30, ఏప్రిల్ 2022, శనివారం

సమస్య - 4066

1-5-2022 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శశి యమావాస్యఁ గురిపించెఁ జంద్రికలను”
(లేదా...)
“చల్లని వెన్నెలల్ గురిసెఁ జంద్రుఁడు వచ్చి యమాస రాతిరిన్”

19 కామెంట్‌లు:

  1. తేటగీతి
    లేమి నందున జిక్కినఁ బ్రేమఁ జూపి
    మగని లాలించి కష్టము మఱువఁ జేసి
    ముదిత శుభము వలుక నగుమోమున ముఖ
    శశి యమావాస్యఁ గురిపించెఁ జంద్రికలను

    ఉత్పలమాల
    తల్లడమొందు భర్తఁగని తల్లివలెన్ సతి లాలనమ్మునన్
    మెల్లఁగఁ దీరుఁ గష్టములు మేదిని సౌఖ్యములందునంచుఁ దా
    నుల్లము నూరడిళ్ల శుభమొప్పగఁ బల్కఁగ భామ మోమునన్
    జల్లని వెన్నెలల్ గురిసెఁ జంద్రుఁడు వచ్చి యమాస రాతిరిన్!

    రిప్లయితొలగించండి
  2. అంధయుగమునకావ్యముహరియనంగ
    అరుణచంద్రుడునవకవియవతరించె
    నవ్యజగతికితానుగానాందిపలికె
    శశియమావాస్యఁగురిపించెచంద్రికలను

    రిప్లయితొలగించండి
  3. తేటగీతి
    అంతరిక్ష శాస్త్రజ్ఞులు యాత్ర జేసి
    నిర్మితము జేయ కృత్రిమ నీర జారి
    బింబము, వెలుగు జిమ్మగ బీరు వోక
    శశి యమావాస్య గురిపించె జంద్రికలను

    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటర్.
    నీరజారి-చంద్రుడు

    రిప్లయితొలగించండి
  4. పెల్లుబుకంగనంధతయువెల్లువయయ్యెప్రబంధకావ్యముల్
    మల్లియమాధురీలతలమాటునచీకటిక్రమ్మెనాయనన్
    అ ల్లననవ్యకావ్యము యందెలుమ్రోగెనుతెల్గువాకిటన్
    చల్లనవెన్నెలల్గురిసెఁజంద్రుఁడువచ్చెయమా రాతిరిన్

    రిప్లయితొలగించండి
  5. అల్లననవ్యకావ్యములయందెలుమ్రోగెనుతెల్గువాకిటన్

    రిప్లయితొలగించండి
  6. కల్లలు గావు రాజు కడు కామ చరిత్రుని
    కాలమందున
    న్నెల్లరు బాధ జెంది,రని యీతని జంపి
    విదేశ రాజు తా
    చల్లగ జూడ బౌరులను సంబరమొందియు
    పల్కిరిట్టులన్
    చల్లని వెన్నెలల్ గురిసె చంద్రుడు వచ్చి యమాస రాతిరిన్

    రిప్లయితొలగించండి

  7. గురువు గారడిగిరిటుల గ్లో యెవండు?
    నందివర్ధన మననేమి? యిందు మతిని
    రమ్యమందు తపసుడేమి రాల్చు ననగ
    శశి, యమావాస్య, గురిపించె చంద్రికలను.


    కపట జూదమందునగెల్చి కరుణవీడి
    పడతినవమాన పరచెడు పాళమందు
    నచట లేనట్టి కృష్ణుండె యాదుకొనెనె
    శశి యమావాస్య గురిపించె చంద్రికలను.


    కల్లల నాడి జూదమున కౌరవ శ్రేష్ఠుడు గెల్చి టంకమున్

    వల్లభనీడ్చి రాసభకు, వల్వల నూడ్చుచు నుండు నత్తరిన్

    నల్లనివాడొసంగెగద నారికి వస్త్రములెన్నియో గనన్

    చల్లని వెన్నెలల్ గురిసె చంద్రుడు వచ్చి యమాసరాతిరిన్.

    రిప్లయితొలగించండి
  8. వధువు చంద్రిక నూతన వరుడు శశియె
    పెండ్లి జరిపిరి వారికిఁబెద్దలెల్ల
    చూడ ముచ్చటగానుండె నీడు జోడు
    "శశి"యమావాస్యఁగురిపించెఁజంద్రికలను.*

    అల్లదె క్రొత్తజంటలకు హాయినిఁగూర్చగ పౌర్ణమీతిథిన్
    *చల్లని వెన్నెలల్ గురిసెఁజంద్రుఁడు వచ్చి;యమాసరాతిరిన్*
    పెల్లుగఁజీకటుల్ ముసిరె ప్రీతినిఁగూర్చె గులాబి జాజులున్
    మల్లెలు మొల్లలున్ మరుని మార్గణజాలములై వసంతమున్.

