13-9-2022 (మంగళవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“భానుఁడు వెలుగంగ వచ్చెఁ దమము”(లేదా...)“భానుఁడు వెల్గుచుండ నొకవంకఁ దమస్సులు గ్రమ్మివచ్చెడిన్”
చేనుల నూరులన్ దడిపి జీవులకీయగ సంతసంబునేవానలు జోరుగాగురియు భాద్రపదంబున మధ్యవేళలోనేనుగు బోలెడున్నసిత మేఘ సమూహము లావరించగాభానుడు వెల్గుచుండ నొక వంక దమస్సులు గ్రమ్మివచ్చెడిన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఆటవెలదిమౌని మంత్రమంది మానిని వల్లింపభువికి దిగియు సుతునిఁ బొందనొసఁగె పృధయె మ్రాన్పడంగ, వెడలుచు వినువీధిభానుడు వెలుగంగ, వచ్చెఁ దమముఉత్పలమాలమౌని మహద్వరమ్మనెడు మంత్ర జపమ్ము పఠించినంతటన్దానుగ భూమికిన్ దిగియు తక్ష్ణమొ సంగెఁ గుమార రత్నమున్మానిని కుంతి మానసము మ్రాన్ప్రడ, శీఘ్రమె నింగిఁ జేరుచున్భానుఁడు వెల్గుచుండ, నొకవంకఁ దమస్సులు గ్రమ్మివచ్చెడిన్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
🙏ధన్యోస్మి గురుదేవా!🙏
మానవతంబు దప్పక సమాజము సేవనొనర్చు తండ్రికిన్హీన గుణంబుగల్గినవిహీనుడు మూర్ఖుడుపాపఖర్ముడౌదానవుడున్ జనించె గద తప్పడు దారిచరించువాడు నాభానుడు వెల్గుచుండ నొకవంక తమస్సులు గ్రమ్మివచ్చెడిన్
ప్రశస్తమైన పూరణ. అభినందనలు.
దట్ట మైన మబ్బు తారాప థంబును నావ హించ దమము వ్యాప్తి చెంది జగముఁ జీక టయ్యె బగలు కూడయపుడు భానుఁడు వెలుగంగ,వచ్చెఁదమము
గ్రహణకాలమందు కనుగొన్న సత్యముకాంతులీనుచున్న ఖగుడు నాడుమసకబారుచుకను మరుగగు హదను స్వర్భానుఁడు వెలుగంగ వచ్చెఁ దమము
జగతి మేలు కొనుచు జవ సత్వముల నొందుభానుడు వెలుగంగ: వచ్చె దమముమబ్బు లేర్ప డియును మరుగు జేయ రవినిగగన మందు చాల కమ్ము కొనగ
ఆటవెలదివేగుఁజుక్క పొడిచె వినువీధి యందునకావు కావు మంచు కాకులెల్ల *భానుఁడు వెలుగంగ వచ్చెఁ,దమము*పోయె సరసిజంబులు పూచె సరసులందు.
ఉత్పలమాల మానక భూమియుందిరుగు మాన్యుని సూర్యుని భాసురాంశువుల్ ఆనిన యట్టి దేశముల యందు నహస్సగు,కాంతులీనుచున్ *భానుఁడు వెల్గుచుండు నొక వంక;తమస్సులు గ్రమ్మి వచ్చెడిన్ *భాను కరమ్ములుంబడని ప్రాంతములందున రేయియే యగున్.
ఏనుఁగు బోలు మేఘములె యేర్పడ యాకస మందు దట్టమై భానుఁడు వెల్గుచుండ నొకవంకఁ దమస్సులు గ్రమ్మి వచ్చెడిం గానగ రాని వేగమున ,గానగ భీకర మయ్యె యంతటన్ భానుఁడు లేనిచో జగము భాసవిహీనము గాదె చూడగన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు. "...యేర్పడ నాకసమందు... భీకరమయ్యె నంతటన్..." అనండి.
