27, ఏప్రిల్ 2022, బుధవారం

సమస్య - 4063

28-4-2022 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“బలిసి కౌరవుల్ సంపిరి పాండవులను”
(లేదా...)
“బల్లిదులైన కౌరవులు పాండవులం బరిమార్చి రుద్ధతిన్”

27 కామెంట్‌లు:

 1. లక్కయింట మడసిన వరవు సు తులను
  గాంచి మనములందున నమ్మకము దృఢముగ
  బలిసి కౌరవుల్ సంపిరి పాండవులను ,
  నిజముగ జరిగినట్టిది నేర్చకుండ

  రిప్లయితొలగించు
 2. కుటిలజూదంబుశకునితోకుట్రఁజేసి
  తగవులేకనుద్రౌపదితరుణిసిగ్గు
  బలిసికౌరవుల్సంపిరి, పాండవులను
  కరుణఁబ్రోచెనుకృష్ణుడుకాంతగాచి

  రిప్లయితొలగించు
 3. కుట్ర లెన్నియొ సేసిరి కుటిలు లగుచు
  బలిసి కౌరవుల్ సంపిరి పాండవులను
  పలు విదమ్ముల కష్టాలు పరగ జేసి
  కృష్ణు డ o డ గ నిల్చియు కీడు బాపె

  రిప్లయితొలగించు

 4. చదువులేకున్న నేమిరా సకల మెఱగి
  నట్టి పండితుడనటంచు ననవరతము
  డంభములు సతము పలుకు డింభుడనెను
  బలసి కౌరవుల్ సంపిరి పాండవులను


  నల్లని వాడు వెన్నుడు సనాతను డెంతగ చెప్పనేమి నా

  పిల్లలు యుద్ధకాంక్షనిక వీడక పోయిరటంచు కృంగెడిన్

  దల్లిని జేరి దుశ్శల ముదమ్మున చెప్పెను కంటి స్వప్నమున్

  బల్లిదు లైన కౌరవులు పాండవులం బరిమార్చిరుద్ధతిన్.

  రిప్లయితొలగించు
 5. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించు
 6. కపట యుక్తులు పన్నుచు కౌరవతతి
  లక్క యిలుగాల్చ తలచిరి పెక్కు రిటుల
  మిక్కుటంబగు ద్వేషము నక్కసు తెగ
  బలిసి కౌరవుల్ సంపిరి పాండవులను

  రిప్లయితొలగించు
 7. లక్కయింటిలోన రాత్రిని బోయలే
  పండు కొనగ వారె పాండవులని
  యౌర! క్రొవ్వు *బలిసి కౌరవుల్ సంపిరి;
  పాండవులను* బ్రోచె వాయు సుతుఁడె.

  రిప్లయితొలగించు
 8. బాలుడనిమదితలచక పార్థుసుతుని
  చుట్టుముట్టుచు నెల్లరు చూచుచుండ
  “బలిసి కౌరవుల్ సంపిరి, పాండవులను”
  చంపగనశక్తులగుచును సమరమందు.

  రిప్లయితొలగించు
 9. బల్లిదులైన కౌరవులు పాండవులంబరిమార్చిరుద్ధతిన్.
  కల్లయె కాదె,లక్కయిలు గాల్చిరిరాతిరి బోయకాంతయుం
  బిల్లలు బూడిదైనఁగని వీరలె పాండవులంచు నెంచరే!
  యల్లదె భీమసేనుఁడు మహాదృఢకాయుఁడు బ్రోచె వారలన్.

  రిప్లయితొలగించు
 10. ఎల్లలు లేని సైన్యమిది యీదగ లేరని, ధార్తరాష్ట్రులే
  మెల్లగ మైకమున్ మునిగి మీరిన మోదమునం దలంచరే
  "బల్లిదులైన కౌరవులు పాండవులం బరిమార్చి రుద్ధతిన్"
  ప్రల్లదు లెల్లజచ్చిరిక భండనమందున, గెల్చెధర్మమే.

  రిప్లయితొలగించు
 11. మాయజూదమునందున మానధనులు
  పాండుసుతులను కానలపాలుజేసి
  మనములందున వారిపై మచ్చరమ్ము
  బలిసి కౌరవుల్ సంపిరి పాండవులను

  రిప్లయితొలగించు
 12. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించు
 13. తేటగీతి
  మయసభా భవనవ్యధ మదిని తాక
  రాజరాజు, మాయాజూద రాజు శకుని
  మామను జతగ నాడించి మదము జేత
  బలిసి కౌరవుల్ సంపిరి పాండవులను.
  ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
  ఉండవల్లి సెంటర్.

