26, ఏప్రిల్ 2022, మంగళవారం

సమస్య - 4062

27-4-2022 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రతికై సోదరునిఁ గాంత రమ్మని పిలిచెన్”
(లేదా...)
“రతికై రమ్మనె నాత్మసోదరుని నారాటంబు గన్పట్టఁగన్”

46 కామెంట్‌లు:

  1. అతులిత శ్రద్ధాభక్తుల
    నతివ వ్రతమునాచరించెనానందముగా
    వ్రతము సమాప్తంబై హా
    రతికై సోదరునిఁ గాంత రమ్మని పిలిచెన్

    రిప్లయితొలగించండి
  2. ప్రతి దినమున్ బూజించుచు
    నతులిత భక్తి గను సుదతి యాహ్లా దముగాఁ
    పతి తో గూడియొ సగ హా
    రతి కై సోదరుని కాంత రమ్మని పిలిచెన్

    రిప్లయితొలగించండి
  3. అతి భక్తితోడ దేవీ
    వ్రతమంతయు నాచరించి వందనముల సం
    స్తుతులొనరిచి మంగళహా
    రతికై సోదరుని కాంతరమ్మని పిలిచెన్.

    రిప్లయితొలగించండి
  4. అతివలునల్పురుగారుగ
    క్షితిలోవారునుసగముగసేమంబందన్
    సతతముగౌరవమీ, భా
    రతికైసోదరునిఁగాంతపమ్మనిఁబిలిచెన్

    రిప్లయితొలగించండి
  5. అతులంబా యనురాగబంధమును సౌహార్దంబు నాప్యాయతల్
    సతతంబా జవరాలు సోదరుని శస్తంబున్న పేక్షించు నా
    డతడేలో వికలంపు చిత్తమున చింతాక్రాంతుడై యుండ హా
    రతికై రమ్మనె నాత్మ సోదరుని నారాటంబు కన్పట్టగన్

    రిప్లయితొలగించండి
  6. సతిగాసుందరిగాగసౌమ్యతనుతాశాంతంబులోనాత్మయై
    హితమున్గోరుచునుండునీవనిత, నీహేయంపువాచాలతన్
    మతినేదప్పుచునుంటివేఘనుడవైమారాముచాలింకభా
    రతికైరమ్మనెనాత్మసోదరునినారాటమ్ముకన్పట్టగన్
    నిగమశర్మఅక్కమాటలు

    రిప్లయితొలగించండి

  7. అతివయె యాహ్వానించెను
    వ్రతమును జేసెదమటంచు భ్రాతను ప్రీతిన్
    క్రతువు ముగియ వచ్చెను హా
    రతికై సోదరునిఁ గాంత రమ్మని పిలిచెన్.


    వ్రతమున్ జేసిన భోగభాగ్యములు సంప్రాప్తించు నంచున్ బురో

    హితుడొక్కండు వచింపగా పడతి ప్రత్యేకమ్ముగా నింటిలో

    క్రతువున్ జేయుచు నారగింపదియె పూర్తైపోవగా పిల్చె హా

    రతికై రమ్మనె నాత్మసోదరుని నారాటంబు గన్పట్టగన్.

    రిప్లయితొలగించండి
  8. రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "పోయిరి యంత... తాండవ నృతినిన్..." అనండి.

      తొలగించండి
    2. ధన్యవాదాలు గురువుగారు.

      కందం
      అతిగనలసిపోయిరి యం
      త, తదేకముగా సలిపిన తాండవ నృతినిన్
      గతి దప్పగ చాలించి వి
      రతికై సోదరుని గాంత రమ్మని పిలిచెన్.

      ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
      ఉండవల్లి సెంటర్.
      విరతి-విశ్రాంతి

      తొలగించండి
  9. అతులితమాయనురాగము
    సతతము సోదరుని యొక్క శస్తముగోరున్
    వెతనొంది యుండఁగని హా
    రతికై సోదరునిఁ గాంత రమ్మని పిలిచెన్

    రిప్లయితొలగించండి
  10. కందం
    గతమున వ్రాసిన కవితకు
    మితిమీరిన స్పందనలవి మెచ్చఁగ వింటిన్
    నుతిఁగొన చదువనొసఁగఁ ద
    త్ప్రతికై సోదరునిఁ గాంత రమ్మని పిలిచెన్

    మత్తేభవిక్రీడితము
    గతమందొక్క కవిత్వ సంపుటికి సత్కారమ్ము నీకెందనన్
    నుతులన్ వింటిని బల్కఁబండితులు సంతోషమ్మునన్ జిల్క భా
    రతి కారుణ్యము గొన్ననీయఁ జదువన్ బ్రాముఖ్యమున్ బొందఁ ద
    త్ప్రతికై రమ్మనె నాత్మసోదరుని నారాటంబు గన్పట్టఁగన్

    రిప్లయితొలగించండి
  11. ( భగిని హస్త భోజనం సందర్భంగా )

    గత వత్సరమున కోవిడు
    కతన జరుగ కుదరలేదుగా ! తన యింటన్
    గతికి పిదప దానిడు హా
    రతికై సోదరునిఁ గాంత రమ్మని పిలిచెన్

    రిప్లయితొలగించండి
  12. సతి!గౌరీ!నగనందినీ!భగవతీ! చాముండ! దాక్షాయణీ!
    పతి సామేన వెలుంగు చాన!ఉమ!శర్వాణీ!భవానీ! శివా!
    నుతచారిత్ర!యటంచు దుర్గమను వేనోళ్ళంబ్రశంసించి,హా
    రతికై రమ్మనె నాత్మసోదరుని నారాటంబు గన్పట్టగన్.