ఏనుఁగు బోలు మేఘములె యేర్పడ నాకస మందు దట్టమైభానుఁడు వెల్గుచుండ నొకవంకఁ దమస్సులు గ్రమ్మి వచ్చెడింగానగ రాని వేగమున ,గానగ భీకర మయ్యె నంతటన్భానుఁడు లేనిచో జగము భాసవిహీనము గాదె చూడగన్
వాడుకైనరీతి ప్రాగ్దిశనందునభానుఁడు వెలుగంగ వచ్చెఁ ; దమముచుట్టుముట్టె నేడు చుక్కల తెరవునమబ్బులన్ని రవిని మరుగుపరచ
నీలభములు నభము నిండనలముకొనికుండపోత వృష్టి కురియుచుండపట్టపగలు గూడ వసుధలో గమకించిభానుఁడు వెలుగంగ వచ్చెఁ దమము
భూభ్రమణము తోడ భూరిగా మార్పులుసంభవించు మాట సత్యమేనుభరత భూమి లో, విదేశము లోజూడభానుడు వెలుగంగ వచ్చు దమము.హీనుడు సైంధవుండధము డెక్కడ దాగెనొ ప్రాణ భీతితో వానిని జంపకున్న ప్రియ బాంధవు డైన పృథాసుతుండకున్ హాని యటంచెఱంగిన మహాత్ముడు చక్రము నడ్డు వేయగా భానుఁడు వెల్గుచుండ నొకవంకఁ దమస్సులు గ్రమ్మివచ్చెడిన్
ఆటవెలదిప్రాగ్దిశాచలంబు పైన ఘనమ్ముగభానుఁడు వెలుగంగ వచ్చెఁ ,దమముచేరె ,పశ్చి మాన జిష్ణుడు క్రుంగగయిదియి సత్య మనుచు యెరుగు మయ్య.ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రిఉండవల్లి సెంటరు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
ఉ.మా.హీనము సేసి లోకముల నెంతయొ కోవిడు బానపొట్టతోద్రేనిచి వీడుకోలునిడ, దీరుగ నుండని నాడులేకమై కానగ గాలుదువ్వుచును కయ్యము లాడనుపక్రమించగన్*భానుఁడు వెల్గుచుండ నొకవంకఁ దమస్సులు గ్రమ్మివచ్చెడిన్*
ఉ.మానిని కౌశికున్ మనుపు మాన్యత నొందె, సులోచనా సతీమౌని యపేక్ష సత్యవతి మర్మము వ్యాసమునీంద్ర జన్మమున్గానక నెవ్వరున్ భువినిఁ గావ్యు జయంతి, దశాబ్ది కేళిలో*భానుఁడు వెల్గుచుండ, నొకవంకఁ దమస్సులు గ్రమ్మివచ్చెడిన్*
వానర యోధులెల్లరును వారధిఁగట్టఁగ నంబురాశిపైభానుని తాపమున్నుడుప వాతుడు చేకొని యంబుదమ్ములన్తానట నాతపత్రముగ తర్షునిఁగప్పఁగ నంబరమ్మునన్భానుఁడు వెల్గుచుండ నొకవంకఁ దమస్సులు గ్రమ్మివచ్చెడిన్
కదియఁగఁ గబలించు కాలము వీక్షించి చండ కిరణ పంక్తి సంతరింప జీవ రాశి కొసఁగఁ జేవ బ్రతుకు నందుభానుఁడు వెలుఁగంగ వచ్చెఁ దమము [తమము = రాహువు] మానవ జాతి లోకము సమస్తము భీతిలి చూచు చుండ ద్వేషానల తప్త మానస సు ధాశన వక్త్రుఁడు నిర్మలాభ్ర దేశానఁ గరాళ దంష్ట్ర విల సద్ఘన గాత్రుఁడు భాను మ్రింగు స్వర్భానుఁడు వెల్గు చుండ నొక వంకఁ దమస్సులు గ్రమ్మి వచ్చెడిన్
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.
