22, ఏప్రిల్ 2022, శుక్రవారం

సమస్య - 4058

23-4-2022 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కాంతరొ మామిడికిఁ జింతకాయలు గాసెన్”
(లేదా...)
“మానిని నేఁడు గాసినవి మామిడి కొమ్మకుఁ జింతకాయలే”

33 కామెంట్‌లు:

  1. అంతే తెలియని చిత్తము
    వింతగు నీయెదురు చూపు విపరీతంబై
    చింతాక్రాంతమ్ము వలన
    కాంతరొ మామిడికిఁ జింతకాయలు గాసెన్

    రిప్లయితొలగించండి
  2. కందం
    అంతర్జాతీయంబుగ
    వింతసృజించెడి సశాస్త్ర విజ్ఞాన విశే
    షాంతర్జాల దినములివి
    కాంతరొ ,మామిడికి జింతకాయలు గాసెన్.

    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటర్.

    రిప్లయితొలగించండి
  3. పొంతన లేని విధమ్ముగ
    వింతలు గన్పించు నంచు వీర బ్రహ్మ ము దా
    సొంతము గా చెప్పి నటుల
    కాంత రొ మామిడికి చింత కాయలు కాసెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదం చివర గణభంగం. సవరించండి.

      తొలగించండి
  4. అంతటజన్యువుమాయలు
    పంతములాడుచుచొరబడివేగమెరాగా
    సుంతయునచ్చెరువేలా
    కాంతరొమామిడికిచింతకాయలుగాసెన్

    రిప్లయితొలగించండి
  5. కందం
    ఎంతెంత పండ్లు కొమ్మకు!
    సంతసమునఁ దోటఁ గొంటి సౌఖ్యమునందన్
    వింతఁగ తొలికాపు పిదప
    కాంతరొ! మామిడికిఁ జింతకాయలు గాసెన్!!

    ఉత్పలమాల
    శ్రేణిగఁ గొమ్మకున్ గన విశేషమనంగను పండ్లు పెద్దవై
    మానక గొంటి నీ వనము మర్మము గానక యంద సౌఖ్యమున్
    గాని విచిత్రమౌచు తొలికాపుకు నావల ముంచె చింతలన్
    మానిని! నేఁడు గాసినవి మామిడి కొమ్మకుఁ జింతకాయలే!!

    రిప్లయితొలగించండి
  6. తేనె సమానమైన కడు తీయని పండుల
    నిచ్చు మొక్కలన్
    నే నతి గారబంబునను నిక్కము తెచ్చియు
    నాటి పెంచితిన్
    కానగ చిత్రమాయెనది కాసిన పండులు
    లేవు తీయగా
    మానిని నేడు గాసినవి మామిడి చెట్టుకు
    చింతకాయలే

    రిప్లయితొలగించండి
  7. వేనకువేలుదుర్మతులువేధనుపల్కుచుమాయఁజేయుచున్
    పూనియధర్మమందునిటపొందికధర్మముకాంచుచుండగా
    కానిదిలేదుగానిలనుకందుమెవింతలనెన్నియోనికన్
    మానినినేఁడుగాసినవిమామిడికొమ్మకుచింతకాయలే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వింతల నెన్నియో యికన్' అనండి.

      తొలగించండి
    2. పొరపాటైనది, సరిదిద్దుకుంటానుక్షమించగలరు

      తొలగించండి
  8. వింతగొలుపుచుం డె గదా
    కాంతరొ ! మామిడికిఁ జింతకాయలు గాసెన్ ,
    జింతకు మామిడి చేర్చుచు
    పొంతము గూర్చిన ఫలమిది మోదము కూర్చన్

    రిప్లయితొలగించండి

  9. సంతకు జనితెచ్చితి నం
    దంతుని కొరకు చరవాణి దానిని తెరవన్
    వింతలవెన్నియొ గాంచితి
    కాంతరొ! మామిడికిఁ జింతకాయలు గాసెన్



    జ్ఞానవివేక శూన్యులగు జ్ఞాతులు దుర్జను లైన వారిచే

    కేనపు జూదమందు తమ గేహిని వీగిన పాండుపుత్రులా

    దీనవమందునుండిరిగదే యరివీరభయంకరుల్ గనన్

    మానిని, నేఁడు గాసినవి మామిడి కొమ్మకుఁ జింతకాయలే.

    రిప్లయితొలగించండి
  10. అంతట కాయలు కాచెను
    *కాంతరొ! మామిడికిఁ, జింత కాయలు గాసెన్*
    చింతకు;జామి,పనసల
    త్యంతముగాఁగాసె గాదె యారామములోన్.