  రిప్లయితొలగించు
 14. ఎల్లరు గూడి బాలు వధియించిరి హీనత వారలెవ్వరో
  కల్లతనంబునెవ్వరిని కాల్చగ జూచిరి లక్క యింటిలో
  ప్రల్లదులైన కౌరవుల పాండవులెట్లు దమించి మించిరో
  బల్లిదులైన కౌరవులు, పాండవులం, బరిమార్చి రుద్ధతిన్

  రిప్లయితొలగించు
 15. రిప్లయిలు
  1. తేటగీతి
   గననయంత్రమందున పద్యకవనమల్లఁ
   గత్తిరించుచు నతికించు పెత్తనమున
   భావహీనమై యతిచెల్లి పాదమయ్యె
   "బలిసి కౌరవుల్ సంపిరి పాండవులను"

   ఉత్పలమాల
   అల్లితె పద్యమున్ గననయంత్రమునందున గూర్పుఁ జేసి నీ
   వెల్లను కత్తిరింపులతికింపుల రీతిన నేరి మాటలన్
   పెళ్లున పాదమందు యతి పేరుచ నయ్యెను భావహీనమై
   "బల్లిదులైన కౌరవులు పాండవులం బరిమార్చి రుద్ధతిన్"

   తొలగించు
 16. చెల్లును పాండుపుత్రులకు చెచ్చెర నాయువటంచుపల్కగా
  నుల్లము కర్ణునిన్ గనుచు నుప్పరమున్ పయనించు చుండగా
  చల్లని రాత్రి కల్గె నొక చక్కని స్వప్నము రాజరాజుకున్
  “బల్లిదులైన కౌరవులు పాండవులం బరిమార్చి రుద్ధతిన్”

  రిప్లయితొలగించు
 17. రిప్లయిలు
  1. వారణావత పుర వాసుల మనోగతము:

   దుష్ట దుర్యోధ నాదులు శిష్ట వర్త
   ను లగు వీర వరేణ్యులను గపటమున
   నక్కజమ్ముగ నడిరేయి లక్క యింట
   బలిసి కౌరవుల్ సంపిరి పాండవులను


   పెల్లుఁదనమ్ము మీఱిన నవీన సభా గమనంపు సాకుతో
   నల్లన గుప్త భావమున హస్తి పురాఖిల పౌరకోటి కం
   పిల్లఁగ రాజ్య లక్ష్మి హరియింపఁగ మోసపు టక్ష విద్యలో
   బల్లిదు లైన కౌరవులు పాండవులం బరిమార్చి రుద్ధతిన్

   తొలగించు
 18. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించు
 19. అల్లన పాఠశాల చయమంతట దెర్వగ
  నొజ్జ వచ్చియున్
  మెల్లగ భారతాలమున మిక్కిలి సచ్చిన
  దెవ్వరంచనన్
  పిల్లడు సెప్పెనిట్టులను భేల మొగుంబును
  వేసి యయ్యెడన్
  బల్లిదులైన కౌరవులు పాండువులంబరి
  మార్చి రుద్ధతిన్

  రిప్లయితొలగించు
 20. కంబు‌ధరు నెవ్వరే రీతి కట్ట దలచె

  ఫల్గుణ సుతుని కౌరవుల్ పట్టి యేమి‌

  చేసె సమరమున‌, శకుని‌ జిత్తు తోడ

  దవము కెవరిని పంపె గాంధారి‌ సుతుడు

  బలిసి కౌరవుల్ ,సంపిరి, పాండవులను.

  రిప్లయితొలగించు
 21. బలిసి కౌరవుల్ సంపిరి పాండవులను
  ననుట సత్యదూ రముగద యార్య!యరయ
  యుద్ధరంగాన జంపిరి కృద్ధులగుచు
  పాండవులు కౌరవులనట బాణతతిని

  రిప్లయితొలగించు
 22. ఎల్లలులేని కోరికలనెల్ల త్యజించి పరంబునొంద చిం
  తిల్లెడువారు పాండవులు, తేకువలేక నిహంబునందు గా
  సిల్లెడువారు కౌరవులు, చిత్రముగా కలిమాయజిక్కి యా
  బల్లిదులైన కౌరవులు పాండవులం బరిమార్చి రుద్ధతిన్

  రిప్లయితొలగించు
 23. బల్లిదులైన కౌరవులు పాండవులన్ బరిమార్చిరుద్ధతిన్
  బల్లిదులైన పాండవుల బైసికొనంగను సాధ్యమే కనన్
  నల్లదె నాకలోకమును నందుకొనంగను ఘోరవాళియే
  యుల్లము జూపునట్టులుగ నూహకు వచ్చెను జిత్రమౌనుగా

  రిప్లయితొలగించు