23, ఏప్రిల్ 2022, శనివారం

సమస్య - 4059

24-4-2022 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“గ్రామంబున వెల్లిగొనెను రక్తపుటేరుల్”
(లేదా...)
“గ్రామమునందు వెల్లిగొనె రక్తపుటేరులు భీకరంబుగన్”

35 కామెంట్‌లు:

  1. రాముడు దశకంఠునితో
    భీమేశ్వరునివలె సల్పె భీకరపోరున్
    రోమాంచిత లీలన్ సం
    గ్రామంబున వెల్లిగొనెను రక్తపుటేరుల్

    రిప్లయితొలగించండి

  2. ఏమని చెప్పుదు భండన
    భీములు విజయార్థులగుచు విద్వేషముతో
    నేమము విడి తలపడు సం
    గ్రామంబున వెల్లిగొనెను రక్తపుటేరుల్

    రిప్లయితొలగించండి
  3. కాముకునధికారంబున
    తామసక్రీడాదరమునతగవదిలేకన్
    పామరుబలిగొనునాసం
    గ్రామంబునవెల్లిగొనెనురక్తపుటేరుల్

    రిప్లయితొలగించండి
  4. భామనుగోరెరావణుడుభంగముజేయుచుధర్మవర్తనన్
    భూమిని యాసజేసెగదభూపతిహస్తినదారిదప్పెయా
    సామములేనిచేష్టలనుసాయుధులౌటనుముప్పుగల్గుసం
    గ్రామమునందువెల్లిగొనెరక్తపుటేరులుభీకరంబుగన్

    రిప్లయితొలగించండి
  5. కందం
    భూమిని జన క్షయమాపఁగ
    సేమమనఁగ సంధి కొప్ప శ్రీకరుఁడన దు
    ష్కాముల మతిఁ గౌరవ సం
    గ్రామంబున వెల్లిగొనెను రక్తపుటేరుల్!

    ఉత్పలమాల
    భూమిని వంశనాశమగు పోరుకు దూకిన, సంధి మేలనన్
    సేమము రాజరాజ! యని శ్రీకరుఁడెంచిన విర్రవీగి దు
    ష్కామిగఁ ద్రోసిపుచ్చి విరసాన సుయోధనుఁడెంచ మేటి సం
    గ్రామమునందు వెల్లిగొనె రక్తపుటేరులు భీకరంబుగన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
      కందం మొదటి పాదంలో గణదోషం. సవరించండి

      తొలగించండి
    2. 🙏ధన్యోస్మి గురుదేవా!🙏

      సవరించిన కందం:

      కందం
      భూమి జన క్షయమాపఁగ
      సేమమనఁగ సంధి కొప్ప శ్రీకరుఁడన దు
      ష్కాముల మతిఁ గౌరవ సం
      గ్రామంబున వెల్లిగొనెను రక్తపుటేరుల్!

      తొలగించండి

  6. భామ యయోనజన్ గనిన పావని మాటల నాలకించి నీ

    ర్వామిని దాటి వానరులె వాహినిగా పురుషోత్తముండె యౌ

    రాముడు నాపలాశనుడు రావణు తోడను సల్పినట్టి సం

    గ్రామము నందు వెల్లిగొనె రక్తపు టేరులు భీకరంబుగన్.

    రిప్లయితొలగించండి
  7. కందం
    సామాజికదౌర్బల్యము
    ప్రేమాభిరుచుల బలిగొన రెచ్చిన జనులున్
    తామసమునకున్ లోబడ
    గ్రామంబున వెల్లిగొనెను రక్తపుటేరుల్.

    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటర్.

    రిప్లయితొలగించండి
  8. ఈమహి భారతాలమున నెందరొ
    యోధులు సైన్యయూధముల్
    సామజ ఘోటకమ్ములును జచ్చెను
    లెక్కకుమించి పీనుగుల్
    యామహితాజి యందున కడచ్చెరు
    వొందగనుండె నట్టి సం
    గ్రామమునందు వెల్లిగొనె రక్తపు టేరులు
    భీకరంబుగన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      పీనుగుల్+ఆ.. అన్నపుడు యడాగమం రాదు. కడునచ్చెరువు.. అనడం సాధువు.

      తొలగించండి
  9. ప్రేమల కు బదు ల సూయ గ
    తామసు లయ్యు చెల రేగి దాడుల తోడన్
    వేమరు పోరును సల్పగ
    గ్రామంబున వెల్లి గొనెను రక్తపు టే రుల్

    రిప్లయితొలగించండి
  10. ఏమని మారు దిట్టగల మెన్నిక లందున నాయకోత్తముల్
    బ్రేమను జూపి పేదలను పెద్దల పేరున మోసపుచ్చుచున్,
    దామటు గెల్చినంత నిక ద్రవ్యము, భూముల దోచివేయగా,
    గ్రామమునందు వెల్లిగొనె రక్తపుటేరులు భీకరంబుగన్.

