6, ఏప్రిల్ 2022, బుధవారం

సమస్య - 4043

7-4-2022 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రావణుఁ జంపంగఁ బోయి రాముఁడు సచ్చెన్”
(లేదా...)
“రావణుఁ జంపఁ బోయి రఘురాముఁడు సచ్చెను వాలి సూడఁగన్”

19 కామెంట్‌లు:

  1. భావనఁజేసెనుబలము
    చేవనురంగస్థలమునఁజేసెనునటనన్

    ఠావునుదప్పగతడబడి
    రావణుఁజంపంగబోయిరాముఁడుసచ్చెన్

    రిప్లయితొలగించండి

  2. దేవానాం ప్రియుడొక్కడు
    తా వాగెను కల్లు ద్రావి తమ్ములతోడన్
    చేవను గలిగీన నేమిర
    రావణు జంపంగ బోయి రాముడు సచ్చెన్.


    రావణు సేవకుండొకడు రాతిరి స్వప్నము నందు గాంచెనే

    చేవను గల్గినట్టి శశిశేఖర భక్తుని దీవి రాయునిన్

    పావనిఁ బంధిసేసెనని వార్ధిని దాటి ప్లవంగ మూకతో

    రావణు జంపఁ బోయి రఘురాముడు సచ్చెను వాలి సూడగన్.

    రిప్లయితొలగించండి
  3. ఆవిర్భవించె పోరా
    తావున బోయీలనడుమ తారాస్థాయిన్
    చావేతథ్యంబని నా
    రావణుఁ జంపంగఁ 'బోయి రాముఁడు' సచ్చెన్

    రిప్లయితొలగించండి
  4. ఈ వాక్యము తప్పేయగు
    "రావణుఁజంపంగఁబోయి రాముడు సచ్చెన్"
    నావలదు, గురువరా!సీ
    తావిభుఁడే రావణునిహతంబొనరించెన్.

    రిప్లయితొలగించండి
  5. *రావణుఁజంపఁబోయి రఘు రాముడు సచ్చెను వాలి సూడగన్*
    ఈ విధమౌ సమస్యలు కవీంద్ర!యొసంగుట మీకు పాడియే?
    రావణుఁజంపెగాదె రఘు రాముడు నంతకుమున్నె వాలినిన్
    జావగ నేసె బాణమున సాలములేడును గూల్చినాడుగా!

    రిప్లయితొలగించండి
  6. రావణ పుత్రుడేగి తన రాక్షస మాయను నుగ్రరూపుడై
    వావిరి యైన నాగముల బంధితు జేయ నరుండు వాలినన్
    దేవర విన్మటంచు రణధీరుడు వోయి వచించె తండ్రితో
    రావణుఁ జంపఁ బోయి రఘురాముఁడు సచ్చెను వాలి సూడఁగన్

    రిప్లయితొలగించండి
  7. పావని సాయము గైకొనె
    రావణుఁ జంపంగఁ బోయి రాముఁడు .; సచ్చెన్
    రానణుడె పోరు సలుపుచు
    పావని భూమి సుతను జెరబట్టిన కతనన్

    రిప్లయితొలగించండి
  8. రావణునకు శ్రీరామున
    కావహమున నటులిరువురు నభినయమందున్
    జీవించిరి తడబాటున
    రావణుఁ జంపంగఁ బోయి రాముఁడు సచ్చెన్

    రిప్లయితొలగించండి
  9. 1.కందం
    మావనుఁ జంపఁగ బోయిన
    దేవకితనయుండు గూలి తెగటాఱెననన్!
    నీవొప్పవె పృచ్ఛక? యే
    రావణుఁ జంపంగఁ బోయి రాముఁడు సచ్చెన్?

    2.జిల్లా విద్యాధికారి ఒక యుపాధ్యాయునితో..

    ఉత్పలమాల
    నీవొక యొజ్జవై చదువు నేర్పిన రీతిగ లేదు చూడగన్!
    జేవనెరుంగఁ బిల్లలను జేయ పరీక్ష వినంగలేనయా!
    మావనుఁ జంపఁ బోయి యదుమాన్యుఁడు సచ్చెను చేది రాట్గనన్!
    రావణుఁ జంపఁ బోయి రఘురాముఁడు సచ్చెను వాలి సూడఁగన్!

