7, జూన్ 2022, మంగళవారం

సమస్య - 4103

 8-6-2022 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మగనినిఁ దిట్టి యొక సుదతి మాన్యతఁ గాంచెన్”
(లేదా...)
“మగనినిఁ దిట్టి యొక్క సతి మాన్యతఁ గాంచెను విజ్ఞులౌననన్”

24 కామెంట్‌లు:

subbarao చెప్పారు...

విగతమ నంబున గుమిలెను
మగనినిఁ దిట్టి యొక సుదతి, మాన్యతఁ గాంచెన్
సుగుణయనునుపా ధ్యాయిని
సుగమముగా బోధజేయ సూక్తుల తోడన్

BMahalakshmi చెప్పారు...

అగపడనితప్పుఁజేయగ
సగభాగముతానుగాగసౌమ్యతపోగా
జగడంబాడుచుగోలగ
మగనినిఁదిట్టియొకసుదతిమాన్యతగాంచెన్

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
BMahalakshmi చెప్పారు...

వగగొనిసత్యభామయునువంచెనుకృష్ణునివన్నెలాడిగా
అగపడదామెభక్తియునుహంసగనిల్చెనుయోగశక్తిగా
సుగమమునయ్యెనీవిధినిశోధనఁజేయుచుపారమంటగా
మగనినిఁదిట్టియొక్కసతిమాన్యతఁగాంచెనువిజ్ఞులౌననన్

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

జగమున గయ్యాళి యె యగు
మగనిని దిట్టు యొక సుదతి : మాన్యత నొందున్
సుగమపథ మ్ము న మెలగుచు
నగు మోమున సేవ సలుపు నాతియె కదరా

విరించి చెప్పారు...


మృగము కొరకంచు రాముడు
సుగాత్రిఁ విడివెడల నరభుజుడు తననీ రీ
తిగ తెచ్చిన మండోదరి
మగనినిఁ దిట్టి యొకయువతి మాన్యత గాంచెన్.

subbarao చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
subbarao చెప్పారు...

విగత మనస్కురాలగుచువేగ మెనేగెనుబుట్టి నింటికిన్
మగనినిఁ దిట్టి యొక్క సతి, మాన్యతఁ గాంచెను విజ్ఞులౌననన్
నగణిత బోధ నాబలము నచ్చెరు వందెడు దాన శీలమున్
సుగుణకునుండుకారణమె సోయగ మబ్బెను లోకమందునన్
రిప్లయితొలగించు

విరించి చెప్పారు...


వగచెను, పారిజాతమును భామిని రుక్మిణి కిచ్చెనయ్యె నీ

మగడని చేతకత్తెయగు మానిని తెల్పగ సత్యభామయే

యగిరము పైన తోయదమునాహుతి వేసిన చందమై రుషన్

మగనినిఁ దిట్టి యొక్క సతి మాన్యతఁ గాంచెను విజ్ఞులౌననన్.

sitharamayya solasa చెప్పారు...

తగులుకొనితి నంచు బిలువ ,
దగదని చెప్పినను వినక దాపుకు జేరన్
వెగడు పడకుండగనె యా
మగనినిఁ దిట్టి , యొక సుదతి మాన్యతఁ గాంచెన్

Rama Murthy Duvvuri చెప్పారు...

నగవుల మాటలుఁగలుపుచు
తెగ కన్నును గీటుచుండి తిరుగుచు వెనుకం
బొగరెక్కిన పర కులసతి
మగనినిఁదిట్టి యొక సుదతి మాన్యతఁగాంచెన్.*

నగవుల హావభావముల నవ్యతఁదోపగ మాటిమాటికిన్
సొగసు నుతించుచుంగనుచు,సొంపులు నొంపులుఁదాకఁబోవుచున్
వెగటుగ సంచరించు కడు వెంగలినా పరకాంత సొంతమౌ
*మగనినిఁదిట్టి యొక్క సతి మాన్యతఁగాంచెను విజ్ఞులౌనన్.*

M.B.G.TILAK చెప్పారు...

సుగుణవతియగు తనసతిని
మగడేదండింపజూచి మాత్సర్యమునన్
రగులుచు నాలిని గొట్టిన
మగనినిఁ దిట్టి యొక సుదతి మాన్యతఁ గాంచెన్

Siva Prasad Chavali చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
Siva Prasad Chavali చెప్పారు...

మగనిని రంకులు తగవని
భగభగ మండి సతి 'రచ్చబండ' కు నీడ్చన్
జగమె(నె)రిగిన నటిగను య
మ్మగనినిఁ దిట్టి యొక సుదతి మాన్యతఁ గాంచెన్

(ప్రసిద్ధ నటి రోజా తన రాజకీయ రంగ ప్రవేశోదంతమున బుల్లి తెరపై నడపిన రచ్చబండ శీర్షికల ఆధారంగా)

sarada చెప్పారు...

