన ఘటించన్
    విభవము కై జనులు పోరి వినుతి గడించెన్

    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటర్.

    రిప్లయితొలగించండి
  18. ప్రభవించిన నెదఁ గోపం
    బభీతినిన్ దారుణముగ నర్హుండగుఁ దా
    నభిశంసనమున కిట్లన
    శుభకృద్వత్సరము భువికి శోకం బిడుతన్


    శుభకృద్వత్సర మెల్ల లోకులకు నిచ్చుంగా నశోకమ్మునే
    సభలో నిట్లన నెంచి స్వీయ వదనోచ్చారమ్ము లిద్ధాత్రిలో,
    నభినందించు సతమ్ము నిట్లు, ప్రతికూలార్థమ్ము లీ నేర్వఁగన్
    శుభకృద్వత్సర మెల్లలోకులకు నిచ్చుంగాత శోకం బిఁకన్

    రిప్లయితొలగించండి

  19. శుభకృన్నామ వరాబ్ద మిద్ధరఁ గడున్ శోభాయమానంబునై
    శుభ సందోహ సమావృతం బగుచు సంక్షోభ క్షయ క్రీడలం
    బ్రభవిల్లున్ జన కోటి కీయఁగ వెసన్ భద్రాయు రారోగ్యముల్
    విభవమ్ముల్ విలయం బొనర్పగఁ దమిన్ విధ్వంస కీటాలినిన్

    రిప్లయితొలగించండి
  20. కందం
    నిభమున్ మోపి యొకరొకరు
    రభస ముగించక చెలంగ రష్యాయుక్రే
    నభమై ప్రపంచ యుద్ధము
    శుభకృద్వత్సరము భువికి శోకం బిడుతన్


    మత్తేభవిక్రీడితము
    సభలన్ గూరిచి పోరునన్ వెతల రష్యా యుక్రెయిన్ దల్పకే
    నిభమున్ మోపుచు నొక్కరొక్కరిపయిన్ నిష్టూరమాడంగనే
    రభసల్ మీరి ప్రపంచ యుద్ధమనివార్యంబై ప్రకోపించినన్
    శుభకృద్వత్సర మెల్లలోకులకు నిచ్చుంగాత శోకం బిఁకన్

    రిప్లయితొలగించండి
  21. విభవత్స్వాస్థ్య మహత్వ సత్వ వర సద్విజ్ఞాన సద్వృత్తులన్
    శుభకృద్వత్సర మెల్లలోకులకు నిచ్చుంగాత; శోకం బిఁకన్
    నభవంబౌనిల శాంతి సుస్థిరమగున్ న్యాయంబు నిర్దేశ్యమై
    శుభమౌ విశ్వజనీన భావనము సంశోభిల్లగానెల్లెడన్

    రిప్లయితొలగించండి
  22. శుభకృత్తనగను నెఱుగుము
    శుభములనే నీయునెపుడు సురుచిర ముంగాన్
    బ్రభువా! పాడియె యిటులన
    శుభకృద్వత్రరము భువికి శోకంబిడుతన్

    రిప్లయితొలగించండి
  23. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  24. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి