15, ఏప్రిల్ 2022, శుక్రవారం

సమస్య - 4051

16-4-2022 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ముద్దిడుమనె భిక్షు వతివ పొమ్మనదయ్యెన్”
(లేదా...)
“ముద్దిడుమన్న భిక్షువునుఁ బొమ్మని చెప్పక సాధ్వి రమ్మనెన్”

45 కామెంట్‌లు:

  1. కందం
    వద్దనక యాదిభిక్షువు
    నద్దిసమొలవేల్పు నందె నద్రిజ వధువై
    పద్ధతిగాఁ దొలిరేయిని
    ముద్దిడుమనె భిక్షు వతివ పొమ్మనదయ్యెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉత్పలమాల
      వద్దనరానివాడనుచు పర్వత పుత్రి యపర్ణయౌచు తా
      నొద్దిక నాదిభిక్షువునకొప్పగ సేవల నంకితంబుగన్
      పద్ధతిగా నొనర్చియు వివాహమునై తొలిరేయి ప్రేమతో
      ముద్దిడుమన్న భిక్షువునుఁ బొమ్మని చెప్పక సాధ్వి రమ్మనెన్

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  2. ప్రొద్దు దిగిపోయె ,గృహమున
    సద్దు మణగెగద ,సుఖముగ సంతా నమికన్
    నిద్దుర పోయిరని మగడు
    ముద్దిడుమనె , భిక్షు వతివ పొమ్మనదయ్యెన్

    రిప్లయితొలగించండి
  3. అద్దిర! పరమునుదేవత
    సద్దునుజేయనిమనసునసాధననంటన్
    మద్దతుకోరుచుశక్తిని
    ముద్దిడుమనెభిక్షువతివపొమ్మనదయ్యెన్

    రిప్లయితొలగించండి
  4. అద్దరి నాశ్రమమందున
    తద్దయువిద్దెలనునేర్చి తాపసి చెంతన్
    బుద్ధిగ భిక్షాటనమున
    “ముద్దిడుమనె భిక్షు వతివ పొమ్మనదయ్యెన్”

    రిప్లయితొలగించండి

  5. ఒద్దికతో నెత్తుకొనియె
    ముద్దియ పసిబాలుని కడు మోదము తోడన్
    ముద్దుల బాలుని గాంచుచు
    ముద్దిడుమనె భిక్షు వతివ పొమ్మనదయ్యెన్

    రిప్లయితొలగించండి

  6. ముద్దియ పార్వతి చంకన
    ముద్దులొలుకుబాలుని గని భువనేశ్వరుడే
    నిద్దురవీడుచు స్కందుని
    ముద్దిడుమనె భిక్షు వతివ పొమ్మనదయ్యెన్

    రిప్లయితొలగించండి

  7. ముద్దుల బాలుడా గుహుని మోదముతో తన చంకనెత్తుకున్

    ముద్దియ పాటలావతియె ముద్దులనాడెడు పాళమందునన్

    సద్దును సేయకుండ నగచాపుడు స్కందుని గాంచి ప్రేమతో

    ముద్దిడుమన్న భిక్షువునుఁ బొమ్మని చెప్పక సాధ్వి రమ్మనెన్

    రిప్లయితొలగించండి
  8. జిద్దు వహించి శైలసుత జీవను శైల
    నివాసుతోడ తా
    పద్దతితో వివాహమును బల్వురు
    మెచ్చగ నాడె , శంభుడున్
    ముద్దుగ నున్న మోముగని మోదము
    తోడను పార్వతీ సతిన్
    ముద్దిడుమన్న భిక్షువుని బొమ్మని చెప్పక
    సాధ్వి రమ్మనెన్

    రిప్లయితొలగించండి
  9. యిద్దఱు రామలక్ష్మణులు నింటిని వీడగ నుద్దవేగియై,
    హద్దులు మీరి రావణమహాసురు డంతట గుట్రపన్నుచున్
    ముద్దియ సీతఁ వేడగనె ముంగిట నిల్వగ జంగముండనన్
    ముద్దిడుమన్న భిక్షువునుఁ బొమ్మని చెప్పక సాధ్వి రమ్మనెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      పద్యాన్ని యడాగమంతో ప్రారంభించరాదు. "ఇద్దఱు.." అని మొదలుపెట్టండి.

