30-4-2022 (శనివారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“బమ్మెర పోతనను గవిగఁ బల్కఁగఁ దగునే”(లేదా...)“బమ్మెర పోతనన్ గవిగఁ బ్రాజ్ఞులు మెచ్చరటన్న సత్యమే”
ఇమ్ముగ బద్యమున్ బలుక నెవ్వరు మెత్తురు నేటి కాలమున్సొమ్ములు గూర్చునట్టివిల చొక్కపు విద్యలుగా దలంచుచున్తిమ్మిని బమ్మి జేయుటయె ధీమసమౌనను బృందమందునన్ బమ్మెర పోతనన్ గవిగఁ బ్రాజ్ఞులు మెచ్చరటన్న సత్యమే
ఉత్పలమాలఇమ్మనుజేశ్వరాధములకీయనటంచును గావ్యకన్యకన్నమ్మిన రామచంద్రునకు నల్వ సతీమణినొమ్ము సేయకేసమ్మతి నంకితమ్మునిడి సద్గతిఁ బొందిన మేటి భక్తుఁడౌబమ్మెర పోతనన్ గవిగఁ బ్రాజ్ఞులు మెచ్చరటన్న సత్యమే?
కందంఅమ్మకు కన్నీళ్లు దుడిచినమ్మినరామయ్యకిచ్చి నల్వురు మెచ్చన్కమ్మని కృతి, నే సమ్యక్బమ్మెర పోతన్న సుకవి గాదంద్రు బుధుల్?
కందంకమ్మని భాగవతంబుననిమ్ముగ హరి దివ్యగాధలేర్పడఁ జెప్పన్జిమ్మక కవితా సుధలన్బమ్మెర పోతనను గవిగఁ బల్కఁగఁ దగునే?
కమ్మని నీలభమ్ము సమకట్టిన క్షౌద్రము వంటి పద్యముల్ బమ్మెర వ్రాసినట్టి కృతి భాగవతమ్మున కొల్లలంచు తా సమ్మతి తెల్పినారిలను సంస్కృతు లెల్లరు గాదె కాంచగన్ బమ్మెర పోతనన్ గవిగఁ బ్రజ్ఞులు మెచ్చరటన్న సత్యమే?
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
బమ్మెర పోతన కన్నను కమ్మని పద్యములు చెప్పు కవులెవ్వరురా యిమ్మహి? యెటులంటివిటుల బమ్మెర పోతనను కవిగ బల్కగ తగునే.
ఇమ్ముగ బద్యమున్ బలుక నెవ్వరు మెత్తురు నేటి కాలమున్నమ్మరు ఛందమున్ యతిని నాగరికంబవి గావు పొమ్మనిన్సమ్మతిగా దలంత్రు పదసంచయమే జనరంజకంబహో బమ్మెర పోతనన్ గవిగఁ బ్రాజ్ఞులు మెచ్చరటన్న సత్యమే
కమ్మని రచనను జేసిన బమ్మె పోతనను గవిగ బల్కగ దగు. నే డిమ్మహి కవిగా వెల్గగ నెమ్మెయి పద్యము ల నల్ల నిష్ట పడుగదా !
క్రమ్మర కవిసంఘంబునబమ్మెర పోతనను గవిగఁ బల్కఁగఁ దగునేయిమ్ముగ కవితాబ్రహ్మగుబమ్మెర పోతన కవీంద్ర పావనచరితున్
నమ్మి నజగుని నుతించినబమ్మెర పోతనను గవిగఁ బల్కఁగఁ దగునేబమ్మెర యది యంతయు ననివమ్ము సలుప మూఢులెంచి వదరిన విధమేఅజగుడు = విష్ణువుబమ్మెర = భ్రాంతివమ్ము = వ్యర్థము
అమ్మో!సహజ కవీంద్రుఁడు*బమ్మెర పోతనను గవిగ బల్కగ దగు;నే*సొమ్ములు గొనకయె భాగవతమ్మును తెనిగించి దశరథాత్మజునకిడెన్.అమ్మరొ!బాష్పధారలు కుచాగ్రముపైఁబడ నేల యేడ్చెదో?యమ్మనుజేశ్వరాధముల కమ్మను భారతి!నమ్ముమంచు,నాంధ్రమ్మున వ్రాసె భాగవత గ్రంథము రామునికంకితమ్ముగా*బమ్మెర పోతనన్ గవిగ ప్రజ్ఞులు మెచ్చరుటన్న!సత్యమే?*
ఇమ్ముగ వ్రాసెను భాగవతమ్మును రామునకుకృతిగ, ధరణీశులకున్ అమ్మెడు వారల పోలికబమ్మెర పోతనను గవిగఁ బల్కఁగఁ దగనే
కందంకమ్మని కృష్ణకథా కావ్యమ్మును రాజులు విదల్చు వైభవ ములకున్నమ్మ ననెడి ఘన రమ్యక్బమ్మెరపోతన్న సుకవి గాదంద్రుబుధుల్? .ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రిఉండవల్లి సెంటర్.
కమ్మని యాంధ్ర భాగవత కావ్యముప్రస్తుత కాలమందునన్నిమ్మహి గాంచ లేము ,బుధులెల్లరుమెచ్చిరి కాని యజ్ఞుడున్సమ్మతి దెల్పకం బలు కసత్యపు మాటలు ,మూర్ఖడన్నచోబమ్మెర పోతనన్ కవిగ ప్రాజ్ఞుల మెచ్చరటన్న సత్యమే!
క్రమ్మఱ విడిచి కవీంద్రునిబమ్మెర పోతనను, గవిగఁ బల్కఁగఁ దగునేసొమ్ముల కమ్మ కటాక్షమునిమ్మనుజేశ్వరుల కమ్ము హీనుని నెమ్మిన్
ఎమ్మెలు కొన్ని వచింపఁగఁ బమ్మిన ధన మదము తోడఁ బండిత మానిన్ రమ్మని వానిని, నెన్నుచుబమ్మెర పోతనను, గవిగఁ బల్కఁగఁ దగనే ఇమ్మహిఁ బద్య కోటి పఠియింపఁగఁ బండిత పామరాళి హర్షమ్మున నాంధ్ర సంస్కృత సుశబ్దము లారసి పొంగు చుండునే పమ్మిన సిద్ధ హస్తుఁ డిల భక్తి రసమ్మున సుందరంపు నైజమ్ము కవిత్రయమ్మునకు సాటి కవిత్వము నందు నెన్నఁగా బమ్మెర పోతనన్ గవిగఁ బ్రాజ్ఞులు మెచ్చర టన్న సత్యమే?
అమ్మలగన్న యమ్మయని యార్తిగ దుర్గను సన్నుతించుచున్కమ్మని జానుతెన్గు నుడికారముతో కమనీయ పద్యముల్నెమ్మనమున్ హరించుగతి నెమ్మి రచించిన సత్కవీంద్రుడౌబమ్మెర పోతనన్ గవిగఁ బ్రాజ్ఞులు మెచ్చరటన్న సత్యమే?
అమ్మరొ యేమీ పలుకులు బమ్మెరపోతనను గవిగ బల్కగ దగునే కమ్మగ భాగవతమ్మును నీమ్ముగ దావ్రాసి యిచ్చె నిక్ష్వాకునకున్
బమ్మెరపోతనన్ గవిగ బ్రాఙ్ఞులు మెచ్చరటన్న సత్యమే బమ్మెరపోతనన్ గవిగ భావన జేయని వారినందరిన్ నిమ్మహి బ్రాఙ్ఞులే యనుట యెన్నడు సహ్యముగాదు భావనా! బమ్మెరపోతనే భువినీ భక్తిరసంబును జిమ్మెగా గధన్
ఇమ్ముగ సుకవులు మెచ్చిరి*బమ్మెర పోతనను కవిగ బల్కగ దగునే !*సొమ్ములకైవ్రాసెడివారిమ్మహిలోఘనులటంచునెరుగనిరీతిన్
ఇమ్ముగ బద్యమున్ బలుక నెవ్వరు మెత్తురు నేటి కాలమున్
రిప్లయితొలగించండిసొమ్ములు గూర్చునట్టివిల చొక్కపు విద్యలుగా దలంచుచున్
తిమ్మిని బమ్మి జేయుటయె ధీమసమౌనను బృందమందునన్
బమ్మెర పోతనన్ గవిగఁ బ్రాజ్ఞులు మెచ్చరటన్న సత్యమే
ఉత్పలమాల
రిప్లయితొలగించండిఇమ్మనుజేశ్వరాధములకీయనటంచును గావ్యకన్యకన్
నమ్మిన రామచంద్రునకు నల్వ సతీమణినొమ్ము సేయకే
సమ్మతి నంకితమ్మునిడి సద్గతిఁ బొందిన మేటి భక్తుఁడౌ
బమ్మెర పోతనన్ గవిగఁ బ్రాజ్ఞులు మెచ్చరటన్న సత్యమే?