ఆనతి నీయ నా ప్రభువుయాత్రికునిన్వలె వచ్చినాడ నీయానమునందు గాన్పడు మహాద్భుతమై గమియించు జీవికన్గానగనోపు చిత్రమగుకాంక్షల లక్ష్యము నెంచు త్రోవలన్భానుడు వెల్గుచుండ నొకవంక దమస్సులు గ్రమ్మివచ్చెడిన్!
కలత లెరుగ నట్టి కాపుర మందునకారుమబ్బు లిట్టె క్రమ్ము కొనగబుద్ధి మంద గింప నొద్దిక కరవాయెభానుడు వెలుగంగ వచ్చె దమము.
భమిడిపాటి కాళిదాసు..... అనకాపల్లి.పట్టపగలు మింట పద్మబాంధవువెంట కారు మబ్బుల గుమి క్రమ్ము కొనగ,ధరణి వెలుగు లొందు ధర్మంబు దప్పెనుభానుడు వెలుగంగ వచ్చె దమము!!
భమిడిపాటి కాళిదాసు..... అనకాపల్లి.దీనుల జీవనంబులను దీప్తిని నింపగ నెమ్మనంబునన్,తానొక యాత్మ బంధువుగ ధర్మము దప్పని పాలనంబునన్,పూని వెలుంగులన్ తెలుగు భూమికి నిత్యము పంచునట్టి యాభానుఁడు వెల్గుచుండ, నొక వంక దమస్సులు గ్రమ్మి వచ్చెడిన్!!
చేనుల నూరులన్ దడిపి జీవులకీయగ సంతసంబునే
రిప్లయితొలగించండివానలు జోరుగాగురియు భాద్రపదంబున మధ్య
వేళలో
నేనుగు బోలెడున్నసిత మేఘ సమూహము లావరించగా
భానుడు వెల్గుచుండ నొక వంక దమస్సులు గ్రమ్మి
వచ్చెడిన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఆటవెలది
రిప్లయితొలగించండిమౌని మంత్రమంది మానిని వల్లింప
భువికి దిగియు సుతునిఁ బొందనొసఁగె
పృధయె మ్రాన్పడంగ, వెడలుచు వినువీధి
భానుడు వెలుగంగ, వచ్చెఁ దమము
ఉత్పలమాల
మౌని మహద్వరమ్మనెడు మంత్ర జపమ్ము పఠించినంతటన్
దానుగ భూమికిన్ దిగియు తక్ష్ణమొ సంగెఁ గుమార రత్నమున్
మానిని కుంతి మానసము మ్రాన్ప్రడ, శీఘ్రమె నింగిఁ జేరుచున్
భానుఁడు వెల్గుచుండ, నొకవంకఁ దమస్సులు గ్రమ్మివచ్చెడిన్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి🙏ధన్యోస్మి గురుదేవా!🙏
తొలగించండిమానవతంబు దప్పక సమాజము సేవ
రిప్లయితొలగించండినొనర్చు తండ్రికిన్
హీన గుణంబుగల్గినవిహీనుడు మూర్ఖుడు
పాపఖర్ముడౌ
దానవుడున్ జనించె గద తప్పడు దారి
చరించువాడు నా
భానుడు వెల్గుచుండ నొకవంక తమస్సులు గ్రమ్మివచ్చెడిన్
ప్రశస్తమైన పూరణ. అభినందనలు.