      తొలగించండి
  10. బౌద్ధమతాచారమ్ముల
    నొద్దిక పాటించు నాతడోగిరమునకై
    తద్దినమున నొకగృహిణిని
    ముద్దిడుమనె భిక్షు వతివ పొమ్మనదయ్యెన్

    (ముద్ద+ఇడు=ముద్దిడు)

    రిప్లయితొలగించండి
  11. ఎద్దట వాహనంబు, మరి యేనుగు చర్మము వస్త్రమౌనటే?
    ముద్దియ! నీదు రూపముకు ముక్కను వానికి సాటియౌనటే?
    ముద్దుగ నేలుకొందునని ముస్సలి బాప డొకండు బల్కగా,
    గ్రద్దన కోపగింపఁ నుమ, కైగొని పారుడె యాదిభిక్షువై,
    ముద్దిడుమన్న భిక్షువునుఁ బొమ్మని చెప్పక సాధ్వి రమ్మనెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మరో ప్రయత్నం:
      పెద్దలు ముగ్గురయ్యలును భిక్షను గోర వివస్త్రగాఁ దనన్,
      శుద్ధ మనస్వి, సాధ్వి, యనసూయ దలంపగ మానసంబునన్
      ముద్దుల పాపలైరి, సతి ముచ్చట గొల్పగ లాలి బాడుచున్.
      ముద్దిడుమన్నభిక్షువును బొమ్మని చెప్పక సాధ్వి రమ్మనెన్.

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణలో 'రూపముకు, ముస్సలి' అనడం సాధువులు కావు.

      తొలగించండి
  12. క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:

    బొద్దగు రూపము నడరుచు
    సుద్దులు చక్కగ పలికెడి సుతుడగ్నిభువున్
    ముద్దిడి తా శివు డంబను
    ముద్దిడుమనె, భిక్షువతివ పొమ్మన దయ్యెన్.

    రిప్లయితొలగించండి
  13. క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:

    గద్దఱియైన తారకుని కాట్పడు బిడ్డ నొసంగ దల్చి తా
    నొద్దిక గూడు తత్త్వమున నొప్పుచు ధ్యానము వీడజేయుచున్
    ముద్దుగ పార్వతీ సతిని పొందును గోరిన శంభుడాయెడన్
    ముద్దిడుమన్న, భిక్షువును బొమ్మని జెప్పక సాధ్వి రమ్మనెన్.

    రిప్లయితొలగించండి
  14. ముద్దుల బాలకుండతడు బుద్ధిగ విద్యలనెల్ల నేర్వగన్
    శ్రద్ధగనాశ్రయించెనొక సత్పురుషుండగు మౌనివర్యునిన్
    విద్దెలు నేర్చునా వటుడు భిక్షకునేగి గృహస్తు నింటికిన్
    ముద్దిడుమన్న భిక్షువునుఁ బొమ్మని చెప్పక సాధ్వి రమ్మనెన్

    రిప్లయితొలగించండి
  15. కందం
    అద్దిరపాటున శూలిని
    శ్రద్దగ తపమును సలిపెడి శైలజ గనగన్
    ఒద్దిక నడిగిన తడవుగ
    ముద్దిడుమనె బిక్షు వతివ పొమ్మన దయ్యెన్
    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటర్

    రిప్లయితొలగించండి
  16. సద్దును సేయక రుద్రుడు
    ముద్దియ పార్వతి ని గాంచ మోహమ్మున దా
    నద్దరి వేషము దాల్చియు
    ముద్దిడు మనె భిక్షు వతి వ పొమ్మన ద య్యెన్

    రిప్లయితొలగించండి
  17. సుద్దులు పెక్కు లు నేర్చియు
    ముద్దిడుమనె భిక్షు,వతని పొమ్మనదయ్యెన్
    'ముద్ద'యని యతని భావము
    బుద్ధుని శిష్యుడటంచు ముదిత తలంచెన్.