కందం
తొలగించండిఅమ్మకు కన్నీళ్లు దుడిచి
నమ్మినరామయ్యకిచ్చి నల్వురు మెచ్చన్
కమ్మని కృతి, నే సమ్య
క్బమ్మెర పోతన్న సుకవి గాదంద్రు బుధుల్?
కందం
తొలగించండికమ్మని భాగవతంబున
నిమ్ముగ హరి దివ్యగాధలేర్పడఁ జెప్పన్
జిమ్మక కవితా సుధలన్
బమ్మెర పోతనను గవిగఁ బల్కఁగఁ దగునే?
రిప్లయితొలగించండికమ్మని నీలభమ్ము సమకట్టిన క్షౌద్రము వంటి పద్యముల్
బమ్మెర వ్రాసినట్టి కృతి భాగవతమ్మున కొల్లలంచు తా
సమ్మతి తెల్పినారిలను సంస్కృతు లెల్లరు గాదె కాంచగన్
బమ్మెర పోతనన్ గవిగఁ బ్రజ్ఞులు మెచ్చరటన్న సత్యమే?
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిబమ్మెర పోతన కన్నను
రిప్లయితొలగించండికమ్మని పద్యములు చెప్పు కవులెవ్వరురా
యిమ్మహి? యెటులంటివిటుల
బమ్మెర పోతనను కవిగ బల్కగ తగునే.
ఇమ్ముగ బద్యమున్ బలుక నెవ్వరు మెత్తురు నేటి కాలమున్
రిప్లయితొలగించండినమ్మరు ఛందమున్ యతిని నాగరికంబవి గావు పొమ్మనిన్
సమ్మతిగా దలంత్రు పదసంచయమే జనరంజకంబహో
బమ్మెర పోతనన్ గవిగఁ బ్రాజ్ఞులు మెచ్చరటన్న సత్యమే
కమ్మని రచనను జేసిన
రిప్లయితొలగించండిబమ్మె పోతనను గవిగ బల్కగ దగు. నే
డిమ్మహి కవిగా వెల్గగ
నెమ్మెయి పద్యము ల నల్ల నిష్ట పడుగదా !
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిక్రమ్మర కవిసంఘంబున
రిప్లయితొలగించండిబమ్మెర పోతనను గవిగఁ బల్కఁగఁ దగునే
యిమ్ముగ కవితాబ్రహ్మగు
బమ్మెర పోతన కవీంద్ర పావనచరితున్
నమ్మి నజగుని నుతించిన
రిప్లయితొలగించండిబమ్మెర పోతనను గవిగఁ బల్కఁగఁ దగునే
బమ్మెర యది యంతయు నని
వమ్ము సలుప మూఢులెంచి వదరిన విధమే
అజగుడు = విష్ణువు
బమ్మెర = భ్రాంతి
వమ్ము = వ్యర్థము
అమ్మో!సహజ కవీంద్రుఁడు
రిప్లయితొలగించండి*బమ్మెర పోతనను గవిగ బల్కగ దగు;నే*
సొమ్ములు గొనకయె భాగవ
తమ్మును తెనిగించి దశరథాత్మజునకిడెన్.
అమ్మరొ!బాష్పధారలు కుచాగ్రముపైఁబడ నేల యేడ్చెదో?
