20-4-2022 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“గాండీవముఁ దాల్చి నిల్చెఁ గర్ణుం డనిలో”
(లేదా...)
“గాండీవమ్మును దాల్చి నిల్చె ఘనుఁడా కర్ణుం డనిన్ వీరుఁడై"
(విట్టుబాబుకు ధన్యవాదాలతో...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“గాండీవముఁ దాల్చి నిల్చెఁ గర్ణుం డనిలో”
(లేదా...)
“గాండీవమ్మును దాల్చి నిల్చె ఘనుఁడా కర్ణుం డనిన్ వీరుఁడై"
(విట్టుబాబుకు ధన్యవాదాలతో...)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికందం
తొలగించండిమెండుగ చరవాణిఁ గనుచు
నిండుగఁ జదువక పరీక్ష నెగ్గఁగఁ దరమే?
దండుగమారిగ వ్రాసితె?
"గాండీవముఁ దాల్చి నిల్చెఁ గర్ణుం డనిలో!"
తొలగించండిశార్దూలవిక్రీడితము
పండించున్ చదువన్నదే బ్రతుకనన్ బాఠాలనేర్వంగ, ముం
దుండంగన్ జరవాణి నీకు సుత! సంతోషమ్మదే చూడఁగన్!
గుండెల్మండెను నీదు వ్రాతగరువుల్ గుప్పింప! నిర్వాకమై
"గాండీవమ్మును దాల్చి నిల్చె ఘనుఁడా కర్ణుం డనిన్ వీరుఁడై!"
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి🙏ధన్యోస్మి గురుదేవా! 🙏
తొలగించండిమూడవ పాదంలో 'గురువుల్ గుప్పింప' గా చదువుకొన ప్రార్థన.
పాండవుగావగవిజయుఁడు
రిప్లయితొలగించండిగాండీవముఁదాల్చినిల్చె, గర్ణుండనిలో
పాండవుద్రుంపగనెదురై
కాండముతోడనుతనరుచుకాంతులనీనెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిభండన మందున విజయుడు
రిప్లయితొలగించండిగాండీవము దాల్చి నిల్చె :గర్ణుo డని లో
మెండుగ శౌర్యము జూపగ
నిండగు స్నేహ మున దాను నిక్కుచు నిల్చెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిభండనమున బీభత్సుడు
రిప్లయితొలగించండిగాండీవముఁ దాల్చి నిల్చెఁ గర్ణుం డనిలో
మెండుగ చెలరేగుచు తా
బాండవ సైన్యంబునెల్ల బాధలువెట్టెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిజెండాపైకపిరాజునిల్చెసఖుడైజేగొట్టకృష్ణుండునున్
రిప్లయితొలగించండిచండాడనతిరుడైకిరీటిఘనతన్చాపంబుదివ్యాంగమై
గాండీవమ్మునుదాల్చినిల్చె, ఘనుడాకర్ణుండాకర్ణుండనిన్వీరుడై
చండుండారవితేజమున్గలుగనోజస్సున్గనన్నిల్చెగా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపాండవుల దునుమాడగ
రిప్లయితొలగించండిగాండీవముఁ దాల్చి నిల్చెఁ గర్ణుం డనిలో
చెండాడు చుండ నాతని
బండి పుడమిలో దిగబడ పార్థుడు సంపెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"పాండవులన్ దునుమాడగ" అనండి.
🙏🏽
తొలగించండిగాండీవము=విల్లు
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిభండనమున బీభత్సుడు
గాండీవముఁ దాల్చి నిల్చెఁ, గర్ణుండనిలో
గాండీవినెదురు కొనగల
గండర గండడతడంచు కౌరవులనిరే.
రండో బాలకులార చెప్పెదనిటన్ రమ్యంబుగా గాథలన్
చెండాడంగను కౌరవాధములనా జిష్ణుండె ప్రేతేశుడై
గాండీవమ్మును దాల్చి నిల్చె, ఘనుడా కర్ణుండనిన్ వీరుడై
గాండీవిన్ ఠవణించునట్టి కడు విక్రాంతుండతండే సుమా!