    శ్రీ నిధులౌ వనమ్ముల విచిత్రము గుత్తులుగాను కాయలున్
    *మానిని!నేడు గాసినవి మామిడికొమ్మకుఁ;జింత,కాయలే*
    దే!నిలువెల్లఁబూసియు నదేమిటొ?జామి,సపోట,నిమ్మలుం
    గానగ వేనవేలుగను గాసెను చూతము రమ్ము చూతముల్.

    రిప్లయితొలగించండి
  11. ఎంతయు ప్రీతిగ బెంచితి
    నింతీ నా ప్రేమభూజ మేమిఫలమ్మో
    చింతిలజేసితివిప్పుడు
    కాంతరొ మామిడికిఁ జింతకాయలు గాసెన్

    రిప్లయితొలగించండి
  12. కం.
    అంతము దిశగా బయనము
    వింతగ జూపుచు జనులకు వేదనమిడుచున్
    బొంతము లేకయె కనగన్
    *గాంతరొ! మామిడికిఁ జింతకాయలు గాసెన్*
    ఉ.మా.
    దీనులు నేటి వారసులు తీయని పండ్లకు దూరమైతిరే!
    కానగ మార్పులన్ విరివి కాలములందున గోచరించుచున్
    మానవ తప్పిదంబులకు మాయని మచ్చగ సాక్ష్యమౌచుచున్
    *మానిని! నేఁడు గాసినవి మామిడి కొమ్మకుఁ జింతకాయలే*

    రిప్లయితొలగించండి
  13. నేననిశంబు నీ వలపునే మదికోరితి ప్రేమబీజమే
    కానగ వృక్షమయ్యినది కాంతరొ నేటికి నా మనంబునన్
    గాని యిదేమి వింతనను గాసిలజేసితి వీతెఱంగునన్
    మానిని నేఁడు గాసినవి మామిడి కొమ్మకుఁ జింతకాయలే

    రిప్లయితొలగించండి
  14. వింతగ పతి పలుకగనిటు
    "కాంతరొ మామిడికిఁ జింతకాయలు గాసెన్"
    వంత పలికె తగిన సతియు
    "చింతింపకుడదియె దీర్చు జింతలు మనకున్"

    రిప్లయితొలగించండి
  15. మానక శాస్త్రవేత్త పలుమార్లు ప్రయత్నము వ్యర్థమైనన
    ద్దాని ఫలంబునెంచి వివిధంబుల మార్పుల చేర్చి గూర్చుచున్
    బూనికగా కృతార్థతను బొంది సతిన్ గని బల్కె జూడుమో
    మానిని నేఁడు గాసినవి మామిడి కొమ్మకుఁ జింతకాయలే

    రిప్లయితొలగించండి
  16. పొంతము లేనివి యగు నీ
    వింత పలుకు లెంత నిజమొ వీక్షింపంగా
    నంతియ నిక్కం బగు నిది
    కాంతరొ మామిడికిఁ జింత కాయలు గాసెన్


    వేనిని బాహ్య రూపముల పేరిమినిం గని కూడ దెన్నఁగా
    వాని గుణమ్ములే యనుభవమ్మునఁ దెల్ల మగున్ నిజమ్ముగాఁ
    గానఁగ నుండ నందముగఁ గాయను దింటిని పుల్పు ఱొడ్డు సూ
    మానిని నేఁడు గాసినవి మామిడి కొమ్మకుఁ జింత కాయలే

    రిప్లయితొలగించండి
  17. వింతలు జరిగే కాలము
    పొంతన యిక యుండదెపుడు పుడమిని నెచటన్
    చెంతనగల యీదృశ్యము
    కాంతరొ!మామిడికీ జింతకాయలు గాసెన్

    రిప్లయితొలగించండి
  18. మానిని!నేడుగాసినవి మామిడి కొమ్మకుజింతకాయలే
    పూనిక తోడియాపలుకు పుట్టుట చిత్రముగాదె చెప్పుమా
    కానిది యౌనుగానగుట కాలపుధర్మమె యెంచిచూడగన్
    మ్రానుకు కట్టిరో మొలకమంచిది యంటుగ చింతజాతినిన్

    రిప్లయితొలగించండి
  19. కం:చింతకలిగె చీడను గని
    *కాంతరొ మామిడికిఁ, జింతకాయలు గాసెన్”*
    చింతతరువులకు తగ్గెను
    చింతయు సుంత ,మనమునకు సేదయు తీరెన్

    మరొక పూరణ

    ఉ.మా:మానుగనొక్కచక్కనగుమామిడిమొక్కనునాటితెప్పుడో
    చేనుననేడుకాయలవిచిత్తము రంజిల కాయలెన్నియో
    *“మానిని నేఁడు గాసినవి మామిడి కొమ్మకుఁ, జింతకాయలే”*
    కానగరావయెన్ తరుకు కారణ మేదొనె రుంగనై తినే

    రిప్లయితొలగించండి