20, ఏప్రిల్ 2022, బుధవారం

సమస్య - 4056

21-4-2022 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“లంజని వధియించె లావెసంగ”
(లేదా...)
“లంజని చంపెఁ గ్రూరముగ లావెసగం బవమానపుత్రుఁడే”

33 కామెంట్‌లు:

  1. వేశ్యయనునెవరిని,విష్ణువు కృష్ణుడై

    కంసు నేమి చేసె,కాళి మహిషు

    నెపుడు చంపికూర్చె నెలమి నీ పుడమికి

    లంజని,వధియించె,లావెసంగ

    రిప్లయితొలగించండి
  2. ఆటవెలది
    రమణి సీత కొరకు లంఘించి కడలిని
    హనుమ లంకఁ జేర నడ్డుపడుచు
    రగిలి మ్రింగినంత లంకిణి తనుమూల
    లం, జని వధియించె లావెసంగ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉత్పలమాల
      పంజరమయ్యె లంక కుజఁ బట్టుచు జేర్చఁగఁ బంక్తికంఠుఁడున్
      రంజనమొంద స్వామి జలరాశిని దూకి యపక్రవిక్రముం
      డంజని పుత్రుఁడున్ జెలఁగ, నందుచు లంకిణి మ్రింగ మేను కూ
      లం, జని చంపెఁ గ్రూరముగ లావెసగం బవమానపుత్రుఁడే!

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  3. శీఘ్రగతినిహనుమసీతమ్మవెదకెను
    రావణుండుగనగరగిలెచిచ్చు
    వానరంపుచేష్టవ్రాలుచుతనదువా
    లం, జనివధియించెలావెసంగ

    రిప్లయితొలగించండి
  4. పింజనువోలెపర్వతముపేలగనయ్యెనువానిచేతనా
    సంజనితంబునైబలముసాగుచువేగమనీదెనంబుధిన్
    అంజనిముద్దుబిడ్డడునునంబురుహేక్షణసీతఁజూడవా
    లంజనిచంపెఁగ్రూరముగలావెసగన్బవమానపుత్రుడై

    రిప్లయితొలగించండి

  5. లంకిని కపిగాంచి రావలదనుచు తా
    నడ్డగింపబోవ ననిలసుతుడు
    కసరుతోడ దనుజ కాంతను లంకనే
    లంజని వధియించె లావెసంగ.


    కంజముఖిన్ గనుంగొనగ ఖంబు పథంబున మొక్కలమ్ముతో

    నంజని పుత్రుడా హరియె యంబుధి దాటుచు భీమరూపమున్

    నంజుడు దిండి రాజ్యమున నారిని యాగ్రహ మందు లంక నే

    లంజని చంపెఁ గ్రూరముగ లావెసగం బవమాన పుత్రుడే.

    రిప్లయితొలగించండి
  6. తండ్రి మాట నిలుప దాశరథి వెడలి
    శిష్ట రక్ష కొఱకు చేవ జూపి
    దుష్ట రక్కసులను దునుముట కై కాన
    లం ' జని వధించె లావె సంగ

    రిప్లయితొలగించండి
  7. వార్ధి దాటునట్టి వాయుసుతుని నీడ
    చేతఁబట్టిలాగ సింహికంత
    సూక్ష్మ రూపుడగుచు సుదతి నోట బిలబిల
    లంజని వధియించె లావెసంగ.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదం చివర గణభంగం. "సుదతి నోట బిలబి । లం జని..." అంటే సరి.

      తొలగించండి
    2. శుభోదయం శంకరయ్య గారు!
      మూడవపాదంలో'ల'అదనంగా టైపయింది
      మీ సూచనకు ధన్యవాదాలు.

      తొలగించండి
  8. వాయుపుత్రుఁ డెగిరి వారాశి దాటంగ
    సీత జాడ నెఱిగి చింత దీర,
    అక్షకుమరు డాది యతిభయంకర కోటు
    లం, జని వధియించె లావెసంగ.

    రిప్లయితొలగించండి
  9. వాయుపుత్రహనుమ! భళి!యపురూపలీ
    లంజని వధియించె లావెసంగ
    లంక గాయుచున్న లంఖిణీ రక్కసిన్
    రామకార్యసిద్ధి లక్ష్యమాయె

    రిప్లయితొలగించండి
  10. ఒంపు సొంపు జూసి యొడలు మరచినట్టి
    తనయుని విధము గని తల్లడిల్లి
    పిల్ల వాని బట్టి పీడించు చుండిన
    లంజని వధియించె లావెసంగ

    లావు = అశక్యము

    రిప్లయితొలగించండి
  11. కంజదళాక్షి జానకినిఁగాంచగ నేగెడు వాని ఛాయయే
    రంజిల, దానిఁబట్టుకొని లాగగ నక్కట!సింహికాఖ్యయున్
    మంజుల సూక్ష్మరూపుడయి, మానిని చాచిన నోటిలోకి,హే
    లం,జని చంపె క్రూరముగ లావెసగంబవమాన పుత్రుడే.

    రిప్లయితొలగించండి
  12. నమ్ము కోర్కెఁ దీర్తు నర్తనశాలలో
    ననుచుఁ బిలువఁ గృష్ణ యరుగుదెంచె
    వేగఁ గీచకుండు; భీముండు నాట్యశా
    లం జని వధియించె లావెసంగ.

    రిప్లయితొలగించండి
  13. ఆటవెలది
    సాగరమ్ము దాటి సాహసి హనుమ లీ
    లం ,జని వధియించె లావెసంగ
    రాక్షసాధములను రావణ లంకనన్
    సీత జాడ తెలియ చిందు లాడె.

    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటర్.

    రిప్లయితొలగించండి
  14. దుర్నిరీక్ష్యుఁడు రణ దుర్జయుండు ఘనుండు
    క్షత్రి యాన్వయుండు శత్రు కోటి
    ఘోర శస్త్ర పటిమఁ గ్రోధమ్ము మీఱఁ దూ
    లం జని వధియించె లా వెసంగ


    రంజిత మానసుండు నయి రక్కసు లెన్బది వేల సంఖ్యలం
    బ్రాంజలి మ్రొక్కి మైథిలికి రావణు సేన నెఱుంగు వేడ్కతో
    నంజని పట్టి యుక్తిని దశాస్యు నశోకపుఁ దోఁట కంత లీ
    లం జని చంపెఁ గ్రూరముగ లావెసఁగం బవమానపుత్రుఁడే

    రిప్లయితొలగించండి
  15. కంజదళాక్షి సీత పొడ గానగ వార్నిధి దాటి లంకలో
    వంజుళనందనంబు కడ పార్థివి గాంచి నమస్కరించి మై
    రంజిలి రావణాసురుని రక్కసి మూకల శక్తి నెంచ లీ
    లం జని చంపెఁ గ్రూరముగ లావెసగం బవమానపుత్రుఁడే

    రిప్లయితొలగించండి
  16. అంజని పుత్రుడున్నత మహామహ
    నీయుడు లంకజేరియున్
    కుంజర వంటి లంకినియు గొబ్బున
    మ్రింగగ దాని పొట్టలో
    రంజిల దిర్గి దిర్గియును రక్కసి
    లంకిని నేర్పతోడ లీ
    లం జని జంపె గ్రూరముగ లావెసగం
    బవమాన పుత్రుడే

    రిప్లయితొలగించండి