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండి*గాండీవమ్మును దాల్చి నిల్చె ఘనుఁ డా కర్ణుం డనిన్ వీరుఁడై.*
రిప్లయితొలగించండిమెండౌ బంధుగణంబులన్ జిదుమ దా మేనెల్ల కంపించ, పా
ర్థుండర్థింప మరల్చ దివ్యరథమున్ దోధూయమానుండునై,
నిండౌ స్ఫూర్తిని పార్థ సారథిడగా నిర్నిద్రతో క్రీడియే
గాండీవమ్మును దాల్చి నిల్చె ఘనుఁ డాకర్ణుం డనిన్ వీరుఁడై.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిచండాడడె యర్జునుఁడున్
రిప్లయితొలగించండిగాండీవముఁదాల్చి;నిల్చె కర్ణుండనిలో
చండతర భానుగతి,కో
దండంబునుఁబూని శత్రుతతి భీతిల్లన్.
చండాస్త్రంబుల సవ్యసాచి రిపులంజండాడె నొక్కుమ్మడిన్
*గాండీవమ్మునుఁదాల్చి;నిల్చెఘనుడాకర్ణుండనిన్ వీరుఁడై*
చండాంశుండు నభంబు వెల్గుగతి,శస్త్రాస్త్రంబులన్ రువ్వుచున్
గుండెల్ చీల్చగసాగె శత్రుతతులున్ ఘోషించి పర్వెత్తగన్.
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:
రిప్లయితొలగించండిభండనమందు కపిరథుడు
గాండీవము దాల్చి నిలిచె, గర్ణుండనిలో
మెండౌ చాపము నూనియు
దండించెద పార్థుననుచు తా వచ్చె వడిన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిక్రొవ్విడి వెంకట సుబ్బలక్ష్మి, ఉడ్బర్రీ, అమెరికా:
రిప్లయితొలగించండిదండన జేయగ విజయుడు
గాండీవము దాల్చి నిలిచె,గర్ణుండనిలో
చెండాడుచు శత్రువులను
పండిన శాపముల వలన పతనంబయ్యెన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:
రిప్లయితొలగించండిమెండౌ నూర్జముతో కిరీటి నిలిచెన్ మిన్నంది యుద్ధమ్మునన్
గాండీవమ్మును దాల్చి, నిల్చె ఘనుడా కర్ణుండనిన్ వీరుడై
దండింతున్ తృటిలో ధనుంజయుని నా ధన్వమ్మునన్ శక్తియే
నిండై యుండిన యీ శరమ్ము ననుచున్ నిల్చెన్ నెఱిన్ గూడుచున్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపాండవ మధ్యము డనిలో
రిప్లయితొలగించండిచెండాడె నెటల తెలుపుమ, చెప్పుము రణమున్
మెండగు కీర్తిని పొందెన్,
గాండీవము దాల్చి,నిలిచె గర్ణుండనిలో
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిచండాడన్ కురు సైన్య సంచయమనిన్ సంసిద్ధుడై తేరుపై
రిప్లయితొలగించండిచండార్కుంగతి ఫల్గునుండు విజయో త్సాహంబు పెంపారగా
గాండీవమ్మును దాల్చి నిల్చె, ఘనుఁడా కర్ణుం డనిన్ వీరుఁడై
నిండౌ దీమసమొప్ప స్యందనముపై నిల్చెన్ మహోత్సాహుడై
*రణోత్సాహుడై
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిగాండీవి దీమసంబుగ
రిప్లయితొలగించండిగాండీవముఁ దాల్చి నిల్చెఁ, గర్ణుం డనిలో
నిండారు విక్రమంబున
మెండుగ శరసంచయమును బెంపుగవిసరెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికందం
రిప్లయితొలగించండిపాండుకుమారుడు పార్థుడు
గాండీవము దాల్చి నిల్చె ,గర్ణుం డనిలో
గుండియ జల్లన రీతిని
నిండార సమరము జేసి నిధనం బొందెన్.
ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటర్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిచెండాడన్ రిపులన్ కిరీటి యనిలో శ్రీజాని తోడుండగా
రిప్లయితొలగించండిగాండీవమ్మును దాల్చి నిల్చె, ఘనుఁడా కర్ణుం డనిన్ వీరుఁడై
నిండౌగుండియ తోడ కాచుచు హితున్ నిర్భీతితో మించె దో
ర్దండాధిక్యము చూపుచున్ మొనలకున్ ధైర్యమ్ము నందించుచున్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఆండాళు వింటి వెయిదియ
రిప్లయితొలగించండిగాండీవము దాల్చి నిల్చె గర్ణుండనిలో
గాండీవము గ్రీడియెగద
యండగ దాదాల్చి జేసె నాహవమపుడున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిచెండాడన్ గురు సేన నర్జునుఁడు రాజీవాక్షు సారథ్యమున్
రిప్లయితొలగించండిగాండీవమ్మును దాల్చి నిల్చె, ఘనుఁడా కర్ణుం డనిన్ వీరుఁడై
యండాండంబులు పిక్కటిల్లగ ధనుష్టంకారమున్ జేసె, వే
దండద్వంద్వమహో మహోగ్ర గతి నుద్దండించె నుద్రిక్తమై
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిగాండీవమ్ము ధరింపఁగ
రిప్లయితొలగించండిగాండీవి రణాంతరమునఁ గాలాభుండై
చండతర కార్ముక మపర
గాండీవముఁ దాల్చి నిల్చెఁ గర్ణుం డనిలో
మండం డెక్కెము నందు మారుతి మహా మార్తాండ తుల్యుండునై
దండన్ నిల్వఁగఁ దోలుచున్ హయములన్ దామోదరుండే రణో
ద్దండాజేయుఁడు తమ్ముఁడే నిలువ బద్ధద్వేషి బీభత్సుఁ డా
గాండీవమ్మును దాల్చి నిల్చె ఘనుఁడా కర్ణుం డనిన్ వీరుఁడై
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
తొలగించండిగాండీవమ్మును దాల్చినిల్చె ఘనుడాకర్ణుండనిన్ వీరుడై
రిప్లయితొలగించండిగాండీవమ్మును దాల్చు వీరుడు గనన్ గౌంతేయుడే పృధ్వినిన్
చెండాడు రిపు వీరులయ్యెడను గసిన్ జిచ్ఛక్తి తోడ్పాటునన్
ఖండంబౌనటు జేయు చయ్యన నొగిన్ గంఠమ్ము లొక్కుమ్మడిన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమూడవ పాదంలో గణభంగం. "చెండాడున్ రిపు వీరులయ్యెడ గసిన్..." అనండి.
3వపాదం మొదలు
రిప్లయితొలగించండిచెండాడున్ గా చదువప్రార్ధితుడను
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఖండించాలనియొండొరుల్ సతతమున్
రిప్లయితొలగించండిగాక్షించి నిర్భీతితో
కొండల్పిండిగ జేయు పార్థుడు వెసన్
గొట్లాటలో శూరుడున్
గాండీవంబు ధరించి నిల్చె, ఘనుడా
కర్ణుండనిన్ వీరుడై
చెండాడం దన బాణ సంచయమునున్
జేపట్టి నిల్చెన్ దగన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'ఖండించాలి' అన్నది వ్యావహారికం. "ఖండింపం జని యొండొరుల్..." అందామా?
చెండాడగవైరులనట
రిప్లయితొలగించండినండగనుండంగశౌరి యర్ధునుడచ్చో
మండెడుతరణివలెనిలిచె
గాండీవముఁ దాల్చి నిల్చెఁ గర్ణుం డనిలో
పాండవమధ్యముడచ్చో
గాండీవము దాల్చి నిల్చె,కర్ణుండనిలో
కుండలములుచెవులమెరయు
చుండగనుత్సుకతతోడచూచెకురుపతిన్ణ