25, ఏప్రిల్ 2022, సోమవారం

సమస్య - 4061

26-4-2022 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“జనమును మ్రింగంగ నొక్క శ్వానము వచ్చెన్”
(లేదా...)
“జనమును మ్రింగ వచ్చె నొక శ్వానము సర్వులు భీతిఁ జెందఁగన్”

47 కామెంట్‌లు:

 1. అనువుగనతడేబలముగ
  వినయముతోడుతతగవరివిందులవిందై
  కనబడపట్టముగట్టిరి
  జనమునుమ్రింగంగనొక్కశ్వానమువచ్చెన్

  రిప్లయితొలగించండి

 2. పెనిమిటి తో మాటాడుచు
  వనితయె కూరలు తరిగెడి పాళమ్మున త
  ర్జని తెగిపడగనె యా వ్యం
  జనమును మ్రింగంగ నొక్క శ్వానము వచ్చెన్.

  రిప్లయితొలగించండి
 3. వినయముతోడజీవనముభావనతెల్లదొరంచువచ్చియా
  ఘనతనుమోసకారిగనఘమ్మునసంచరించుచున్
  పనిగొనిహిందురాజులకుపన్నుగవైరముకల్గఁజేసెనే
  జనమునుమ్రింగవచ్చెనొకశ్వానముసర్వులుభీతిఁజెందగన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   రెండవ పాదంలో గణభంగం. సవరించండి.

   తొలగించండి
  2. ఘనతనుమోసకారిగనఘమ్మునమత్తిలంగనేర్చియున్

   తొలగించండి
 4. మన రాజకీయ రంగము
  గన పక్షములుద్భవించు ఘనతరలీలన్
  జనులే తలచును మదిలో
  జనమును మ్రింగంగ నొక్క శ్వానము వచ్చెన్

  రిప్లయితొలగించండి

 5. ధనికులయింట పెండిలికి దండిగ జేరిరి బంధు జాలమే

  ఘనమగు విందు కోసమని కాంతలు కూరలు కోయుచుండ త

  ర్జని తెగె నొక్క భామినికి రక్తపు టేరులు పారె నట్టి వ్యం

  జనమును మ్రింగ వచ్చెనొక శ్వానము సర్వులు భీతిజెందగన్.

  రిప్లయితొలగించండి
 6. ఘనముగ వంటలు వండియు
  వనితయు పొరుగింటి వైపు పని కై వెడలెన్
  కన రా రెవ్వ రనుచు భో
  జనమును మ్రింగంగ నొక్క శ్వాన ము వచ్చె న్

  రిప్లయితొలగించండి
 7. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 8. కందం
  దనుజ సదృశ రూప మృగము
  జనమును మ్రింగంగ, నొక్క శ్వానము వచ్చెన్
  తన పుర వాసుల రక్షణ
  మొనర్చ విశ్వాసము తగ మొఱుగుడు పఱచిన్.
  ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
  ఉండవల్లి సెంటర్.

  రిప్లయితొలగించండి
 9. తనయుడు చేయువేళ దన తండ్రికి
  శ్రాద్ధము యేటి వడ్డునన్
  వినయముతోడ సాదమును విప్రుడు
  సెప్పిన రీతి పెట్టగా
  గనుగొని కన్నుగప్పిశునకమ్ము తటాలున
  జేరి యట్టి భో
  జనమును మ్రింగవచ్చె నొక శ్వానము
  సర్వులు భీతిజెందగన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "శ్రాద్ధము నేటి యొడ్డునన్" అనండి.

   తొలగించండి
 10. చనవరులందరు గూడగ
  వనభోజనముల కొరకయి వండిన వాటిన్
  తినగ వదిలి పెట్టిన భో
  జనమును మ్రింగంగ నొక్క శ్వానము వచ్చెన్

  రిప్లయితొలగించండి
 11. ధనమును విచ్చలవిడిగా
  ననువుగ వెచ్చించి కొన్న యాహారమ్మున్
  తినకన్ వృధజేసిన, భో
  జనమును మ్రింగంగ నొక్క శ్వానము వచ్చెన్

  రిప్లయితొలగించండి
 12. ధనమును లెక్కచేయక సదా చెడు మార్గమునన్ చరించుచున్
  వినయ విధేయతల్ మరచి వేదన గూర్చుచు కన్నవారికిన్
  తనయుడు తా చరించునెడ తప్పుడుదోవఁ దలంచి రెల్ల భో
  జనమును మ్రింగ వచ్చె నొక శ్వానము సర్వులు భీతిఁ జెందఁగన్

  రిప్లయితొలగించండి
 13. అనువగు కాలమంచు కడు నద్భుత రీతిని నిర్వహింపగా
  పనిగొని క్షాత్రమందునను పండిత వర్యులతో సదస్సులన్
  ఘనమగు వంటకమ్ములను కన్గొని కావలి వానిఁ ద్రోసి భో
  జనమును మ్రింగ వచ్చె నొక శ్వానము సర్వులు భీతిఁ జెందఁగన్

  రిప్లయితొలగించండి
 14. చని కాశీ సద్భక్తిన్
  అనఘుండై కాలభైరవాఖ్యుని గనియెన్
  తనయింట భక్తినిడ భో
  జనమును మ్రింగంగ నొక్క శ్వానము వచ్చెన్

  రిప్లయితొలగించండి
 15. ఘనముగ తీర్థయాత్రలకు కాశి గయాదులకేగి యచ్చటం
  దానములాడి దానములు తద్దయు సేసియు వచ్చి యింటికిం
  గనుగొని బంధుమిత్రులను కమ్మని విందును సేయునంత,భో
  జనమును మ్రింగవచ్చెనొక శ్వానము సర్వులు భీతిఁజెందగన్.