కందం
సుగుణవతి సీత విపినము
మగని ననుగమించనెంచ మారు తలచగన్
మగని తలపుఖండించెన్
మగనిని దిట్టి యొక సుదతి మాన్యత గాంచెన్

ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటరు.

Surya చెప్పారు...

మగటిమి జూపి కదనమున
పగతుల దునుమంగ మరచి వలపుల బులుపున్
మగువల దగులము తగదని
మగనినిఁ దిట్టి యొక సుదతి మాన్యతఁ గాంచెన్

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...



కందం
నగములఁ దిరిగెడు రాముడు
సుగతులనిడ లేడు సీత! సుఖపడరమ్మన్
బగతుఁ దృణమనఁగ లంకకు
మగనినిఁ దిట్టి యొక సుదతి మాన్యతఁ గాంచెన్

చంపకమాల
నగముల వాసమందు సుఖనౌకను దేల్చునె? రాముడంచు నీ
దిగులను బాపు రావణుఁడు దివ్య సుఖమ్ముల స్వర్ణలంకలో
సుగతుల గాంచుమన్నఁ గుజ చూపె తృణమ్మును బోల్చి, లంకకే
మగనినిఁ దిట్టి యొక్క సతి మాన్యతఁ గాంచెను విజ్ఞులౌననన్!


గండూరి లక్ష్మీనారాయణ చెప్పారు...

జగడము జేయుచున్ సతము సఖ్యతనే
చెడ గొట్టుకొన్నదే!
మగనిని దిట్టి యొక్కసతి, మాన్యత
గాంచెను విజ్ఞులౌనన్
సుగుణపురాశి యొక్కసతి చూచుచు
భర్తను గౌరవంబుతో
జగమున గొప్ప సాధ్వియని సర్వజ
నోత్తము లైనవారిచే
జగడము జేయుచున్ సతము సఖ్యతనే
చెడ గొట్టుకొన్నదే!
మగనిని దిట్టి యొక్కసతి, మాన్యత
గాంచెను విజ్ఞులౌనన్
సుగుణపురాశి యొక్కసతి చూచుచు
భర్తను గౌరవంబుతో
జగమున గొప్ప సాధ్వియని సర్వజ
నోత్తము లైనవారిచే

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

మగువల నలుసుగ జూచుట
మగఁటిమిగానెంచుపతిని మార్చగ ధిషణన్
తగబిలిచి హితముఁ జెప్పుచు
మగనినిఁ దిట్టి యొక సుదతి మాన్యతఁ గాంచెన్

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

మగువలు కారు భీరువులు మానసికంబుగ ధైర్యశాలురై
తెగువనుజూప జాలుదురు తిగ్మము తాకగ స్వాభిమానమున్
మగడివిగాన దెల్పితిని మన్ననచేయుమటంచు దీఁటుగా
మగనినిఁ దిట్టి యొక్క సతి మాన్యతఁ గాంచెను విజ్ఞులౌననన్

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

వగచుచు డెందమునఁ గరము
తగ విట్టి గుణమ్ము లనుచుఁ దన కూతురునిం
బొగరునకుఁ జలమునకు, విను
మ! గనినిఁ దిట్టి యొక సుదతి మాన్యతఁ గాంచెన్


పగతుర కైన నిట్టి వగు పాటులు కూడ దటంచుఁ దల్చుచుం
దగ దని నొక్కి పల్కుచును దద్దయు రోషము వొంగు చుండఁ ది
క్కగ బదు లీయఁ గోపమునఁ గన్న కుమారుని, నూఱడించి తా
మగనినిఁ, దిట్టి యొక్క సతి మాన్యతఁ గాంచెను విజ్ఞు లౌ ననన్

Dhanikonda Ravi Prasad చెప్పారు...

కం:పగవారికి వెన్ జూపిన
మగవాడవు నీవు నేడు మగువవె యనుచున్
పగ బెంచె దిక్కనకు సతి
మగనిని దిట్టి యొక సుదతి మాన్యత గాంచెన్
(ఇది ఖడ్గతిక్కన ,అతని భార్య చానమ్మ ల ఇతివృత్తం.)

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...

తెగవాగుచు సతమెల్లర
తెగడుచు పరిపరి విధముల తిరుగుచు తనకున్
నగలిమ్మని వేధించెడు
మగనిన దిట్టి యొక పడతి మాన్యత గాంచెన్

A.Satyanarayana Reddy చెప్పారు...

తగులము నొంది సానులకు దాస్యము చేయుట నిత్యకృత్యమై,
జగడము లాడుచున్ కలుగు సంపద నంతయు దోచి పెట్టుచున్
తగదను పెద్దవారల సతమ్ము నలక్ష్యము చేయుచుండ నా
మగనినిఁ దిట్టి యొక్క సతి మాన్యతఁ గాంచెను విజ్ఞులౌననన్