28, ఏప్రిల్ 2022, గురువారం

సమస్య - 4064

29-4-2022 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“స్తనమే నాకిష్ట మనుచు సన్యాసి యనెన్”
(లేదా...)
“స్తనమే యిష్టము నా కటంచుఁ బలికెన్ సన్యాసి సద్బుద్ధితోన్”

40 కామెంట్‌లు:

 1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించు
 2. మునుపటి కాలము నే తల

  చిన కలుగుచు‌ నుండు నెపుడు చీదర నాకున్,

  ఘనమౌ మోక్షము‌ నిడు శ్వ

  స్తనమే నా కిష్టమనుచు సన్యాసి యనెన్

  శ్వస్తనము‌ ‌=భవిష్యత్త్ కాలము

  రిప్లయితొలగించు
 3. కందం
  వినయంబున నలువసతిని
  బ్రణతుల నర్చించి ధవళ వస్త్రంబులతో
  జనని గళమందునుచ గో
  స్తనమే నాకిష్ట మనుచు సన్యాసి యనెన్

  మత్తేభవిక్రీడితము
  వినయంబున్ గలఁబోసి భక్తియుతుడై విద్యాళికిన్ దేవినిన్
  బ్రణతుల్జేయుచు నిష్ఠతో ధవళ వస్త్రంబుల్ సదాచారమై
  జననిన్ దీరిచి విగ్రహంపు గళమున్ సత్కాంతులన్ వెల్గ గో
  స్తనమే యిష్టము నా కటంచుఁ బలికెన్ సన్యాసి సద్బుద్ధితోన్

  (గోస్తనము =
  నలువది పూసల సరము.)

  రిప్లయితొలగించు
 4. తనువుననర్ధమునారీ
  మునులకుదివ్యతనొకటిగమూర్తిగనుండన్
  అనయముపదనటవిన్య
  స్తనమేనాకిష్టమనుచుసన్యాసియనెన్

  రిప్లయితొలగించు
 5. అనయము దైవస్మరణము
  వినయవిధేయతలు మరి వివేకములను నీ
  గొనముల మేల్కలయిక గో
  స్తనమే నాకిష్టమనుచు సన్యాసి యనెన్

  రిప్లయితొలగించు
 6. కందం
  ఘనతరముగ తెమ్మనె గో
  స్తనమే నాకిష్ట మనుచు సన్యాసి యనెన్
  తన యాశ్రమ వాసుల తో
  డున వెడలుచు యాత్రకై కడుంగడు వింతన్

  ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
  ఉండవల్లి సెంటర్.
  గోస్తనము-నలువది పూసల సరము

  రిప్లయితొలగించు
 7. కె.వి.యస్. లక్ష్మి, ఉడ్బర్రీ, అమెరికా:

  మౌనమె మోక్షము గూర్చెడి
  ఘనమగు మార్గం బనుచును కనుగొని నంతన్
  దినమును తపమూనెడి శ్వ
  స్తనమే నాకిష్టమంచు సన్యాసి యనెన్.

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "మును మౌనమె మోక్షము నిడు..." అనండి.

   తొలగించు
 8. అనయము హరి నామ జపము
  మునుకొని సల్పుచును మోహ ములనే విడుచున్
  తనువే వలదను నత డే
  స్తనమే నాకిష్ట మంచు సన్యాసి యనె న్?

  రిప్లయితొలగించు
 9. అనివార్యంబిది చావటంచెఱిగి యన్యాయంబు జింతింపకన్
  కనకాగార కళత్ర మిత్ర సుత సంఘాతంబులన్ వీడుచున్
  ఘనమౌ భక్తిని నామసంస్మరణతో కైవల్య మాశించి, గో
  స్తనమే యిష్టము నా కటంచుఁ బలికెన్ సన్యాసి సద్బుద్ధితోన్.

  అగార-గృహములు
  గోస్తనము-గుండ్లహారము

  రిప్లయితొలగించు
 10. జనపదము నందునుండిన
  జనులందరు గూడి భక్తి శ్రద్ధగ వలువల్
  తనకొసగ బోవ నైష
  స్తనమే నాకిష్ట మనుచు సన్యాసి యనెన్

  ఐషమస్తనము = ఈ సంవత్సరపుది

  రిప్లయితొలగించు
 11. క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:

  ఘనమగు శ్రద్ధను గూడుచు
  జినుని గుఱించి తపమెంచి చెలగెడి నాకున్
  అనయము నిశ భుక్తికి గో
  స్తనమే నాకిష్ట మనుచు సన్యాసి యనెన్.