    రిప్లయితొలగించండి
  13. కం:అతి శ్రద్ధ శోభనపు గది
    ప్రతి యంశము వీక్ష జేసి భ్రాత ముదముకై
    యతి చక్కని మరదలితో
    రతి కై సోదరుని కాంత రమ్మని పిలచెన్

    రిప్లయితొలగించండి
  14. మ:అతిగా వేశ్యల పొందు తో నిగమశర్మాఖ్యుండు సత్కాంత యౌ
    సతినే గాంచక యుంట జూచి యతనిన్ చక్కంగ జేయంగ తా
    నతి నైపుణ్యత తీర్చి దిద్ది గది నా యక్కయ్య,యిల్లాలితో
    రతి కై రమ్మనె నాత్మసోదరుని నారాటమ్ము కన్ పట్టగన్.
    (ఇది తెనాలి రామకృష్ణ మహాకవి గారి పాండు రంగ మాహాత్మ్యం లోని నిగమశర్మోపాఖ్యానం అనే చక్కని ఇతివృత్తం ఆధారం గా చేసిన పూరణ.పూరణ యథాతథం గానే చేశాను.ఆ కథ అందరికీ తెలుసునని భావిస్తున్నాను. )

    రిప్లయితొలగించండి
  15. శ్రుతిశుభగంబగురాగము
    నతులితభావంబునందునారభిలోనన్,
    శ్రితజనరాముని శ్రీహా
    రతికై సోదరునిఁ గాంత రమ్మని పిలిచెన్
    కొరుప్రోలు రాధాకృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  16. అతివలు జేరిరి నత్తరి
    సతి పతు లిర్వురు వ్రతమును సల్పగ గృహమున్
    పతి నూతన వస్త్రములను
    జితముగ ధరియింప బోవగ శీఘ్రము నిడ హా
    రతికై సోదరుని గాంత రమ్మని పిలిచెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "...జేరిరి యత్తరి... సల్ప గృహమునన్... పతి నూత్నవస్త్రమిడ హారతికై..." అనండి. పద్యంలో ఒక పాదం అదనంగా ఉన్నది.

      తొలగించండి
  17. యతి వేషంబున గ్రీడి రైవతకమందాసీనుడై యుండగా
    నతనిన్ గొల్వగనంపె సోదరిని శ్రద్ధాళుండు తాలాంకుడ
    య్యతి లీలాయిత చేష్టలన్ గనగ చోద్యంబై సుభద్రాంగ నా
    రతికై రమ్మనె నాత్మసోదరుని నారాటంబు గన్పట్టఁగన్

    రిప్లయితొలగించండి
  18. సతతము విద్యార్జనమున
    వితతముగఁ గృశింపఁ దాను వీక్షించి మదిన్
    వెత వొడమఁ దమ గృహమున వి
    రతికై సోదరునిఁ గాంత రమ్మని పిలిచెన్


    నత శీర్షుండవు నై రయమ్ముగను సందర్శింప నీ వేఁగు న
    గ్గతులం దీయ శుభవ్రజమ్ములను రక్షార్థమ్ము వారెల్ల ర
    ద్దితి రీ వద్దికొనంగఁ గన్నులకు భక్తిన్ దైవ దత్తంపు టా
    రతికై రమ్మనె నాత్మ సోదరుని నారాటంబు గన్పట్టఁగన్

    రిప్లయితొలగించండి
  19. అతులిత భక్తిని నిరతము
    శతయుత నామంబుతోడ శ్రద్ధగ బూజన్
    సతిదా నొనరించియుహా
    రతికై సోదరుని గాంత రమ్మని బిలిచెన్

    రిప్లయితొలగించండి
  20. అతి నియతిని యతిని గొలిచె
    నతివ పతియు సుతుల దోడ నతులితభక్తిన్
    అతిథిగ రానత్తఱి హా
    రతికై సోదరునిఁ గాంత రమ్మని పిలిచెన్

    రిప్లయితొలగించండి
  21. వ్రతముల్సేయుచు రమణియారామాఖ్యు దేవేరికిన్
    సతమున్ బ్రార్ధన జేయుచున్ మధుర భోజ్యంబుల్ గుభాళించ హా
    రతికై రమ్మనె నాత్మసోదరుని నారాటంబు గన్బట్టగన్
    పితరుల్ సెప్పిన కార్యమే సతులు దావేగంబుగా జేతురే

    రిప్లయితొలగించండి
  22. అతులమ్మైన విరాళి కొల్చుచుసదా హ్లాదమ్ముతో శ్రీపతిన్
    మతిలో ప్రేమ ఘటిల్లగా కనుచు సమ్మానమ్ముతో సోదరున్
    పతితోడన్ వ్రత మాచరించుచును సద్భావమ్ముతో నక్క హా
    రతికై రమ్మనె నాత్మసోదరుని నారాటంబు గన్పట్టఁగన్

    రిప్లయితొలగించండి
  23. సతతము భ్రాతసుఖమ్మును
    మతితోకోరుచునుచేసిమానుగపూజల్
    హితవుగ పిలిచెను తా హా
    రతికై సోదరునిగాంతరమ్మని పిలిచెన్

    రిప్లయితొలగించండి