2, ఏప్రిల్ 2022, శనివారం

సమస్య - 4039

3-4-2022 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కవికోకిల లెల్లఁ గూయఁ గాకులు నవ్వెన్”
(లేదా...)
“గొల్లున నవ్వెఁ గాకములు గోకిలలై కవులెల్లఁ గూయఁగన్”

22 కామెంట్‌లు:

 1. అవియివియనునంతరమే
  భువిలోతెలియనిమనసునభూజనులుండన్
  చవులూరుహితముచెప్పుచు
  కవికకిలలెల్లగూయగాకులునవ్వెన్

  రిప్లయితొలగించు
 2. చెల్లవుచేదుమాటలవి;చెప్పినసూక్తులువిందురాజనుల్
  మల్లియవంటికావ్యములుమాయలమాటలమూటలయ్యెడిన్
  పల్లపుబందలోనగలపందియుగంధమునిచ్చగించునా
  గొల్లుననవ్వెకాకములుకోకిలలైకవులెల్లగూయగన్

  రిప్లయితొలగించు
 3. చవు లూరించెడు కవితల
  చెవి కింపుగ గాన ములను చెలువుగ సలుపన్
  రవముల పరిహా సంబుగ
  కవి కోకిల లెల్ల గూయ గాకులు నవ్వెన్

  రిప్లయితొలగించు

 4. చవటలు కొందరు జేరిరి
  యవధానముజరుగు చుండ నధములు వారే
  కవనపు మధురిమనెఱుగక
  కవికోకిల లెల్ల గూయ గాకులు నవ్వెన్.

  రిప్లయితొలగించు
 5. ఈ మధ్య ఒక సభలో నేను గమనించిన విషయ పరంగా....

  కందం
  కవిసమ్మేళనమందు వె
  ధవలగు మంత్రులను బిల్వఁ దనరిన నటనన్
  జెవులన్ గొరికి యొకరొకరిఁ,
  గవికోకిల లెల్లఁ గూయఁ గాకులు నవ్వెన్!

  ఉత్పలమాల
  అల్లన మంత్రి బృందమది యందరి ముందర సాహితీసభన్
  జెల్లెడు వారి పోలికను జెప్పునదర్థముకాకపోయినన్
  బెళ్లునఁ బ్రక్క వారిఁగని వేడుక నొప్పఁగ వంతపాడుచున్
  గొల్లున నవ్వెఁ గాకములు గోకిలలై కవులెల్లఁ గూయఁగన్!

  రిప్లయితొలగించు
 6. చెవిటికి శంఖంబూదిన
  చెవులకు వినఁబడక నవ్వె చిత్రం బదె,వే
  కువ పంచమస్వరంబున
  కవి!కోకిలలెల్లఁగూయ కాకులు నవ్వెన్.

  రిప్లయితొలగించు
 7. కవిసమ్మేళనమందున
  కవితాగానముసలిపెడు కవులు కవితలన్
  సవురుగ పాడనెఱుంగమి
  కవికోకిల లెల్లఁ గూయఁ గాకులు నవ్వెన్

  రిప్లయితొలగించు

 8. ఎల్లలు దాటి ఖ్యాతివహియించిన సద్గుణ వంతు లైన ప్ర

  జ్ఞిల్లురు పద్యగానమట జేయుచునుండగ జండిపోతులౌ

  యల్లరిమూక చేరి పరిహాసము లాడుచు కూటమందునన్

  గొల్లున నవ్వెఁ గాకములు గోకిలలై కవులెల్లఁ గూయగన్

  జుల్లర మేమెఱుంగునట చొక్కపు గంధపు సౌరభమ్మిలన్.

  రిప్లయితొలగించు
 9. అల్లదె!కైతలోని రసమందము చందమెఱుంగలేని,యో
  ప్రల్లదు చెంతఁజెప్పుగతి ఫాలమునందు లిఖించబూనుటల్
  చెల్లున? బ్రహ్మ!నీకిది యు,చెప్పెడిదేమి,సభాంతరంబునన్
  *గొల్లుననవ్వెఁగాకములు గోకిలలై కవులెల్లగూయగన్.

  రిప్లయితొలగించు
 10. చవులూరు తెలుగు మాటల
  నవశ్యముగ చిన్నవారి కవగతి నిడగన్
  సవినయముగ మన తెలుగు
  కవికోకిల లెల్లఁ గూయఁ గాకులు నవ్వెన్

  రిప్లయితొలగించు
 11. క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:

  పవిదిగ కవితల నల్లియు
  సవురుగ సభలో చదివెడి సమయము నందున్
  కవనముల భావ మెఱుగక
  కవికోకిలలెల్ల గూయ కాకులు నవ్వెన్.