    రిప్లయితొలగించండి
  10. రావణుఁజంపఁబోయి రఘు రాముడు సచ్చెను వాలిసూడగన్
    పావని ద్రౌపదిన్ వెదుక వారిధి దాటియుఁజంపె భీమునిన్
    త్రావెను కాలకూటము సురారులు మెచ్చగ పాకశాసనుం
    డీవిధమౌ సమస్యలు బళీబళి!పూరణ సేయ శక్యమే!

    రిప్లయితొలగించండి
  11. కందం
    ఏవిధముగ సరి జూచిన
    ఈ వాక్యంబు మతిలేని హేళన కొరకున్
    గావించెడి దూషణగున్
    రావణు జంపంగ బోయి రాముడు సచ్చెన్

    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటర్.

    రిప్లయితొలగించండి
  12. కావర మణచగ పోరెను
    రావణు చంపంగ బోయి రాముడు: చచ్చె న్
    ధీ వరు శర ఘాతమ్మది
    రావణు నాభిని జొరబడ రౌద్రము గాగన్

    రిప్లయితొలగించండి
  13. ఆ విభుని కేమి పని‌యో

    దీవికి వెడలంగ ,సీత దేముడెవరొకో,

    రావణుడనిలో నేమయె

    రావణు జంపంగ బోయి, రాముడు ,సచ్చెన్.

    రిప్లయితొలగించండి
  14. రావణ రామసంగరము రక్తిగ సాగుచునుండ వేదికన్
    రావణ పాత్రధారిపయి రయ్యన వైచెను బాణమొక్కటిన్
    రావణుఁ జంపఁ బోయి రఘురాముఁడు, సచ్చెను, వాలి సూడఁగన్
    ఆవలివైపునుండి తెరకాతడుపస్థితుడయ్యు నత్తరిన్

    {రామరావణ సంగ్రామ ఘట్టం రసవత్తరంగా ప్రదర్శింప బడుతోంది. రావణుని చంపబోయి అతడిపై రాముడు
    రయ్యిమని బాణంవదిలాడు. ఆ సమయంలో తెరవెనుక కూర్చున్న వాలి(పాత్రధారి) చూస్తూండగా రావణుడు రాముని బాణహతికి చచ్చెను.} :)

    రిప్లయితొలగించండి
  15. పావని సీతా సతిఁ గని
    యీ వచనము లనిరి మోసగింప నవనిజన్
    రావణిచే నని యసురులు
    రావణుఁ జంపంగఁ బోయి రాముఁడు సచ్చెన్


    చావును దత్క్షణం బొసఁగఁ జాలెడు రామ శరమ్ము తాఁకఁగా
    నా వన చారి వక్షము మహాయస సన్నిభమున్ దృఢమ్మునుం
    జేవ సెలంగ మిక్కుటము స్వీయ వరానుజు శత్రు సంఘ వి
    ద్రావణుఁ జంపఁ బోయి రఘురాముఁడు, సచ్చెను వాలి, సూడఁగన్

    [..సచ్చెను వాలి రఘురాముఁడు సూడఁగన్ ]

    రిప్లయితొలగించండి
  16. తావిధివంచనంబుననుదారుణమయ్యెగధర్మకర్తకున్
    పావనిసీతగానకనుబాధనువాలినితమ్ముగానగా
    చేవనుజేసెమైత్రినటచేడ్పడియన్ననుసంహరిమచెనే
    రావణుఁజంపఁబోయిరఘురాముఁడు;సచ్చెనువాలి;సూడగన్

    రిప్లయితొలగించండి
  17. పావని జానకీ సతిని బాపి దశానను
    డుంచెలంకలో
    నీ విషయంబు నంత వెసనెర్గియు గట్టెను
    వారధిన్ బలున్
    రావణు జంపబోయి రఘు రాముడు, సచ్చెను వాలి చూడగన్
    కావరశాళి దానవుడు గ్రక్కన జొచ్చి
    బిలంబునందునన్

    రిప్లయితొలగించండి