    రిప్లయితొలగించండి
  9. మంచి బహుమతి గొనిపోయి మగువ కీయ
    మునిగె నానంద జలధిలో ముదిత వదన
    శశి యమావాస్య గురిపించె జంద్రికలను
    పతిని ముంచెను సౌఖ్యాల వరద యందు

    రిప్లయితొలగించండి
  10. పౌర్ణమిఱేయి నందున దన ప్రకృతి యైన
    వెన్నెలనిడుట నెన్నడు విడివడు గద
    శశి ; యమావాస్యఁ గురిపించెఁ జంద్రికలను
    తెరువున జరిపించిన విద్యుదీకరణము

    రిప్లయితొలగించండి
  11. తనను వలచిన వానితో మనువగునని
    విశదపడగ సంతసమొందెను శశివదన
    విభుడు కౌగిట ప్రేమతో బిగియపట్ట
    శశి యమావాస్యఁ గురిపించెఁ జంద్రికలను

    రిప్లయితొలగించండి
  12. చల్లని పిల్లవాయువులు సాంత్వనగూర్చుచు వీచుచుండ కో
    కొల్లలుగాగనుప్పతిలు కోర్కెలు యుల్లము సందడింపగా
    నల్లనివాడు పద్మనయనమ్ముల నందకిశోరు రాకతో
    చల్లని వెన్నెలల్ గురిసెఁ జంద్రుఁడు వచ్చి యమాస రాతిరిన్

    రిప్లయితొలగించండి
  13. ఎల్లి యుగాద నంగ తెలుగింట వధానము నిర్వహింపగా,
    నల్లిన పద్యరాజముల నచ్చిన వీక్షక లోకమెల్ల దా
    ముల్లస మంద హెచ్చుగ, మహోన్నత తీరగు ప్రక్రియన్గనన్,
    చల్లని వెన్నెలల్ గురిసె జంద్రుడు వవ్చి యమాస రాతిరిన్

    రిప్లయితొలగించండి
  14. చారుతర మూర్తి నిజ భర్త సద్గుణుండు
    స్వీయ తను కాంతు లందు రవి సదృశుండు
    నాత్మ వదన లావణ్యము నందు నెంచ
    శశి యమావాస్యఁ గురిపించెఁ జంద్రికలను


    కల్లయొ సత్యమో యెఱుఁగఁ గట్టెదుటం గనిపించి మించి నా
    యుల్లము వొంగ మిక్కుట మనూహ్యము దూరపు దేశ మందు వ
    ర్తిల్లెడు సుందరాస్యుఁడు నిజేశుఁడు దార మనోబ్ధి వెల్గుచుం
    జల్లని వెన్నెలల్ గురిసెఁ జంద్రుఁడు వచ్చి యమాస రాతిరిన్

    రిప్లయితొలగించండి
  15. శశియమావాస్య గురిపించె జంద్రికలను
    పున్నమి దినమున శశియే పూర్ణుడగుచు
    గురియ జేయును వెన్నెల గుంఫనముగ
    సోముడుండని రాతిరి చూడ తమమె

    రిప్లయితొలగించండి
  16. ఉల్లము ఝల్లనంగ నసిలోత్పలముల్ విలసిల్లె పున్నమిన్
    చల్లని వెన్నెలల్ గురిసెఁ జంద్రుఁడు వచ్చి; యమాస రాతిరిన్
    నల్లని యంబరంబలరెనా జలతారుగ మార తారలే;
    వల్లె రసజ్ఞులౌ కవుల స్పందనలెల్ల మనోజ్ఞముల్ గదా

    రిప్లయితొలగించండి
  17. చల్లని వెన్నెలల్ గురిసె జంద్రుడి వచ్చి యమాస రాతిరిన్
    నల్లదె యెంతదారుణము హర్షవిహీనము నయ్యె జూడగన్
    జల్లని వెన్నెలల్ గురియు చంద్రుడు పున్నమి రాతిరిన్ గదా
    కల్లలు మాటలాడగను గారణమున్నదె చెప్పుమా రవీ!

    రిప్లయితొలగించండి
  18. పున్నమి దినాన యగుపించు భూరిగాను
    వెదికినా యగుపించడువిన్నునందు
    కలువభామనుకనులార కనుచు మురిసి
    *శశి,యమావాస్య,గురిపించెచంద్రికలను*

    రిప్లయితొలగించండి
  19. పున్నమి దినాన యగుపించు భూరిగాను
    వెదికినా యగుపించడువిన్నునందు
    కలువభామనుకనులార కనుచు మురిసి
    *శశి,యమావాస్య,గురిపించెచంద్రికలను*


    మల్లెలు ఘమ్మనంగనట మానినులెల్లరు వేచియండగా
    నుల్లముఝల్లనంగవడినూదుచువేణువుమోహనమ్ముగా
    మెల్లగవచ్చుశౌరిగని మేదినియందున పర్చునట్లుగా
    చల్లని వెన్నెలల్ గురిసెఁ జంద్రుఁడు వచ్చి యమాస రాతిరిన్”

    రిప్లయితొలగించండి