    రిప్లయితొలగించండి
  11. గామిడి రారాజు తమదగు
    భూమి నొసగనన్న కతనమున ధర్మజుడున్
    బామమునొంది సలుపు సం
    గ్రామంబున వెల్లిగొనెను రక్తపుటేరుల్

    రిప్లయితొలగించండి
  12. సామజ రథాశ్వబలములు
    హేమాహేమీలునౌ మహీశులు పోరం
    గా,మాయురె!భారత సం
    గ్రామంబున వెల్లివిరిసె రక్తపుటేరుల్.

    కోమలి సీతఁగైకొనిన క్రూరుని రావణునిన్ వధింపగా
    శ్రీమదనంత వానరుల సేనలు రాముని యాజ్ఞ పోర, నా
    హా!మహిదద్దరల్లినది యబ్ధులు పొంగెను భూరి ఘోర సం
    గ్రామమునందు వెల్లిగొనె రక్తపుటేరులు భీకరంబులై.

    రిప్లయితొలగించండి
  13. సామజ రధగజ బలమును
    నిమ్ముగ బ్రాఘాతమంద యేర్పడ జొనుపన్
    నేమము విడితలపడు సం
    గ్రామంబున వెల్లిగొనెను రక్తపుటేరుల్

    రిప్లయితొలగించండి
  14. ఈ మహిఁ గౌరవ పాండవ
    భూమీశులు రాజ్య కాంక్షఁ బోరఁ గురుక్షే
    త్రామల తటి భారత సం
    గ్రామంబున వెల్లి గొనెను రక్తపు టేరుల్


    సామజ సత్పదాతిదళ సద్రథ సాశ్వ నికాయ యుక్త సం
    గ్రామ తలాంతర ప్రథిత కంపిత భూమి నిరంత రోగ్ర వి
    శ్రామ విహీన యుద్ధ గత శాత్రవ వీర మదేభ విగ్రహ
    గ్రామము నందు వెల్లిగొనె రక్తపు టేరులు భీకరంబుగన్

    రిప్లయితొలగించండి
  15. నీమములేని కౌరవుల నీచపు కృత్యములెల్ల సైచి సం
    క్షేమముగోరి యెల్లరకు చేసిన దౌత్యము వీగిపోయె నౌ
    రా! మసనంబువోలె సమరాంగణ మెల్లెడ దోచె నట్టి సం
    గ్రామమునందు వెల్లిగొనె రక్తపుటేరులు భీకరంబుగన్

    రిప్లయితొలగించండి
  16. ఏమని జెప్పనొప్పుదును గీచకభీముల ఘోరమైన సం
    గ్రామమునందు వెల్లిగొనె రక్తపుటేరులు భీకరంబుగన్
    గ్రామపు వైరముల్గనగ రాక్షసవృత్తిగ సంచరించుచున్
    నీమహినంతటన్ రుధిరయేరులు బాఱగ జేయుచుండిరే

    రిప్లయితొలగించండి
  17. రాముడు కపిసేనలతో
    దీమసముగ లంకకేగి దివిజులు పొగడన్
    తామసులన్ దునిమెడు సం
    గ్రామంబున వెల్లిగొనెను రక్తపుటేరుల్

    రిప్లయితొలగించండి
  18. క్షేమము గూర్చుచున్ బ్రజకు కీడు ఘటిల్లని రీతి కాచుచున్
    నీమము తోడ మార్కొనుచు నిల్చి రణమ్మున దేశ రక్షకుల్
    పామురులైన వైరులను వాడి శరమ్ముల ద్రెంచు చుండ సం
    గ్రామమునందు వెల్లిగొనె రక్తపుటేరులు భీకరంబుగన్

    రిప్లయితొలగించండి
  19. క్షేమము గాదు వైరమని కేశవుడొప్పుగ రాయబారియై
    గ్రామములైదు చాలు రణకాంక్షను వీడుమటంచు బల్కినన్
    తామసుడా సుయోధనుడధర్మ పథంబె చరింప గోరె సం
    గ్రామమునందు వెల్లిగొనె రక్తపుటేరులు భీకరంబుగన్

    రిప్లయితొలగించండి
  20. విదురుడు దృతరాష్ట్రుని తో

    కం:ఏమని వాక్రుచ్చగలను
    నేమములనువీడుచునటనీసుతులెల్లర్
    తామసమునచేసెడి సం
    గ్రామంబున నెల్లిగొనెనురక్తపుటేరుల్

    కం:కామాతురులైకొందరు
    కామినులనుగాంచికోర కాదనినంతన్
    గ్రామస్తులడ్డుకొన నా
    గ్రామంబున వెల్లిగొనెను రక్తపుటేరుల్”*

    ఉ.మా:తామసబుద్ధితోనటకుతాపసివేషముతోడవచ్చితా
    సోమునికాంతితోవెలుగుసుందరిసీతనుకాంక్షచేయగా
    రామునియాగ్రహమ్మచటలంకనుముట్టడి చేయబూ నసం
    *"గ్రామమునందు వెల్లిగొనె రక్తపుటేరులు భీకరంబుగన్”*

    రిప్లయితొలగించండి