  రిప్లయితొలగించండి
 16. రిప్లయిలు
  1. కందం
   జనులెవ్వరు కూర్చొనకయె
   వనభోజన పంక్తి విందు వడ్డింపనటన్
   గనుకప్పుచు బిర బిర భో
   జనమును మ్రింగంగ నొక్క శ్వానము వచ్చెన్

   చంపకమాల
   జనములు బంతిఁ గూర్చొనక సర్వము వడ్డనజేసినంతటన్
   మునుమును విస్తరాళి వనభోజనమందునఁ దొందరెక్కువై
   గనులను గప్పి యాకలికి గన్పడ ముచ్చట నాగలేక భో
   జనమును మ్రింగ వచ్చె నొక శ్వానము సర్వులు భీతిఁ జెందఁగన్

   తొలగించండి
  2. కందం
   కనువిందగు సోయగమని
   వెనుకొనఁ గని నాట్యశాల వేడుక యన మా
   లిని వడ్డించు వలపు భో
   జనమును మ్రింగంగ నొక్క శ్వానము వచ్చెన్

   తొలగించండి
  3. మీ మూడు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
 17. కం:తన యన్నదానమున భో
  జనమును మ్రింగంగ నొక్క శ్వానము వచ్చెన్
  తన పై బాబా దయయని
  ఘనుడౌ భక్తుండు పెట్టె కమ్మని తిండిన్.
  (బాబా భక్తులకి ఈ జీవకారుణ్యం ఎక్కువ.ముఖ్యంగా కుక్కని బాబా అనుచరుడి గా ,ఆయన రూపం గా గౌరవిస్తారు.)

  రిప్లయితొలగించండి
 18. చం:జనులకు భోజనమ్ములను సర్వులు హోటలు నుండి తేగ,భో
  జనమును మ్రింగ వచ్చె నొక శ్వానము సర్వులు భీతి జెందగన్
  తన కడ నున్న కర్రగొని దానిని ద్రోలుచు నింత భీతియా?
  యని యొక నవ్వు నవ్వె నొక డా శునకమ్ముల తీ రెరుంగుటన్.
  (ఇక్కడ "సర్వులు"అనేది మనిషి పేరు.సర్వయ్య,సర్వేశం,సర్వప్ప అనే పే ర్లున్నట్టే అతడి పేరు సర్వులు.)

  రిప్లయితొలగించండి
 19. అనునిత్య మపాయ మెదు
  ర్కొనుచుం దిరుగాడు చుండు కూన యొకటి భీ
  తినిఁ గని మార్జాలము వడిఁ
  జన మును మ్రింగంగ నొక్క శ్వానము వచ్చెన్


  కనఁ బడి నట్టి యెల్లర కఖండిత వాక్కులు చెప్పు చుండుఁ దా
  ననిశము కాఁగ ఛిద్రములె యందఱికిం జెవు లెల్ల వింతగా
  వినఁ డతఁ డెంత వద్దనిన వీనులు కొర్కుచు నుండుఁ దద్దయున్
  జనమును మ్రింగ వచ్చె నొక శ్వానము సర్వులు భీతిఁ జెందఁగన్

  రిప్లయితొలగించండి
 20. కనుమూరితోడ,సహభో
  జనమును మ్రింగంగ నొక్కశ్వానము వచ్చెన్
  గనగనె భయపడుచును లే
  చిననను,జూచి పరిజనులు సేసిరీ సేవల్

  రిప్లయితొలగించండి
 21. తినుటకు సిద్ధమయ్యెడను ధీరతతోడను బాత్రలోని భో
  జనమును మ్రింగవచ్చె నొకశ్వానము సర్వులు భీతిజెందగన్
  వినుమిది భోజ్యపాత్రలను వేరుగ నెత్తగు చోటులందునన్
  నునుపగ మంచిదెప్పుడును నూరక చెప్పుటలేదు సత్యముల్

  రిప్లయితొలగించండి
 22. జనులకు శుష్క వరంబులు
  ననునయ వాక్యములు బలికి యధికారంబున్
  గొని జాతి సంపద ప్రయో
  జనమును మ్రింగంగ నొక్క శ్వానము వచ్చెన్

  రిప్లయితొలగించండి
 23. అనయముదోచుచన్య ప్రజ అక్రమమార్గమునందు ధారుణిన్
  గనుచుదురాత్ముడొక్కడటకాచెధనమ్మునుదొంగిలంచగన్
  వినయముచూపురీతిగనువేషముమార్చుచు వేగమాతనా
  “ర్జనమును మ్రింగ వచ్చె నొక శ్వానము సర్వులు భీతిఁ జెందఁగన్”

  ఘనమగు కొలువది దొరకగ
  వినయముతో నొక్కడచటవిందును కూర్చన్
  తినగా ప్రజ మిగిలినభో
  *"జనమును మ్రింగంగ నొక్క శ్వానము వచ్చెన్”*

  రిప్లయితొలగించండి