  రిప్లయితొలగించు
 12. అనయము గోస్తని నదిలో
  మునుగుచు దేలుచు తరించి ముక్తినికోరే
  ఘనతాపసియాతడు గో
  స్తనమే నాకిష్ట మనుచు సన్యాసి యనెన్

  రిప్లయితొలగించు
 13. క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:

  అనయమ్మున్ హరి నామమున్ తలచుచున్ నానంద భాగ్యమ్ముతో
  అనుమోదిల్లెడు యోగినిన్ తినుట కాహారమ్ము మీకేదనన్
  ఘనమౌ ధ్యానము సల్పగా బలిమినే గల్గించి మేల్గూర్చు గో
  స్తనమే యిష్టము నాకటంచు బలికెన్ సన్యాసి సద్బుద్ధితోన్.

  రిప్లయితొలగించు
 14. తన సర్వస్వము వీడియు
  కనుగొంచును మోక్షసిద్ధి కామించక స్త్రీ
  లనహో!భిక్షాపాత్రగు
  స్తనమే నాకిష్టమనుచు సన్యాసియనెన్.

  అనఘా!సర్వము వీడి మోక్షమునకై
  యారాటముంజెందుచుం
  గనుగొంచుంబ్రతి జీవిలో భగవ
  దాకారంబునే నిత్యముం
  జను,కామాదివికారముల్ బడక,
  భిక్షాపాత్రగానెంచుచున్
  స్తనమే యిష్టము నా కటంచు బలికెన్
  సన్యాసి సద్భుద్ధితోన్.

  రిప్లయితొలగించు
 15. అనయంబా పరమాత్ము చింతనమునం దానందమున్ బొందుటన్
  వినయంబున్ సదసద్వివేకమును సర్వేశున్ మదిన్ నిల్పుటల్
  గొనముల్ తాపసి భూషణంబులగు నా గుణ్యంపు మేలైన గో
  స్తనమే యిష్టము నా కటంచుఁ బలికెన్ సన్యాసి సద్బుద్ధితోన్

  రిప్లయితొలగించు
 16. ఘనమౌ కోవెలనొంటి కాననములోఁ గట్టించి సద్భక్తితో
  వినయమ్మొప్పగ నిల్పి విగ్రహములన్ ప్రేమమ్ముతో శౌరికిన్
  అనువౌవస్త్రములన్ సరమ్ములను దేహమ్మున్ నియోగించి గో
  స్తనమే యిష్టము నా కటంచుఁ బలికెన్ సన్యాసి సద్బుద్ధితోన్

  రిప్లయితొలగించు
 17. మనుజులకు నెంచఁ బాప
  మ్ము నించుకయుఁ జేయ కుంట పొసఁగదు ధరలోఁ
  దనరిన పాపప్రాయ
  స్తనమే నా కిష్ట మనుచు సన్యాసి యనెన్

  [ప్రాయః + తనము = ప్రాయస్తనము: ప్రాయశ్చిత్తము]


  అనయం బింపుగ ధర్మ వర్తనమునం దాసక్తి వర్ధిల్ల మూ
  రిన సద్భక్తినిఁ బద్మనాభుఁ డగు నా శ్రీనాథు గాధాలి చిం
  తనలో సంతత ముండు నిర్మలమునౌ నారాయ ణోపేయివ
  స్తనమే యిష్టము నా కటంచుఁ బలికెన్ సన్యాసి సద్బుద్ధితోన్

  [ఉపేయివస్ + తనము = ఉపేయివస్తనము: చేరినట్టి చిత్తము]

  రిప్లయితొలగించు

 18. మునిజన వంద్యుండగు రా
  మునినామము నమ్మినట్తి మోక్షార్థిని నే
  ననిశము జపియింపగ గో
  స్తనమే నాకిష్ట మనుచు సన్యాసి యనెన్.