    అద్దిర!ముద్ద-ముద్దులకు నంతరముంగన నేరకుండెనే
    సుద్దులు చాలసెప్పు మరి చోద్యముగా వచియించుచుండెగా
    బుద్ధుని శిష్యుడౌగద!ముముక్షువు,భిక్షనుగోరెనంచు తాన్
    ముద్దిడుమన్న భిక్షువును బొమ్మని చెప్పక సాధ్విరమ్మనెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
      కందంలో "శిష్యుండటంచు' అనండి. లేకుంటే గణభంగం.

      తొలగించండి
    2. నమస్తే శంకరయ్య గారు!
      దోషము సవరించినందుకు ధన్యవాదములు.

      తొలగించండి
  18. సద్దుమణఁగిన గృహములో
    ముద్దుగఁ గపటంపు వేషమున హాస్యముగా
    నొద్ద కరుదెంచి పతియే
    ముద్దిడు మనె భిక్షు వతివ పొమ్మన దయ్యెన్


    ముద్దియ నేర్వ వ్యాకరణముం దలపోయుచు నత్వ సంధినిన్
    ముద్ద నొసంగు మన్న గతి పొల్తుక డెందము నందు నెంచుచుం
    దద్దయు భక్తిఁ జూపుచును దప్పక యిత్తును భిక్ష నంచుఁ దా
    ముద్దిడు మన్న భిక్షువునుఁ బొమ్మని చెప్పక సాధ్వి రమ్మనెన్

    రిప్లయితొలగించండి
  19. ముద్దుల రుచిని నెఱింగిన
    ముద్దులగుమ్మగు సుచరిత పోడిమి తోడన్
    ముద్డుల వర్షము నొందగ
    ముద్ధిడుమనె భిక్షువతివపొమ్మనదయ్యెన్

    రిప్లయితొలగించండి
  20. పొద్దునలేచికర్షకులు
    పొందికతోవ్యవసాయయుక్తమై
    సద్దులుమూటగట్టుకొని
    శక్తినినమ్మనకూలిలందరున్
    హద్దులులేనికష్టమును
    హాయిగజేయుచు,సద్దితేకనే
    ముద్దిడుమన్నభిక్షువును
    బొమ్మనిచెప్పకసాద్విరమ్మనెన్
    ...తోకల...

    రిప్లయితొలగించండి
  21. ముద్ధులు వారునట్లుగను పోడిమిఋతోడను బల్కునా
    ముద్దిడుమన్నఋభిక్షువును బొమ్మని చెప్పక సాధ్విరమ్మనెన్
    ముద్దులు మూటగట్టు నుడిబోలెడు నాతని బల్కులుంటచే
    వద్దనకుండగా దనదు పజ్జకు రమ్మనీ చెప్పెనేనెమో

    రిప్లయితొలగించండి
  22. హద్దును దాటకుండ కడు హ్లాదము గూర్చుచు, నర్జనుండు తా
    నొద్దికగా చరించ ఘన యోగివిధమ్ము సుభద్ర సన్నిధిన్
    ముద్దియ పార్థుడంచెరిగి మోహము చిప్పిల మానసమ్ములో
    ముద్దిడుమన్న భిక్షువునుఁ బొమ్మని చెప్పక సాధ్వి రమ్మనెన్

    రిప్లయితొలగించండి
  23. వద్దటు రిక్తహస్తముల పంపగ రాదు క్షుధార్తునెన్నడున్
    కొద్ది సహాయమైన నొనగూర్చుట పాడి యటంచు చెప్పెడిన్
    పెద్దల మాటలన్ మిగుల పేర్మి దలంచుచు నొక్క యన్నపున్
    ముద్దిడుమన్న భిక్షువునుఁ బొమ్మని చెప్పక సాధ్వి రమ్మనెన్

    రిప్లయితొలగించండి
  24. పొద్దులు మూడాయెనమా
    ముద్దయు గొంతున దిగకను మూర్ఛయు వచ్చెన్
    చద్దన్నమెయైననునొక
    *"ముద్దిడుమనె భిక్షు వతివ పొమ్మనదయ్యెన్”*

    రిప్లయితొలగించండి