యమ్మనుజేశ్వరాధముల కమ్మను భారతి!నమ్ముమంచు,నాం
ధ్రమ్మున వ్రాసె భాగవత గ్రంథము రామునికంకితమ్ముగా
*బమ్మెర పోతనన్ గవిగ ప్రజ్ఞులు మెచ్చరుటన్న!సత్యమే?*
ఇమ్ముగ వ్రాసెను భాగవ
రిప్లయితొలగించండితమ్మును రామునకుకృతిగ, ధరణీశులకున్
అమ్మెడు వారల పోలిక
బమ్మెర పోతనను గవిగఁ బల్కఁగఁ దగనే
కందం
రిప్లయితొలగించండికమ్మని కృష్ణకథా కా
వ్యమ్మును రాజులు విదల్చు వైభవ ములకున్
నమ్మ ననెడి ఘన రమ్య
క్బమ్మెరపోతన్న సుకవి గాదంద్రుబుధుల్? .
ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటర్.
కమ్మని యాంధ్ర భాగవత కావ్యము
రిప్లయితొలగించండిప్రస్తుత కాలమందున
న్నిమ్మహి గాంచ లేము ,బుధులెల్లరు
మెచ్చిరి కాని యజ్ఞుడున్
సమ్మతి దెల్పకం బలు కసత్యపు మాటలు ,
మూర్ఖడన్నచో
బమ్మెర పోతనన్ కవిగ ప్రాజ్ఞుల మెచ్చరటన్న సత్యమే!
క్రమ్మఱ విడిచి కవీంద్రుని
రిప్లయితొలగించండిబమ్మెర పోతనను, గవిగఁ బల్కఁగఁ దగునే
సొమ్ముల కమ్మ కటాక్షము
నిమ్మనుజేశ్వరుల కమ్ము హీనుని నెమ్మిన్
ఎమ్మెలు కొన్ని వచింపఁగఁ
రిప్లయితొలగించండిబమ్మిన ధన మదము తోడఁ బండిత మానిన్
రమ్మని వానిని, నెన్నుచు
బమ్మెర పోతనను, గవిగఁ బల్కఁగఁ దగనే
ఇమ్మహిఁ బద్య కోటి పఠియింపఁగఁ బండిత పామరాళి హ
ర్షమ్మున నాంధ్ర సంస్కృత సుశబ్దము లారసి పొంగు చుండునే
పమ్మిన సిద్ధ హస్తుఁ డిల భక్తి రసమ్మున సుందరంపు నై
జమ్ము కవిత్రయమ్మునకు సాటి కవిత్వము నందు నెన్నఁగా
బమ్మెర పోతనన్ గవిగఁ బ్రాజ్ఞులు మెచ్చర టన్న సత్యమే?
అమ్మలగన్న యమ్మయని యార్తిగ దుర్గను సన్నుతించుచున్
రిప్లయితొలగించండికమ్మని జానుతెన్గు నుడికారముతో కమనీయ పద్యముల్
నెమ్మనమున్ హరించుగతి నెమ్మి రచించిన సత్కవీంద్రుడౌ
బమ్మెర పోతనన్ గవిగఁ బ్రాజ్ఞులు మెచ్చరటన్న సత్యమే?
అమ్మరొ యేమీ పలుకులు
రిప్లయితొలగించండిబమ్మెరపోతనను గవిగ బల్కగ దగునే
కమ్మగ భాగవతమ్మును
నీమ్ముగ దావ్రాసి యిచ్చె నిక్ష్వాకునకున్
బమ్మెరపోతనన్ గవిగ బ్రాఙ్ఞులు మెచ్చరటన్న సత్యమే
రిప్లయితొలగించండిబమ్మెరపోతనన్ గవిగ భావన జేయని వారినందరిన్
నిమ్మహి బ్రాఙ్ఞులే యనుట యెన్నడు సహ్యముగాదు భావనా!
బమ్మెరపోతనే భువినీ భక్తిరసంబును జిమ్మెగా గధన్
ఇమ్ముగ సుకవులు మెచ్చిరి
రిప్లయితొలగించండి*బమ్మెర పోతనను కవిగ బల్కగ దగునే !*
సొమ్ములకైవ్రాసెడివా
రిమ్మహిలోఘనులటంచునెరుగనిరీతిన్