తొలగించండిదట్ట మైన మబ్బు తారాప థంబును
రిప్లయితొలగించండినావ హించ దమము వ్యాప్తి చెంది
జగముఁ జీక టయ్యె బగలు కూడయపుడు
భానుఁడు వెలుగంగ,వచ్చెఁదమము
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిగ్రహణకాలమందు కనుగొన్న సత్యము
రిప్లయితొలగించండికాంతులీనుచున్న ఖగుడు నాడు
మసకబారుచుకను మరుగగు హదను స్వ
ర్భానుఁడు వెలుగంగ వచ్చెఁ దమము
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిజగతి మేలు కొనుచు జవ సత్వముల నొందు
రిప్లయితొలగించండిభానుడు వెలుగంగ: వచ్చె దమము
మబ్బు లేర్ప డియును మరుగు జేయ రవిని
గగన మందు చాల కమ్ము కొనగ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఆటవెలది
రిప్లయితొలగించండివేగుఁజుక్క పొడిచె వినువీధి యందున
కావు కావు మంచు కాకులెల్ల
*భానుఁడు వెలుగంగ వచ్చెఁ,దమము*పోయె
సరసిజంబులు పూచె సరసులందు.
ఉత్పలమాల
తొలగించండిమానక భూమియుందిరుగు మాన్యుని సూర్యుని భాసురాంశువుల్
ఆనిన యట్టి దేశముల యందు నహస్సగు,కాంతులీనుచున్
*భానుఁడు వెల్గుచుండు నొక వంక;తమస్సులు గ్రమ్మి వచ్చెడిన్ *
భాను కరమ్ములుంబడని ప్రాంతములందున రేయియే యగున్.
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిఏనుఁగు బోలు మేఘములె యేర్పడ యాకస మందు దట్టమై
రిప్లయితొలగించండిభానుఁడు వెల్గుచుండ నొకవంకఁ దమస్సులు గ్రమ్మి వచ్చెడిం
గానగ రాని వేగమున ,గానగ భీకర మయ్యె యంతటన్
భానుఁడు లేనిచో జగము భాసవిహీనము గాదె చూడగన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"...యేర్పడ నాకసమందు... భీకరమయ్యె నంతటన్..." అనండి.
ఏనుఁగు బోలు మేఘములె యేర్పడ నాకస మందు దట్టమై
తొలగించండిభానుఁడు వెల్గుచుండ నొకవంకఁ దమస్సులు గ్రమ్మి వచ్చెడిం
గానగ రాని వేగమున ,గానగ భీకర మయ్యె నంతటన్
భానుఁడు లేనిచో జగము భాసవిహీనము గాదె చూడగన్
వాడుకైనరీతి ప్రాగ్దిశనందున
రిప్లయితొలగించండిభానుఁడు వెలుగంగ వచ్చెఁ ; దమము
చుట్టుముట్టె నేడు చుక్కల తెరవున
మబ్బులన్ని రవిని మరుగుపరచ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినీలభములు నభము నిండనలముకొని
రిప్లయితొలగించండికుండపోత వృష్టి కురియుచుండ
పట్టపగలు గూడ వసుధలో గమకించి
భానుఁడు వెలుగంగ వచ్చెఁ దమము
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిభూభ్రమణము తోడ భూరిగా మార్పులు
సంభవించు మాట సత్యమేను
భరత భూమి లో, విదేశము లోజూడ
భానుడు వెలుగంగ వచ్చు దమము.
హీనుడు సైంధవుండధము డెక్కడ దాగెనొ ప్రాణ భీతితో
వానిని జంపకున్న ప్రియ బాంధవు డైన పృథాసుతుండకున్
హాని యటంచెఱంగిన మహాత్ముడు చక్రము నడ్డు వేయగా
భానుఁడు వెల్గుచుండ నొకవంకఁ దమస్సులు గ్రమ్మివచ్చెడిన్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిఆటవెలది
రిప్లయితొలగించండిప్రాగ్దిశాచలంబు పైన ఘనమ్ముగ
భానుఁడు వెలుగంగ వచ్చెఁ ,దమము
చేరె ,పశ్చి మాన జిష్ణుడు క్రుంగగ
యిదియి సత్య మనుచు యెరుగు మయ్య.
ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటరు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఉ.మా.