  రిప్లయితొలగించు
 12. అవిరళ హాస్యము నిండగ
  కవికోకిల లెల్లఁ గూయఁ గాకులు నవ్వెన్
  భువనము నందున కాకులు
  వివరింపగ లోకులుగద విషయము నెరుగన్

  రిప్లయితొలగించు
 13. క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:

  మెల్లగ పౌరులెల్లరిని మేల్కొన జేయుచు పండితోత్తముల్
  చల్లగనుండగోరి తమ చక్కని కైతలు చెప్పుచుండగా
  సొల్లు వినంగ సిద్ధమగు శుంఠల కర్థము కాకపోవగా
  గొల్లున నవ్వె కాకములు కోకిలలై కవులెల్ల గూయగన్.

  రిప్లయితొలగించు
 14. అల్లుచు పద్యముల్ కవులు హ్లాదముగా నవ వత్సరంబునం
  దుల్లము పల్లవింప నమితోల్లసనంబుగ పద్యగానమం
  దెల్లరు మగ్నులై దనర నెంతయు సంతసమాయె నక్కటా
  గొల్లున నవ్వెఁ గాకములు గోకిలలై కవులెల్లఁ గూయఁగన్

  రిప్లయితొలగించు
 15. ప్రల్లదనంబుచేత భయభక్తులు మానిన నేటిజాతి ధ
  మ్మిల్లము పట్టి యీడ్చినను
  మీరకయున్నది భావదాస్యమున్
  అల్ల పరాయి సంస్కృతికి
  హారతులిచ్చెడు-అక్కుపక్షులై
  గొల్లున నవ్వె కాకములు
  గోకిలలై కవులెల్ల గూయగన్

  రిప్లయితొలగించు
 16. చల్లని సంధ్య పండితుల సంఘము నూతన వత్సరమ్ములో
  నల్లన చేరి చావడిని హర్షముతోడ కరోన బాధలున్
  చెల్లెనటంచు పల్కగను చెన్నగు కైతల, నాకతాయలై
  గొల్లున నవ్వెఁ గాకములు గోకిలలై కవులెల్లఁ గూయఁగన్

  రిప్లయితొలగించు
 17. కందం
  కవిమిత్రులు గోష్ఠి సలుప
  సవివర చర్చలు జరుపుచు జాగు సలుపగన్
  యువకులు రభసను జేయగ
  కవి కోకిల లెల్ల గూయ గాకులు నవ్వెన్.

  ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
  ఉండవల్లి సెంటర్.

  రిప్లయితొలగించు
 18. కం.
  చవి యెరుగని దీనులుగా
  నివసించుచు లోకమందు నిర్లిప్తముగా
  నవధానమ్మును జూచుచు
  *కవికోకిల లెల్లఁ గూయఁ గాకులు నవ్వెన్*
  ఉ.మా.
  తెల్లనివన్ని పాలనుచు దీనత క్రమ్మగ మోసబోవుచున్
  సెల్లున దూరి సంతతము శ్రేయము పక్కనబెట్టి,కర్ణముల్
  చిల్లులు చేయు గానముల చిందులు వేయుచు నున్న రీతిగన్
  *గొల్లున నవ్వెఁ గాకములు గోకిలలై కవులెల్లఁ గూయఁగన్*

  రిప్లయితొలగించు
 19. భువి ధర్మమ్మును సత్య
  మ్ము వలుక నేఁడు కని వానిఁ బురుషులు కలిలో
  నవివేకి యనిరి కంటివె
  కవి! కోకిల లెల్లఁ గూయఁ గాకులు నవ్వెన్


  పెల్లుగ రాగ యుక్తములు పేరు గడింపఁగఁ దప్పు లున్నఁ గో
  కొల్లలు భాషలో నయినఁ గోట్లు గడించును జిత్ర వీథిలో
  నల్లిన నారికేల సదృశాంచిత పాకము నందు లోకులా!
  గొల్లున నవ్వెఁ గాకములు గోకిలలై కవులెల్లఁ గూయఁగన్

  రిప్లయితొలగించు
 20. పిల్లలటాంగ్ల మాధ్యమపు విద్యలలోఁ బడి తెన్గు నేర్వకన్
  తల్లడపాటునన్ బలుక తప్పుల కుప్ప లుగాది వేడుకన్
  గొల్లున నవ్వెఁ గాకములు; గోకిలలై కవులెల్లఁ గూయఁగన్
  ఝల్లనె నుల్లముల్ తెనుఁగు జాతి యశంబు విరాజమానమై

  రిప్లయితొలగించు
 21. అవగుణ వంతులు గొందఱు
  యవధానము జరుగుదరిని నాశీనులరై
  వికవిక పకపకలునగుట
  కవికోకిలలు గూయ గాకులు నవ్వెన్

  రిప్లయితొలగించు
 22. అల్లదె రామచంద్రునకు నారతి నిచ్చుచు బాటపాడగా
  నల్లరి మూకలయ్యెడను హాస్యము లాడుచు గంతువేయగన్
  దల్లడపాటు చెందుచును ధర్మవిరుద్ధపుచేతలన్గనన్
  గొల్లున నవ్వెకాకములు గోకిలలై కవులెల్ల కూయగన్

  రిప్లయితొలగించు