  క్షణికమ్మౌ సుఖభోగముల్ విడిచి మోక్షార్థుండనై భక్తితో

  మునివంద్యుండగు రామచంద్రుని సదా పూజించి సేవింపగా

  ననునిత్యంబు జపమ్ము సేసికొనగన్ హారంబు తెమ్మంటి, గో

  స్తనమే యిష్టము నా కటంచుఁ బలికెన్ సన్యాసి సద్బుద్ధితోన్

  రిప్లయితొలగించు
 19. కననౌవేదముజాగరూకతనుతాగావింపబ్రహ్మంబునున్
  వినగానాదముబ్రహ్మతేజమునునావిష్కారమయ్యెన్మదిన్
  అనువైసాధననంతరాంతరమునాయాకాలవేదాంగగో
  స్తనమేయిష్టమునాకటంచుబలికెన్సన్యాసిసద్బుద్ధితోన్

  రిప్లయితొలగించు
 20. తన పాతివ్రత్యము నొర
  గొన దిసమొల వడ్డనంబు గోర త్రిమూర్తుల్
  గొని శిశువులుగా పాలిడె
  స్తనమే నాకిష్ట మనుచు సన్యాసి యనెన్

  రిప్లయితొలగించు
 21. మనమెప్పన్నిను నుతింతి వినుమమ్మా
  వాణి వాగ్దేవి నీ
  వనినన్ మానవ కోటి స్వాంతనములో
  ప్రత్యేక స్థానంబు జీ
  వనముల్ వెల్గును సుమ్మి నీ విమల సద్భా
  వంపు సాహిత్య పా
  స్తనమే యిష్టము నాకటంచు బల్కెన్ సన్యాసి సద్బద్ధిచే


  రిప్లయితొలగించు
 22. వనితాలోలుడు వారకాంత గని వైవశ్యంబునన్ ప్రేలగా
  స్తనమే యిష్టము నా కటంచుఁ; బలికెన్ సన్యాసి సద్బుద్ధితోన్
  వినుమీ దేహము నశ్వరంబు ముదిమిన్ వ్రేలాడునంగాంగముల్
  గనుమా శాశ్వతు నిత్య సత్య పరమోత్కర్షాభిరామంబునే

  రిప్లయితొలగించు
 23. స్తనమే యిష్టము నా కటంచు బలికెన్ సన్యాసి సద్బుద్ధి తోన్
  (1)మ:స్తనసౌందర్యము జూపి నా మనమునన్ స్థానమ్ము బొందంగ నీ
  మనమం దెన్నడు దల్ప కమ్మ మగువా ! మా యాశ్రమ మ్ముండె గో
  స్తని తీరాన బ్రశాంతవేదికగ, నే సౌందర్యమే కోర, గో
  స్తనమే యిష్టము నా కటంచు బలికెన్ సన్యాసి సద్బుద్ధితోన్
  (ఆ సన్యాసి యొక్క ఆశ్రమం గోస్తనీ నది వద్ద ఉన్నది.నీ స్తనసౌందర్య మెందుకు.గోస్తన సౌందర్యం నేను చూడ గలను అన్నడి ఆ నిజమైన సన్యాసి.)
  (2)కం:"కనుడీ చిత్రము లం
  దే స్తనములు మీ కిష్ట ?" మనుచు సరసుం డడుగన్
  తన బిడ్డ నోటి కిడు నా
  స్తనములు నా కిష్ట మనుచు సన్యాసి యనెన్.
  (3)కం:ఘనమగు సంగీతమునకు
  ననువుగ సాహిత్య మలరి యాధ్యాత్మికతన్
  మనమున నింపెడు వాణీ
  స్తనములు నా కిష్ట మనుచు సన్యాసి యనెన్.
  (సంగీత మపి సాహిత్యం వాగ్దేవీ కుచద్వయం అని ఆర్యోక్తి.)


  రిప్లయితొలగించు
 24. అనయము చేయుచు తపమును
  గొనియెద మారపితకృపను కూరిమితోడన్
  వినుమా ముక్తి నొసగు శ్వ
  స్తనమే నాకిష్ట మనుచు సన్యాసి యనెన్”*

  మనమున హరినే తలచుచు
  ఘనముగ తపమును జపమును కానలలో తా
  ననయము చేయదలచి గో
  స్తనమే నాకిష్ట మనుచు సన్యాసి యనెన్”*

  రిప్లయితొలగించు