రిప్లయితొలగించండిహీనము సేసి లోకముల నెంతయొ కోవిడు బానపొట్టతో
ద్రేనిచి వీడుకోలునిడ, దీరుగ నుండని నాడులేకమై
కానగ గాలుదువ్వుచును కయ్యము లాడనుపక్రమించగన్
*భానుఁడు వెల్గుచుండ నొకవంకఁ దమస్సులు గ్రమ్మివచ్చెడిన్*
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఉ.
రిప్లయితొలగించండిమానిని కౌశికున్ మనుపు మాన్యత నొందె, సులోచనా సతీ
మౌని యపేక్ష సత్యవతి మర్మము వ్యాసమునీంద్ర జన్మమున్
గానక నెవ్వరున్ భువినిఁ గావ్యు జయంతి, దశాబ్ది కేళిలో
*భానుఁడు వెల్గుచుండ, నొకవంకఁ దమస్సులు గ్రమ్మివచ్చెడిన్*
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివానర యోధులెల్లరును వారధిఁగట్టఁగ నంబురాశిపై
రిప్లయితొలగించండిభానుని తాపమున్నుడుప వాతుడు చేకొని యంబుదమ్ములన్
తానట నాతపత్రముగ తర్షునిఁగప్పఁగ నంబరమ్మునన్
భానుఁడు వెల్గుచుండ నొకవంకఁ దమస్సులు గ్రమ్మివచ్చెడిన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికదియఁగఁ గబలించు కాలము వీక్షించి
రిప్లయితొలగించండిచండ కిరణ పంక్తి సంతరింప
జీవ రాశి కొసఁగఁ జేవ బ్రతుకు నందు
భానుఁడు వెలుఁగంగ వచ్చెఁ దమము
[తమము = రాహువు]
మానవ జాతి లోకము సమస్తము భీతిలి చూచు చుండ ద్వే
షానల తప్త మానస సు ధాశన వక్త్రుఁడు నిర్మలాభ్ర దే
శానఁ గరాళ దంష్ట్ర విల సద్ఘన గాత్రుఁడు భాను మ్రింగు స్వ
ర్భానుఁడు వెల్గు చుండ నొక వంకఁ దమస్సులు గ్రమ్మి వచ్చెడిన్
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.
తొలగించండి
రిప్లయితొలగించండిఆనతి నీయ నా ప్రభువు
యాత్రికునిన్వలె వచ్చినాడ నీ
యానమునందు గాన్పడు మ
హాద్భుతమై గమియించు జీవికన్
గానగనోపు చిత్రమగు
కాంక్షల లక్ష్యము నెంచు త్రోవలన్
భానుడు వెల్గుచుండ నొక
వంక దమస్సులు గ్రమ్మివచ్చెడిన్!
కలత లెరుగ నట్టి కాపుర మందున
రిప్లయితొలగించండికారుమబ్బు లిట్టె క్రమ్ము కొనగ
బుద్ధి మంద గింప నొద్దిక కరవాయె
భానుడు వెలుగంగ వచ్చె దమము.
భమిడిపాటి కాళిదాసు..... అనకాపల్లి.
రిప్లయితొలగించండిపట్టపగలు మింట పద్మబాంధవువెంట
కారు మబ్బుల గుమి క్రమ్ము కొనగ,
ధరణి వెలుగు లొందు ధర్మంబు దప్పెను
భానుడు వెలుగంగ వచ్చె దమము!!
భమిడిపాటి కాళిదాసు..... అనకాపల్లి.
రిప్లయితొలగించండిదీనుల జీవనంబులను దీప్తిని నింపగ నెమ్మనంబునన్,
తానొక యాత్మ బంధువుగ ధర్మము దప్పని పాలనంబునన్,
పూని వెలుంగులన్ తెలుగు భూమికి నిత్యము పంచునట్టి యా
భానుఁడు వెల్గుచుండ, నొక వంక దమస్సులు గ్రమ్మి వచ్చెడిన్!!